scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

హ్యాపీ బర్త్‌డే క్రికెట్‌ క్వీన్‌!

mithali raj  first woman cricketer to complete 20 years in odi cricket in telugu

క్రికెట్ ఆడడానికే పుట్టిందేమో అన్నట్లుగా క్రికెట్‌నే తన జీవిత పరమావధిగా మార్చుకుందామె. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకొని దేశానికే గర్వకారణంగా నిలిచింది. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడం, నాయకురాలిగా సహచరులకు నైపుణ్యాల్ని నేర్పించడం, ప్రతికూల పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చడం.. ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎన్నో రికార్డులు, అవార్డులు-రివార్డులు ఆమె సిగలో చేరి మురిశాయి. అలా భారత్‌లో మహిళల క్రికెట్‌కు వన్నెలద్దిన ఘనత 'ది వన్ అండ్ ఓన్లీ' మిథాలీ రాజ్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు.

mithali200dis650-6.jpg

ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి ఈ క్రీడలో మకుటం లేని మహారాణిగా కొనసాగుతోన్న ఆమె.. భారతీయ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఘనత సాధించిందీ హైదరాబాదీ. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా తనకెదురైన ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకుంటూ, ఒక్కో మెట్టూ ఎక్కుతూ మిథాలీ క్రికెట్‌ క్వీన్‌గా ఎదిగిన వైనం ఎంతో స్ఫూర్తిదాయకం. నేడు ఈ క్రికెట్‌ మహారాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా మిథాలీ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

mithali200dis650-2.jpgమహర్దశ వైపు నడిపించింది!

1999లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పుడు అటు ఐసీసీకి, ఇటు బీసీసీఐకి మహిళల క్రికెట్‌తో సంబంధమే లేదు. స్పాన్సర్లు లేకపోవడంతో విదేశీ పర్యటనలకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడో ఆర్నెళ్లకో సిరీస్, ఏడాదికో పర్యటన అన్నట్లుగా ఉండేది మహిళల క్రికెట్ జట్టు పరిస్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దృఢచిత్తంతో నిలబడిందీ క్రికెట్ దిగ్గజం. మేటి ఇన్నింగ్స్‌లు, సరికొత్త రికార్డులతో మహిళల క్రికెట్‌కు ప్రాణం పోసింది.. సారథిగా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. ఐసీసీ ఆదేశాలతో మిగతా బోర్డులు మహిళల క్రికెట్‌ను విలీనం చేసుకున్నా.. బీసీసీఐ మాత్రం మొదట్లో అందుకు ఒప్పుకోలేదు. అయినా స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలనందిస్తూ విలీనం చేయక తప్పని పరిస్థితిని కల్పించింది మిథాలీ. అలా 2006లో బీసీసీఐలో విలీనం మహిళల క్రికెట్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతో తరచూ క్రికెట్ సిరీస్‌లు, విదేశీ పర్యటనలు, ప్రత్యక్ష ప్రసారాలు, మ్యాచ్ ఫీజులు, పురుష క్రికెటర్లతో సమానంగా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణాలు, సెంట్రల్ కాంట్రాక్టులతో.. మహిళల క్రికెట్లో మహర్దశ మొదలైంది. ఇలా మహిళల క్రికెట్‌కు ఇన్ని పేరు ప్రఖ్యాతులొచ్చాయంటే అందులో మిథాలీ పాత్ర, ఆమె ఆటతీరు, పట్టుదలే కీలకం అని చెప్పడంలో సందేహం లేదు.

mithali200dis650-3.jpg

ఎందరికో స్ఫూర్తిగా..
2003లో మిథాలీ భారత జట్టు పగ్గాలు చేపట్టినప్పుడు జట్టులో అంతా ఆమె కంటే సీనియర్లే. ప్రస్తుతం జట్టులో అందరూ ఆమె కంటే జూనియర్లే. ఒకప్పుడు అస్థిత్వమే లేని అమ్మాయిల క్రికెట్ ఇప్పుడు దేశంలో మహిళల క్రీడల్లో ముందుంది. ఆదాయం, ప్రచారం, పేరులో మహిళల క్రికెట్ మంచి స్థితికి చేరుకుంది. మిథాలీ స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. స్మృతీ మంధాన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ.. వీరంతా అలా వచ్చిన వాళ్లే. 2017 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రదర్శనతో దేశంలో ఆటకు మరింత ఆదరణ పెరిగింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా క్రికెట్ నేర్పించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువైంది. ఇలా అమ్మాయిలందరికీ స్ఫూర్తి ప్రదాతగా మారిందీ క్రికెట్ మహారాణి.

భరతనాట్యమంటే ఎంతో ఇష్టం!

mithali200dis650-4.jpgపదేళ్ల వయసులో మిథాలీ చాలా ఆలస్యంగా నిద్రలేచేదిఆ బద్ధకాన్ని వదిలించాలనే ఉద్దేశంతోనే మిథాలీ తండ్రి దొరై రాజ్ సికింద్రాబాద్‌లోని ఓ స్పోర్ట్స్ అకాడమీలో ఆమెను చేర్పించారు.
అలా పదేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఆమెకు అంతకుముందు క్రికెటన్నాఇతర క్రీడాంశాలన్నా అస్సలు ఇష్టముండేది కాదటఅందరమ్మాయిల్లాగే తానూ భరతనాట్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపేదాన్నని చెబుతుందీ మేటి క్రికెటర్.
చిన్నతనం నుంచీ భరతనాట్యంపై విపరీతమైన ఆసక్తి కనబరిచే మిథాలీ.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఈ నృత్యాన్ని నేర్చుకుందిఅంతేనా.. కొన్ని స్టేజి పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చిందిఇక తన చూపు క్రికెట్‌పైకి మళ్లిన తర్వాత కూడా తన అభిరుచిని వదల్లేదామెకాస్త కష్టమైనా రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూఖాళీ సమయాల్లో నాట్యం సాధన చేస్తూ తనలోని మక్కువను చాటేదీ క్రికెటర్.
క్రికెట్‌లో మిథాలీ ప్రతిభను గుర్తించిన మాజీ పేసర్ జ్యోతి ప్రసాద్ ఆమెకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఆమె తల్లిదండ్రులను అతి కష్టమ్మీద ఒప్పించి మరో కోచ్ సంపత్‌కుమార్ దగ్గరికి పంపించారుఆమె ఆటతీరు గమనించిన సంపత్ భవిష్యత్తులో మిథాలీ మహిళల క్రికెట్లో రికార్డులు సృష్టిస్తుందని ముందుగానే వూహించారుపదహారేళ్ల వయసు వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయిలో మిథాలీ ఆడడం చూడాలనుకొన్నారాయనకానీ అది నెరవేరడానికి ముందే ఓ ప్రమాదంలో చనిపోయారు.

పుస్తకాలు వదలదు!

/mithali200dis650.jpg

మిథాలీకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టంప్రతి మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు పుస్తకాలు చదువుతూ వాటి నుంచి చాలా విషయాలు నేర్చుకోవడం తనకు అలవాటుజీవితంలో మరింత ఎత్తుకు ఎదగడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయని నమ్మే ఈ క్రికెటర్.. క్రైమ్చరిత్రఆత్మకథలుఫిలాసఫీకి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ప్రముఖ పర్షియన్ కవి జలాలుద్దీన్ రూమీ రచించిన 'ది ఎసెన్షియల్ రూమీఅనే పుస్తకాన్ని చదువుతూ మీడియా కంటికి చిక్కిందిఅప్పుడు ఆ ఫొటో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

డాక్టర్‌తో పెళ్లి వద్దంది!

mithali200dis650-8.jpgమహిళా క్రికెట్లో పెద్దగా ఆదాయం లేని రోజుల్లో వైద్యుడిని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడే అవకాశం వచ్చింది మిథాలీకికానీ పెళ్లి తర్వాత ఆటకు దూరంగా ఉండాలని షరతు పెట్టడంతో ఆ పెళ్లి వద్దనుకుందటఇలా తన ఆత్మాభిమానాన్నిఆటపై ప్రేమను చాటుకుందీ మేటి క్రికెటర్.
అలాగే ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌లో మహిళా వ్యాఖ్యాత కోసం ఇంటర్వ్యూకు కూడా వెళ్లింది మిథాలీఅన్ని పరీక్షల్లోనూ పాసైందికానీ మోకాళ్ల పైవరకు దుస్తులు వేసుకోవాలని చెప్పగానే ఇంటికి తిరిగొచ్చేసిందిఇలా పేరుకు పేరుడబ్బుకు డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా.. ఆత్మగౌరవానికే విలువిచ్చి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకుందీ క్రికెటర్.

ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ!

mithali200dis650-7.jpg* 1999లో తన పదహారేళ్ల ప్రాయంలో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిథాలీ.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టిందిఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుపై 114 పరుగులు చేసిన ఈ క్రికెట్ దిగ్గజం.. ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిందిఅంతేకాదు.. డెబ్యూ మ్యాచ్‌లోనే వందకు పైగా పరుగులు చేసిన నాలుగో మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది మిథాలీ.
* 2002 ప్రపంచకప్‌లో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూనే ఆ టోర్నీలో పాల్గొన్న ఈ మేటి క్రికెటర్.. ఆటపై తనకున్న అంకితభావాన్ని చాటుకుంది.
* 21 ఏళ్లకే భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మిథాలీ.. ఈ ఘనత సాధించిన అతిపిన్న భారతీయ క్రీడాకారిణిగామొత్తంగా ఏడో క్రీడాకారిణిగా నిలిచిందినాటి నుంచి నేటి వరకు తన కెప్టెన్సీలో రెండుసార్లు మన మహిళల జట్టు ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన విషయం తెలిసిందేతన చక్కనైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్‌తోస్టార్ ప్లేయర్‌గా ఉన్నా జట్టు సహచరులతో స్నేహభావంతో మెలుగుతూవారికి క్రీడా నైపుణ్యాల్ని నేర్పిస్తూ కూల్ కెప్టెన్‌గా పేరుతెచ్చుకుందీ స్త్టెలిష్ ప్లేయర్.

మహిళల క్రికెట్లో సచిన్!

* 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భాగంగా.. టెస్టుల్లో 663, వన్డేల్లో 6731, టీ20ల్లో 2364 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ క్రికెటర్.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతోందిఅందుకే ఆమెను అభిమానులంతా ముద్దుగా 'తెందూల్కర్ ఆఫ్ ఇండియన్ వుమెన్స్ క్రికెట్'గా పిలుచుకుంటారు.
అంతేకాదు.. మిథాలీ ఆరాధ్య క్రికెటర్ కూడా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కరేఆయన ఆటతీరునుసహచరులతో మెలిగే విధానాన్ని గ్రహించిన ఈ మేటి క్రికెటర్ క్రీడా రహస్యం కూడా అదేనంటూ అభిమానులుక్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తుంటారు.
జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గాప్లేయర్ కోచ్‌గానూ వ్యవహరించిన ఈ హైదరాబాదీ ప్లేయర్.. ఓ క్రీడాకారిణిగాకెప్టెన్‌గానే కాదు.. కోచ్‌గానూ తన సత్తాను చాటుకుంది.


క్రికెట్లోకి రాకపోయుంటే...

mithali200dis650-9.jpgఒకవేళ మీరు క్రికెటర్ కాకపోయుంటేఅని అడిగితే.. 'సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి సేవ చేయడమంటే నాకు మొదట్నుంచీ ఇష్టంఅలాగే భరతనాట్యాన్నీ ప్రేమిస్తానేను క్రికెట్‌లోకి రాకపోతే సివిల్ సర్వీసెస్‌లో చేరేదాన్నిఅలాగే భరత నాట్యాన్నీ కొనసాగించేదాన్ని..' అని చెబుతుందీ క్రికెట్ బ్యూటీ.
* 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలురికార్డులుఅవార్డులు-రివార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ పవర్‌ఫుల్ క్రికెటర్.. 'విజ్డెన్ ఇండియా క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఖ్యాతి గడించింది. 2015 ఏప్రిల్‌లో ఆమె ఈ అవార్డును అందుకుంది.
ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేతో 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిందీ దిగ్గజ ప్లేయర్. 36 ఏళ్ల మిథాలీ తన 20 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 51.38 సగటుతో 6,731 పరుగులు చేసిందిఇందులో సెంచరీలు, 52 అర్ధసెంచరీలున్నాయి.

ఇంతకాలం ఆడతాననుకోలేదు..

* 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిఇంతటి అరుదైన ఘనతను అందుకున్న మిథాలీ మాట్లాడుతూ.. 'నా దృష్టిలో 200 ఒక సంఖ్య మాత్రమేఅయితే ఇంత దూరం ప్రయాణించడం గొప్పగా అనిపిస్తోందిమహిళల క్రికెట్లో భిన్న దశలు చూశా. 1999లో అంతర్జాతీయ మహిళల క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వన్డేల్లో అరంగేట్రం చేశాఐసీసీలో విలీనమయ్యాక తేడా స్పష్టంగా చూస్తున్నాంసుదీర్ఘకాలం పాటు దేశానికి ప్రాతినిథ్యం వహించడం చాలా ఆనందంగా ఉందిఆట మొదలుపెట్టినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని వూహించలేదుటీమిండియాకు ఆడితే చాలనుకున్నాజట్టులో కీలక సభ్యురాలిగా ఉండాలనుకున్నాకానీ ఇంత సుదీర్ఘంగా ఆడతానని అనుకోలేదు..' అంటూ తన మనసులోని భావాల్ని అందరి ముందుంచుతూ తన నిరాడంబరతను చాటుకుందీ పవర్‌ఫుల్ ప్లేయర్.
వన్డే క్రికెట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తిరుగన్నదే లేని మిథాలీకి దేశానికి ప్రపంచకప్ అందించాలన్న కల మాత్రం అలాగే ఉండిపోయిందిఅందుకే 2021 ప్రపంచకప్‌పై తన పూర్తి దృష్టి నిలపడానికిసారథిగా దేశానికి తొలి మహిళా ప్రపంచకప్ అందించాలన్న లక్ష్యంతోనే ఇటీవలే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్‌ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసిందీ హైదరాబాదీ స్టార్ బ్యాటర్.
గాయాల కారణంగా మిథాలీ పదేళ్ల క్రితమే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకుందిఅదే జరిగి ఉంటే ఇన్ని రికార్డులుఘనతలు ఆమె మిస్సవడమే కాదు.. దేశమూ అంత గొప్ప క్రీడాకారిణిని మిస్సయ్యేదేమోఆ కానీ ఆ సమయంలో మరింత శక్తిని కూడగట్టుకొని తాను కోల్పోయిన ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి మళ్లీ తనదైన శైలిలో చెలరేగి ఆడుతోంది.
భారత వన్డే జట్టుకి సుదీర్ఘ కాలంగా కెప్టెన్‌గా కొనసాగుతోన్న ఆమె.. దేశవాళీ క్రికెట్లో రైల్వేస్ తరఫున ఆడుతోందిప్రతి మ్యాచ్‌లో మూడో నెంబర్ బ్యాట్స్‌వుమన్‌గా క్రీజులోకి దిగుతుందీ మహిళా క్రికెటర్ఫార్మాట్ ఏదైనా సరే.. దూకుడుగా ఆడడం మిథాలీ శైలి.

తెరపై ‘శెభాష్‌ మిథూ’గా..!

mithali200dis650-12.jpg

తన అద్భుతమైన ఆటతీరుతోఅందమైన వ్యక్తిత్వంతో ఎందరికో రోల్‌ మోడల్‌గా నిలిచింది ఇండియన్‌ క్రికెట్‌ క్వీన్‌ మిథాలీ.. అందుకే ఆమె జీవితం త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కాబోతోందిఈ లెజెండ్‌ క్రికెటర్‌ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను గుదిగుచ్చి సినిమాగా రూపొందిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌ ధోలాకియా. ‘శెభాష్‌ మిథూ’గా నామకరణం చేసిన ఈ సినిమాలో మిథాలీ పాత్రలో అందాల భామ తాప్సీ నటించనున్నట్లు నిన్నటి దాకా గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందేఅయితే అదే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించింది తాప్సీమిథాలీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెతో కలిసి కేక్‌ కట్‌ చేస్తోన్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ సొట్టబుగ్గల బ్యూటీ.. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌మీరు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.. మేమెంతో గర్వపడేలా చేశారుమీ జీవిత కథ వెండితెరపై రూపొందించడం ఎంతో గౌరవంగా అనిపిస్తోందిమీ బర్త్‌డే సందర్భంగా నేను మీకు ఏ బహుమతి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు.. కానీ వెండితెరపై మిమ్మల్ని మీరు చూసుకొని గర్వపడేలా చేస్తానని నేను మీకు ప్రామిస్‌ చేస్తున్నా. ‘శెభాష్‌ మిథూ’ కోసం సన్నద్ధమవుతున్నా..’ అంటూ రాసుకొచ్చిందిఇలా తన పోస్ట్‌ ద్వారా మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో తానే మిథాలీగా నటించబోతున్నట్లు చెప్పకనే చెప్పిందీ ‘పింక్‌’ బ్యూటీగతంలో కూడా మిథాలీ సంతకం చేసిన పేపర్‌క్రికెట్‌ బాల్‌.. వంటివి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ తాను మిథాలీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు హింట్‌ ఇచ్చిందీ అందాల తారఇలా ఆఫ్‌స్క్రీన్‌ఆన్‌స్క్రీన్‌ మిథాలీ రాజ్‌లిద్దరూ పుట్టినరోజు వేడుకలో నిమగ్నమైన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee) on

నా ఇష్టాలు ఇవీ!

ఫేవరెట్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్రికీ పాంటింగ్మైఖేల్ క్లార్క్
నటుడు షారుఖ్ ఖాన్ఆమిర్ ఖాన్
నటి కాజోల్అనుష్కా శర్మ
వ్యాఖ్యాత (కామెంటేటర్) - నాజర్ హుస్సేన్
ఆహారం సోన్ పాపిడి
రంగు నలుపు
ప్రదేశం లండన్
అలవాట్లు వ్యాయామంనాట్యంపుస్తకాలు చదవడం
కుటుంబ నేపథ్యం తమిళ కుటుంబం

20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో , 16 ఏళ్ల కెప్టెన్సీతో భారత మహిళల క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి.. అస్థిత్వమంటూ లేని భారత మహిళల క్రికెట్‌ను శిఖరాగ్రాన నిలిపిన ఘనత మిథాలీకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె మహిళల క్రికెట్‌కే మహారాణి! ఇకపైనా ఆమె సారథ్యంలో జట్టు మరెన్నో విజయాలు సాధించాలని, వ్యక్తిగతంగా మరెన్నో రికార్డుల్ని సృష్టించాలని, తన ప్రపంచకప్ కల నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఈ లెజెండ్ క్రికెటర్‌కి మనమూ బర్త్‌డే విషెస్‌ చెబుదాం!

హ్యాపీ బర్త్‌డే ది ఉమన్‌ క్రికెట్‌ లెజెండ్‌!

women icon@teamvasundhara
smriti-mandhana-chit-chat-with-fans-abour-her-life

లాక్‌డౌన్‌ వల్ల దాన్ని బాగా మిస్సవుతున్నా!

కరోనా నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోవడంతో సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు విలువైన సందేశాలు అందిస్తూ... తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖులు తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. కరోనా ఉపద్రవం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తోన్న ఆమె.. ‘#AskSmritisession’ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
pv-sindhu-shares-her-quarantine-lifestyle

women icon@teamvasundhara
malala-makes-her-own-hair-cut-during-quarantine
women icon@teamvasundhara
face-masks-are-available-for-10-rupees-in-sagar-district-in-madhya-pradesh

ఈ కలెక్టరమ్మ ముందుచూపు... 10 రూపాయలకే మాస్కు..!

సమస్య వచ్చిన తర్వాత పరిష్కారానికి కృషి చేయడం వేరు... దాని తీవ్రతను కాస్త ముందుగానే ఊహించి వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం వేరు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మైథిల్‌ నాయక్‌ రెండో కోవకు చెందుతారు. మధ్యప్రదేశ్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఒకటీ అరా కనిపించగానే శానిటైజర్ల తయారీకి చక్కని కార్యాచరణ రూపొందించారు ప్రీతీ. దీనిలో భాగంగా సెంట్రల్‌ జైల్‌లో ఉంటున్న 55 మంది ఖైదీల సేవలను మాస్కుల తయారీకి వినియోగించుకుంటున్నారు. రోజుకు వెయ్యి మాస్కుల చొప్పున తయారుచేయిస్తున్నారు. ఒక్కసారి వాడి పారేయకుండా పునర్వినియోగానికి పనికొచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. ఆరోగ్య సేవకులకు, వైద్యులకు, పోలీసులకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. సామాన్యులకు పది రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల వారికి, మాస్కులు అవసరమైన వారికి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కదా...

Know More

women icon@teamvasundhara
singapore-illustrator-fight-misinformation-about-corona-through-her-comics

కామిక్‌ల రూపంలో ‘కరోనా’పై అవగాహన పెంచుతోంది!

‘మీరు N-95 మాస్క్‌ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్‌ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్‌ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్‌ ఆర్టిస్ట్‌.

Know More

women icon@teamvasundhara
new-tiktok-trend-to-help-women-who-feel-unsafe-in-cabs

క్యాబ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ టిక్‌టాక్‌ ట్రిక్‌ను వాడండి..!

ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటోన్న సమస్యల్లో ‘మహిళలకు సరైన భద్రత లేకపోవడం’ కూడా ఒకటి. స్కూళ్లు, కాలేజీలు, బస్‌స్టాప్‌లు, హాస్టళ్లు, పని ప్రదేశాలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జన సమూహాలు ఉండే ప్రదేశాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే.. ఇక నిర్మానుష్య ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో భాగంగా క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, క్యాబ్‌ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో ఈ సమస్యకు ఓ సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు టిక్‌టాకర్లు. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
cyber-attacks-in-the-name-of-coronavirus

కరోనా పేరుతో వైరస్‌ను పంపుతున్నారు... జాగ్రత్త!

ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి.. దేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.. ముఖ్యమైన మీటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని రంగాలపై ‘కరోనా’ వైరస్‌ (కొవిడ్‌-19) దాడి చేస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే.. కరోనా వ్యాధిని వ్యాపారంగా కూడా మార్చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మామూలు రోజుల్లో రూ.10 విలువ చేసే మాస్కులను.. ఇప్పుడు ఏకంగా రూ.50నుంచి వందకు అమ్ముతున్నారు. మనుషుల ఆరోగ్యానికే కాకుండా జేబులకు సైతం చిల్లుపెడుతోన్న ‘కరోనా’ వైరస్‌ను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఏకంగా సైబర్‌ నేరగాళ్లు కూడా నేరాలకు తెగ బడుతున్నారు. ఇంతకీ ‘కరోనా’తో సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనేగా మీ సందేహం.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

Know More

women icon@teamvasundhara
google-trick-to-play-holi-with-your-smartphones

ఈ గూగుల్‌ కొత్త ట్రిక్‌తో ‘డిజిటల్‌ హోలీ’ ఆడేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్‌’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్‌ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్‌. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్‌’ను తమ బెస్ట్‌ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్‌ పేజీని క్రియేటివ్‌గా డిజైన్‌ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్‌ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్‌ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
teenmar-savithi-got-vasundhara-puraskaram