శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;బహుళ పక్షం పంచమి: సా.5-13 తదుపరి షష్ఠి పుష్యమి: మ.12-36 తదుపరి ఆశ్లేష వర్జ్యం: రా.1-18 నుంచి 2-53 వరకు అమృత ఘడియలు: ఉ.7-44 వరకు దుర్ముహూర్తం: ఉ.6-20 నుంచి 7-48 వరకు రాహుకాలం: ఉ.9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.6-20 సూర్యాస్తమయం: సా.5-21
మేషం
ప్రారంభించే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.
వృషభం
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.
మిథునం
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.
కర్కాటకం
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
సింహం
ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
కన్య
ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
తుల
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలు పెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
వృశ్చికం
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
ధనుస్సు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మకరం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతి ఆరాధన మంచిది.
కుంభం
శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మీనం
ప్రారంభించే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని కలిగిస్తాయి. దైవారాధన మానవద్దు.