scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

మీ ఇల్లు బంగారంగానూ!

Ways to Start the New Year Fresh

రోజు మారింది... రోజులు కూడా మారాయి... మనం మారాలి. ఇంటిని మార్చాలి... ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందుకోవాలి, ఇంటిల్లిపాదికీ అందించాలి. దీనికోసం కాలానుగుణంగా వచ్చే పరిణామాలను గమనించాలి, మార్పులను అందిపుచ్చుకోవాలి. ఈ రోజు మీకో అవకాశం. కొత్త సంవత్సరాన్ని ఇలా మొదలుపెట్టేద్దామా?

20:80... ఇది పొదుపు మంత్రం

goldenhomegh650-1.jpg

20 శాతం పొదుపు.. 80 శాతం ఖర్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఏ ఆర్థిక కష్టాలూ మిమ్మల్ని భయపెట్టలేవు. వచ్చిన ఆదాయంలో 80 శాతంతోనే కుటుంబ అవసరాలను తీర్చుకోవాలి. 20 శాతం సొమ్ముని తప్పనిసరిగా దాచిపెట్టాలి. కొత్త వస్తువుల కొనుగోళ్లు, పండగలు, శుభకార్యాలు, విహారయాత్రల వంటివాటికి రెండు మూడు నెలల ముందుగానే ఈ 80 శాతం నగదు నుంచే కొద్దికొద్దిగా మిగుల్చుకోవాలి.31122019vasu1d.jpg

అత్యవసర నిధి కూడా చాలా ముఖ్యం. మూడు నెలల జీతం లేదా వరుసగా కొంత నగదును పద్ధతిగా పొదుపు చేసుకోవాలి. ప్రమాదాలు జరిగినప్పుడు, ఉద్యోగం మారాల్సిన సమయంలో ఈ అత్యవసర నిధే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదైనా ఒక నెలలో అదనపు ఖర్చు ఉంటే, ముందునెల నుంచే ఇంటి ఖర్చుల నుంచి కొంత నగదును పక్కన పెట్టగలగాలి. ఉపయోగించే ప్రతి రూపాయినీ ఎందుకు, ఎలా ఖర్చు పెడుతున్నామో గుర్తిస్తే ఖర్చుపై నియంత్రణ ఉంటుంది. ముందుగా పొదుపు, ఆ తరువాతే ఖర్చు అనే నియమం ప్రతి మహిళా తప్పనిసరిగా పాటించాలి.

ఆటలు + ఆరోగ్యం + వికాసం = బాల్యం

goldenhomegh650-2.jpg

సాంకేతికతతో వచ్చే అతి జ్ఞానం పిల్లలకు అవసరం లేదు. చంద్రయాన్‌ ప్రయోగం గురించి తెలిసిన పిల్లలకు పెద్దవాళ్లతో ఎలా ప్రవర్తించాలనేది తెలియకపోతే ఆ జ్ఞానానికి అర్థం లేదు. ఒకప్పటితో పోలిస్తే తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై రుద్దడం తగ్గిపోయింది. ఆసక్తి ఉన్న రంగాల్లోనే ఎదిగే స్వేచ్ఛ ఈ తరం పిల్లలకు వచ్చింది. ఈ స్వేచ్ఛ కొత్తరకం సమస్యలకు దారితీయకుండా చూడాలి.article_img/31122019vasu1f.jpg

ఏదైనా అడగ్గానే కొనిచ్చే అలవాటును మానుకోవాలి. వీటితో పాటు కేరింగ్‌, షేరింగ్‌, గివింగ్‌ వంటి లక్షణాలే పిల్లల మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ రోజుల్లో పిల్లలను సాంకేతికతకు దూరంగా ఉంచలేం. సాంకేతికత, శారీరకశ్రమ, చదువు... ఈ మూడే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మూడింటినీ సమన్వయం చేసుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోండి.

మీరూ వ్యాపారవేత్త కావచ్చు!

goldenhomegh650-3.jpg

అవసరం కోసం ఉద్యోగాలు చేసే మహిళలు.. పనిలో సంతృప్తి గురించి ఆలోచించరు. యాంత్రికంగా పనిచేస్తూ ఒత్తిడికి గురవుతారు. దీనికి బదులుగా అలవాట్లు, అభిరుచులనే వ్యాపార మార్గాలుగా ఎంచుకొని విజయం సాధించవచ్చు. పెద్ద కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో మహిళలకు ఇంటిపనులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటివి సవాళ్లుగా మారుతున్నాయి. పిల్లలకు ఏదైనా జబ్బుచేస్తే ఒక్కరోజు కార్యాలయానికి సెలవు పెట్టడానికి ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఇలా కాకుండా సొంతంగా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుంటే... ఆఫీసుల్లో ఉండే ఒత్తిడి, రోజువారీ లక్ష్యాలు వంటివి ఉండవు.31122019vasu1h.jpg

మనకోసమే మన పని అనే ఆలోచన మనసులో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగానే స్వీకరిస్తాం. వందశాతం ఆత్మసంతృప్తి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలనూ చక్కబెట్టుకోవచ్చు. మీరు నేర్చుకునే కళ మీ సొంతమైతే అది మీకు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. నలుగురికి ఉపాధి కల్పించే శక్తినిస్తుంది. లాభాలు తక్కువ ఉన్నా భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారాన్ని ఎంచుకుంటే రాణిస్తారు. ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాలు, అవకాశాలు, వనరులను వినియోగించుకోవడంలోనే మన విజయసూత్రం దాగి ఉంది.

ఆత్మ విశ్వాసంతో...

goldenhomegh650-4.jpg

ముందు మహిళల్లో ఎటువంటి వేధింపులు ఎదురైనా తమనితాము కాపాడుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి. సెల్‌ఫోన్‌ని ఎప్పుడూ సినిమాలు, పాటలు, వినోదానికే వినియోగించుకోకుండా లోకజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగించాలి. ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి.. ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఆలోచించాలి. ఆటలతో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం రెండూ అలవడతాయి.31122019vasu1j.jpg

ఇవి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడి కుంగిపోకుండా.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. కుంగ్‌ఫూ, కరాటేలూ నేర్చుకుంటే మనలో ధైర్యాన్ని నింపుతాయి. నేరం జరగకుండా... జరిగినా ఎదుర్కొనే బలాన్నిస్తాయి. ఆపత్కాలంలో పోలీసులను సంప్రదించేలా 100, 112, 108 వంటి హెల్ప్‌లైన్ల మీద అవగాహన ఉండాలి. తెలంగాణలో షీ టీంలు, ఆంధ్రప్రదేశ్‌లో మహిళా మిత్రా, సైబర్‌ మిత్రా వంటివాటిని ఎలా సంప్రదించాలో తెలిసుండాలి.  

ఇద్దరూ గెలవండి!

goldenhomegh650-5.jpg

కూరలో ఉప్పుండనిదే... దానికి రుచి ఉండదు. అనుబంధంలో ప్రేమ లేనిదే దానికి నిండుదనం ఎక్కడిది? భాగస్వామితోనో, స్నేహితులతోనో, సహచరులతోనో... కూర వండలేదనో, చెప్పింది వినలేదనో ఇలా విడిపోవడానికి వంద కారణాలుంటాయి. కలిసుండటానికి ఒక్క కారణం చాలు. బంధం బలంగా ఉండాలంటే ఎదుటివ్యక్తి కోణంలో ఆలోచించగలగాలి. అతడు ఎంత కష్టపడుతున్నాడు... మాట జారడానికి కారణాలేంటీ ఇలా మీకు మీరే విశ్లేషించుకోవాలి.31122019vasu1l.jpg

చాలా మంది చనువు ఉంది కదానీ... ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలని చూస్తారు. ఇలా చేస్తే ఎవరైనా దూరమై పోతారు. కొంతమంది స్నేహితుల్లో ఒకరు సినిమాకు పోదామంటారు... ఇంకొకరు పార్కుకు పోదామంటారు. రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఎవరో ఒకరి అభిమతం ఓడినట్టే. ఇద్దరూ గెలవాలంటే ఒకదాని తరువాత మరొకదానికి వెళ్లాలనే ధోరణిలో వ్యవహరించాలి. నా మాటే నెగ్గాలనే పంతం పనికిరాదు.

క్యాలండర్‌ ఉందా?

goldenhomegh650-6.jpg

ఈ ఏడాదిలో మీరేం చేయాలనుకుంటున్నారో ఆ పనులను ఓ పట్టికలా తయారుచేసుకుని మీ పై అధికారులకు అనధికారికంగా అందించాలి. పనిచేసే మహిళలకు క్యాలండర్‌ ఓ ఆయుధం. చాలామంది ఇది చాలా బిజీగా ఉండే వ్యక్తులకే అని అనుకుంటారు. ఇలా అనుకోవడం సరికాదు.31122019vasu1n.jpg

ప్రతి ఒక్క ఉద్యోగి దీన్ని అమలు చేయాలి. పిల్లల పరీక్షలు, సెలవులు, పండగలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులు... ఇలా ప్రతిదీ ఆ క్యాలండర్‌లో నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన క్యాలండర్‌ను కూడా తయారుచేసుకోవాలి. వార్షికాంతంలో ఇచ్చే సమీక్షలు, పై అధికారులకు సమర్పించే ప్రజంటేషన్స్‌... ఇలా ప్రతిదీ క్యాలెండర్‌లో పెట్టుకోవాలి. ప్రతి నెలా వీటిని చెక్‌ చేసుకుంటూ ఉండాలి. నెట్‌వర్క్‌ను పెంచుకోవాలి. సమావేశాలకు హాజరవుతూ ఉండాలి. అప్పుడే మన రంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సమావేశాల్లో మనం చేసిన పనిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాని గురించి గట్టిగా మాట్లాడాలి. చేసిన పనిని చక్కగా చెప్పడానికి ప్రయత్నించాలి. దీన్ని పర్సనల్‌ బ్రాండింగ్‌ అంటారు

...షట్‌డౌన్‌ చేయండి!

goldenhomegh650-7.jpg

నాకు అన్ని సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నాయి’ అని గొప్పగా భావించడం మానేసి అవి మనకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయనేది గుర్తించాలి. మాధ్యమాల్లో మన ఆసక్తులు, అభిరుచులను పెడుతూ గుర్తింపును పొందాలనుకోవడంలో తప్పులేదు. కానీ ‘ఇలాంటివి నేనే అప్‌లోడ్‌ చేశానా?’ అనే ఆలోచన భవిష్యత్తులో రాకూడదు. ఉపయోగపడే యాప్స్‌, ఆన్‌లైన్‌ ఛానెళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి.31122019vasu1p.jpg

టెక్నాలజీ పరంగా ఆన్‌లైన్‌లో ఎంత తక్కువగా గడిపితే అంత మంచిది. సైబర్‌మిత్ర, షీటీమ్స్‌ వంటి సెక్యూరిటీ యాప్స్‌ను కచ్చితంగా ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అవి మీకు తోడుగా ఉంటాయి. రాత్రి ఎనిమిది తరువాత స్మార్ట్‌ఫోనును వాడొద్దని ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోండి. తల్లులు ఫోను వాడితే పిల్లలూ అడుగుతారు. రాత్రివేళ ఎక్కువ సమయం ఫోనులో గడిపే పిల్లలు శారీరక, మానసిక దుష్ప్రభావాల బారిన పడే అవకాశం ఉంది. వీటితోపాటు రోజూ స్క్రీన్‌ టైమింగ్‌ను సరిచూసుకోండి.

ఆరోగ్యానికి ఐలవ్యూ చెప్పండి!

goldenhomegh650-8.jpg

లవ్‌ యూ... ఈ మాట ప్రతి మహిళ తనతో తాను ప్రతిరోజూ అనుకోవాలి. అవును ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రేమించుకోగలిగితే ఆమెలో అనుకూలభావాలు పెరుగుతాయి. అప్పుడే తన కుటుంబాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోగలదు. ఇదంతా జరగాలంటే... తన ఆరోగ్యం పట్ల అవగాహనతో అడుగులు వేయాలి. వయసుని బట్టి కొన్ని రకాల వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అందరినీ పట్టించుకుని తనని తాను నిర్లక్ష్యం చేసుకోకూడదు. చక్కని ఆహారం తీసుకుంటూ హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి, ఒత్తిడి వంటివాటికి దూరంగా ఉండాలి.31122019vasu1r.jpg

వారంలో నాలుగు రోజులు కనీసం అరగంట సేపు నడక, పరుగు లేదా జిమ్‌కు వెళ్లాలి. లేదంటే ప్రసవ సమయం, ప్రసవానంతరం, 40 ఏళ్లు దాటిన తరువాత శారీరక సామర్థ్యం తగ్గుతుంది. అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలెదురవుతాయి. ఇప్పటి బిజీ జీవితాల్లో మానసిక ఒత్తిడికి గురవడం సహజం. ఈ దశలో కొత్తప్రాంతాలను పర్యటించి ఒంటరితనం, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. మీరు చేరాలనుకునే లక్ష్యాలు, సంతోషంగా జీవించాలనే ఆశయానికి మీ శారీరక సామర్థ్యం తోడయ్యేలా జాగ్రత్తపడితే చాలు... ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.

పదండి పాతరోజులకి!

goldenhomegh650-9.jpg

ఆరోగ్యంగా ఉండాలంటే పాతకాలంలోకి వెళ్లాల్సిందే. మీరు చదివింది కరెక్టే... పాతకాలం నాటి ధాన్యాలు, పొట్టు తీయని పప్పులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీరానికి శక్తినిచ్చేవి మాంసకృత్తులు. వీటి కోసం పప్పులని ఎంచుకోవచ్చు. అలసందలు, రాజ్మా, సెనగలు వంటివాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. స్థానికంగా దొరికే గానుగనూనె... పల్లీ, నువ్వుల నూనెలను వాడుకుంటే మంచిది. నూనె, చక్కెర, బెల్లం.... ఏదైనా సరే పరిమితంగా ఉపయోగిస్తేనే మేలు.31122019vasu1t.jpg

మన ఆహారంలో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇవి మనకు ఆరోగ్యాన్ని అందించే మూలస్తంభాలు. పండ్లను నేరుగా తింటే పోషకాలన్నీ అందుతాయి. పొరుగింటి బ్రకోలి కోసం పరుగెత్తనవసరం లేదు. సులభంగా దొరికే బచ్చలి, కొత్తిమీర, గంగవెల్లి, గోంగూర, కరివేపాకును విరివిగా వాడుకోండి. ఇంటి పెరుగు చాలా శ్రేయస్కరం. మసాలాలు తాజాగా, ఇంట్లోనే తయారుచేసి వాడుకుంటే మేలు. మరో ముఖ్య విషయం... వాట్సాప్‌, ఫేస్‌బుక్‌... లాంటి సామాజిక మాధ్యమాల్లో ఆహారం గురించి వచ్చే అన్ని రకాల వార్తలను గుడ్డిగా నమ్మొద్దు. మీకేదైనా సమస్య ఉంటే పోషకాహార నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.





women icon@teamvasundhara
things-to-do-when-using-social-media

ఆ విషయాలు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారా..? అయితే జాగ్రత్త!

హేమ చాలారోజులు ఒంటరితనంతో ఇబ్బంది పడింది. దాన్నుంచి బయటపడటానికి కవిత్వం రాసేది. వాటిని ఫేస్‌బుక్‌లో చూసిన చాలామంది ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించారు. వారిలో ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని ఆమెకు రోజూ సందేశాలు పంపేవాడు. చివరికి కవిత్వంతోనే హేమను ఆకట్టుకున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ ప్రేమ వ్యవహారం కొనసాగించారు. కొన్నాళ్ల తరువాత హేమపై అనుమానం పెంచుకున్నాడు ఆ వ్యక్తి. క్రమంగా ఆమెపై ఆంక్షలు మొదలయ్యాయి.ఫేస్‌బుక్‌లో ఆమె ఫొటోలను ఫలానా వ్యక్తి ఎందుకు ఎక్కువ సార్లు లైక్‌ చేశాడని వేధించేవాడు. చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించిందామె..

Know More

women icon@teamvasundhara
singer-dhvani-bhanusali-wins-mirchi-music-award

ఈ సింగింగ్‌ సెన్సేషన్‌ పాటలకు ‘సాహో’!

గతేడాది విడుదలైన ‘సాహో’ సినిమాలోని ‘ఆగడిక సైకో సయ్యా’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ సాంగ్‌ను 4 భాషల్లో నలుగురు మేల్‌ సింగర్స్‌ పాడారు. కానీ ఫిమేల్‌ వెర్షన్‌ మాత్రం 4 భాషల్లో ఒకే అమ్మాయి పాడింది. ఆమే ధ్వని భానుశాలి. ఇప్పటికే నేపథ్య గాయనిగా ఎన్నో బాలీవుడ్‌ సినిమాల్లో పాటలు పాడిన ఆమె పాప్‌ సింగర్‌గానూ సత్తా చాటుతోంది. మ్యూజిక్‌ ఆల్బమ్‌లు రూపొందిస్తూ యూట్యూబ్‌ రికార్డులన్నింటినీ కొల్లగొడుతోంది. ఈ క్రమంలో కేవలం 22 ఏళ్లకే సంగీత ప్రపంచంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ యంగ్‌ సెన్సేషన్‌ కీర్తి కిరీటంలో మరో పురస్కారం చేరింది. ఇందులో భాగంగా ఇటీవల మిర్చి మ్యూజిక్‌ ‘లిజనర్స్‌ ఛాయిస్‌ ఇండిపెండెంట్‌’ పురస్కారాన్ని సొంతం చేసుకుందీ బ్యూటిఫుల్‌ సింగర్‌.

Know More

women icon@teamvasundhara
sports-womans-who-wins-espn-india-sports-awards

ఈ అవార్డుల్లోనూ అమ్మాయిలదే హవా!

ఒకటా...రెండా ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మహిళలు కూడా పురుషులతో సమానంగా పోటీపడుతూ పతకాలు సాధిస్తున్నారు. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ లాంటి గేమ్స్‌లో అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే అరుదైన విజయాలు సాధిస్తున్నారు. సరిహద్దులు దాటి దేశ, విదేశాల్లో పతకాల పంట పండిస్తున్నారు. ఇక క్రీడాకారుల ప్రతిభకు మరింత ప్రోత్సాహమందిస్తూ ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఈఎస్‌పీఎన్‌ ఏటా వివిధ విభాగాల్లో పురస్కారాలు ప్రదానం చేస్తోంది. ఈ క్రమంలో 2019 సంవత్సారానికి గానూ పది విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, పారా అథ్లెట్‌ మానసీ జోషీ, ప్రొఫెషనల్‌ స్ర్పింటర్‌ ద్యుతీ చంద్‌ ఈ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
tips-to-reduce-mobile-phone-usage

మీరు ‘ఫోన్‌ హాలిడే’ తీసుకుంటున్నారా?

‘ఫోన్‌’.. ప్రస్తుతం మనిషి జీవితంలో అత్యంత కీలకంగా మారిన వస్తువు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి వూపిరి తీసుకోకుండానైనా బ్రతకగలడేమో కానీ.. చేతిలో మొబైల్‌ ఫోన్‌ లేనిదే ఒక్క క్షణం కూడా గడపలేడంటే అతిశయోక్తి కాదు. మనకు ఏది కావాలన్నా మన చేయి ముందు ఫోన్‌ వైపే వెళ్తుంటుంది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరితో ఉన్నా ఫోన్‌ పక్కన లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ తరం మనిషి చేతికి ఉండే ఆరో వేలే ఈ సెల్‌ ఫోన్‌..! కాల్స్‌, మెసేజెస్‌, ఈమెయిల్స్‌, కెమెరా, అలారం, క్యాలెండర్‌.. మొదలైన నిత్యవసర యాప్స్‌తో పాటు.. వాట్సాప్‌ ఛాటింగ్‌, వీడియో కాల్స్‌, సోషల్‌ మీడియా(ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌), OTT ప్లాట్‌ఫామ్‌లు (Amazon, Netflix, Hotstar).. మొదలైన మరెన్నో వినోదాన్ని పంచే యాప్‌లతో సెల్‌ ఫోన్‌ మనిషిని కట్టిపడేస్తోంది. ఇవన్నీ కొంతవరకు సౌకర్యం, కాలక్షేపమే.. కానీ, మితిమీరిన వాడకం వల్ల అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు రావడం తధ్యమని నిపుణులు కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తునే ఉన్నారు. కానీ, జనం మాత్రం ఫోన్ వాడకాన్ని ఏమాత్రం తగ్గించకపోగా.. దానిని ఉపయోగించే సమయాన్ని రోజురోజుకూ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో CMR (Cyber Media Research) అనే సంస్థ చేసిన అధ్యయనంలో.. ఫోన్‌ను అధికంగా వాడడం వల్ల మానవ సంబంధాలపై చెడు ప్రభావాలుంటాయని తేలడం గమనార్హం. మరి ఆ ప్రభావాలేంటో.. వాటి నుంచి బయటపడే మార్గాలేంటో మీరే చూడండి..!

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-valentines-day

ఎర్ర గులాబీలనే ఎందుకిస్తారో తెలుసా?

ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమ పండగే వేలంటైన్స్ డే. ఇష్టంతో ముడిపడిన రెండు హృదయాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ క్రమంలో ప్రేమను తెలుపుకోవడంతో పాటు ఒకరికొకరు కానుకలిచ్చిపుచ్చుకోవడం కూడా మనకు తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఈ వేలంటైన్స్ డే రోజున ఎర్ర గులాబీలనే ఎందుకు కానుకగా అందిస్తారు? ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రోమియో-జూలియట్ ఎవరు? ఇలాంటి విషయాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే వేలంటైన్స్ డేకు సంబంధించిన ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాల సమాహారం మీకోసం..

Know More

women icon@teamvasundhara
covid-virus-no-worry-for-ritu-phogat

అక్కడ ఫైట్‌ కన్నా ముందు ఓ ప్రెషర్‌ కుక్కర్‌ కొనుక్కోవాలి!

కుస్తీ పోటీలంటే భారతదేశంలో అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘ఫోగట్‌ కుటుంబమే’. బబితా ఫోగట్‌, వినేశ్‌ ఫోగట్‌, ప్రియాంక ఫోగట్‌, గీతా ఫోగట్‌...ఇలా ఐదుగురి సిస్టర్స్‌లో ఒకరైన రీతూఫోగట్‌ 2016 కామన్వెల్త్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌ పోటీల్లో స్వర్ణంతో సత్తా చాటింది. దీంతో పాటు రెజ్లింగ్‌కు సంబంధించి పలు పతకాలు, టైటిళ్లు గెలిచిన రీతూ గతేడాది ఫిబ్రవరిలో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(ఎంఎంఏ)ఫైటర్‌గా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రొఫెషనల్‌ ఫైట్‌లోనే విజయం సాధించిన ఈ స్టార్‌ ఫైటర్‌ తాజాగా రెండో పోరు బౌట్‌ కోసం సిద్ధమవుతోంది. కానీ కోవిడ్‌-19(కరోనా) కల్లోలం నేపథ్యంలో సింగపూర్‌లో జరిగే ఈ ఫైట్‌లో ఆమె పాల్గొంటుందా?లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వైరస్‌కు తాను భయపడనని ధైర్యంగా ఈ పోరుకు హాజరవుతానని స్పష్టం చేసింది మణిపూర్‌ మణిపూస.

Know More

women icon@teamvasundhara
mumbai-girl-kaamya-karthikeyan-youngest-in-the-world-to-climb-south-americas-highest-peak

పన్నెండేళ్లకే ప్రపంచ రికార్డు సృష్టించింది!

ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులతో కలిసి ట్రెక్కింగ్ చేయడం ప్రారంభించిందా చిన్నారి. నడక నేర్చిన తర్వాత సహ్యాద్రి పర్వతాలపై సరదాగా అడుగులు వేసింది. అప్పటికి ఆమె వయసు రెండేళ్ల లోపే! ఆ తర్వాత కేరళలోనే ఎత్త్తెన శిఖరంగా పేరుగాంచిన చెంబ్రాపై ట్రెక్కింగ్ చేసింది. అనంతరం ఆమె అధిరోహించిన పర్వతాల జాబితాలో హిమాలయాల్లోని చంద్రశిల, కేదార్‌కాంత్, హర్ కి డున్, రూప్‌కుండ్ లేక్.. మొదలైనవి చేరాయి. ఇక తొమ్మిదేళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్దకు చేరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిందా అమ్మాయి. తాజాగా దక్షిణ అమెరికాలోని 6,962 మీటర్ల ఎత్తైన మౌంట్ అకొంకాగువా శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర తిరగరాసింది. ఆమే 12 ఏళ్ల కామ్యా కార్తికేయన్. ఇలా పేరెంట్స్ సహకారంతో పర్వతారోహణలో రికార్డు సృష్టిస్తున్న ఈ బాలిక విజయ ప్రస్థానం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Know More

women icon@teamvasundhara
meet-the-5-women-featured-in-the-forbes-india-30-under-30-list

‘ఫోర్బ్స్‌’ యువ కెరటాలు వీరే!

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా’... ‘పోకిరి’ సినిమాలో ప్రిన్స్‌ మహేశ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌. ఈ సినిమా డైలాగ్‌ను రియల్‌ లైఫ్‌లో కూడా ఫాలో అవుతున్నారు చాలామంది. వయసుతో ప్రమేయం లేకుండా వివిధ రంగాల్లో తమ సృజనాత్మకతతో, శక్తి సామర్థ్యాలతో సత్తా చాటుతున్నారు. ప్రతిభా పాటవాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ముచ్చటగా 30 ఏళ్లు కూడా నిండకుండానే నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్న యువకెరటాలను గుర్తించి వారికి ఏటా తమ జాబితాలో చోటు కల్పిస్తోంది ‘ఫోర్బ్స్‌’. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ ఓ జాబితాను విడుదల చేసింది. మరి, ఈ లిస్టులో చోటు సంపాదించి నేటి యువతకు స్ఫూర్తినిస్తోన్న ఈ యువకెరటాల గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
start-shuttler-pv-sindhu-special-interview
women icon@teamvasundhara
to-avoid-misuses-greta-thunberg-has-applied-to-trademark-her-name-and-fridays-for-future

ఇకపై నా పేరును వాడుకుంటే శిక్ష తప్పదు !

సమాజంలో ఎవరైనా ఓ వ్యక్తికి కాస్త గుర్తింపు లభిస్తే చాలు వాళ్ల పేరును ఉపయోగించుకొని లబ్ధి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఆ వ్యక్తితో తమకు ఎలాంటి పరిచయం లేకపోయినా.. ఫలానా వ్యక్తి మాకు బాగా తెలుసంటూ తమ సొంత పనుల కోసం ఆ పేరును వాడుకుంటుంటారు. అంతేకాదు, సమాజంలో పేరున్న వ్యక్తులు, సంస్థల పేర్లు చెప్పుకొని అమాయక ప్రజల దగ్గర డబ్బులు లాగే వాళ్ల గురించి మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్లు చేసే పనుల వల్ల ప్రముఖులు సమాజంలో తమకున్న మంచి పేరును కోల్పోతుంటారు. అయితే పర్యావరణ పరిరక్షణకై పోరాటం చేస్తోన్న ప్రముఖ సామాజికవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కి కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే ఎదురైంది. దీనికి తానో చక్కటి పరిష్కార మార్గం ఆలోచించింది. తన పేరుతో, తను చేస్తోన్న ఉద్యమం పేరుతో ఎలాంటి మోసాలు జరగకుండా వాటిపై పేటెంట్‌ హక్కులు తీసుకోవాలని నిర్ణయించుకుందీ 17 ఏళ్ల ఉద్యమకారిణి.

Know More

women icon@teamvasundhara
yusaku-maezawa-has-20000-applications-for-his-girlfriend-wanted-add

నా చంద్రమండల యాత్రకు ప్రేయసి కావలెను !

ఏ సంస్థ అయినా ఉద్యోగస్థుల కోసమో, వ్యాపారంలో భాగస్వామ్యం కోసమో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం చూశాం. ఆఖరికి మంచి వరుడికి ఫలానా అర్హతలున్న మంచి వధువు కావలెననో లేదా చక్కనైన వధువుకు ఈ అర్హతలున్న వరుడు కావలెననో... ఇలాంటి ప్రకటనలను కూడా చూశాం. కానీ తనకో ప్రేయసి కావాలని దరఖాస్తులను ఆహ్వానించిన వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా ? అసలు ఇటువంటి వార్తలను విన్నారా ? అది కూడా చంద్రమండలంపై అతడు చేయబోయే యాత్ర కోసం అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మమనే అంటారు ఎవరైనా కూడా ! అయితే నమ్మితీరాలి... ఎందుకంటే ఇది అల్లాటప్పా వ్యక్తి చేసిన పని కాదు. ఓ జపాన్‌ బిలియనీరు చేసిన పని. అందుకు జపాన్‌ మీడియా కూడా అతడికి సహకరిస్తోంది. ఇప్పటికే 28,000 మంది యువతులు అతగాడి లవర్‌గా ఉండేందుకు సిద్ధమని తమ దరఖాస్తులను కూడా పంపారట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే మరి !

Know More

women icon@teamvasundhara
bala-devi-is-the-first-indian-woman-footballer-to-sign-professional-contract-overseas

‘ఈ క్రీడలో అమ్మాయిలెందుకు లేరు?’ అనుకునేదాన్ని !

జీవితంలో ఒక ఆశయం పెట్టుకొని విజయం సాధించిన చాలామంది చెప్పే మాట ఒకటే... ‘ఆశయసాధనలో విజయం సాధించడం ముఖ్యం కాదు.. ఆ విజయం కోసం పడే తపనే ముఖ్యం.’ అని. ఎందుకంటే ఆ తపనే పదుగురికి స్ఫూర్తిగా నిలిచి మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. ఇలా ఫుట్‌బాల్‌ క్రీడలో విజయం సాధించాలని అనుక్షణం తపన పడింది ఓ మహిళ. ఈక్రమంలో తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఓ విదేశీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున కాంట్రాక్ట్‌ అందుకున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించింది. ఫుట్‌బాల్‌ క్రీడ అంటే కేవలం పురుషుల క్రీడే కాదని కనువిప్పు కలిగిస్తూ.. ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం లేని స్త్రీలకు తన నిరంతర తపనతో స్ఫూర్తిని రిగిలిస్తోంది. ఆమె మరెవరో కాదు... మణిపూర్‌ మణిపూస నంగొమ్‌ బాలాదేవి !

Know More

women icon@teamvasundhara
chennai-girl-nethra-kumanan-becomes-the-first-indian-woman-sailor-to-win-world-cup-medal

అలల్ని ఓడించింది... అరుదైన ఘనత సాధించింది !

సముద్రపు అలల్లో గొప్ప జీవిత సత్యం దాగుంది. తీరం దాటేందుకు నిరంతరంగా అవి సాగించే ప్రయాణం... ఆశయసాధనలో మనమెప్పుడూ ప్రయత్నం మానకూడదని తెలుపుతుంది. ఇలా అలల నుంచి స్ఫూర్తి పొందింది కాబట్టే పరాజయాలు ఎదురైనా నిరంతరం విజయం వైపు అడుగులు వేస్తూనే ఉంది ఓ యువతి. ఈక్రమంలోనే ఓ అద్భుతమైన ఘనతను సాధించింది. భారత సెయిలింగ్‌ క్రీడ (పడవ నడపడం)లో మహిళా సాధికారతకు మణిహారంగా నిలుస్తూ భావితరాలకు స్ఫూర్తిగా మారింది. ఆమె మరెవరో కాదు తాజాగా సెయిలింగ్‌ వరల్డ్‌ కప్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళ నేత్రా కుమనన్‌. సెయిలింగ్‌ అంటేనే పురుషుల క్రీడ అన్న భావనను చెరిపేస్తూ.. పరాజయాలు ఎదురైనా తీరంతో పోరాడుతున్న అలలా ఆమె ఈ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును సాధిస్తోంది. మరి మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా పరిచయం లేని నేత్ర ఈరోజు అందరికీ సుపరిచితురాలు అవడం వెనుక ఉన్న కథేంటో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
billie-eilish-becomes-the-first-woman-to-sweep-the-big-four-grammys

పీసీ, జెన్నీలను కాదని... ఆమే ‘టాప్‌’ లేపింది !

నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ గురించి మన తెలుగు వారికి పరిచయమే. ఎందుకంటే.. ‘జెన్నిఫర్‌ లోపెజ్‌ స్కెచ్‌ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి..’ అని ‘జల్సా’గా తెలుగు ప్రేక్షకులు కూడా పాడుకునే అందం ఆమెది. ఇక ప్రియాంక చోప్రా గురించి చెప్పాలంటే పిల్లాడిని అడిగినా బయోడేటా మొత్తం పూస గుచ్చినట్లు చెప్పేస్తుంటాడు. అంతటి నట ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. మరి అటువంటి జెన్నిఫర్‌ ఒకవైపు, ప్రియాంక మరోవైపు ఒకే వేడుకలో ఉండగా మరొకరి మీదకి మన దృష్టి వెళ్తుందా చెప్పండి ! కానీ వెళ్లింది.. ఓ 18 ఏళ్ల యువ సంగీత కెరటం ఆ తారల్ని మరిపించి అందర్నీ ఆకర్షించింది. ఆమే.. సంగీతంతో శ్రోతల్ని హిప్నటైజ్‌ చేసే బిల్లీ ఐలిష్‌. ఇటీవల జరిగిన 62వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదు అవార్డులు గెలుచుకుని ప్రపంచ సంగీత ప్రియులతో ఔరా అనిపించింది. మరింతకీ ఈమె ఎవరు ? అంతలా ఆమె సంగీతంలో ఏముంది ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
telugu-students-lakshmi-rajitha-climbs-mount-kilimanjaro
women icon@teamvasundhara
deshkibasha-is-new-hashtag-introduced-on-the-occasion-of-republic-day

భారతీయులమైనందుకు గర్విస్తున్నాం..!

దేశంలో 71వ గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా మన దేశ శ్రేయస్సు కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను మనమంతా గుర్తు చేసుకున్నాం. మతాలు, ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు.. ఇలా ప్రజల మధ్య ఎన్ని అంతరాలున్నా మనమంతా ఎప్పటికీ ఒక్కటే అంటూ మరోసారి చాటి చెప్పాం. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. త్రివర్ణ పతాకానికి సెల్యూట్‌ చేస్తూ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తోటి భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి టిక్‌టాక్‌లో ఓ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ వీడియోలు రూపొందించి అప్‌లోడ్‌ చేశారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
dollyparton-challenge-goes-viral

మరో కొత్త ఛాలెంజ్‌ వచ్చేసింది!

గతేడాది ‘10 ఇయర్‌ ఛాలెంజ్‌’ సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం మనం చూశాం. ఇలాగే ఏటేటా సోషల్‌ మీడియాలో కొన్ని ఛాలెంజ్‌లు సెన్సేషన్‌ సృష్టించడం పరిపాటే. అలా ఈ ఏడాది ఆరంభంలోనే ఓ ఛాలెంజ్‌ నెట్టింట్లో పాపులర్‌గా మారింది. అదే.. ‘డాలీ పార్టన్‌’ పేరుతో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోన్న ఛాలెంజ్‌. ఇటీవలే ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ అటు సెలబ్రిటీల నుంచి ఇటు సామాన్యుల దాకా ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి, ఈ న్యూ ఛాలెంజ్‌ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
esl-sprite-sports-league-women-winners

‘ఈఎస్‌ఎల్‌’ విజేతలు వీరే !

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా సాగిన ఈఎస్‌ఎల్‌ క్రికెట్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించి, వారిలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈనాడు- స్ప్రైట్‌ ఆధ్వర్యంలో జిల్లా/ప్రాంతీయ/ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ పోటీల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచినవారికి శనివారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రికెట్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాలతో పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడా పోటీల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌, ఈఎస్‌ఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ పుల్లెల గోపీచంద్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌.కిరణ్‌ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పలువురు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా వివిధ క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటారు. ఈ క్రమంలో వివిధ క్రీడల్లో సత్తా చాటి బహుమతులు గెలుచుకున్న మహిళా విజేతల వివరాలివే...

Know More

women icon@teamvasundhara
bal-shakti-puraskar-2020-and-national-bravery-award-2019

శభాష్‌... పిల్లలూ !

రేపటి పౌరులైన నేటి బాలల చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటారు. ఆపద సమయంలో ధైర్యంగా ఉండడం, కష్టాల్లో ఉన్నవారిని కనికరించడం, ఏ రంగంలోనైనా ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండడం, దేశ సంస్కృతిని ఇనుమడింపజేయడం వంటి సద్గుణాలు పిల్లలందరిలో ఉండవు. కొందరిలోనే ఉంటాయి. ఆ కొందరే మరికొందరికి స్ఫూర్తిగా నిలిచి దేశ ఉన్నతికి బాట వేస్తారు. అలాంటి బాలలను గుర్తించి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘బాల్‌శక్తి’ పురస్కారాలను అందిస్తుంటుంది భారత ప్రభుత్వం. ఈ ఏడాది 49 మందికి ఈ పురస్కారాలు దక్కగా వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు నలుగురు ఉండడం విశేషం. అంతేకాదు మరో 22 మంది బాలబాలికలు ఆపద సమయాల్లో తమ ధైర్య సాహసాలను ప్రదర్శించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసీసీడబ్ల్యూ) అందించే ‘జాతీయ సాహస బాలల పురస్కారాలు’ అందుకోబోతున్నారు. మరి పెద్దల నుంచి పాఠాలు నేర్చుకునే ఈ పిడుగులు దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచే స్థాయికి ఎలా చేరుకున్నారో చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
kodeeswari-winner-kousalya-kharthika-story
women icon@teamvasundhara
tania-shergill-will-lead-republic-day-parade

ఆర్మీ దుస్తులు ధరిస్తే అమ్మాయినని మరిచిపోతా!

తనియా షేర్గిల్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు ప్రముఖుల నోట మార్మోగుతున్న ఓ సైనికురాలి పేరు. పేరు చూస్తేనే చెప్పొచ్చు ఆమెది పంజాబ్‌ రాష్ర్టమని.. మరి ఆ రాష్ర్టంలో ఆర్మీవాళ్లు బోలెడు మంది ఉన్నారు.. కాబట్టి ఆమె సైన్యంలో చేరడమనేది చర్చించుకోవాల్సిన వింతేమీ కాదు. పైగా ఆమె పూర్వీకులందరూ సైనికాధికారులుగా సేవలందించినవారే.. వారి వారసత్వాన్ని తను కూడా పుణికి పుచ్చుకుంది. సో.. అందులో ఆశ్చర్యపడాల్సిన అద్భుతమేమీ లేదు. మరి ‘తనియా.. తాలియా’ అంటూ ఎందుకు దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంటోంది? ఆనంద్‌ మహీంద్రా, అమితాబ్‌ లాంటి సెలబ్రిటీ దిగ్గజాలు మాట్లాడుకోవాల్సిన స్పెషాలిటీ ఏముందామెలో? అది తెలియాలంటే ఇటీవల దిల్లీలో జరిగిన ఆర్మీడే పరేడ్‌ను ఓసారి చూడండి.

Know More

women icon@teamvasundhara
newpassword-is-the-first-twitter-trend-in-2020

మీ పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గానే ఉందా..?

ప్రస్తుతం మనం డిజిటల్‌ యుగంలో జీవిస్తున్నాం. మన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలూ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాంక్‌ లావాదేవీలు, పర్సనల్‌ ఈ-మెయిల్‌ల దగ్గర నుంచి సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్‌ వ్యాలెట్ల వరకు రోజూ మనం ఇంటర్నెట్‌ని ఎన్నో రకాలుగా వాడుతుంటాం. ఈ ఆన్‌లైన్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు వాటికి ‘పర్సనల్‌ ఐడీ’, ‘పాస్‌వర్డ్‌’లు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే మనం పెట్టే పాస్‌వర్డ్‌లు ఎంత క్లిష్టంగా ఉంటే మన ఖాతాలు అంత సురక్షితమని సైబర్‌ నిపుణులు నిత్యం చెబుతుంటారు. అంతేకాదు, ఆన్‌లైన్‌ ఖాతాలకు ఎక్కువకాలం ఒకే పాస్‌వర్డ్‌ ఉంచకూడదని.. వాటిని తరచూ మార్చుకోవాలని వాళ్లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా #NewPassword అనే ఓ కొత్త హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. మన ఆన్‌లైన్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను సంవత్సరానికి ఒకసారైనా మార్చుకోవడం సురక్షితమని తెలియజేయడమే ఈ హ్యాష్‌ట్యాగ్‌ ముఖ్యోద్దేశం. అయితే దీనిపై పలు రకాల ఫన్నీ మీమ్స్‌ రూపొందిస్తున్నారు నెటిజన్లు. వీరిలో సామాన్యులే కాదు.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ వ్యాపార సంస్థలు సైతం ఉండడం విశేషం. ఈ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సురక్షితమైన పాస్‌వర్డ్‌ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయడంతో పాటు తమ బాధ్యతలు, కార్యాచరణల గురించి అందరికీ సులభంగా అర్థమయ్యేలా వీటిని రూపొందిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో మీరూ చూసేయండి.

Know More

women icon@teamvasundhara
nilanshi-patel-palced-in-guinness-world-of-records-for-her-longest-hair

ఆరడుగుల జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించింది!

విరుల్లాంటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మహిళల ముఖ సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేసే ఈ వెంట్రుకలు రాలిపోతుంటే వారి మనసులో రేగే కలవరం అంతా ఇంతా కాదు. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డు సృష్టించింది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్‌. 17 ఏళ్ల వయసులోనే 190 సెంటీమీటర్ల (6 అడుగల 2.8 అంగుళాలు) పొడవైన కురులతో..ప్రపంచంలోనే అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల కెక్కిందీ టీనేజ్‌ సెన్సేషన్‌.

Know More

women icon@teamvasundhara
deepika-padukone-social-experiment-on-acid-sales

ఒక్క రోజులోనే 24 యాసిడ్‌ బాటిళ్లు కొన్నాం..!

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్‌’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీపికా పదుకొణె లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమా ఈనెల 10న విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాకు దీపిక స్వయంగా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక చిత్ర ప్రమోషన్‌ను దీపిక వినూత్న పద్ధతిలో ముందుకు తీసుకెళుతోంది. చిత్ర ప్రమోషన్‌తో పాటు ఏదో ఒక సందేశాన్ని ఇస్తోంది దీపిక టీం. యాసిడ్‌ బాధితుల పట్ల సమాజం ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలుసుకునే క్రమంలో ఇటీవల చిత్ర యూనిట్‌ ‘ఛపాక్‌ ఎక్స్‌పరిమెంట్‌’ పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా యాసిడ్ అమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరో ప్రయోగాన్ని చేపట్టింది ‘ఛపాక్‌’ టీం. మరి ఈసారి వీరు చేసిన సోషల్‌ ఎక్స్‌పరిమెంట్‌ ఏంటో చూద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
life-lessons-from-sankranti

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
team-for-womens-t20-cricket-world-cup-2020-is-announced

టీ20 ప్రపంచకప్‌ జట్టులో యువరత్నాలు!

‘బ్యాటు-బంతి రెండు చూడ చక్కగుండు... చూడ చూడ జోష్‌ పెరుగుతుండు, క్రీడలందు క్రికెట్‌ క్రీడ వేరయా... విశ్వదాభిరామ... వరల్డ్‌ కప్‌ మనదే రామ !’ అని ఆనందంగా పాడుకుంటున్నారు క్రికెట్‌ అభిమానులు. వారు అలా జోష్‌ఫుల్‌గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే మహిళా టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ఇటీవలే భారత మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో అందరూ భావించినట్లు చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ చోటు సంపాదించగా, ఈ ప్రపంచకప్‌తో రిచా ఘోష్‌ తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెడుతోంది. ఇక తెలంగాణ క్రికెటర్‌ అరుంధతీ రెడ్డి కూడా ఈ మెగా టోర్నీలో చోటుదక్కించుకుంది. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ 22 ఏళ్ల హైదరాబాదీ పేసర్‌కిది రెండో ప్రపంచకప్‌. మిథాలీ రాజ్‌ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు క్రికెటర్‌ అరుంధతినే కావడం విశేషం. మరి ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరినీ అలరించేందుకు రడీ అవుతోన్న ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు మన మహిళల టీమ్‌ స్క్వాడ్‌ ఎలా ఉందో ఓసారి చూద్దాం రండి !

Know More

women icon@teamvasundhara
surat-woman-with-cancer-plants-30000-trees-to-fight-air-pollution

నేను చనిపోతానని తెలుసు.. కానీ నాలా మరొకరు బలవ్వకూడదు!

27 ఏళ్ల వయసంటే.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని వాటిని నిజం చేసుకోవాలని తాపత్రయపడే దశ. అలాంటిది ఉన్నట్టుండి తాను త్వరలోనే చనిపోతానని తెలిస్తే మిగిలిన కొద్దిపాటి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఓ యువతి కూడా ఇలాంటి బాధనే అనుభవించింది. అయితే తన చావుకి కారణం మనిషి తెలియక చేస్తోన్న తప్పే అని గ్రహించిన ఆ యువతి, తన మిగిలిన జీవితమంతా ఆ తప్పును సరిదిద్దుతూ మనుషుల్లో చైతన్యం తీసుకురావడానికి అంకితమిచ్చింది. ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతూ భావితరాల ఉన్నతికి బాసటగా నిలుస్తోంది. ఇంతకీ ఆమెందుకు చావుకు దగ్గరైంది? మనిషి తెలియక చేస్తోన్న ఆ తప్పేంటి? ఏ విధంగా ఆమె ఆ తప్పును సరిదిద్దుతోంది? తెలుసుకుందాం రండి!

Know More

women icon@teamvasundhara
meet-the-makeup-artist-clover-wootton-who-behind-in-malati-in-chhapaak

అలా దీపికను ‘మాలతి’గా మార్చేసింది!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించిన తాజా చిత్రం ‘ఛపాక్‌’. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా మేఘనా గుల్జార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ‘మాలతి’ గా లీడ్‌ రోల్‌లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది దీపిక. ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కోసం వినూత్నంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది ‘ఛపాక్‌’ టీం. ఇందులో భాగంగా సినిమాలో మాదిరిగా ‘మాలతి’ గెటప్‌లో తయారై ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది దీపిక. అయితే ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదు సరి కదా..కొందరు ఆమె వైపు వికారంగా చూడడం గమనార్హం. మరి బోలెడు ఇమేజ్‌, స్టార్‌ పాపులారిటీ ఉన్న దీపిక జనం గుర్తుపట్టలేనంతగా ఎలా మారింది? ‘మాలతి’ మేకప్‌ వెనకనున్న రహస్యమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
sucheta-satish-trying-to-sing-songs-in-120-languages-for-guinness

120 భాషల్లో పాటలు పాడేస్తోన్న అపర బాల మేధావి!

జ్ఞానమనేది అనంతమైనది.. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అందుకే కొందరు ఎన్ని విషయాలు తెలిసినా, ఇంకా ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలని తపన పడుతుంటారు. అద్భుతాలు సృష్టించాలని, అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ రెండో కోవకే చెందుతుంది భారత సంతతికి చెందిన పదమూడేళ్ల సుచేతా సతీష్. దాదాపు భారతీయ భాషలన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తన గాత్రంతో సంగీత ప్రేమికుల్ని ఓలలాడిస్తోన్న ఈ యంగ్‌స్టర్‌కు నేర్చుకోవాలన్న తపన రోజురోజుకీ రెట్టింపవుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా తాను అందుకున్న ‘గ్లోబల్‌ ఛైల్డ్‌ ప్రొడిజీ (ప్రపంచ బాల మేధావి)’ అవార్డు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలపై కూడా పట్టు సాధించి.. ఇలా మొత్తంగా 120 భాషలు ఔపోసన పట్టడంతో పాటు అన్ని భాషల్లోనూ పాటలు పాడగల నైపుణ్యం సొంతం చేసుకున్నందుకే ఈ అవార్డు ఆమెను వరించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
greta-thunberg-turns-17-marks-birthday-with-7-hour-climate-protest

కేక్‌ దొరక్కపోవచ్చు..కానీ అందరం డిన్నర్‌ చేద్దాం!

పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాల పుస్తకాలను పక్కన పెట్టి మరీ పోరాడుతోంది గ్రెటా థున్‌బర్గ్‌. ‘స్కూల్‌ స్ట్రైక్‌ ఫర్‌ ది క్లైమేట్’, ‘యూత్‌ ఫర్‌ క్లైమేట్‌’ పేరుతో ఉద్యమాలను మొదలు పెట్టి అంతర్జాతీయ మేధావుల ప్రశంసలు సైతం అందుకుందీ స్వీడిష్‌ టీనేజర్‌. పర్యావరణంపై ప్రేమతో గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి భూమిని పరిరక్షించే బాధ్యతలను చిన్న వయసులోనే భుజాన వేసుకున్న గ్రెటా.. తన భావోద్వేగ ప్రసంగాలతో అందరిలో స్ఫూర్తి రగిలిస్తోంది. ఉద్యమంలో భాగంగా తనను విమర్శించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లాంటి వారికి కూడా తనదైన శైలిలో సమాధానాలిస్తోందీ యువకెరటం. ఈ క్రమంలో గ్రెటా తాజాగా 17 వ ఏటలోకి అడుగుపెట్టింది. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న ఈ యువతేజం అందరిలా పుట్టినరోజు సంబరాలు చేసుకోలేదు. మరేం చేసిందో మీరే చదవండి.

Know More

women icon@teamvasundhara
malayisan-couple-arrives-in-ambulance-to-their-wedding-faces-criticism

పెళ్లి పల్లకీలో కాదు.. అంబులెన్స్‌లో వచ్చారు..!

పెళ్లంటేనే సరదాలు, సంతోషాల సమ్మేళనం. జీవితంలో వచ్చే అతి పెద్ద వేడుక కాబట్టి.. దీనిని వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయే లాగా జరుపుకోవాలని కోరుకోవడం సహజం. పందిరి దగ్గర నుంచి భోజనాల మెనూ వరకు.. శుభలేఖల మోడల్‌ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ వరకు.. ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యానికి గురి చేయడానికి ఒక్కోసారి వింత ప్రయత్నాలు చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఆ ప్రయత్నం విజయవంతమై అందరి ప్రశంసలందుకుంటే ఫర్వాలేదు.. కానీ, అవి వికటిస్తే మాత్రం నలుగురి ముందు నవ్వుల పాలవ్వడంతో పాటు పలు రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఓ సంఘటన ఇటీవలే మలేషియాలో జరిగింది. మరి అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
telangana-girl-malavath-poorna-one-step-away-from-goal

పరి ‘పూర్ణ’ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో..!

మలావత్‌ పూర్ణ.. పర్వతారోహణకు సంబంధించి తెలంగాణ పేరును ప్రపంచానికి వినపడేలా చేసిన ఓ గిరిజన అమ్మాయి. బాల్యంలో స్థానికంగా ఉండే కొండలు, గుట్టలను ఎక్కిన ఆ బాలిక..13 ఏళ్ల వయసుకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా అతి పిన్న వయసులోనే ఈ శిఖరాన్ని ఎక్కిన బాలికగా రికార్డు సృష్టించిందీ డేరింగ్‌ గర్ల్‌. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకున్న పూర్ణ ప్రయాణం ఎవరెస్టు అధిరోహణతో ప్రారంభమైంది. తాజాగా అంటార్కిటికా ఖండంలోనే ఎత్తయిన విన్సన్‌ మాసిఫ్‌ శిఖరాన్ని కూడా అందుకుంది. దీంతో ఇప్పటివరకు ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన శిఖరాలను పాదాక్రాంతం చేసుకున్న ఈ తెలుగమ్మాయి.. పర్వతారోహణకు సంబంధించి పరి ‘పూర్ణ’ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
things-that-every-woman-should-try-to-learn-in-new-year

ఈ తీర్మానాలు మనకే ప్రత్యేకం..!

కాలం గడిచిపోతూ మరో ఏడాది వెనక్కి వెళ్లిపోయింది. కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త సంవత్సరం ఆరంభం వేళ కొత్త తీర్మానాలు తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇందులో భాగంగా జిమ్‌కి వెళ్లడం, వ్యాయామం ప్రారంభించడం, ఖర్చులు తగ్గించడం, చెడు అలవాట్లు మానేయడం వంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి వ్యక్తిగత తీర్మానాలతో పాటు విభిన్నంగా ఆలోచించి కొత్త సంవత్సరం వేళ మహిళలుగా సాధికారత సాధించే దిశగా సరికొత్త తీర్మానాలను కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనం జీవితమంతా ఆనందంగా ఉండడమే కాదు.. వ్యక్తిగా కూడా మనం ఎదిగేందుకు వీలుంటుంది. మరి, అలా మనం తీసుకోవడానికి వీలుండే కొన్ని తీర్మానాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
social-meida-challenges-those-went-viral-in-2019

2019లో వైరలైన సోషల్‌ మీడియా ఛాలెంజ్‌లివే..!

2019 చివరి దశకు చేరుకున్నాం. ఈ ఏడాదికి గుడ్‌బై చెప్పి.. 2020ని ఆహ్వానించడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ప్రతి సంవత్సరం లాగే 2019లో కూడా మనం ఆనందపడిన, బాధ పడిన, కన్నీళ్లు పెట్టుకున్న, ఆవేశానికి గురైన, కళ్లు చెమర్చేలా నవ్విన, ఆశ్చర్యానికి లోనైన, ఆలోచించిన సందర్భాలెన్నో ఉన్నాయి. మనల్ని బాధకు గురి చేసిన విషయాల నుంచి పాఠాలు నేర్చుకొని.. ఆనందపర్చిన, అలరించిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం. ఇదిలా ఉంటే ప్రతిసారీ లాగే ఈసారి కూడా సోషల్‌ మీడియాలో వివిధ నేపథ్యాలతో మొదలైన ఎన్నో ఛాలెంజ్‌లు నెటిజన్ల ఆదరణను పొందాయి. వీటిలో సమాజానికి మేలు చేసేవి కొన్నైతే.. ఆనందాన్ని పంచేవి మరికొన్ని. వీటితో పాటు కొన్ని ప్రమాదకరమైన ఛాలెంజ్‌లు కూడా ఉన్నాయండోయ్‌..! మరి, 2019లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొని సోషల్‌ మీడియాలో వైరలైన ఛాలెంజ్‌లేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
malala-yousaf-zai-most-famous-teenager-decade-un-declare

ధీరవనితకు దక్కిన మరో అరుదైన గౌరవం!

కట్టుబాట్లను కాదని చదువుకుంటోందన్న కారణంతో 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురైంది మలాలా యూసఫ్‌ జాయ్‌. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికీ రాకూడదని బాలికా విద్య, పిల్లల హక్కులపై నిరంతర పోరాటం చేస్తోందీ ధీరవనిత. ఇందులో భాగంగానే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ యూత్‌ ఐకాన్‌..అతి పిన్న వయసులో నోబెల్‌ శాంతి బహుమతి అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుందీ డేరింగ్‌ టీనేజర్‌. ఈ ‘దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌’గా గుర్తింపు పొందిందీ యువకెరటం.

Know More

women icon@teamvasundhara
upcoming-women-in-sports-2019

నవ వత్సరానికి యువ క్రీడా శక్తి !

నూతన సంవత్సరం 2020 సంఖ్యాపరంగా కూడా సమానత్వాన్ని చాటుతోంది. ఏ రంగాన్ని తీసుకున్నా పురుషులకేమీ తీసిపోని విధంగా క్రమక్రమంగా మహిళా శక్తి ఎదిగింది. గతంలో సిగ్గుతో తల వంచుకుని నెమ్మదిగా నడిచిన స్త్రీలు.. ఇప్పుడు పరుగు పందెంలో పతకాలు కొల్లగొడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తున్నారు. గృహహింసకు గురై పురుషాధిక్య నీడలో చిత్రహింసలకు గురైన మగువ, ఇప్పుడు పిడికిలి బిగించి బాక్సింగ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. బిందెనెత్తిన చేతులతో బరువులెత్తి పతకాలు సాధిస్తోంది. గరిట పట్టిన చేత్తో బ్యాట్‌ పట్టి క్రికెట్‌ బంతిని బౌండరీకి తరలిస్తోంది. ఈ క్రమంలో అనాదిగా పేరుకుపోయిన అసమానతలను సమూలంగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు నేటి తరం మహిళా మణులు. అందుకు నిదర్శనమే ఈ యువ మహిళా రైజింగ్‌ స్టార్స్‌.