scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

పెద్దన్న గారికి అలా జవాబిచ్చింది!

Greta Thunberg placed in Forbes Most Powerful Women List

ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట.. ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా..’ అంటూ ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని సూటిగా ప్రశ్నిస్తోంది స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థున్‌బర్గ్‌. చిన్నతనం నుంచే ప్రకృతి, పచ్చదనాన్ని తనలో నింపుకున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు.. అన్ని దేశాలు తిరుగుతూ భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉద్యమం చేస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తూ పిల్లలు, సామాన్యుల దగ్గర్నుంచి.. దేశ నాయకుల దాకా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాలని.. అప్పుడే వచ్చే తరాల వారికి ఈ భూమి సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని అందరిలో స్ఫూర్తి రగిలిస్తోందీ యువ తేజం. అందుకే నిన్నటికి నిన్న ప్రముఖ పత్రిక టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా గ్రెటాను కొనియాడగా.. తాజాగా ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటుదక్కించుకుందీ యంగ్‌ యాక్టివిస్ట్‌. ఈ నేపథ్యంలో ఈ యువ ప్రకృతి ప్రేమికురాలి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

norwaylawyersgh650-1.jpg
పర్యావరణంపై ప్రేమతో..!

స్వీడన్ దేశానికి చెందిన గ్రెటా ఎర్న్‌మన్ థున్‌బర్గ్ వయసు పదహారు సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోన్న ఈ అమ్మాయికి చిన్నతనం నుంచి ప్రకృతి అన్నా, పర్యావరణమన్నా అమితమైన ప్రేమ. అయితే స్వీడన్‌లో కార్బన్ ప్రసరణ బాగా పెరిగి వాతావరణం వేడెక్కడం గ్రెటాను తీవ్రంగా బాధించింది. స్వీడన్ ప్రభుత్వం కూడా 'ప్యారిస్ అగ్రిమెంట్'కు అనుగుణంగా వాతావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలను చేపట్టకుండానే గతేడాది మళ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వం ఎలాగైనా కార్బన్ ప్రసరణను తగ్గించే చర్యలను చేపట్టాలని గతేడాది ఆగస్టులో స్కూల్ మానేసి మరీ శాసనమండలి ముందు నినదించింది గ్రెటా. అలా ఒక్కరోజు కాదు ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘స్కూల్ స్ట్రైక్‌ ఫర్ ది క్లైమేట్’ ప్లకార్డుతో రోజూ శాసనమండలి ముందు కూర్చునేది గ్రెటా. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతి శుక్రవారం స్కూల్ మానేసి ప్లకార్డుతో నిరసన తెలపడం మొదలుపెట్టింది. అలా తాను కొనసాగిస్తోన్న పోరాటం క్రమక్రమంగా ప్రపంచ దేశాలను తాకింది.
norwaylawyersgh650-3.jpg
అలా ప్రపంచమంతా విస్తరించింది!
గ్లోబల్ వార్మింగ్‌పై గ్రెటా చేస్తోన్న పోరాటం అనతికాలంలోనే ప్రపంచంలోని దాదాపు వంద దేశాలను తాకింది. ‘స్కూల్ స్ట్రైక్‌ ఫర్ ది క్లైమేట్'గా ప్రారంభమైన ఈ ఉద్యమం.. ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’, ‘యూత్ ఫర్ క్లైమేట్’ వంటి పేర్లతో ప్రపంచంలోని విద్యార్థులను ఈ దిశగా కదిలించింది. గతేడాది డిసెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 270 నగరాల్లోని దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు గ్రెటాకు మద్దతుగా గ్లోబల్ వార్మింగ్‌కి వ్యతిరేకంగా స్కూల్ స్ట్రైక్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి మాటను కూడా లెక్క చేయకుండా విద్యార్థులు గ్రెటా ఉద్యమాన్ని కొనసాగించారంటే తోటి విద్యార్థులపైన గ్రెటా ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి డచ్ శాస్త్రవేత్తలు సైతం సంఘీభావం తెలిపారు. ఇక జర్మనీలోనైతే విద్యార్థుల ఉద్యమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కొంతమంది న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయడం విశేషం.

norwaylawyersgh650-4.jpg

ఆఫ్‌లైనే కాదు.. ఆన్‌లైన్‌లోనూ..!
పర్యావరణ పరిరక్షణ కోసం గ్రెటా ప్రారంభించిన ఈ ఉద్యమం.. అందరినీ ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే అటు ఆఫ్‌లైన్‌లో విద్యార్థులంతా గుమిగూడి నిరసనకు దిగడమే కాకుండా.. ఆన్‌లైన్‌లోనూ గ్రెటా ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే గ్రెటాకు ట్విట్టర్‌లో 34 లక్షల మందికిపైగా ఫాలోవర్లున్నారు. వారంతా ఆమె ప్రారంభించిన ఉద్యమాన్ని #climatestrike, #klimatstrejk, #FridaysForFuture అనే హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా విశ్వవ్యాప్తం చేస్తూ, మరింత మందిని ఇందులోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థీ తన వెంట నడవడం తనకు ఎంతగానో సంతోషం కలిగిస్తోందని అంటోంది గ్రెటా.
norwaylawyersgh650-2.jpg
'నా దృష్టిలో ఈ ఉద్యమం ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికీ పర్యావరణం పట్ల అవగాహనను పెంచడమే కాదు.. దీని గురించి, దీని ప్రాముఖ్యం గురించి అందరూ మాట్లాడుకునేందుకు దోహదం చేస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణహితం కోసం తమ వంతుగా ప్రయత్నిస్తారు. నేను ఉద్యమం ప్రారంభించిన తొలి రోజు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు కొనసాగించా. అయితే ఆ రోజు నేనొక్కదాన్నే ఉన్నా.. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా నాతో పాటు చేరారు. ఇలా ఇప్పటికే ఈ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థినీ విద్యార్థులు భాగమవుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. వారు ప్లకార్డులు పట్టుకొని పోరాటం సాగిస్తోన్న ఫొటోలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది..' అంటూ మురిసిపోతోందీ టీనేజీ యాక్టివిస్ట్.

మా కలల్ని చిదిమేయడానికి మీకెంత ధైర్యం!

GretaThunbergspeech650.jpg

పర్యావరణ పరిరక్షణ కోసం దేశదేశాలు తిరుగుతూఅక్కడి నాయకుల్ని కలుస్తూ వాతావరణం కలుషితం కాకుండా చర్యలు తీసుకోమని కోరుతోందీ యంగ్‌ గర్ల్‌అంతేకాదు.. పర్యావరణహితం కోరుతూ పలు అంతర్జాతీయ వేదికలపైనా తన గళాన్ని వినిపిస్తుంటుందిఈ క్రమంలో ఇటీవలే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి వేదికగా జరిగిన ‘ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు’లో పాల్గొన్న గ్రెటా.. ‘పర్యావరణ కాలుష్యం తద్వారా రాబోయే తరాలకు జరిగే ముప్పు’ అనే అంశంపై అద్భుతమైన రీతిలో ఉపన్యసించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘ప్రస్తుతం వాతావరణమంతా కలుషితమవుతోందిఅలాకాకుండా ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు.. అందరు పిల్లల్లాగే హాయిగా స్కూల్లో పాఠాలు నేర్చకునేదాన్నిమీ నిస్సారమైన మాటలుచేతలతో ఓవైపు పర్యావరణాన్ని నాశనం చేస్తూనేమా ఆశల్ని ఆవిరి చేస్తూనే.. మళ్లీ భవిష్యత్తుయువత అంటూ మీరు మా వద్దకు రావడానికి మీకెంత ధైర్యం?’ అంటూ దేశాధినేతల్ని ధైర్యంగా ప్రశ్నించిన గ్రెటా ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందిపర్యావరణ పరిరక్షణ దిశగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందిఇలా సాగిన గ్రెటా ప్రసంగానికి సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఫిదా అవడంతో పాటు ఆమెను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు.

చివరికి కూతురి దారిలోకే..!

norwaylawyersgh650-5.jpgగతేడాది ఆగస్టులో తన కూతురు గ్రెటా ప్రారంభించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని మొదట్లోనే విరమింపజేయాలని విశ్వప్రయత్నం చేశారు గ్రెటా తల్లిదండ్రులు స్వాంటే థున్‌బర్గ్మాలేనా ఎర్న్‌మన్కానీ ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తోన్న మద్దతుఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన ఆ పేరెంట్స్ ఆఖరికి తమ కూతురి దారిలోకే వెళ్లడం విశేషంఅంతేకాదు.. పర్యావరణహితం కోసం అంతులేని పోరాటం సాగిస్తోన్న గ్రెటాను చూసి ఆమె పేరెంట్స్ కూడా స్ఫూర్తి పొందారు. ‘గ్రెటా పూర్తిగా శాకాహారిపర్యావరణానికి హాని కలిగించే పనేదీ ఆమె చేయదువిమానయానాలకు సైతం చిన్నతనంలోనే స్వస్తి చెప్పిందిఫలితంగా పలు అవార్డులను కూడా వదులుకుందిదావోస్‌లోని ఒక ఉద్యమానికి అందరు పిల్లలు విమానంలో వస్తే గ్రెటా మాత్రం 32 గంటలు రైల్లో ప్రయాణించి దావోస్‌కు చేరుకొని పర్యావరణం పట్ల తనకున్న మక్కువను చాటుకుందితన కూతురిలో ఉన్న ఈ లక్షణాలే ఆమె తల్లిదండ్రుల్ని విపరీతంగా ఆకర్షింపజేశాయిఅందుకే వారు కూడా గ్రెటాలాగా విమానాల్లో ప్రయాణించడం పూర్తిగా మానేశారుఅలాగే వేగన్ ఆహారం తీసుకోవడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని లైఫ్‌స్త్టెల్‌ని అనుసరించడం మొదలుపెట్టాం..’ అంటూ తన కూతురి ప్రభావం తమపై ఎంతగానో ఉందని ఓ సదస్సులో భాగంగా వివరించారు గ్రెటా తండ్రి స్వాంటేప్రస్తుతం గ్రెటా తండ్రి స్వాంటే థున్‌బర్గ్ రచయితగానటుడిగాఆమె తల్లి మాలేనా ఎర్న్‌మన్ ఒపేరా సింగర్‌గా కొనసాగుతున్నారు.

శక్తిమంతమైన మహిళగా అవతరించింది!

GretaThunbergspeechnew650-1.jpgదాదాపు ఏడాదిన్నర కాలం పాటు కొనసాగిస్తోన్న తన ఉద్యమంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది గ్రెటాఅందుకే తాజాగా ఫోర్బ్‌ పత్రిక విడుదల చేసిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో వందో స్థానంలో నిలిచిందీ స్వీడిష్‌ టీనేజర్‌ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో చోటుదక్కించుకోవాలని పోటీ పడే మహామహులను సైతం వెనక్కి నెట్టి గ్రెటా ఈ లిస్టులో చోటుదక్కించుకోవడం విశేషంఅలాగే నిన్నటికి నిన్న ‘టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గానూ గ్రెటా సేవల్నిఉద్యమాన్ని కొనియాడిందా పత్రికఇక అంతకుముందు స్వీడన్‌లోని ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 2019కి గాను గ్రెటా అత్యంత ప్రభావశీలమైన స్వీడన్ అమ్మాయిగా అవతరించిందిఅలాగే టైమ్ పత్రిక కూడా 2018కి గాను అత్యంత ప్రభావశీలురైన 25 మంది టీనేజర్లలో ఒకరిగా గ్రెటాను గుర్తించి గౌరవించిందిఅంతేకాదు.. ఈ ఏడాది 'అంతర్జాతీయ మహిళా దినోత్సవంసందర్భంగా గ్రెటా 'మోస్ట్ ఇంపార్టెంట్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ స్వీడన్ ఇన్ 2019'గా నిలిచిందిఅక్కడి 'ఇనిజియోఇనిస్టిట్యూట్‌తో పాటు 'ఆఫ్టన్‌బ్లాడెట్పత్రిక సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైంది.

నోబెల్‌ రేసులో నిలిచింది.. కానీ!

GretaThunbergspeechnew650-2.jpgపర్యావరణ ప్రేమికురాలైన గ్రెటా ఉద్యమ నాయకురాలిగానే కాదు.. చక్కటి వక్తగా కూడా అందరికీ సుపరిచితురాలేఈ క్రమంలో 'టెడ్ఎక్స్ టాక్స్', 'కోప్24 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ సమిట్', 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'.. వంటి వేదికలపై పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తన గళాన్ని వినిపించింది. 'ప్రస్తుతం మనం చేసే పనుల వల్ల మన మనుగడకు మనమే ముప్పు తెచ్చుకున్న వాళ్లమవుతున్నాంఈ గ్లోబల్ వార్మింగ్ మనందరం ఎదుర్కొనే అతిపెద్ద సంక్షోభం అనడం అతిశయోక్తి కాదుఅందుకే ఇప్పటికైనా మనందరం ఈ విషయాన్ని గ్రహించి పర్యావరణానికి హాని కలిగించే పనుల్ని ఆపుదాంపర్యావరణహిత ప్రపంచాన్ని ముందు తరాల వారికి అందించే ప్రయత్నం చేద్దాం.. అంతేకాదు.. పర్యావరణ పరిరక్షణ గురించి తల్లిదండ్రులంతా తమ పిల్లలకు మంచి మాటలు నేర్పించాలి.. వారినీ ఈ దిశగా నడిపించాలి..' అంటూ అంత చిన్న వయసులోనే పర్యావరణహిత సమాజం కోసం తాను ఎంతగా పాటుపడుతోందో ప్రపంచ వేదికగా వివరించింది గ్రెటాఅందుకే ఆమెను అక్కడివారు 'స్వీడన్స్ ఓన్ మలాలా'గా కీర్తిస్తుంటారుగ్రెటాలోని ఈ వ్యక్తిత్వమే నార్వేలోని న్యాయవాదులను సైతం మెప్పించిందిఅందుకే వారు ఆమె పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడంతో.. ఈ ఏడాది నోబెల్ పురస్కారాల రేసులోనూ నిలిచిందీ యువతేజంఅయితే నోబెల్‌ శాంతి బహుమతిని మాత్రం అందుకోలేకపోయింది గ్రెటా.

గ్రెటా.. ముందు నీ కోపాన్ని తగ్గించుకో!

GretaThunbergspeechnew650-3.jpg

ప్రకృతిని పరిరక్షించడానికి తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తోన్న గ్రెటాను సమర్థించేవారు ఎక్కువమందే ఉన్నా.. ఆమెను విమర్శించే వారూ లేకపోలేదుఆ లిస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు వరుసలో ఉంటారుగతంలో ఐరాసలో గ్రెటా తన గళాన్ని వినిపించినప్పుడు ‘గ్రెటా చాలా యాక్టివ్‌గా ఉండే అమ్మాయి.. ఆమె భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా..’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయగా అప్పుడది సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయిందిఅయితే తాజాగా టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన గ్రెటాపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు ట్రంప్‌. ‘గ్రెటా.. నువ్వు ముందుగా నీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయిఆపై నీ ఫ్రెండ్‌తో కలిసి ఓ పాత సినిమా చూడ్డానికి వెళ్లు.. చిల్‌ గ్రెటా.. చిల్‌!’ అంటూ ట్వీట్‌ రూపంలో మరోసారి విమర్శించారు ట్రంప్‌ప్రస్తుతం కూడా ఈ ట్వీట్‌ వైరలవుతోందిఅయితే సాధారణంగా గ్రెటా ట్విట్టర్‌ బయోలో ‘ఎన్విరాన్‌మెంటల్‌ యాక్టివిస్ట్‌’ అని రాసుంటుందికానీ తాజాగా ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను తన ట్విట్టర్‌ బయోగా రాసుకొని తనదైన రీతిలో సమాధానం చెప్పిందీ యంగ్‌ యాక్టివిస్ట్‌.

ఏదేమైనా, ఎవరేమన్నా పర్యావరణహితం కోసం తాను చేస్తోన్న ఈ పోరాటం మాత్రం కొన్ని రోజులతో ఆగేది కాదని, స్వీడన్ ప్రభుత్వం ‘ప్యారిస్ ఒప్పందా’నికి కట్టుబడి దాన్ని అమలు చేసే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని అంటోందీ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ నాయకురాలు. మరి, ఈ స్వీడన్ మలాలా కొనసాగిస్తోన్న ఈ ఉద్యమానికి మనమూ మన వంతుగా మద్దతు తెలుపుదాం. ఈ టీనేజీ కార్యకర్తకు సలాం కొడుతూ ఇలాగైనా పర్యావరణ పరిరక్షణలో భాగమవుదాం.

women icon@teamvasundhara
face-masks-are-available-for-10-rupees-in-sagar-district-in-madhya-pradesh

ఈ కలెక్టరమ్మ ముందుచూపు... 10 రూపాయలకే మాస్కు..!

సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషి చేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ఊహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వేరు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మైథిల్‌ నాయక్‌ రెండో కోవకు చెందుతారు. మధ్యప్రదేశ్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఒకటీ అరా కనిపించగానే శానిటైజర్ల తయారీకి చక్కని కార్యాచరణ రూపొందించారు ప్రీతీ. దీనిలో భాగంగా సెంట్రల్‌ జైల్‌లో ఉంటున్న 55 మంది ఖైదీల సేవలను మాస్కుల తయారీకి వినియోగించుకుంటున్నారు. రోజుకు వెయ్యి మాస్కుల చొప్పున తయారుచేయిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేయకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. ఆరోగ్య సేవకులకు, వైద్యులకు, పోలీసులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. సామాన్యులకు పది రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి, మాస్కులు అవసరమైన వారికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కదా...

Know More

women icon@teamvasundhara
singapore-illustrator-fight-misinformation-about-corona-through-her-comics

కామిక్‌ల రూపంలో ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

‘మీరు N-95 మాస్క్‌ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్‌ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్‌ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.

Know More

women icon@teamvasundhara
new-tiktok-trend-to-help-women-who-feel-unsafe-in-cabs

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
cyber-attacks-in-the-name-of-coronavirus

కరోనా పేరుతో వైరస్‌ను పంపుతున్నారు... జాగ్రత్త!

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.. దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.. ముఖ్యమైన మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రంగాలపై ‘కరోనా’ వైరస్‌ (కొవిడ్‌-19) దాడి చేస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వ్యాధిని వ్యాపారంగా కూడా మార్చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మామూలు రోజుల్లో రూ.10 విలువ చేసే మాస్కులను.. ఇప్పుడు ఏకంగా రూ.50నుంచి వందకు అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యానికే కాకుండా జేబులకు సైతం చిల్లుపెడుతోన్న ‘కరోనా’ వైరస్‌ను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏకంగా సైబర్‌ నేరగాళ్లు కూడా నేరాలకు తెగ బడుతున్నారు. ఇంతకీ ‘కరోనా’తో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
google-trick-to-play-holi-with-your-smartphones

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
teenmar-savithi-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
singer-madhupriya-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
supriya-got-vasundhara-puraskaram

ఘన వారసత్వం...

తెలుగువారు గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్ఢ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత కావడంతో తొలి నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. పదహారో ఏటనే గాయం సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్‌ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత గూఢచారి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమా నిర్మాణంలోనూ, నటనలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు సుప్రియ

Know More

women icon@teamvasundhara
mithali-raj-got-vasundhara-puraskaram

మహిళా క్రికెట్‌ చిరునామా!

భారత మహిళల క్రికెట్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మిథాలీరాజ్‌. దేశంలో అమ్మాయిల క్రికెట్‌ ఉందని కూడా చాలా మందికి తెలియని సమయంలో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి భారత మహిళా క్రికెట్‌ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు గొప్ప స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణం.. మిథాలీయే. 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకం చేసింది. 19 ఏళ్ల వయసులో తన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై 214 పరుగులు చేశారు. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. గతేడాది టీ20ల నుంచి రిటైరయ్యారు. గతంలో మిథాలీ బ్యాటర్‌గా కొనసాగుతూనే జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై జట్టును నడిపించిన ఈ ప్రస్తుత వన్డే కెప్టెన్‌.. 2021 ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలు పలికే అవకాశముంది.

Know More

women icon@teamvasundhara
jyothi-surekha-got-vasundhara-puraskaram
women icon@teamvasundhara
hari-priya-got-vasundhara-puraskaram

నాట్య పరిమళం...

‘వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి..శతాబ్దాల చరితగల సుందర నగరం..’ అంతటి ఘన చరితగల రాజమహేంద్రికి చెందిన చిన్నారే... మద్దిపట్ల పరిమళ హరిప్రియ. పదమూడేళ్ల వయసులోనే కూచిపూడి, భరతనాట్యాల్లో అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న హరిప్రియ ఇప్పటివరకు అయిదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ల కిందట హరిప్రియ ఇస్రోలో ఇచ్చిన ప్రదర్శన ఎందరో ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఆమె ఇచ్చిన ప్రదర్శన రసహృదయులను ఆనందసాగరంలో ముంచేసింది. 2015లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ‘నాట్య మయూరి’ అవార్డు, 2016లో ‘నర్తన్‌ బాల’ అవార్డు, రాష్ట్ర స్థాయి పోటీలో ‘నాట్య పరిమళ’ అవార్డులు గెలుచుకుంది. శోభానాయుడు, మంజుభార్గవిలా నృత్యంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్న హరిప్రియకు వీణలో కూడా ప్రవేశం ఉంది.

Know More

women icon@teamvasundhara
singer-mangli-womens-day-special-song

మంగ్లీ స్పెషల్‌ సాంగ్‌ విన్నారా..?

ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఎంతో సంతోషంగా, గర్వపడుతూ, పండగలా జరుపుకునే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రానే వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు గాయనీగాయకులు ప్రత్యేకమైన గీతాలతో మహిళల ఉనికిని దశదిశలా విస్తరింపజేస్తారు. ప్రముఖ గాయని, నటి మంగ్లీ కూడా ఈ ‘ఉమెన్స్‌ డే’ని పురస్కరించుకొని ఈటీవీతో కలిసి ఓ గీతాన్ని ఆలపించింది. స్త్రీ శక్తిని గురించి ఎంతో గొప్పగా అక్షీకరించిన ఈ పాటను మంగ్లీ ఎంతో అద్భుతంగా పాడింది. ‘అమ్మగా.. అమ్మాయిగా.. చెలియగా.. చెల్లాయిగా.. ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం..’ అంటూ సాగే ఈ పాట స్త్రీలు తమ నిజ జీవితంలో పోషించే వివిధ పాత్రల గురించి కళ్లకు కడుతుంది. ఈ పాటలో మంగ్లీతో పాటు కరుణ, లహరి, పలువురు బుల్లితెర తారలు కూడా సందడి చేశారు. ఈ పాటను ప్రతి ఒక్క మహిళకు అంకితం చేస్తున్నట్లు ఈటీవీ ప్లస్‌ తెలిపింది. మరి, వినసొంపుగా, స్త్రీ శక్తిని చాటేలా ఉన్న ఆ అద్భుతమైన గీతాన్ని మీరూ విని తరించండి!

Know More

women icon@teamvasundhara
mithali-raj-playing-cricket-in-saree-goes-viral

నేను చీరకట్టి బ్యాట్‌ పట్టింది అందుకే!

భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం చీర. అయితే చీరకట్టులో సౌకర్యంగా ఉండలేమని చెబుతూ చాలామంది అమ్మాయిలు శారీలను కేవలం పండగలు, ప్రత్యేక రోజులకే పరిమితం చేశారు. ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్ర్తధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్‌కు మూల స్తంభంలా నిలిచిన మిథాలీ రాజ్‌ కూడా చీర కట్టుతోనే క్రికెట్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జెర్సీ, ప్యాంటు ధరించి క్రికెట్‌ ఆడే ఆమె ఎందుకు చీరకట్టి బ్యాట్‌ పట్టిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
13years-girl-stops-child-marriage-and-got-award-from-cm

బాల్య వివాహాన్ని అడ్డుకుంది.. అవార్డు గెలుచుకుంది !

సాంకేతికంగా దేశం ముందంజలో దూసుకెళుతోంది. ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నాం. అయినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రం వెనుకబడే ఉన్నాయి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్యవివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత ప్రచారం కల్పించినా.. వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఏదో ఓ చోట ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తన కళ్ల ముందు జరుగుతోన్న ఆ అమానుష చర్యను చూస్తూ ఊరుకోలేదో చిన్నారి. వయసులో చిన్నదే అయినా ఎంతో గొప్పగా ఆలోచించి బాల్య వివాహాన్ని అడ్డుకుంది. ఇంతకీ ఎవరా చిన్నారి..? తనేం చేసిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
schschool-girls-turns-one-day-collector-for-an-inspiring-reason

ఈ ‘ఒక్కరోజు కలెక్టర్‌’ గురించి విన్నారా?

అర్జున్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. సాధారణ టీవీ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోన్న అర్జున్‌కి అనుకోకుండా ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’గా పని చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రజల శ్రేయస్సు కోసం తాను అప్పటివరకు చేయాలనుకున్న పనులను ఒక సీఎంగా అర్జున్‌ పూర్తి చేసి ప్రజల మన్నలను పొందుతాడు. ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్కూల్‌ విద్యార్థినులకు ఇటీవల ‘ఒక్కరోజు కలెక్టర్‌’గా పని చేసే అవకాశం లభించింది. మరి వాళ్లకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
cricketer-radha-yadav-inspirational-story

women icon@teamvasundhara
women-fight-for-toilets

రీల్‌ స్టోరీ కాదిది.. రియల్‌ స్టోరీ!

అక్షయ్‌ కుమార్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా 2017లో వచ్చిన ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరుగుదొడ్లు ఉపయోగించని ఓ గ్రామంలోకి పెళ్లి చేసుకొని వెళ్లిన ఓ నవ వధువు (భూమి) ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? ఆ గ్రామ ప్రజల్లో ఎలా మార్పు తీసుకొచ్చింది. దీనికి భర్త (అక్షయ్‌ కుమార్‌) ఎలా సహాయపడ్డాడు... ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. వినడానికి చిన్న సమస్యగానే ఉన్నా.. నిజానికి ఇదో పెద్ద సమస్య. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల మరుగుదొడ్లను ఉపయోగించడం లేదంటే మీరు నమ్మగలరా? అయితే అలాంటి ఓ గ్రామాన్ని మార్చేసింది ఓ మహిళ. సినిమాలో హీరోయిన్‌లానే గ్రామంలో మార్పులు తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరామె.? తన కథేంటో తెలుసుకోవాలనుందా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon@teamvasundhara
start-shuttler-pv-sindhu-got-vasundhara-puraskaram

ఎగిసిన క్రీడా కెరటం

భారత బ్యాడ్మింటన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత పి.వి.సింధు సొంతం. సైనా ఘనతల తర్వాత మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫిట్‌నెస్.. దూకుడుతో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను, భారత రాకెట్ జోరును అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఎవరూ వూఊహించని ఘనతలు అందుకుంది.సైనా సాధించిన ఘనతలకు మెరుగులు దిద్దింది. ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో రజతం. కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం, కాంస్యం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాల్ని సింధు కైవసం చేసుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది. నిరుడు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం..ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ ఫిట్‌నెస్.. దూకుడుతో మహిళల బ్యాడ్మింటన్‌లో వూఊపు తెచ్చింది. ఒకప్పుడు పురుషుల మ్యాచ్‌లకే ఆదరణ ఉండగా.. మహిళల పోరాటాల్ని ఆసక్తిగా మార్చిన ఘనత సింధుదే. జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటం సింధుకే చెల్లింది. ప్రపంచ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ), ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంతానన్ రచనోక్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులకు సమ ఉజ్జీ మన సింధు.

Know More

women icon@teamvasundhara
fareeha-tafim-got-vasundhara-puraskaram