scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

lord siva temples in telugu states

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

kailasnadhudarsa650.jpg
శ్రీ భ్రమరాంబికామల్లికార్జున దేవస్థానం, శ్రీశైలం-కర్నూలు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి పీఠం రెండింటికీ నెలవు శ్రీశైల మహాక్షేత్రం. ఇక్కడ శివపార్వతులిద్దరూ ఎన్నో ఏళ్లుగా పూజలందుకుంటున్నారు. ఈ పుణ్యక్షేత్రానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల గిరులకు సిరిధన్, శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వత, శ్రీనగం అనే పేర్లు కూడా ఉన్నాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం ప్రతి సోమవారం చేసే ప్రత్యేక పూజలతో మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఇక కార్తీకమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో అయితే దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకొని కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, శివపార్వతులను దర్శించుకుంటారు. 'దీపోత్సవం' పేరుతో ఆలయ ప్రాంగణంలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీకపౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే 'జ్వాలాతోరణం' కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. ఇందులో పాల్గొంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం. శ్రీశైలం చుట్టుపక్కల పర్యటకులను అమితంగా ఆకర్షించే మరెన్నో ఇతర ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య పట్ణణాలు, నగరాల నుంచే కాకుండా కొన్ని మారుమూల గ్రామాల నుంచి కూడా శ్రీశైలం చేరుకోవడానికి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. కర్నూలు జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది.

kailasnadhudarsakalahasthi650.jpg
శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి, చిత్తూరు
శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు).. ఈ మూడు భోళాశంకరుణ్ని దర్శించి ముక్తి పొందాయని, వారికి శివుడు ఇచ్చిన వరం ఆధారంగానే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారని ప్రతీతి. దీనికే 'దక్షిణ కైలాసం' అని కూడా పేరు. పంచభూత లింగాల్లో పృథ్వి, జలం, తేజస్సు, ఆకాశానికి సంబంధించిన నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే తెలుగు ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక రూపం ఇక్కడి వాయులింగం. 'శ్రీశైలంలో పుణ్యదర్శనం చేసుకోవాలి.. కాశీలో మరణం పొందాలి..' అని తెలిపే పురాణాలు శ్రీకాళహస్తిలో కేవలం కాలుమోపినా చాలు ముక్తిని పొందచ్చని చెబుతున్నాయి. భక్తకన్నప్ప తన రెండు కళ్లను శివుడికి సమర్పించిన స్థలం ఇదే. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీకాళహస్తి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి రోజున భక్తులు ఇక్కడి స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానమాచరించి శివుడికి దీపాల వెలుగుల మధ్య ప్రత్యేక పూజలందిస్తారు. తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది.

kailasnadhudarsa6507.jpg
రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, వేములవాడ-రాజన్న సిరిసిల్ల
'దక్షిణకాశీ'గా ప్రాచుర్యం పొందిన శివాలయం ఇది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వర్ ప్రాంతాలను పావనం చేసిన తర్వాత పరమశివుడు వేములవాడ వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కార్తీకమాసం మొదటిరోజున స్వామికి ఏకరుద్రాభిషేకం పూజ నిర్వహిస్తారు. ఈ నెల మొత్తం వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అక్కడి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ మాసంలో తొలి సోమవారం నాడు రాజన్నకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. భోళాశంకరుడు తాము కోరిన కోరికలు తీర్చాలని భక్తులు కోడె మొక్కులు సమర్పిస్తారు. వీటితో పాటు ఈ ఆలయంలో కార్తీకమాసంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహారుద్రాభిషేకం, మహాలింగార్చన చూసి తీరాల్సిందే. అలాగే పౌర్ణమిరోజు జ్వాలాతోరణం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకాలు నిర్వహించి.. చల్లగా చూడమని ఆయన్ను వేడుకుంటారు. వేములవాడకు నేరుగా రైలు మార్గం లేదు. కానీ కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి రోడ్డుమార్గంలో 35 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడకు చేరుకోవచ్చు. ఇక దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి వేములవాడకు నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

kailasnadhudarsakaleswaram650.jpg
కాళేశ్వర-ముక్తీశ్వరాలయం-కాళేశ్వరం, భూపాలపల్లి
కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం.. ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు వర్ణించాయి. అలాంటి పుణ్యభూముల్లో ఓ భాగమై, శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాళేశ్వరం. ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడి పానపట్టంపై ఒకేసారి శివుడు, యముడు వెలిసినందుకు దీనికా పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి ముక్తీశ్వర లింగంపై రెండు నాసికారంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్వామిపై అభిషేకించిన పంచామృతాలు నేరుగా ఈ నాసికారంధ్రాల ద్వారా త్రివేణీ సంగమానికి చేరతాయి. పుణ్య గోదావరి, పవిత్రమైన ప్రాణహిత, అంతర్వాహిణిగా పేరొందిన సరస్వతి.. నదుల దివ్య సంగమం కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రంలో కనిపిస్తుంది. అందుకే కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి, మహాశివరాత్రి పర్వదినం రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ నదీస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుందీ ఆలయం. గోదావరి తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో కార్తీకమాసంలో ప్రజలు నదీస్నానాలు ఆచరించి, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక్కడకు చేరుకోవడానికి అన్ని ముఖ్య నగరాలు, పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అయితే రైలు మార్గం మాత్రం కేవలం రామగుండం వరకే ఉంది. అక్కడి నుంచి రోడ్డు ప్రయాణం ద్వారా కాళేశ్వరం చేరుకోవచ్చు.

kailasnadhudarsa6504.jpg
రామలింగేశ్వరస్వామి ఆలయం- కీసర, మేడ్చల్-మల్కాజ్‌గిరి
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల జాబితాలో కీసరగుట్ట శివాలయం ఒకటి. ఇక్కడి శివుడు రామలింగేశ్వరస్వామిగా నీరాజనాలందుకుంటున్నాడు. ఈ క్షేత్రాన్ని పూర్వం కేసరగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా అది కీసరగుట్టగా రూపాంతరం చెందింది. ఇక్కడ శ్రీరామలింగేశ్వరస్వామి లింగం ప్రతిష్ఠాపన వెనుక ఒక పురాణకథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో సీతారాములు, హనుమంతుడు ఇక్కడకు వనవిహారానికి వచ్చినప్పుడు ప్రకృతి సంపదకు ఎంతగానో పరవశించిపోయిన శ్రీరాముడు లింగ ప్రతిష్ఠాపన చేసేందుకు రుషులను సంప్రదించాడు. అప్పుడు రుషులు శ్రీరాముడితో ఇక్కడ లింగస్థాపన చేస్తే రావణుణ్ని చంపిన బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తి పొందచ్చని సలహా ఇచ్చి, అందుకు ముహూర్తాన్ని సైతం నిర్ణయించారట. దీంతో కాశీకి వెళ్లి శివలింగాలను తేవాల్సిందిగా రాముడు హనుమంతునికి ఆదేశాలిచ్చాడు. అయితే హనుమంతుడు కాశీ నుంచి 101 లింగాలను తెచ్చేలోపు ముహూర్తం దాటిపోవడంతో శ్రీరాముడు శివుణ్ని ప్రార్థించగా, లింగరూపంలోకి మారిన శివుణ్ని అక్కడ ప్రతిష్ఠించాడట. విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆందోళనకు గురై, తాను తెచ్చిన 101 లింగాలను తోకతో విసిరేశాడట. అలా విసిరిన శివలింగాలు ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయట. అప్పుడు రాముడు హనుమంతుణ్ని ఓదారుస్తూ జరిగిన దానికి చింతించవద్దని, ఈ క్షేత్రం హనుమంతుని పేరు మీదనే కేసరగిరిగా వర్థిల్లుతుందని వరమిచ్చాడట. శివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసంలో పూజలు, దేవీనవరాత్రుల్లో ఉత్సవాలతో పాటు కార్తీకమాసంలో దీపారాధన కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి శివుడు పశ్చిమ ముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా గంటన్నర ప్రయాణిస్తే ఇక్కడకు చేరుకోవచ్చు.

someswaralayam6kailasnadhudarsa50.jpg
సోమేశ్వరాలయం- పాలకుర్తి, వరంగల్
పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం ఇదే ప్రదేశంలోని వేర్వేరు గుహల్లో శివుడు, విష్ణువు కొలువై ఉండేవారట. లోకకళ్యాణార్థం కొండపై వెలసి, భక్తులకు దర్శనమివ్వాలని సప్తరుషులు వీరిని వేడుకుంటే శివుడు సోమేశ్వరస్వామిగా, విష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారట. కొండపైకి వెళ్లే భక్తులు ఎవరైనా శుచి, శుభ్రత లేకుండా దైవదర్శనానికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడి తేనెటీగలు కొండ కింది వరకు వారిని తరిమి, వెనక్కు పంపించేస్తాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీకమాసంలో నిర్వహించే లక్షదీపార్చన, గోపూజకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. హైదరాబాద్ నుంచి దాదాపు 120, హన్మకొండ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శైవక్షేత్రానికి చేరుకోవడానికి రోడ్డు ప్రయాణ సౌలభ్యం అందుబాటులో ఉంది.

kailasnadhudarsa6veistambagudi50.jpg
వేయిస్తంభాల గుడి - హన్మకొండ, వరంగల్
వరంగల్ జిల్లా వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి, కార్తీకమాసం తొలిరోజున తెల్లవారు జామున 3 గంటల నుంచే పూజలు మొదలవుతాయి. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ నిర్వహించే లక్షబిల్వార్చనలో పాల్గొంటే సకల సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కార్తీకంలో రోజూ నిర్వహించే రుద్రాభిషేకంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడి శివలింగాన్ని స్థానికులు మారేడు పత్రాలతో పూజిస్తారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాల నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యం ఉంది. వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇక్కడకు చేరుకోవచ్చు.


వీటితో పాటు వరంగల్‌లోని రామప్ప గుడి, తాండూర్ భావిగి భద్రేశ్వరాలయం, కల్బగూర్ కాశీవిశ్వేశ్వరాలయం, ఎల్లంకొండ శివాలయం, ముర్తోటలోని శ్రీగంగా పార్వతీ ముక్తీశ్వరాలయం.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆ శంకరుడు కొలువుదీరిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ మహాశివరాత్రి, కార్తీకమాసం పర్వదినాల్లో భక్తులతో కిటకిటలాడుతూ, శివనామస్మరణతో మార్మోగిపోతూ ఉంటాయి.

women icon@teamvasundhara
today-horoscope-details-15-1-2021
women icon@teamvasundhara
sankranthi-celebrations-in-various-places-in-telugu

దేశమంతటా సందడిగా సాగే సంకురాత్రి..!

ఏటా జనవరి 14 లేదా 15న వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిరోజు భోగిమంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. బుజ్జి పాపాయిలకు భోగిపండ్లు పోస్తారు. రెండో రోజు రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. ఇక మూడోరోజు కూడా పండగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కోడిపందేల జోరును కొనసాగిస్తారు. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సంక్రాంతి సందడి. ఈ పండగను కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా సంక్రాంతిని ఎలా జరుపుకొంటారో మనమూ తెలుసుకుందామా...

Know More

women icon@teamvasundhara
interesting-sankranthi-facts-in-telugu
women icon@teamvasundhara
today-horoscope-details-11-1-2021
women icon@teamvasundhara
today-horoscope-details-8-1-2021
women icon@teamvasundhara
salon-owner-offers-free-haircuts-for-a-day-to-customers-to-celebrate-the-birth-of-his-girl-child

కూతురు పుట్టిందన్న సంతోషంతో వీళ్లేం చేశారో మీరే చూడండి!

‘ఆకాశంలో సగం...అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. కడుపులో పడ్డ నలుసు ఆడపిల్ల అని తెలియగానే తనను భూమ్మీదకు రాకుండా ఆపేసే వారూ ఎందరో! ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ఓ హెయిర్‌ కట్టింగ్‌ సెలూన్‌ యజమాని తెగ సంబరపడిపోయాడు. మా ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తనకు కూతురు పుట్టిందన్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుంటూ తనకున్న మూడు సెలూన్లలో ఒక రోజంతా కస్టమర్లకు ఉచితంగా సెలూన్‌ సేవలందించాడు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-6-1-2021
women icon@teamvasundhara
easy-steps-to-finding-body-positive-confidence-in-new-year

ఇలా ఈ ఏడాదంతా మనల్ని మనం ప్రేమించుకుందాం!

శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా బాడీ షేమింగ్‌ ప్రస్తుతం మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇలాంటి భావోద్వేగాల వల్ల మనకే నష్టం. అందుకే బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. మరి, కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
things-you-can-do-in-2021-to-make-it-the-best-year-of-your-life

2020లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందండిలా!

చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. ట్వంటీ-20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా ఎంతో వేగంగా, ఉత్కంఠగా సాగింది. కంటికి కనిపించని శత్రువులా కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. యావత్‌ ప్రపంచానికే సంక్షోభంగా మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఇలా మనల్ని ఆనందానికి, ఆహ్లాదానికి దూరం చేసిన 2020 లాగా కాకుండా 2021 హ్యాపీగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని కొత్త సంవత్సరంలో పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. అలాగని ఇవేవీ శ్రమతో, ఖర్చుతో కూడుకున్నవి కావు. మనం మనసు పెట్టి చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. మరి అవేంటో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-2-1-2021
women icon@teamvasundhara
different-new-year-traditions-around-the-world

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
habits-that-you-need-to-implement-in-2021-for-the-sake-of-your-emotional-wellness

ఈ అలవాట్లతో కొత్త ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు!

సరిగ్గా ఏడాది క్రితం ఫుల్‌ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్‌ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.

Know More

women icon@teamvasundhara
new-years-eve-celebrations-get-new-cdc-guidance-in-telugu

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదట!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనమంతా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటిదాకా చేసుకున్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఒకెత్తయితే.. ఈ ఏడాది మరో ఎత్తు! కారణం.. కరోనా మహమ్మారి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే! పైగా ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం వల్ల వైరస్‌ విస్తృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Know More

women icon@teamvasundhara
rajasthan-man-gifts-plot-of-land-on-moon-to-wife-on-their-wedding-anniversary

ముద్దుల భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-12-2020
women icon@teamvasundhara
telangana-cm-k-chandrasekhar-rao-adopted-daughter-to-tie-the-knot

కేసీఆర్ దత్తపుత్రిక.. కల్లోల జీవితం నుంచి కల్యాణ వేదిక పైకి!

ప్రత్యూష... ఐదేళ్ల క్రితం సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై మృత్యుముఖం దాకా వెళ్లిన ఓ అభాగ్యురాలు. ఒళ్లంతా గాయాలతో, మొహం మీద వాతలతో ఆస్పత్రి పాలైన ఆమెను చూసి ప్రతిఒక్కరూ ఆవేదన చెందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమె పరిస్థితిని చూసి మరింత చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా సవతి తల్లి, కన్న తండ్రి కబంధ హస్తాల నుంచి బయటపడిన ప్రత్యూష నేడు తన సొంతకాళ్లపై నిలబడుతోంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోందామె. ఈ క్రమంలో కల్లోల జీవితం నుంచి బయటపడిన ప్రత్యూష తాజాగా తను కోరుకున్న యువకుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-tied-knot-in-this-pandemic-year

‘కరోనా నామ సంవత్సరం’లోనే పెళ్లి పీటలెక్కేశారు!

పెళ్లంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటుంది.. తన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా తను కోరుకున్న వాడి చేయి పట్టుకొని ఏడడుగులు నడవాలనుకుంటుంది. ఫొటోషూట్స్‌తో సందడి చేయాలనుకుంటుంది. మరి, మనమే మన పెళ్లి గురించి ఇన్ని కలలు కంటే సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఆకాశానికి నిచ్చెనలేస్తుంటారు. అయితే ఈ ఏడాది అంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రముఖులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కరోనానే! ఓ వైపు తక్కువ మంది అతిథులు, మరో వైపు కొవిడ్‌ నిబంధనలతోనే సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు కొంతమంది ముద్దుగుమ్మలు/సెలబ్రిటీలు. అలాగని తమ ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మరి, ఈ ‘కరోనా నామ సంవత్సరం’లో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రముఖులెవరో, వారి పెళ్లి ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-28-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-25-12-2020
women icon@teamvasundhara
vaikunta-ekadashi-significance-in-telugu

అందుకే ముక్కోటి ఏకాదశి అంత పవిత్రం !

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ రోజునే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని చెబుతారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-24-12-2020
women icon@teamvasundhara
biryani-most-preferred-food-on-swiggy-ordered-more-than-once-every-second!

ఈ ఏడాది కూడా చికెన్ బిర్యానీనే ఎక్కువగా లాగించేశారట!

పార్టీ అయినా, ఫ్రెండ్స్‌/కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్లినా, ఆఫీస్‌లో ఎవరైనా ట్రీట్‌ ఇవ్వాలనుకున్నా.. మన మెనూలో ముందుండే ఫుడ్‌ ఐటమ్‌ బిర్యానీ కాక ఇంకేముంటుంది చెప్పండి! అందులోనూ మొదటి ప్రాధాన్యం చికెన్‌ బిర్యానీదే! అంతలా మన ఆహారపుటలవాట్లలో భాగమైందీ వంటకం. అయితే ఈ ఏడాది కరోనా రాకతో చాలామంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకున్నారు.. ఆరోగ్యం పేరుతో ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బిర్యానీ ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదనడానికి ‘స్విగ్గీ’ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికే ప్రత్యక్ష నిదర్శనం!

Know More

women icon@teamvasundhara
decorate-christmas-tree-in-your-home-in-telugu

'క్రిస్మస్ చెట్టు' కాంతులీనేలా...

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందునుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు. సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి కొనిఫెర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు) జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. అయితే కొంతమంది ఈ చెట్టును ఇంట్లోనే పెంచుకుంటే.. మరికొంతమంది కృత్రిమ చెట్టును వాస్తవికత ఉట్టిపడేలా ముస్తాబు చేస్తారు. ఏదేమైనా క్రిస్మస్ చెట్టును కాంతులీనేలా, ఆకర్షణీయంగా అలంకరించడమెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
deepika-padukones-nutritionist-reveals-the-actors-pre-wedding-diet-plan!

ఆ డైట్ తోనే దీపిక అప్పుడంత అందంగా కనిపించిందట!

పెళ్లి ఫిక్సయిందంటే అమ్మాయిల కలలు కోటలు దాటుతాయి. అందరి కంటే అందంగా మెరిసిపోవాలి.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలి.. సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్స్‌ ఫాలో అవ్వాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటుంది నవ వధువు. ఇలాంటి అపురూప లావణ్యాన్ని, నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి ముందు నుంచే చక్కటి ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలనుకుంటారు కాబోయే పెళ్లికూతుళ్లు. అయితే అలాంటి వారందరికీ దీపిక పాటించిన ఈ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. ఈ మూడింటినీ బ్యాలన్స్‌ చేసేలా తాను రూపొందించిన హెల్దీ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌తో అప్పుడు దీపిక వెలిగిపోతే.. ఇప్పుడు అదే డైట్‌ ప్లాన్‌ను ఫాలో అవుతూ నవ వధువులందరూ మెరిసిపోవచ్చంటున్నారామె. అందుకే ఆ విశేషాలను ఇటీవలే పంచుకున్నారు శ్వేత.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-18-12-2020
women icon@teamvasundhara
eight-years-on-nirbhayas-mother-asha-devi-says-she-will-seek-justice-for-all-rape-victims

వారి ముఖంలో నా కూతురిని చూసుకుంటున్నా!

అమానవీయం... అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ క్రూర ఘటన ఓ కన్నతల్లికి తీరని గర్భశోకాన్ని మిగల్చగా, యావత్‌ భారతావని చేత కన్నీళ్లు పెట్టించింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరేసరి అంటూ అందరూ రోడ్ల మీదకు వచ్చేలా చేసింది. ఈమేరకు మానవత్వానికే మచ్చగా మిగిలిపోయిన ‘నిర్భయ’ ఘటనకు నేటితో (డిసెంబర్‌ 16) ఎనిమిదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిర్భయకు నివాళి అర్పించిన ఆమె తల్లి ఆశాదేవి... అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మరోసారి నినదించారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-12-2020
women icon@teamvasundhara
first-period-traditions-in-india-in-telugu

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
most-tweeted-actress-in-2020-in-telugu

అందుకే వీళ్ల గురించి తెగ ‘ట్వీటా’రట!

సాధారణంగా తమ అభిమాన హీరోయిన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ కావాలంటే చాలామంది వారి సోషల్‌ మీడియా ఖాతాలనే ఆశ్రయిస్తారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను శోధించి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... తదితర సమాచారం తెలుసుకుంటుంటారు. ఈక్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్‌ ఇండియా. ‘మోస్ట్‌ ట్వీటెడ్ స్టార్స్‌-2020’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ఆమె గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు చేశారని ట్విట్టర్ ఇండియా తెలిపింది. కీర్తితో పాటు పలువురు కథానాయికలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-15-12-2020
women icon@teamvasundhara
tamil-family-got-food-delivered-at-guests’-doorsteps-so-that-they-can-enjoy-the-virtual-wedding
women icon@teamvasundhara
here-are-the-women-india-googled-the-most-in-2020

ఈ ఏడాది గూగుల్‌లో వీరి గురించే ఎక్కువగా వెతికారు!

సాధారణంగా తమకు నచ్చిన వారి గురించి కానీ, వార్తల్లోని వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవడానికి అందరూ మొదట గూగుల్‌నే ఆశ్రయిస్తారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... ఎలాంటి సమాచారం పొందాలనుకున్నా ఈ సెర్చింజన్‌లోనే శోధిస్తారు. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాను ‘గూగుల్‌ ఇండియా’ విడుదల చేసింది. ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీస్‌’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో టాప్‌-10లో ఐదుగురు మహిళా సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? నెటిజన్లు ఎందుకు వారి గురించే ఎక్కువగా వెతికారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
karnataka-newly-weds-skip-honeymoon-and-clear-over-600-kg-trash-from-beach-instead
women icon@teamvasundhara
today-horoscope-details-10-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-08-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-05-12-2020
women icon@teamvasundhara
us-couple-cancels-big-wedding-uses-deposit-to-feed-needy
women icon@teamvasundhara
today-horoscope-details-01-12-2020
women icon@teamvasundhara
today-horoscope-details-28-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-25-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-23-11-2020
women icon@teamvasundhara
today-horoscope-details-19-11-2020