scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఆ 'డేరింగ్ గర్ల్' నుంచి జాన్వి ఏం నేర్చుకుందో తెలుసా?

Lessons we learn from The Kargil Girl Gunjan Saxena in Telugu

‘అమ్మాయిలు’.. ఎందుకో ఈ పదం వింటేనే చాలామంది చులకన భావంతో చూస్తుంటారు. ‘ఆమె’ను బలహీనురాలిగా పరిగణిస్తుంటారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నా, ఆకాశానికి నిచ్చెన వేసినా.. నేటికీ అమ్మాయిలంటే కొన్ని చోట్ల వివక్షే నెలకొంది. ఇలాంటి అసమానతల్ని రూపుమాపి అమ్మాయి అంటే అబల కాదు.. సబల అని నిరూపించారు ఎందరో అతివలు. తమ విజయంతో నలుగురిలో ‘ఒక్క’రిగా చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాంటి గ్రేట్‌ ఉమన్‌ గుంజన్‌ సక్సేనా. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళగా కీర్తి గడించిన ఈ ధీర జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘గుంజన్‌ సక్సేనా : ది కార్గిల్‌ గర్ల్‌’ చిత్రం తాజాగా మన ముందుకొచ్చింది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి ఆమె ప్రదర్శించిన ధీరత్వమే కాదు.. ఆమె జీవితంలోని అణువణువూ మనందరికీ ఆదర్శప్రాయమే. ఆమె వేసిన ప్రతి అడుగూ ఓ పాఠమే!

View this post on Instagram

A post shared by Sharan Sharma (@sharansharma) on


ప్రోత్సహిస్తే రాటుదేలతాం!
లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనలో ఉండే తపనకు తోడు మన ఇంట్లో వాళ్ల ప్రోత్సాహముంటే అది మరింత సులువవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు నాన్నతో ఉన్న చెలిమి ఎంతో ప్రత్యేకం. ఆయనే వారికి రోల్‌మోడల్‌! మరి, ఆయన అండదండలు, ప్రోత్సాహముంటే ఏ అమ్మాయైనా అందలమెక్కుతుంది.. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఇదే విషయాన్ని గుంజన్‌ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు.

‘పైలట్‌ కావాలనుకుంటున్నాను నాన్నా’ అని చిన్నారి గుంజన్‌ తన తండ్రితో చెప్పినప్పుడు ‘సరే తల్లీ..’ అంటూ తన పూర్తి మద్దతు తెలిపారాయన. అంతేకాదు.. ‘నువ్వు ఆడపిల్లవి.. ఇవన్నీ నీకెందుకు’ అని చుట్టూ ఉన్న వాళ్లు నిరుత్సాహపరిచినా.. ‘వాళ్ల మాటలు పట్టించుకోకు.. ముందు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు’ అంటూ తన కూతురి కల సాకారం కావడానికి అనుక్షణం ఆమె వెన్నంటే ఉన్నారాయన. ఇలా ఆడపిల్లలకు తమ తండ్రి అండదండలుంటే, వారి అభిరుచులకు తగ్గట్లుగా ప్రోత్సహిస్తే ఎంతటి శిఖరాలైనా అధిరోహించగలరని నిరూపించారీ కార్గిల్‌ గర్ల్.

View this post on Instagram

A post shared by Sharan Sharma (@sharansharma) on


‘ఆడపిల్లను’.. అయితే ఏంటి?
ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఏదైనా విభిన్న కోర్సు చేస్తాననడం లేదంటే సరికొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాం అని చెప్తే కొంతమంది ‘ఆడపిల్లలకు ఇవన్నీ ఎందుకమ్మా.. హాయిగా ఆ చదువేదో పూర్తిచేసుకొని, పెళ్లి-పిల్లలు అంటూ కుటుంబ జీవితానికి పరిమితం కాక!’ అంటూ వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయాల్లో మనం నిరుత్సాహ పడకుండా ధైర్యాన్ని ప్రదర్శించాలి. ‘అవును.. ఆడపిల్లను అయితే ఏంటి.. ఆ పని ఆడపిల్లలు చేయద్దని ఎక్కడా చెప్పలేదే’ అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని గుంజన్‌ సక్సేనా తన జీవితం ద్వారా నిరూపించారు. నిజానికి చిన్నతనంలోనే అందరూ నిరుత్సాహ పరిచినప్పుడు తను వెనకడుగు వేసి ఉంటే ఆమె ఓ సాధారణ మహిళగానే తెర వెనుకే ఉండేదేమో! అలాకాకుండా ధైర్యంగా ముందడుగు వేసింది కాబట్టే ఓ అద్భుతమైన మహిళగా పేరు తెచ్చుకుంది. ఈ రోజు దేశమంతా తన జీవితాన్ని వెండితెరపై చూసేంత గొప్ప మహిళగా మన్ననలందుకుంటోంది. అందుకే మనం కూడా ఈ కార్గిల్‌ గర్ల్‌ను ఆదర్శంగా తీసుకుందాం.. ‘ఆడపిల్లలమైనంత మాత్రాన బలహీనులం కాదు.. మేమూ తలచుకుంటే ఏదైనా సాధించగలం’ అని నిరూపిద్దాం..!

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


అవి విమర్శలు కాదు.. సోపానాలు!
తరాలు మారినా పితృస్వామ్య వ్యవస్థలో మాత్రం మార్పు రావట్లేదు. పైగా ఇది అన్ని రంగాల్లోనూ బలంగా పాతుకుపోయింది. ఒకవేళ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మహిళలు ఇలాంటి రంగాల్లోకి అడుగుపెట్టినా అక్కడ కొందరు అతివలకు అవమానాలు, విమర్శలు తప్పట్లేదు. గుంజన్‌ జీవితాన్ని పరిశీలిస్తే ఇలాంటి వివక్షే తనూ ఎదుర్కొంది. ఎన్నో సవాళ్లను అధిగమించి తను కలలు కన్న వాయుసేనలోకి అడుగుపెట్టినా.. అక్కడా ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. తాను శిక్షణ తీసుకున్న బృందంలో అందరూ మగాళ్లే ఉన్నా.. ‘ఇంతమంది మగాళ్ల మధ్యలో నువ్వొక్కదానివే ఆడపిల్లవు.. నువ్వేం సాధిస్తావ్‌?’ అంటూ చుట్టూ ఉన్న వాళ్లు విమర్శలు గుప్పించినా.. వాటికి ఆమె బాధపడలేదు. ఆ విమర్శల్నే సోపానాలుగా భావించింది.. తనేంటో నిరూపించాలనుకుంది.. అనుకున్నది చేసి చూపించింది. విమర్శించిన నోళ్లే తనను ప్రశంసించేంత స్థాయికి చేరుకుంది. కాబట్టి ఆడపిల్లలపై వివక్ష కొనసాగినన్నాళ్లూ ఇలాంటి విమర్శలు మనందరికీ కామన్‌.. అయితే వీటికి ప్రతికూలంగా స్పందించడం కాకుండా సానుకూలంగా మార్చుకుంటే మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది.. ఇదే గుంజన్‌ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


మార్పు నాతోనే మొదలవ్వాలి!
అసలే ఆడపిల్లంటేనే కొన్ని చోట్ల చిన్న చూపు ఉంది. అలాంటిది ఆ రంగంలో ప్రవేశించినా ఆమెకు ఎలాంటి సౌలభ్యాలు, సౌకర్యాలు అందుతాయి చెప్పండి! అలాంటి పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూశారు గుంజన్‌. తను వాయుసేనలో శిక్షణ కోసం వెళ్లినప్పుడు మహిళలకంటూ కనీసం వాష్‌రూమ్‌ కూడా లేదంటే ఆ రోజుల్లో అతివల పరిస్థితులేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాగని వెనకడుగు వేయలేదామె. తన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమంది మహిళలు యుద్ధరంగంలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచింది. ఆపై మహిళలకంటూ ప్రత్యేకంగా ఎన్నో సౌలభ్యాలు సమకూరేందుకు ఆదిగా నిలిచింది. అలా కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటూ ముందుకు సాగాలని, మనమే ఆయా రంగాల్లో మార్పు తీసుకు రావడానికి కృషి చేయాలని తన జీవితంతో నిరూపించారీ సాహస వనిత.

నేను నేర్చుకున్న పాఠాలివే!

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


ఒక స్ఫూర్తిదాయక కథ వింటే/చూస్తేనే మనం ఇన్ని విషయాలు నేర్చుకుంటే.. ఇక అదే జీవితకథలో నటిస్తే, ఆ మహిళ జీవితాన్ని దగ్గర్నుంచి గమనిస్తే.. ఇంకెన్ని విషయాలు నేర్చుకోవాలో కదా! ‘గుంజన్‌ సక్సేనా : ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కూడా ఈ క్రమంలో బోలెడన్ని విషయాలు నేర్చుకుందట! సినిమా ప్రారంభమైన దగ్గర్నుంచి గుంజన్‌ గురించి తెలుసుకుంటూ, ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ గుంజన్‌ జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలను పలు సందర్భాల్లో ఇలా పంచుకుంది జాన్వీ.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని చేరుకోవాలన్న తపన, పట్టుదల, అంకితభావం, అందుకు తగిన కఠోర శ్రమ.. ఇవి ఉన్నప్పుడే సులభంగా విజయం సాధించగలం. గుంజన్‌ జీవితం నుంచి నేర్చుకున్న ఈ సూత్రాన్ని నేను నా సినిమాలకు అన్వయించుకుంటున్నా.. ఇక ముందు కూడా సినిమాల విషయంలో అభిమానుల మెప్పు పొందేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* దేశం కోసం, ప్రజల కోసం గుంజన్ ఎంతో చేశారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. అయినా సినిమా సెట్స్‌కి వచ్చినప్పుడు ‘నేను అంత గొప్ప పనేం చేశాను’ అనేవారు. అదే ఆమె గొప్పతనం. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల’న్న విషయం ఆమెను చూసి నేర్చుకోవచ్చు.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* సమాజం నుంచి ఎదురైన విమర్శలకు ఆమె లొంగలేదు.. అలాగని తనను తాను తక్కువ చేసి చూసుకోలేదు. కేవలం శ్రమనే నమ్ముకుంది.. అనుకున్నది సాధించింది. విమర్శించిన సమాజంతోనే చప్పట్లు కొట్టించుకుంది.. ఆమెలోని ఆ ధైర్యమే నాకెంతో స్ఫూర్తిదాయకం!

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* మనం ఎంచుకున్న రంగం పట్ల మనమెంత బాధ్యతాయుతంగా మెలగాలో, వృత్తిని ఎంతగా ప్రేమించాలో గుంజన్‌ ప్రపంచానికి చాటిచెప్పారు.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* సినిమా ప్రారంభంలో ఇంత గొప్ప పాత్రకు నేను న్యాయం చేయగలనా అనిపించింది. కానీ సినిమా పూర్తయ్యే సరికి నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. మన చేతిలో ఉన్న బాధ్యతను నిర్వర్తించేందుకు మన శాయశక్తులా కృషి చేయాలన్న విషయం తెలుసుకున్నా. ఏదైనా సాధించాలంటే దాన్ని చేరుకునేదాకా అలుపెరుగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి.. గుంజన్‌ మేడమ్‌తో టచ్‌లో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


* ‘నాకు, గుంజన్‌ మేడంకి కొన్ని పోలికలున్నాయి. మా ఇద్దరికీ డెజర్ట్స్‌ అంటే ఇష్టం.. ఇద్దరి చేతులూ పొడవుగా ఉంటాయి. అలాగే ఇద్దరి తండ్రులూ ప్రపంచంలోనే ది బెస్ట్‌ (తండ్రులు కూతుళ్లను ప్రోత్సహిస్తే వారు అనుకున్నది సాధించగలరు అని చెప్పకనే చెప్పింది జాన్వీ)’ అంటూ తన తండ్రితో దిగిన ఓ లవ్లీ ఫొటోను తాజాగా పంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ.

నిజానికి ఈ సినిమా జాన్వీ కెరీర్‌లో రెండోది. ఇంత అనతికాలంలోనే ఇంత గొప్ప బయోపిక్‌లో నటించే అవకాశం తనకు దక్కడం తాను చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చిందీ కుందనపు బొమ్మ. అంతేనా.. పాత్రకు ప్రాణం పోస్తానో, లేదోనన్న సందేహంతోనే షూటింగ్‌లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్‌ భామ.. అద్భుతమైన నటనను కనబరిచి సినీ ప్రేక్షకుల చేత వందకు వంద మార్కులు వేయించుకుంటోంది.

కంగ్రాట్స్‌ అండ్‌ ఆల్‌ ది బెస్ట్‌ జాన్వీ!





women icon@teamvasundhara
bhawana-kanth-to-become-the-first-female-fighter-pilot-to-take-part-in-republic-day-parade

ఆ రోజు సుఖోయ్-౩౦ తో ఆకాశంలో ఆడుకుంటా!

యుద్ధమంటే ఆమెకు భయం లేదు.. శత్రువు ఏ మూల నుంచి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా పసిగట్టి తిప్పికొట్టగల ఓర్పును, నేర్పును ఒంటబట్టించుకుందామె. ఈ క్రమంలోనే భారత వాయుసేనలో మహిళా యుద్ధవిమాన పైలట్‌గా చేరి ఆ అరుదైన ఘనత దక్కించుకున్న అతివగా రికార్డులకెక్కింది. ఆమే.. ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ భావనా కాంత్‌. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. కారణం.. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఊహ తెలిసిన దగ్గర్నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌ను టీవీలో చూసిన తనకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానంటోన్న ఈ డేరింగ్‌ లేడీ తన గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
meet-banjeet-kaur-21-year-old-female-auto-driver-breaking-stereo-types-in-jammu-and-kashmir

కుటుంబం కోసం ఆటో నడుపుతున్నా.. చదువు మాత్రం మానను!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా ఇప్పట్లో మనల్ని విడిచి వెళ్లేలా లేదు. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి బతికున్న వాళ్లను కూడా ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతిస్తూ ఎన్నో కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. ఈ క్రమంలో కరోనా కారణంగా కుదేలైన తన కుటుంబానికి తోడుగా నిలిచేందుకు ఆటో తోలుతోంది జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువతి. తన తండ్రి ఉద్యోగం పోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె ఈ ఆపత్కాలం నుంచి తన కుటుంబాన్ని బయటపడేసేందుకు శతవిధాలా శ్రమిస్తోంది. మరి కుటుంబం కోసం పురుషులతో పోటీ పడుతూ ఆటో స్టీరింగ్‌ తిప్పుతోన్న ఆ యువతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
life-lessons-to-learn-from-sankranti-in-telugu

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
swami-vivekananda-views-about-women-in-india-in-telugu

భర్త మరణిస్తే మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది తన ఇష్టం!

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు.. నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..' ప్రతి ఒక్కరూ తమలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే స్ఫూర్తినిస్తూ వివేకానందుడు పలికిన మాటలివి. మిగిలిన వారి విషయం పక్కన పెడితే.. మహిళలు తప్పకుండా ఆచరించాల్సిన సూత్రం ఇది. ఇదే కాదు.. వివేకానందుని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా అమృత వాక్కే. వాటిని ఆచరిస్తే విజయం మన సొంతం. 'బలమే జీవితం.. బలహీనతే మరణం' అంటూ మనలో ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడు వివేకానందుడు. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే.. ఆయన హృదయ ఔన్నత్యం ఎంతటిదో అర్థమవుతుంది. సంప్రదాయాల పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించడాన్ని ఆనాడే ఆయన నిరసించారు. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో మహిళల గురించి, వారి ఔన్నత్యం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే మహిళల పట్ల ఆయన దృక్కోణానికి నిదర్శనం. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి స్వామి వివేకానంద జయంతి(జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మీకోసం...

Know More

women icon@teamvasundhara
psychologist-advice-on-preparation-in-telugu
women icon@teamvasundhara
17-year-old-from-zimbabwe-teaches-girls-taekwondo-to-join-hands-against-child-marriaage

తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరాటం చేస్తోంది!

సాంకేతికంగా ప్రపంచం ముందంజలో దూసుకెళుతోన్నా...ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పాలి. అలాంటివాటిలో ఆఫ్రికా దేశమైన జింబాబ్వే కూడా ఒకటి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్య వివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా...ఎంత ప్రచారం కల్పించినా...వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ దేశంలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తన కళ్లముందు జరుగుతోన్న ఆ అమానుషాన్ని చూస్తూ ఊరుకోలేదో బాలిక. వయసులో చిన్నదే అయినా తనదైన శైలిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? తనేం చేసిందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
loksabha-speaker-om-birla-daughter-clears-upsc-in-first-attempt

వారి స్ఫూర్తితోనే సివిల్స్‌లో చేరాలనుకున్నా!

ఆమె తండ్రి ఓ రాజకీయనేతగా నిత్యం ప్రజా సేవలో తరిస్తున్నారు. తల్లి వైద్యురాలిగా రోగుల ప్రాణాలు కాపాడుతోంది. అక్కేమో ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రజలకు సేవ చేస్తోంది. ఇలా వీరందరినీ దగ్గర్నుంచి చూసిన ఆమె కూడా సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. తన కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌లో చేరి ప్రజాసేవలో తరించాలనుకుంది. అందుకు తగ్గట్టే చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. తద్వారా తన కలను సాకారం చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా. యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన 89 మంది అభ్యర్థుల రిజర్వ్‌ జాబితాలో అంజలి కూడా చోటు దక్కించుకుంది.

Know More

women icon@teamvasundhara
failures-are-the-stepping-stones-for-success

నమ్మకం చేసే మ్యాజిక్ అదే మరి!

మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!

Know More

women icon@teamvasundhara
rajasthan-milkman-daughter-set-to-become-a-judge-in-telugu

పశువుల పాకలోనే చదువుకుని జడ్జిగా ఎదిగింది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సోనాల్‌ శర్మ. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో పలువురి ప్రశంసలందుకుంటోంది. మరి, ఇంతకీ ఎవరీ సోనాల్‌? ఏంటి ఆమె లక్ష్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
21-year-old-bsc-student-arya-rajendran-to-become-youngest-mayor-in-telugu

దేశమంతా ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుకుంటోందో తెలుసా?

‘రాజకీయాలంటేనే రొంపి... అందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి... అవమానాలు భరిస్తూ ముందుకెళ్లాలి. ఇక మహిళలు అయితే ఇందులోకి అడుగుపెట్టకపోవడమే మంచిది’... ప్రస్తుత రాజకీయాలపై నేటి తరం అభిప్రాయాలివి. ఈ కారణాలతోనే దేశానికి వెన్నెముక అని చెప్పుకునే యువత పాలిటిక్స్‌ అంటేనే విముఖత చూపిస్తున్నారు. సామర్థ్యం ఉన్నా మనకెందుకీ తలనొప్పి వ్యవహారాలంటూ మౌనంగా ఉంటున్నారు. అయితే సమర్ధులందరూ ఇలాగే ఇంట్లో కూర్చుంటే సమాజానికి మంచిది కాదంటూ కేరళకు చెందిన ఓ యువతి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా... ఎలాంటి రాజకీయ చరిత్ర లేకున్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే ఓ ప్రధాన నగర మేయర్‌ పీఠాన్ని అధిష్టించే అవకాశం దక్కించుకుందీ టీనేజర్. తద్ద్వారా యావద్దేశం దృష్టినీ ఆకర్షించింది. ఆ యువ కెరటమే కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్.

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-santa-clause
women icon@teamvasundhara
woman-teaches-children-for-free-near-their-dwellings-in-bhubaneswar
women icon@teamvasundhara
ways-to-make-yourself-happy-in-telugu

ప్రశాంతత లోపించిందా? అయితే మీరిది చదవాల్సిందే!

సమాజంలో ఉన్నత స్థానం, హోదా, కళ్లు తిప్పనివ్వని అందం, అద్భుతమైన తెలివితేటలు, ఆస్తిపాస్తులు, విశాలమైన బంగ్లా, ఖరీదైన కార్లు ఇవన్నీ ఉంటేనే జీవితం బిందాస్ అనుకుంటాం. కానీ ఇది కొంత వరకే నిజం కావచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే అసలేవీ లేనట్టే. కావాలంటే మీరే చూడండి... కొంతమందికి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ ఏ లోటూ లేకుండా హాయిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాంతం ఆనందంగా గడిపేస్తారు. ఎందుకంటే... ఏమున్నా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం వీరి సొంతం. అదే వారి సంతోషకర జీవనానికి కారణం. ఇంతకీ ఈ మానసిక ప్రశాంతతను ఎలా సొంతం చేసుకోవాలి? అంటే అది మన చేతుల్లోనే ఉంది.

Know More

women icon@teamvasundhara
do-you-have-the-tmi-syndrome
women icon@teamvasundhara
plus-sized-kerala-woman-braves-body-shaming-to-become-a-model

ఇంత లావున్నా నా శరీరంతో నేను ఫుల్‌ హ్యాపీస్‌!

కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని చూసి నవ్వుకోవడం, హేళన చేయడం కొందరికి అలవాటు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో సరదాకి ఒక ఫొటో షేర్‌ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు. దాని వల్ల ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే చేస్తూ ఉంటారు. కేరళకు చెందిన ఓ 27 ఏళ్ల అమ్మాయి కూడా తన శరీరాకృతి విషయంలో ఇలాంటి ఎబ్బందులనే ఎదుర్కొంది. అయితే ఆత్మస్థైర్యంతో వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచి ప్లస్‌ సైజ్‌ మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె లక్ష్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

Know More

women icon@teamvasundhara
woman-performs-backflips-in-a-saree-with-ease-and-grace-netizens-are-impressed

వావ్‌.. చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్‌.. ఎలా చేసేస్తోందో చూడండి!

చీర...భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో చీర కట్టుకునే వారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చీరకట్టులో సౌకర్యవంతంగా ఉండలేమని.. చుడీదార్లు, జీన్సుల్లోనే కంఫర్టబుల్‌గా ఉండచ్చని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్త్రధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం, సాహసకృత్యాల్లో భాగమవడం...వంటివి చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది మిలీ సర్కార్‌ అనే యువతి. ఇంటర్నేషనల్‌ యోగా గోల్డ్‌ మెడలిస్ట్‌, జిమ్నాస్ట్‌ అయిన ఆమె.. చీరకట్టులో అవలీలగా బ్యాక్‌ఫ్లిప్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మహిళలు చీరకట్టులోనూ ఎంతటి కఠినమైన పనులైనా అలవోకగా చేయగల సమర్థులు అని నిరూపిస్తోంది.

Know More

women icon@teamvasundhara
this-nurse-before-and-after-picures-show-the-impact-of-treating-covid-19-for-months

నా కెరీర్‌ అలా మొదలై.. ఇలా సాగుతుందనుకోలేదు!

సరిగ్గా ఏడాది క్రితం చైనాలోని వుహాన్‌ వేదికగా పురుడు పోసుకుంది కరోనా వైరస్‌. అప్పటి నుంచి ప్రపంచమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ వణికిస్తోందీ మహమ్మారి. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. అదే సమయంలో కరోనా వైరస్‌తో సుమారు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో కొందరు డాక్టర్లు అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు రోగులకు సేవ చేస్తూ మానసిక ఒత్తిడితో పాటు తీవ్ర శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే ఈ అమెరికన్‌ నర్సు.

Know More

women icon@teamvasundhara
who-is-charli-d-amelio?-a-16-year-old-who-just-became-the-most-followed-tiktoker-in-the-world

అలా తన ప్రతిభతో ‘పది కోట్ల’ మంది అభిమానం చూరగొంది!

‘టిక్‌టాక్‌’....కొద్ది నెలల క్రితం భారత్‌లో నిషేధించిన ఈ చైనా మొబైల్‌ యాప్‌కి ఇతర దేశాల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రధానంగా అమెరికాలో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ యాప్‌ కారణంగా ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు ఓవర్‌నైట్‌ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తమ సృజనాత్మక వీడియోలతో లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ టిక్‌టాక్‌ స్టార్లుగా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఓ 16 ఏళ్ల యువతి టిక్‌టాక్‌లో తొలిసారిగా 100మిలియన్(10కోట్లు) ఫాలోవర్స్‌ మార్క్‌ను చేరుకుంది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? వంద మిలియన్ల మంది అభిమానం ఎలా సంపాదించిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
woman-bags-world-record-title-for-traveling-the-world-in-just-3-days
women icon@teamvasundhara
dont-do-these-things-to-lead-satisfactory-life

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

Know More

women icon@teamvasundhara
american-teenager-makes-largest-hand-drawn-maze-bags-guinness-world-records

ఈ పొడవైన దారిని కనుక్కునే టైం మీకుందా?

రోజూ పత్రికలు చదివేవారిలో చాలామందికి సుడోకు, పజిల్స్‌ పూర్తి చేయడమంటే చాలా సరదా. ప్రత్యేకించి మేజ్‌ పజిల్‌ను పరిష్కరించేందుకు చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా పని చేస్తుందని, జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ అమ్మాయి 104.64 చదరపు మీటర్ల పొడవైన మేజ్‌ పజిల్‌ని రూపొందించింది. తద్వారా ప్రపంచంలో అతి పొడవైన పజిల్‌ను తయారుచేసిన యువతిగా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది.

Know More

women icon@teamvasundhara
kerala-girl-sets-record-for-fastest-completion-of-online-courses-in-telugu

ఆన్‌లైన్ కోర్సులతో రికార్డు సృష్టించింది!

కరోనా ప్రభావంతో ఇప్పటికీ చాలాచోట్ల విద్యా సంస్థలు తెరుచుకోలేదు. పలు సంస్థలు, కార్యాలయాలు నేటికీ ‘వర్క్‌ ఫ్రం హోం’కే ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో యువత తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా చాలామంది యువత ఆన్‌లైన్‌ కోర్సులపై దృష్టి సారిస్తున్నారు. లాక్‌డౌన్‌ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ విద్యార్థిని 35 రోజుల్లోనే 628 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా ప్రఖ్యాత ‘అమెరికన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది.

Know More

women icon@teamvasundhara
rapunzel-from-gujarat-breaks-her-own-guinness-world-record-with-2-metre-long-hair

ఈ అమ్మాయిది ఎంత పొడవైన జుట్టో చూశారా?

పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 190 సెంటీమీటర్ల పొడవైన కురులతో ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించిన ఆమె తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ క్రమంలో 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవాటి కేశాలతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా మరోసారి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిందీ యంగ్‌ సెన్సేషన్.

Know More

women icon@teamvasundhara
psychologist-advice-for-depressed-girl-in-telugu

ఏ పనైనా పూర్తిగా చేయలేకపోతున్నా.. ఇది నా లోపమా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ బాగా చదివేదాన్ని.. కానీ కొన్ని రోజుల నుంచి మనసు నిలకడగా ఉండటం లేదు. ఏ పని చేసినా సగంలోనే ఆపేస్తున్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటున్నా.. కానీ తీరా చదివే సమయంలో ‘ఇప్పుడు ఇది కాదేమో.. వేరే సబ్జెక్ట్‌ చదివితే బాగుండు!’ అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే అనిపిస్తుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతున్నా.. దీనివల్ల ఏదో ఆరాటం, బాధ, దిగులు నాలో కనిపిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రేపు ఎలాగైనా ఈ పని చేయాలని పడుకుంటాను. కానీ మరుసటి రోజు మళ్లీ అదే అసంపూర్ణత! నేనేందుకు హుషారుగా ఉండలేకపోతున్నాను?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
this-pune-woman-repurposes-scrapped-tyres-to-create-pretty-foot-wear

కార్పొరేట్‌ కొలువు కాదని.. పాత టైర్లతో చెప్పులు తయారుచేస్తోంది!

ఆమె ఇంజినీరింగ్‌ చదివింది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికై కార్పొరేట్‌ కంపెనీలో కొలువు తెచ్చుకుంది. నెలకు ఆరంకెల జీతం అందుకుంది. కానీ ఇంకా ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన.. అందుకే వీటన్నింటినీ వదిలేసి పాడైపోయిన టైర్లతో ఫ్యాషనబుల్‌ పాదరక్షలు తయారుచేస్తోంది. అందులోనే తనకు కావాల్సిన జీతం, జీవితాన్ని వెతుక్కుంది. సొంత స్టార్టప్‌ను ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌ యువ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. మరి, ఇంతకీ ఎవరీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌? ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
tanya-gupta-shares-her-baking-story-which-is-her-childhood-dream

కరోనా ఈ అమ్మాయి కలను ఆపలేకపోయింది!

పెద్దయ్యాక నేను డాక్టరవ్వాలి, ఆర్కిటెక్ట్‌ అవ్వాలి అని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కొంతమంది తమ కలల్ని మార్చుకుంటే.. మరికొందరు చిన్ననాటి కలను నెరవేర్చుకునేదాకా నిద్రపోరు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన తన్యా గుప్తా కూడా అంతే! చిన్నతనం నుంచే బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. దానికోసం మంచి జీతమొచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తన వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా వెనక్కి తగ్గలేదామె. కొత్తగా ఆలోచించి, తన ఉత్పత్తుల్ని సరికొత్తగా ప్రమోట్‌ చేయడం ప్రారంభించి.. ఈ కరోనా సమయంలోనూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా మన పయనాన్ని ఆపలేవంటోన్న తన్యా అంతరంగమిది!

Know More

women icon@teamvasundhara
lessons-to-learn-from-dussehra-festival-in-telugu