scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

‘మోస్ట్‌ డిజైరబుల్‌’ వీళ్లే !

Hyderabad times most desirable women

చూడగానే ఆకట్టుకునే అందం...అరుదైన నైపుణ్య ప్రతిభ ... వీటికి తోడు కొంచెం స్మార్ట్‌నెస్‌ కలగలిస్తే చాలు సామాన్యులైనా స్టార్‌ సెలబ్రిటీలుగా మారిపోవాల్సిందే. అందుకేనేమో ప్రజలు కూడా వీరి ప్రతిభను మెచ్చుకుంటూ పట్టం కడుతున్నారు. ఈక్రమంలో తాజాగా 2019 సంవత్సరానికి గాను ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితా విడుదలైంది. టాలీవుడ్‌ బ్యూటీ అక్కినేని సమంత ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. మరి సమంతతో పాటు ఈ లిస్ట్‌లో చోటు సంపాదించిన ఆ స్టార్‌ సెలబ్రిటీలెవరో ఓ సారి చూద్దాం రండి..!

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

అక్కినేని సమంత
గతేడాది ‘మజిలి’, ‘ఓ బేబీ’, ‘సూపర్‌ డీలక్స్‌’ వంటి సినిమాలతో అలరించిన సామ్‌ ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితాలో టాప్ ప్లేస్‌ దక్కించుకుంది. 2018లో ఆమె ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవగా, అంతకుముందు ఏడాది 21వ స్థానం సొంతం చేసుకుంది. మూడేళ్లలోనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న సమంత ఖ్యాతిని అభినందించాల్సిందే.


View this post on Instagram

A post shared by Sanjana Vij (@sanjanavij) on


సంజనా విజ్‌
ఫెమినా మిస్‌ ఇండియా తెలంగాణ 2019 కిరీటం గెలుచుకుని.. ఫెమినా మిస్‌ ఇండియా రన్నరప్‌గా నిలిచిన సంజనా విజ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆమెకు యువతలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది.


View this post on Instagram

A post shared by sindhu pv (@pvsindhu1) on


పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు మూడో స్థానం సొంతం చేసుకుంది. ఆమె 2018లో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.


View this post on Instagram

❤️

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on


అదితీరావు హైదరి
గతేడాది ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కథానాయిక అదితీరావు హైదరి ఈ సారి నాలుగో స్థానంలో నిలిచింది. 2018లో ఆమె నటించిన ‘పద్మావత్‌’, ‘సమ్మోహనం’ సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ఆమె నటించిన ‘వి’ సినిమా విడుదల కాబోతోంది.


View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja) on


పూజా హెగ్డే

కథానాయిక పూజా హెగ్డే ఐదో స్థానం దక్కించుకుంది. గత ఏడాది ఈ బుట్టబొమ్మ ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలతో తెలుగు వారిని అలరించింది. ఆమె హిందీలో నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ సూపర్‌హిట్‌గా నిలిచింది.


View this post on Instagram

A post shared by Raja Kumari (@therajakumari) on

రాజకుమారి
గాయని రాజ కుమారి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. సంగీత ప్రపంచంలో గాయనిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక షోలు ఇచ్చి, మెప్పించారు.


View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సారి ఏడో స్థానం దక్కించుకుంది. ఆమె 2019లో ‘దేవ్‌’, ‘దే దే ప్యార్‌ దే’, ‘ఎన్జీకే’, ‘మన్మథుడు 2’ వంటి సినిమాలతో అలరించింది. రకుల్‌ గత ఏడాది ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఇంకాస్త ముందుకొచ్చింది.


View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


కాజల్‌ అగర్వాల్‌
టాలీవుడ్‌ చందమామ కాజల్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత ఏడాది పదో స్థానంలో ఉన్న ఆమె ఈ ఏడాది కాస్త ముందుకొచ్చింది. కాజల్‌ గతేడాది ‘సీత’, ‘రణరంగం’, ‘కోమలి’ వంటి సినిమాల్లో నటించి అలరించింది.


View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on


రష్మిక మందన
‘ఛలో’తో టాలీవుడ్‌కు వచ్చిన రష్మిక ఈసారి ‘హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో ఐదో స్థానంలో ఉన్న ఆమె ఈసారి నాలుగు అంకెలు కిందికి దిగింది. రష్మిక 2019లో ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించింది.


View this post on Instagram

A post shared by Nikita Tanwani (@nikitatanwani) on


నిఖితా తన్వానీ
ఫెమినా మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-2019 కిరీటం దక్కించుకున్న నిఖితా తన్వానీ పదో స్థానంలో నిలిచింది. అందాల కిరీటం గెలుచుకున్న తర్వాత యువతలో ఆమెకు క్రేజ్‌ విపరీతంగా పెరిగింది.


View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on


నిధి అగర్వాల్‌
2019లో ‘మిస్టర్‌ మజ్ఞు’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలతో సందడి చేసిన నిధి అగర్వాల్‌ 11 వ స్థానంలో నిలిచింది.


View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) on


కియారా అద్వానీ
గతేడాది ‘వినయ విధేయ రామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కియారా అద్వానీ. ఇక బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘కబీర్‌ సింగ్‌,’ ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రాలు కూడా సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. తాజా జాబితాలో 12 వస్థానంలో నిలిచిందీ ముద్దుగుమ్మ.


View this post on Instagram

A post shared by Nikhat Zareen (@zareennikhat) on


నిఖత్‌ జరీన్‌
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఈ స్టార్‌ బాక్సర్‌ 2019లో థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సిల్వర్‌ మెడల్ సాధించి సత్తా చాటింది. తద్వారా హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’ జాబితాలో 13 వ స్థానంలో నిలిచింది.


View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on


నభా నటేష్‌ (14)


View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on


రాఖీ ఖన్నా(15)


View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha) on


ఈషా రెబ్బా(16)


View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on


పాయల్‌ రాజ్‌పుత్‌(17)


View this post on Instagram

A post shared by RIKEE CHATTERJEE (@rikeec) on


రికీ ఛటర్జీ (18)


View this post on Instagram

A post shared by Reha Sukheja (@rehasukheja) on


రేహా సుఖేజా (19)


View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on


కీర్తి సురేష్‌ (20)


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


అనుపమా పరమేశ్వరన్‌(21)


View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on


తమన్నా (22)


View this post on Instagram

Vishu comes early this year ♥️ PC : @appollofoxx 🐥

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on


సాయి పల్లవి (23)


View this post on Instagram

Always take time to reflect upon things despite a busy schedule .#musing #practicesession#asics

A post shared by Mithali Raj (@mithaliraj) on


మిథాలీ రాజ్‌ (24)



శ్రీముఖి (25)


View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on


ఆదాశర్మ(26)
View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on


రెజీనా కసాండ్రా (28)


View this post on Instagram

A post shared by Nara Brahmani (@brahmaninara) on

బ్రాహ్మణి(29)


View this post on Instagram

A post shared by Esha Kode (@_esha.kode_) on


ఇషా కొడే(30)





women icon@teamvasundhara
face-masks-are-available-for-10-rupees-in-sagar-district-in-madhya-pradesh

ఈ కలెక్టరమ్మ ముందుచూపు... 10 రూపాయలకే మాస్కు..!

సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషి చేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ఊహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వేరు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మైథిల్‌ నాయక్‌ రెండో కోవకు చెందుతారు. మధ్యప్రదేశ్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఒకటీ అరా కనిపించగానే శానిటైజర్ల తయారీకి చక్కని కార్యాచరణ రూపొందించారు ప్రీతీ. దీనిలో భాగంగా సెంట్రల్‌ జైల్‌లో ఉంటున్న 55 మంది ఖైదీల సేవలను మాస్కుల తయారీకి వినియోగించుకుంటున్నారు. రోజుకు వెయ్యి మాస్కుల చొప్పున తయారుచేయిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేయకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. ఆరోగ్య సేవకులకు, వైద్యులకు, పోలీసులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. సామాన్యులకు పది రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి, మాస్కులు అవసరమైన వారికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కదా...

Know More

women icon@teamvasundhara
singapore-illustrator-fight-misinformation-about-corona-through-her-comics

కామిక్‌ల రూపంలో ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

‘మీరు N-95 మాస్క్‌ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్‌ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్‌ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.

Know More

women icon@teamvasundhara
new-tiktok-trend-to-help-women-who-feel-unsafe-in-cabs

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
cyber-attacks-in-the-name-of-coronavirus

కరోనా పేరుతో వైరస్‌ను పంపుతున్నారు... జాగ్రత్త!

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.. దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.. ముఖ్యమైన మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రంగాలపై ‘కరోనా’ వైరస్‌ (కొవిడ్‌-19) దాడి చేస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వ్యాధిని వ్యాపారంగా కూడా మార్చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మామూలు రోజుల్లో రూ.10 విలువ చేసే మాస్కులను.. ఇప్పుడు ఏకంగా రూ.50నుంచి వందకు అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యానికే కాకుండా జేబులకు సైతం చిల్లుపెడుతోన్న ‘కరోనా’ వైరస్‌ను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏకంగా సైబర్‌ నేరగాళ్లు కూడా నేరాలకు తెగ బడుతున్నారు. ఇంతకీ ‘కరోనా’తో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
google-trick-to-play-holi-with-your-smartphones

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
anee-master-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
supriya-got-vasundhara-puraskaram

ఘన వారసత్వం...

తెలుగువారు గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్ఢ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత కావడంతో తొలి నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. పదహారో ఏటనే గాయం సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత గూఢచారి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమా నిర్మాణంలోనూ, నటనలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు సుప్రియ

Know More

women icon@teamvasundhara
mithali-raj-got-vasundhara-puraskaram

మహిళా క్రికెట్‌ చిరునామా!

భారత మహిళల క్రికెట్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మిథాలీరాజ్‌. దేశంలో అమ్మాయిల క్రికెట్‌ ఉందని కూడా చాలా మందికి తెలియని సమయంలో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి భారత మహిళా క్రికెట్‌ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు గొప్ప స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణం.. మిథాలీయే. 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకం చేసింది. 19 ఏళ్ల వయసులో తన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై 214 పరుగులు చేశారు. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. గతేడాది టీ20ల నుంచి రిటైరయ్యారు. గతంలో మిథాలీ బ్యాటర్‌గా కొనసాగుతూనే జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై జట్టును నడిపించిన ఈ ప్రస్తుత వన్డే కెప్టెన్‌.. 2021 ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలు పలికే అవకాశముంది.

Know More