scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!

Sucheta Satish trying to sing songs in 120 languages for Guinness

జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్‌స్టర్‌కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రాడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డుభారతీయ భాషలతో పాటు విదేశీ భాషలు కలుపుకొని మొత్తంగా 120 భాషల్లో పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

80languagessongsgh650.jpg
అందరూ సంగీత ప్రియులే..
సుచేతా సతీష్
.. కేరళకు చెందిన ఈ పదమూడేళ్ల బాలిక.. ప్రస్తుతం కుటుంబంతో పాటు దుబాయ్‌లో నివసిస్తోంది. అక్కడి ‘ది ఇండియన్ హైస్కూల్‌’లో ఎనిమిదో తరగతి చదువుతోంది. సంగీతమంటే ప్రాణమిచ్చే ఇంట్లో పుట్టి పెరిగిన సుచేత.. తన నాలుగేళ్ల ప్రాయంలోనే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. కుటుంబమంతా సంగీత ప్రియులు కావడం, చిన్న వయసు నుంచే మ్యూజిక్ నేర్చుకోవడంతో ఆమెకూ సంగీతం అంటే మక్కువ క్రమంగా పెరిగింది. ఎనిమిదేళ్ల వయసులో హిందుస్థానీ సంగీతంలో పట్టు సాధించడం మొదలుపెట్టిన సుచేత.. ఆ సంగీత పరీక్షలోనూ విజయం సాధించి.. తనకు సంగీతమంటే ఎంత మక్కువో చాటుకుంది. అంతేకాదు.. తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ, బెంగాలీ.. వంటి భారతీయ భాషలపై పట్టు సాధించి ఆ భాషల్లోనూ పాటలు పాడడం నేర్చుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా 'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..' అనే తెలుగు పాటను పాడి అందరిచేతా శెభాష్ అనిపించుకుంది సుచేత.

suchetasatishsinger650-1.jpg
120 భాషల్లో పాటలు పాడేస్తోంది!

వివిధ భాషల్లో రూపొందిన పాటలు నేర్చుకోవడంపై ఉన్న ఇష్టం, సంగీతంపై ఉన్న మక్కువతో సుచేత కేవలం వివిధ భారతీయ భాషలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన భాషల్లో రూపొందించిన పాటలు కూడా పాడడం నేర్చుకుంది. ఇలా తన 13 ఏళ్ల ప్రాయంలోనే 120 భాషల్లో అలవోకగా, చక్కటి గాత్రంతో పాటలు పాడేస్తోందీ యూత్‌ స్టార్‌. ఇంత చిన్న వయసులోనే తన టాలెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సుచేతను చూసి ఆమె తల్లి పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతుందితన కూతురు ప్రతిభను చూసి ఉప్పొంగిపోతున్న ఆ తల్లి.. 'మేం ఏ దేశంలో పర్యటించినా సరే.. సుచేత అక్కడి భాషను, పదాలను ఇట్టే గ్రహించేస్తుంది. వాటిని ఎప్పటికీ తన మెమరీలో నిక్షిప్తం చేసుకుంటుంది..' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

80languagessongsgh650-2.jpg
అదే నా తొలి పాట..
భారత్‌లో ఉన్నప్పుడు పలు భారతీయ భాషల్ని నేర్చుకొని
, ఆ భాషల్లో పాటలు పాడిన సుచేత.. ఆ తర్వాత విదేశీ భాషలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాను నేర్చుకొని పాట పాడిన తొలి విదేశీ భాష జపనీస్ అంటోంది సుచేత. 'విదేశీ భాషల్లో నేను నేర్చుకున్న తొలి భాష జపనీస్. నా తొలి పాట కూడా అదే భాషలో పాడా. గతంలో ఓసారి మా నాన్న స్నేహితురాలు దుబాయ్ వచ్చారు. ఓరోజు ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఒక జపనీస్ పాట పాడారు. అది నాకెంతో నచ్చింది. వెంటనే దాన్ని నేర్చేసుకున్నా..' అంటూ తన తొలి పాట గురించి వెల్లడించింది. అప్పటికే అరబిక్ నేర్చుకుంటున్న సుచేత.. ఆ భాషలోనూ గీతాలాపన చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్ భాషైన టాగలాగ్‌లో నైపుణ్యం సంపాదించింది. ఇలా క్రమంగా వారానికో కొత్త భాషకు సంబంధించిన పాటల్ని ఔపోసన పట్టడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 120 భాషల్లో సునాయాసంగా పాటలు పాడేస్తోందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.

80languagessongsgh650-1.jpg
అరగంట చాలు..

ఇప్పటికే 120 భాషల్లో పాటలు పాడేస్తోన్న ఈ యువ సింగర్‌.. తాను ఇంతగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవడం వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయంటోంది. అలాగే ఆయా భాషలు తెలిసిన వ్యక్తులతో మాట్లాడుతుండడంతో పాటు గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయంతో కూడా తాను ఇన్ని భాషల్లో సునాయాసంగా పాటలు పాడేస్తున్నానంటోందామెఅలాగే కరావోకే ట్రాక్ సహాయంతో పాటలు నేర్చుకోవడం సులభమైందని చెబుతోంది సుచేత. 'వివిధ భాషలు, వాటికి సంబంధించిన పాటలు నేర్చుకునే క్రమంలో ఆయా భాషలు తెలిసిన వ్యక్తులతో మాట్లాడేదాన్ని. నేను పాడే పాటలో ఏవైనా లోపాలున్నా, సరిగ్గా పలకకపోయినా వారు సరిచేసేవారు. సాధారణంగా నేను ఒక పాట నేర్చుకోవడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. ఒకవేళ అందులోని పదాలు పలకడానికి సులభంగా ఉంటే ఇంకా త్వరగా నేర్చుకుంటా. పాట మరీ చిన్నదైతే అరగంట చాలు.. ఇక ఫ్రెంచ్, హంగేరియన్, జర్మన్ భాషలు నాకు కాస్త కష్టంగా అనిపించాయి. ఆ భాషల్లో పాటలు నేర్చుకోవడానికి మాత్రం రెండు మూడు రోజులు పట్టేది.. ఇన్ని పాటలు నేర్చుకున్నా వాటిలో నాకు బాగా నచ్చింది మాత్రం న్యూజిలాండ్‌లో మావోరీ తెగ మాట్లాడుకునే టీ రియో అనే భాషకు సంబంధించిన పాట.. అది ఎంతో వినసొంపుగా ఉంటుంది..' అంటూ తన అనుభవాలను పంచుకుందామె.

చాలాసార్లు వింటా..!
ఒక పాట నేర్చుకోవాలంటే ముందుగా దాని లిరిక్స్ రాసుకొని
, ఆ పాటను ప్లే చేస్తూ దాన్ని నేర్చుకుంటాం. కానీ సుచేత అలా కాదు.. ఒక భాషకు సంబంధించిన పాటను నేర్చుకోవాలంటే.. లిరిక్స్‌తో పనిలేకుండా దాన్ని చాలాసార్లు విని ఒంటపట్టించుకుంటుంది. అలా ఏ భాషకు సంబంధించిన పాటనైనా ఇట్టే నేర్చేసుకుంటుంది. అంతేకాదు.. పాప్, హిప్-హాప్, జానపదం.. వంటి వివిధ రకాల పాటలన్నీ పాడుతుంది సుచేత. 'వివిధ దేశాల సంప్రదాయాలకు సంబంధించిన పాటల్ని కూడా ప్రయత్నించా. అలాగే కొన్ని మాండలికాలకు చెందిన పాటలతో పాటు అసలు లిరిక్స్ అంటూ లేని హంగేరియన్ భాషకు సంబంధించిన పాటలు కూడా నేను నేర్చుకున్న వాటిలో ఉన్నాయి..' అంటోంది సుచేత. తాను నేర్చుకున్న ఈ పాటల నైపుణ్యాల్ని పలు సందర్భాల్లో ప్రదర్శిస్తుంటుంది కూడా..! పాఠశాలలో నిర్వహించే పాటల పోటీల్లో పాల్గొనడంతో పాటు సంగీత కార్యక్రమాల్లో, అవార్డు ఫంక్షన్లలో, కమ్యూనిటీ గ్రూప్ ఈవెంట్లు.. ఇలా వివిధ సందర్భాల్లో తన గాత్రాన్ని అందరికీ పరిచయం చేస్తుందీ లిటిల్ స్టార్.

రెండు ప్రపంచ రికార్డులు!

suchetasatishsinger650-3.jpg

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రపంచంలోని భాషలన్నింటిలో పాటలు పాడే ప్రావీణ్యం సంపాదించి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిందీ ఛైల్డ్‌ సింగర్‌ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం దుబాయ్‌లో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో నిరంతరాయంగా 6:15 గంటల పాటు 102 భాషల్లో పాటలు పాడి రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకుందీ యంగ్‌ సింగర్‌ఇందులో భాగంగా ఒకే సంగీత కచేరీలో ఎక్కువ భాషల్లో పాటలు పాడిన రికార్డు ఒకటైతే.. సుదీర్ఘ సమయం పాటు (6:15 గంటల పాటుపాటలు పాడిన బాలికగా రెండో ప్రపంచ రికార్డును తన వశం చేసుకుంది సుచేతఈ రెండు ప్రపంచ రికార్డులే తాజాగా ఆమెకు ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రాడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డును దక్కేలా చేశాయి. ‘ఎంత నేర్చుకున్నా నా దాహం తీరదు’ అన్నట్లుగా తాను నేర్చుకునే పరభాషా పాటల సంఖ్య పెంచుకుంటూ పోతుందే తప్ప తన పాటల ప్రవాహాన్ని అక్కడితో ఆపట్లేదామె.

ఈ అవార్డు అందుకున్న అనంతరం తన భావాలను ఇలా పంచుకుందీ స్టార్‌ సింగర్‌. ‘దిల్లీలో ఇటీవలే ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారువివిధ విభాగాలకు గానూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది బాల మేధావులు ఈ అవార్డును అందుకున్నారుఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థిని (ఈ ప్రదానోత్సవానికి కైలాష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారుకలుసుకోవడం నా ఆనందాన్ని రెట్టింపుచేసింది..’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది సుచేతప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సహకారంతో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తోందినాట్యంసంగీతంనటనసృజనాత్మకతక్రీడలు.. వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన 15 ఏళ్లలోపు చిన్నారులకు ఈ అవార్డులు అందిస్తున్నారు.

డాక్టర్‌నవుతా..!

suchetasatishsinger650-2.jpg

ఇలా ఓవైపు తనలోని ప్రతిభను చాటుకుంటూనే మరోవైపు తన తండ్రిలాగా డాక్టర్ కావాలని కోరుకుంటోంది సుచేతఇప్పటికే వివిధ భాషల్లో పాటలు పాడి తనలోని ప్రతిభాపాటవాలను నిరూపించుకుంటోన్న ఈ బాలిక.. మొన్నామధ్య తన రెండో ఆల్బమ్‌ ‘యా హబీబీ’ని విడుదల చేసి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించిందిఇలా భాషలతోపాటలతో తానెంత బిజీగా ఉన్నా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయనని అంటోందీ యంగ్‌స్టర్‌అందుకు గాను షేక్ హమ్‌దాన్ అవార్డు కూడా ఆమెను వరించిందిసుచేత స్పెల్లింగ్ బీ ఛాంపియన్ కూడా..! డ్యాన్స్‌లోనూ ఆమెకు నైపుణ్యం ఉందిమరిఇంత చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోన్న నీకు రోల్ మోడల్స్ ఎవరని అడిగితే మాత్రం.. ప్రముఖ గాయనీమణులు లతా మంగేష్కర్శ్రేయా ఘోషల్ అని చెబుతోంది.

ఓ పక్క చదువులో రాణిస్తూనే, మరో పక్క తన అభిరుచుల్ని నెరవేర్చుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోన్న సుచేత నేటి యువతరానికి ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు ఏదైనా సాధించగలరు.. ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించగలరు అని తన సక్సెస్‌ స్టోరీతో నిరూపిస్తోన్న ఈ యువ సింగర్‌.. తన కెరీర్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆశీర్వదిద్దాం..!

Photos: www.facebook.com/pg/suchethasatish

women icon@teamvasundhara
face-masks-are-available-for-10-rupees-in-sagar-district-in-madhya-pradesh

ఈ కలెక్టరమ్మ ముందుచూపు... 10 రూపాయలకే మాస్కు..!

సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషి చేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ఊహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వేరు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మైథిల్‌ నాయక్‌ రెండో కోవకు చెందుతారు. మధ్యప్రదేశ్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఒకటీ అరా కనిపించగానే శానిటైజర్ల తయారీకి చక్కని కార్యాచరణ రూపొందించారు ప్రీతీ. దీనిలో భాగంగా సెంట్రల్‌ జైల్‌లో ఉంటున్న 55 మంది ఖైదీల సేవలను మాస్కుల తయారీకి వినియోగించుకుంటున్నారు. రోజుకు వెయ్యి మాస్కుల చొప్పున తయారుచేయిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేయకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. ఆరోగ్య సేవకులకు, వైద్యులకు, పోలీసులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. సామాన్యులకు పది రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి, మాస్కులు అవసరమైన వారికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కదా...

Know More

women icon@teamvasundhara
singapore-illustrator-fight-misinformation-about-corona-through-her-comics

కామిక్‌ల రూపంలో ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

‘మీరు N-95 మాస్క్‌ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్‌ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్‌ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.

Know More

women icon@teamvasundhara
hyderabad-times-most-desirable-women
women icon@teamvasundhara
new-tiktok-trend-to-help-women-who-feel-unsafe-in-cabs

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
cyber-attacks-in-the-name-of-coronavirus

కరోనా పేరుతో వైరస్‌ను పంపుతున్నారు... జాగ్రత్త!

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.. దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.. ముఖ్యమైన మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రంగాలపై ‘కరోనా’ వైరస్‌ (కొవిడ్‌-19) దాడి చేస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వ్యాధిని వ్యాపారంగా కూడా మార్చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మామూలు రోజుల్లో రూ.10 విలువ చేసే మాస్కులను.. ఇప్పుడు ఏకంగా రూ.50నుంచి వందకు అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యానికే కాకుండా జేబులకు సైతం చిల్లుపెడుతోన్న ‘కరోనా’ వైరస్‌ను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏకంగా సైబర్‌ నేరగాళ్లు కూడా నేరాలకు తెగ బడుతున్నారు. ఇంతకీ ‘కరోనా’తో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
manasi-chaudhari-launches-pink-legal-portal-for-women
women icon@teamvasundhara
google-trick-to-play-holi-with-your-smartphones

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
tv-artist-pallavi-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
supriya-got-vasundhara-puraskaram

ఘన వారసత్వం...

తెలుగువారు గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్ఢ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత కావడంతో తొలి నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. పదహారో ఏటనే గాయం సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత గూఢచారి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమా నిర్మాణంలోనూ, నటనలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు సుప్రియ

Know More

women icon@teamvasundhara
mithali-raj-got-vasundhara-puraskaram

మహిళా క్రికెట్‌ చిరునామా!

భారత మహిళల క్రికెట్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మిథాలీరాజ్‌. దేశంలో అమ్మాయిల క్రికెట్‌ ఉందని కూడా చాలా మందికి తెలియని సమయంలో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి భారత మహిళా క్రికెట్‌ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు గొప్ప స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణం.. మిథాలీయే. 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకం చేసింది. 19 ఏళ్ల వయసులో తన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై 214 పరుగులు చేశారు. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. గతేడాది టీ20ల నుంచి రిటైరయ్యారు. గతంలో మిథాలీ బ్యాటర్‌గా కొనసాగుతూనే జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై జట్టును నడిపించిన ఈ ప్రస్తుత వన్డే కెప్టెన్‌.. 2021 ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలు పలికే అవకాశముంది.

Know More

women icon@teamvasundhara
eesanvi-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
hari-priya-got-vasundhara-puraskaram

నాట్య పరిమళం...

‘వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి..శతాబ్దాల చరితగల సుందర నగరం..’ అంతటి ఘన చరితగల రాజమహేంద్రికి చెందిన చిన్నారే... మద్దిపట్ల పరిమళ హరిప్రియ. పదమూడేళ్ల వయసులోనే కూచిపూడి, భరతనాట్యాల్లో అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న హరిప్రియ ఇప్పటివరకు అయిదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ల కిందట హరిప్రియ ఇస్రోలో ఇచ్చిన ప్రదర్శన ఎందరో ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఆమె ఇచ్చిన ప్రదర్శన రసహృదయులను ఆనందసాగరంలో ముంచేసింది. 2015లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ‘నాట్య మయూరి’ అవార్డు, 2016లో ‘నర్తన్‌ బాల’ అవార్డు, రాష్ట్ర స్థాయి పోటీలో ‘నాట్య పరిమళ’ అవార్డులు గెలుచుకుంది. శోభానాయుడు, మంజుభార్గవిలా నృత్యంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్న హరిప్రియకు వీణలో కూడా ప్రవేశం ఉంది.

Know More

women icon@teamvasundhara
singer-mangli-womens-day-special-song

మంగ్లీ స్పెషల్‌ సాంగ్‌ విన్నారా..?

ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఎంతో సంతోషంగా, గర్వపడుతూ, పండగలా జరుపుకునే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రానే వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు గాయనీగాయకులు ప్రత్యేకమైన గీతాలతో మహిళల ఉనికిని దశదిశలా విస్తరింపజేస్తారు. ప్రముఖ గాయని, నటి మంగ్లీ కూడా ఈ ‘ఉమెన్స్‌ డే’ని పురస్కరించుకొని ఈటీవీతో కలిసి ఓ గీతాన్ని ఆలపించింది. స్త్రీ శక్తిని గురించి ఎంతో గొప్పగా అక్షీకరించిన ఈ పాటను మంగ్లీ ఎంతో అద్భుతంగా పాడింది. ‘అమ్మగా.. అమ్మాయిగా.. చెలియగా.. చెల్లాయిగా.. ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం..’ అంటూ సాగే ఈ పాట స్త్రీలు తమ నిజ జీవితంలో పోషించే వివిధ పాత్రల గురించి కళ్లకు కడుతుంది. ఈ పాటలో మంగ్లీతో పాటు కరుణ, లహరి, పలువురు బుల్లితెర తారలు కూడా సందడి చేశారు. ఈ పాటను ప్రతి ఒక్క మహిళకు అంకితం చేస్తున్నట్లు ఈటీవీ ప్లస్‌ తెలిపింది. మరి, వినసొంపుగా, స్త్రీ శక్తిని చాటేలా ఉన్న ఆ అద్భుతమైన గీతాన్ని మీరూ విని తరించండి!

Know More

women icon@teamvasundhara
indian-women-cricket-history
women icon@teamvasundhara
mithali-raj-playing-cricket-in-saree-goes-viral

నేను చీరకట్టి బ్యాట్‌ పట్టింది అందుకే!

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. అయితే చీరకట్టులో సౌకర్యంగా ఉండలేమని చెబుతూ చాలామంది అమ్మాయిలు శారీలను కేవలం పండగలు, ప్రత్యేక రోజులకే పరిమితం చేశారు. ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్ర్తధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు మూల స్తంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ కూడా చీర కట్టుతోనే క్రికెట్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జెర్సీ, ప్యాంటు ధరించి క్రికెట్‌ ఆడే ఆమె ఎందుకు చీరకట్టి బ్యాట్‌ పట్టిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
13years-girl-stops-child-marriage-and-got-award-from-cm

బాల్య వివాహాన్ని అడ్డుకుంది.. అవార్డు గెలుచుకుంది !

సాంకేతికంగా దేశం ముందంజలో దూసుకెళుతోంది. ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నాం. అయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం వెనుకబడే ఉన్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్యవివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత ప్రచారం కల్పించినా.. వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఓ చోట ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తన కళ్ల ముందు జరుగుతోన్న ఆ అమానుష చర్యను చూస్తూ ఊరుకోలేదో చిన్నారి. వయసులో చిన్నదే అయినా ఎంతో గొప్పగా ఆలోచించి బాల్య వివాహాన్ని అడ్డుకుంది. ఇంతకీ ఎవరా చిన్నారి..? తనేం చేసిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
schschool-girls-turns-one-day-collector-for-an-inspiring-reason

ఈ ‘ఒక్కరోజు కలెక్టర్‌’ గురించి విన్నారా?

అర్జున్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. సాధారణ టీవీ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోన్న అర్జున్‌కి అనుకోకుండా ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’గా పని చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రజల శ్రేయస్సు కోసం తాను అప్పటివరకు చేయాలనుకున్న పనులను ఒక సీఎంగా అర్జున్‌ పూర్తి చేసి ప్రజల మన్నలను పొందుతాడు. ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్కూల్‌ విద్యార్థినులకు ఇటీవల ‘ఒక్కరోజు కలెక్టర్‌’గా పని చేసే అవకాశం లభించింది. మరి వాళ్లకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
cricketer-radha-yadav-inspirational-story

women icon@teamvasundhara
women-fight-for-toilets

రీల్‌ స్టోరీ కాదిది.. రియల్‌ స్టోరీ!

అక్షయ్‌ కుమార్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా 2017లో వచ్చిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుగుదొడ్లు ఉపయోగించని ఓ గ్రామంలోకి పెళ్లి చేసుకొని వెళ్లిన ఓ నవ వధువు (భూమి) ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? ఆ గ్రామ ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది. దీనికి భర్త (అక్షయ్‌ కుమార్‌) ఎలా సహాయపడ్డాడు... ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. వినడానికి చిన్న సమస్యగానే ఉన్నా.. నిజానికి ఇదో పెద్ద సమస్య. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల మరుగుదొడ్లను ఉపయోగించడం లేదంటే మీరు నమ్మగలరా? అయితే అలాంటి ఓ గ్రామాన్ని మార్చేసింది ఓ మహిళ. సినిమాలో హీరోయిన్‌లానే గ్రామంలో మార్పులు తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరామె.? తన కథేంటో తెలుసుకోవాలనుందా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
start-shuttler-pv-sindhu-got-vasundhara-puraskaram

ఎగిసిన క్రీడా కెరటం

భారత బ్యాడ్మింటన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత పి.వి.సింధు సొంతం. సైనా ఘనతల తర్వాత మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫిట్‌నెస్.. దూకుడుతో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను, భారత రాకెట్ జోరును అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఎవరూ వూఊహించని ఘనతలు అందుకుంది.సైనా సాధించిన ఘనతలకు మెరుగులు దిద్దింది. ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో రజతం. కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం, కాంస్యం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాల్ని సింధు కైవసం చేసుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది. నిరుడు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం..ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ ఫిట్‌నెస్.. దూకుడుతో మహిళల బ్యాడ్మింటన్‌లో వూఊపు తెచ్చింది. ఒకప్పుడు పురుషుల మ్యాచ్‌లకే ఆదరణ ఉండగా.. మహిళల పోరాటాల్ని ఆసక్తిగా మార్చిన ఘనత సింధుదే. జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటం సింధుకే చెల్లింది. ప్రపంచ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ), ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంతానన్ రచనోక్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులకు సమ ఉజ్జీ మన సింధు.

Know More