శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం విదియ: రా.11-01 తదుపరి తదియ కృత్తిక: రా.10-50 తదుపరి రోహిణి వర్జ్యం: ఉ.9-38 నుంచి 11-24 వరకు అమృత ఘడియలు: రా.8-11 నుంచి 9-56 వరకు దుర్ముహూర్తం: మ.12-06 నుంచి 12-52 వరకు తిరిగి మ.2-23 నుంచి 3-09 వరకు రాహుకాలం: ఉ.7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.6-02 సూర్యాస్తమయం: సా.5-26
మేషం
తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
వృషభం
శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారుంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.
మిథునం
మంచి ఆలోచనావిధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
కర్కాటకం
కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివ్రుద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం చదివితే బాగుంటుంది.
సింహం
పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలని కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కన్య
సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇదే సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.
తుల
మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.
వృశ్చికం
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
ధనుస్సు
తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొంటారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
మకరం
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉత్సాహవంతంగా వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మహా గణపతి ఆరాధన శుభప్రదం.
కుంభం
పెద్దలు సూచించిన మార్గంలో ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మీనం
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.