ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఎంతో సంతోషంగా, గర్వపడుతూ, పండగలా జరుపుకొనే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రానే వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు గాయనీగాయకులు ప్రత్యేకమైన గీతాలతో మహిళల ఉనికిని దశదిశలా విస్తరింపజేస్తారు.
ప్రముఖ గాయని, నటి మంగ్లీ కూడా ఈ ‘ఉమెన్స్ డే’ని పురస్కరించుకొని ఈటీవీ ప్లస్‌తో కలిసి ఓ గీతాన్ని ఆలపించింది. స్త్రీ శక్తిని గురించి ఎంతో గొప్పగా అక్షరీకరించిన ఈ పాటను మంగ్లీ ఎంతో అద్భుతంగా పాడింది. ‘అమ్మగా.. అమ్మాయిగా.. చెలియగా.. చెల్లాయిగా.. ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం..’ అంటూ సాగే ఈ పాట స్త్రీలు తమ నిజ జీవితంలో పోషించే వివిధ పాత్రల గురించి కళ్లకు కడుతుంది. ఈ పాటలో మంగ్లీతో పాటు కరుణ, లహరి, పలువురు బుల్లితెర తారలు కూడా సందడి చేశారు. ఈ పాటను ప్రతి ఒక్క మహిళకు అంకితం చేస్తున్నట్లు ఈటీవీ ప్లస్ తెలిపింది. మరి, వినసొంపుగా, స్త్రీ శక్తిని చాటేలా ఉన్న ఆ అద్భుతమైన గీతాన్ని మీరూ వినేయండి !
హ్యాపీ విమెన్స్ డే!!