శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్ల పక్షం ఏకాదశి: తె.5-52 తదుపరి ద్వాదశి ఉత్తరాభాద్ర: రా.8-06 తదుపరి రేవతి వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ.2-53 నుంచి 4-37 వరకు; దుర్ముహూర్తం: మ.11-24 నుంచి 12-08 వరకు రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.6-13 సూర్యాస్తమయం: సా.5-20 స్మార్త ఏకాదశి
మేషం
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయమిది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
వృషభం
శుభకార్యాల్లో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబసభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.
మిథునం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. అలసట పెరగకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమ్తత్తంగా ఉండాలి. లక్ష్మీస్తుతి శుభాన్నిస్తుంది.
కర్కాటకం
ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. కుటుంబసభ్యుల మాటకు విలువనివ్వండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్నిస్తుంది.
సింహం
ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంతనిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. విష్ణు సందర్శనం శుభప్రదం.
కన్య
చేపట్టిన కార్యాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. గోసేవ చేయడం మంచిది.
తుల
విశేషమైన శుభాలున్నాయి. ఈ పని తలపెట్టినా వెంటనే పూర్తవుతుంది. ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకులాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
వృశ్చికం
మిశ్రమ కాలం. మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణములు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మనోధైర్యమే విజయానికి మూలం అని గ్రహిస్తారు. మీమీ రంగాల్లో అనుకున్నది సాధిస్తారు . కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓర్పును వదలకండి. అపోహలు తొలగుతాయి. కొన్ని కీలక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. పట్టుదలతో ముందుకు సాగండి వారాంతంలో అనుకూల ఫలితాలున్నాయి. హనుమాన్ చాలీసా చదివితే మేలు.
మకరం
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలలోను విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు . అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త . దుర్గ స్తోత్రం పఠించాలి.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలలో మంచి ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబవాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాదన మానవద్దు.
మీనం
శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.