సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!
సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. పంటలు ఇంటికి రావడం.. చేతి నిండా పుష్కలంగా డబ్బులుండడం.. ఎవరికైనా ఆనందమే కదా..! అందుకే సంక్రాంతిని సంబరాల పండగ అంటారు.. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...