scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

Famous Indian Celebrities Who Have Adopted Children in Telugu

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

మందిరా బేడీ

నటిగా, క్రికెట్‌ కామెంటేటర్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, టీవీ హోస్ట్‌గా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసింది మందిరా బేడీ. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ 48 ఏళ్ల వయసులోనూ తన ఫిట్టెస్ట్‌ బాడీని సక్సెస్‌ఫుల్‌గా మెయింటెయిన్‌ చేస్తోంది. 1999లో రాజ్‌కౌశల్తో పెళ్లిపీటలెక్కిన ఆమె 2011లో ‘విర్‌’ అనే ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో తన కుటుంబం మరింత పరిపూర్ణం అయ్యేలా తాజాగా ఓ నాలుగేళ్ల పాపను దత్తత తీసుకుంది మందిర. ఈ సందర్భంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేస్తూ మురిసిపోయింది.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi) on


సుమారు పాతికేళ్ల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన ‘శాంతి’ సీరియల్‌తో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది మందిర. ఈ సీరియల్‌ ప్రభావంతో అప్పట్లో తన అసలు పేరుకంటే ‘శాంతి’ పేరుతోనే ఎక్కువమందికి దగ్గరైపోయిందామె. దీంతో పాటు ‘ఆహత్‌’, ‘ఔరత్‌’, ‘ఘర్‌ జమై’ ‘హలో ఫ్రెండ్స్‌’, ‘సీఐడీ’, ‘క్యుంకీ సాస్‌ భీ కభీ బహూ థీ’...వంటి సీరియల్స్‌లో నటిస్తూనే పలు టీవీ ప్రోగ్రామ్స్‌, రియాల్టీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి ఆకట్టుకుంది. ఇక కాజోల్‌-షారుఖ్‌ఖాన్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే ’ వంటి హిట్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘బాదల్‌’, ‘షాదీ కా లడ్డు’, ‘మన్మధన్‌’ ‘దస్‌ కహానియా’, ‘మీరాబాయి నాట్‌ అవుట్‌’, ‘వోడ్కా డైరీస్’, ‘ఓ తెరీ’, ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. 2003, 2007లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ పోటీల్లో క్రికెట్‌ కామెంటేటర్‌గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఇక గతేడాది ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమాలో స్టైలిష్‌ విలన్‌గా కనిపించి మరోసారి వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi) on


ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది!
మందిర వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే... ఆమె 1999 ఫిబ్రవరి 14న రాజ్‌కౌశల్‌ను వివాహం చేసుకుంది. 2011లో ‘విర్‌’ అనే పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే ఓ ఆడపిల్ల తన ఇంట్లో అడుగు పెడితే తన కుటుంబానికి మరింత పరిపూర్ణత వస్తుందని భావించిన మందిర ఏడేళ్ల క్రితమే ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది కుదరలేదు. ఈ క్రమంలో అప్పటి కోరికను తాజాగా నెరవేర్చుకున్నారు మందిరా-రాజ్ కపుల్‌. ఈ ఏడాది జులై 28న నాలుగేళ్ల తారా బేడీ కౌశల్‌ అనే చిన్నారిని దత్తత తీసుకున్న ఈ లవ్లీ కపుల్‌ తాజాగా ఆ పాపను ప్రపంచానికి పరిచయం చేశారు.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi) on


తను ఓ వరంలా మా ఇంట్లోకి అడుగుపెట్టింది!
ఈ సందర్భంగా తారతో కలిసి కుటుంబ సభ్యులందరూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్న మందిర.. ‘దేవుడు అందించిన వరంలా తార మా దగ్గరకు వచ్చింది. పేరుకు తగ్గట్టే నక్షత్రాల్లాంటి మెరిసే కళ్లున్న తను ‘విర్‌’ కి చెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. 2020 జులై 28 నుంచి తను కూడా మా కుటుంబంలో భాగస్వామిగా మారిపోయింది. స్వచ్ఛమైన ప్రేమతో తనకు మా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అందాల తార. ఈ సందర్భంగా సహ నటీనటులు, స్నేహితులు, సన్నిహితులు మందిరకు సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. నటులు శ్రియా శరన్‌, అనిందిత బోస్‌, విద్యా మల్వాడేతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ పూజ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.

View this post on Instagram

A post shared by Mandira Bedi (@mandirabedi) on


‘విర్‌’కు ఓ తోబుట్టువుని అందించాలనుకున్నాం!
ఈ క్రమంలో గతేడాది చివరిలో ఓ టీవీ షోకు హాజరైన మందిర ‘ప్రస్తుతం నా కుమారుడు ‘విర్’ వయసు ఎనిమిదేళ్లు. వాడికొక తోబుట్టువును అందించాలని మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. అందుకోసం రెండున్నరేళ్ల నుంచి నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లోకి అడుగుపెట్టే ఆ పాపకు ‘తార’ అని పేరు పెట్టాలనుకుంటున్నాం. రెండున్నరేళ్ల క్రితం CARA(సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ)లో దరఖాస్తు చేశాం. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది మందిర.

సుస్మిత

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47) on


ఈ నేపథ్యంలో మందిర కన్నా ముందే కొంతమంది సెలబ్రిటీలు అనాథ చిన్నారులకు ఆపన్న హస్తం అందించారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ గురించి. బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో పిల్లల దత్తత విషయమంటే అందరికీ ముందుగా ఈ అందాల తారే గుర్తుకొస్తుంది. తన పాతికేళ్ల వయసున్నప్పుడే అది కూడా పెళ్లి కాకుండానే ‘రెనీ’ అనే చిన్నారిని దత్తత తీసుకున్న సుస్మిత మరో పదేళ్లకు ‘అలీషా’ను దత్తత తీసుకుంది. బాలికను దత్తత తీసుకున్నాక బాలుడిని మాత్రమే దత్తత తీసుకోవాలన్న చట్ట నిబంధనలపై పోరాడేందుకు ఆమెకు పదేళ్ల సమయం పట్టింది. ఇప్పటికీ సింగిల్ మదర్‌గానే కొనసాగుతున్న సుస్మిత పెద్ద కూతురు 20 ఏళ్ల రెనీతో పాటు అలీషా ఆలనాపాలనను దగ్గరుండి మరీ చూసుకుంటోంది.

‘సొంత తల్లికి, బిడ్డకు పేగు బంధం ఉంటుంది. దత్తత తీసుకున్న బిడ్డకు, తల్లికి తెగని బంధం ఉంటుంది. సొంత తల్లి తన కడుపులోంచి బిడ్డను కంటుంది. దత్తత తల్లి తన హృదయంలోంచి జన్మను ఇస్తుంది’ అని పిల్లల దత్తత గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

రవీనా టాండన్

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on


‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశవీధిలో’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రవీనా టాండన్‌ తన 20 ఏళ్ల వయసులోనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. అప్పటికింకా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఆమె ఛాయ, పూజ అనే ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2004లో అనిత్‌ తడానీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని రవా, రణ్‌బీర్‌ వర్ధన్‌ అనే ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయినా తన దత్త పుత్రికల బాధ్యతలను విస్మరించలేదీ అందాల తార. ఇరువురికీ ఘనంగా పెళ్లిళ్లు చేసి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల ఛాయ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అమ్మమ్మ హోదాను కూడా అందుకుందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

సన్నీ లియోన్

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on


అందంతో పాటు అంతకుమించి అందమైన మనసున్న ముద్దుగుమ్మ సన్నీ లియోన్. 2011లో న్యూయార్క్‌కు చెందిన డేనియల్‌ వెబర్‌ను వివాహమాడిన ఈ అందాల తార 2017లో మహారాష్ట్రలోని లాథూర్ అనాథాశ్రమం నుంచి ఓ మూడేళ్ల పాపను దత్తత తీసుకుంది. తనకు ముద్దుగా ‘నిషా కౌర్‌ వెబర్‌’ అనే పేరు కూడా పెట్టుకున్నారీ లవ్లీ కపుల్‌. 2018లో సరోగసీ విధానం ద్వారా ‘ఆషర్‌’, ‘నోహా’ అనే మరో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు సన్నీ దంపతులు. ప్రస్తుతం తన ముగ్గురి పిల్లల ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

మహీవిజ్

View this post on Instagram

A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) on


‘చిన్నారి పెళ్లి కూతురు’ (బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది మహీవిజ్‌. మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతోంది. సీరియల్స్, డ్యాన్స్ రియాల్టీ షో లలో సత్తా చాటుతూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఆమె 2011లో సహనటుడు జై భానుశాలిని వివాహం చేసుకుంది.

ఈ క్రమంలో 2017లో తన పని మనిషి పిల్లలు రాజ్‌వీర్‌, ఖుషీలను దత్తత తీసుకుంది. పిల్లలు కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నప్పటికీ వారిద్దరికీ సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఇక పెళ్లైన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019 ఆగస్టులో ‘తార’ అనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది మహి. ప్రస్తుతం ముగ్గురి పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) on

వీళ్లు కూడా!
* బాలీవుడ్‌ బుల్లితెరకు సంబంధించి సెలబ్రిటీ కపుల్‌గా గుర్తింపు పొందిన డెబినా బెనర్జీ-గుర్మీత్‌ చౌదరి దంపతులు పూజ, లలిత అనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈ ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుని పెద్ద మనసు చాటుకున్నారీ లవ్లీ కపుల్.

View this post on Instagram

A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) on


* సీనియర్‌ హీరోయిన్‌, ప్రముఖ నృత్య కళాకారిణి శోభన 2017 ఆగస్టులో ఓ ఆరు నెలల చిన్నారిని దత్తత తీసుకుంది. కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ టెంపుల్‌లో ఆ పాపకు అన్నప్రాసన ఘనంగా జరిపించి ‘అనంత నారాయణి’ అని పేరు పెట్టుకుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz) on


* సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రిషికేష్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న 34 మంది పిల్లలను దత్తత తీసుకుంది ప్రీతీజింటా. వీలు చిక్కినప్పుడల్లా ఆ పాఠశాలను సందర్శిస్తూ వారికి కావాల్సిన చదువు, తిండి, వసతి సదుపాయాలను సమకూరుస్తోంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika) on


* తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోన్న యాపిల్ బ్యూటీ హన్సిక 25 మంది చిన్నారులను దత్తత తీసుకుంది. సామాజిక స్ఫూర్తితో వారికి సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటోంది.
సామాజిక స్ఫూర్తితో కొంతమంది తారలు ఎంచుకున్న ఈ బాటలో మరికొంతమంది మనసున్న మహిళలు నడవాలని, అనాథ చిన్నారులకు ఆపన్న హస్తం అందించాలని ఆశిద్దాం.

women icon@teamvasundhara
98-year-old-annapurna-biswal-becomes-eldest-from-odisha-to-defeat-covid-19

98 ఏళ్లు.. అయినా మనోధైర్యంతో కరోనాను జయించింది!

మాయదారి కరోనా మహమ్మారి ఎవరినీ కనికరించడం లేదు. యువతను, చిన్నపిల్లలను సైతం కబళిస్తూ ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో వృద్ధులు, అందులోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అయితే సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో పాటు కొంచెం మానసిక స్థైర్యం ఉంటే కరోనానే కాదు ఎలాంటి మహమ్మారి వైరస్‌లనైనా మట్టుబెట్టవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శతాధిక వృద్ధులు కూడా కరోనా నుంచి కోలుకున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరొక సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
madhya-pradesh-nurse-prafullit-peter-with-single-lung-successfully-beats-covid-19

ఒకే ఊపిరితిత్తితో కరోనాను జయించింది!

వివిధ రకాల అనారోగ్యాలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారే కాదు.. యుక్తవయసులో ఉన్న వారు కూడా కరోనా ధాటికి విలవిల్లాడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఏవైనా సమస్యలున్న వారు ఈ మహమ్మారి బారిన పడితే ఇక కోలుకోవడం కష్టమే అని భావిస్తుంటాం.. తాను కరోనా బారిన పడిన తర్వాత కూడా అందరూ ఇలాగే అనుకున్నారని చెబుతోంది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్లిత్‌ పీటర్‌ అనే నర్సు. అందుకు తనలో ఉన్న అవయవ లోపమే అని చెబుతోంది. అయినా గుండె ధైర్యంతో ఈ మహమ్మారితో పోరాడి విజయం సాధించింది. ‘కరోనా వస్తే ఇక జీవితం అంతే!’ అని కుంగుబాటుకు గురవుతోన్న ఎంతోమందిలో ధైర్యం నింపుతోందామె. మరి, ఇంతకీ ఆమెలో ఉన్న ఆ అవయవ లోపమేంటి? కరోనాను ఎలా జయించగలిగింది? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
pregnant-doctor-loses-battle-to-covid-husband-shares-last-video-message
women icon@teamvasundhara
useful-gadgets-for-mom-on-this-mothers-day
women icon@teamvasundhara
give-these-priceless-gifts-to-your-mother-in-telugu

women icon@teamvasundhara
who-debunking-some-common-hand-sanitizer-myths-in-telugu

హ్యాండ్‌ శానిటైజర్‌ : అపోహలు-వాస్తవాలు!

కరోనా మహమ్మారి బారిన పడకూడదంటే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి! అలాగని ఏది ముట్టినా, పట్టినా చేతులు కడుక్కోవడం కుదరదు.. పైగా అన్ని సమయాల్లో మన వద్ద సబ్బు, నీళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఇలాంటప్పుడు శానిటైజర్‌ వాడడం మనకు అలవాటైపోయింది. దాదాపు ఏడాది కాలంగా మనం దీన్ని వాడుతున్నా.. ఇంకా దీని గురించి చాలామందిలో చాలా రకాల సందేహాలున్నాయని చెప్పచ్చు. వాడిన ప్రతిసారీ ఎంత మోతాదులో వాడచ్చు? ఒకవేళ ఎక్కువగా వాడితే ఇతర ఆరోగ్య సమస్యలేవైనా వస్తాయేమో? పదే పదే శానిటైజర్‌ వాడే కంటే గ్లౌజులు పెట్టుకోవడం మంచిదేమో?.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సందిగ్ధం నెలకొంది.. అయితే తాజాగా ఇదే విషయంపై స్పష్టతనిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ). హ్యాండ్‌ శానిటైజర్ల వాడకం గురించి చాలామందిలో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ అసలు నిజాలేంటో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో వివరించింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
things-to-keep-in-mind-while-buying-and-using-essential-oils

వాసన కోల్పోతే 'స్మెల్ ట్రైనింగ్'.. ఎందుకు? ఏమిటి?

అందం, ఆరోగ్యం, జుట్టు సంరక్షణ.. మొదలైన అంశాల పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపిస్తారు. ఈ క్రమంలో తమ రోజువారీ దినచర్యలో వివిధ రకాల పదార్థాల్ని/ఉత్పత్తుల్ని భాగం చేసుకుంటుంటారు. అత్యవసర నూనెలూ ఇందుకు మినహాయింపు కాదు. వివిధ చర్మ సమస్యల్ని తగ్గించడం దగ్గర్నుంచి జుట్టు ఆరోగ్యాన్ని పెంచడం దాకా.. ఒత్తిడి-ఆందోళనలకు చెక్‌ పెట్టడం (అరోమా థెరపీ) దగ్గర్నుంచి ఇంట్లోని గాలిని శుద్ధి చేయడం దాకా.. ఇలా ఎన్నో రకాలుగా ఈ నూనెలు మనకు ఉపయోగపడతాయి. అంతేకాదు.. కొవిడ్‌ కారణంగా కోల్పోయిన వాసన చూసే శక్తిని తిరిగి పొందడానికీ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే Smell Training/Olfactory Training (అత్యవసర నూనెల్ని వాసన చూడడం) అనే పద్ధతిని పాటించమని చెబుతున్నారు. అయితే ఇలా మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ నూనెలను వాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం తిరిగి అవి మనకే చేటు చేస్తాయట! అందుకే వాటిని ఎంచుకునేటప్పుడు, వాడేటప్పుడు కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-why-should-avoid-wearing-gloves-shopping-for-grocery

చేతులకు గ్లోవ్స్‌ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కరోనా వైరస్‌ ప్రభావంతో మన జీవనశైలిలో చాలా మార్పులొచ్చాయి. వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునే క్రమంలో అందరితో సామాజిక దూరం పాటిస్తున్నాం. ఫేస్‌ మాస్క్‌తోనే బయటకు వెళుతున్నాం. క్రమం తప్పకుండా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరికొందరు రెగ్యులర్‌గా హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరిస్తున్నారు. అయితే అన్ని సందర్భాల్లో గ్లోవ్స్‌ వాడడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య, వైద్య నిపుణులు. ప్రత్యేకించి గ్రాసరీ, ఫార్మసీ దుకాణాలకు వెళ్లినప్పుడు హ్యాండ్‌ గ్లోవ్స్‌ ధరించకపోవడమే మేలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
punjab-covid-hospital-nurses-shares-their-weird-experiences-in-telugu
women icon@teamvasundhara
cdc-recommend-double-masking-to-prevent-corona-infection;-here-is-how-to-do-it-the-right-way

రెండు మాస్కులు పెట్టుకుంటే రక్షణ ఎక్కువ!

ప్రస్తుతం మనందరి ముందున్న లక్ష్యం ఒక్కటే.. కరోనా మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం! ఇందుకోసం మాస్క్‌ ధరించడం అత్యంత ముఖ్యం. అందుకే బయటే కాదు.. ఇంట్లోనూ మాస్క్‌ పెట్టుకోమని ఇటు నిపుణులు, అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే చెబుతోంది. అయితే అటు వ్యక్తిగత పనుల వల్లో, ఇటు వృత్తి ఉద్యోగాల వల్లో ప్రస్తుతం ఎక్కువమంది ఒక చోట చేరడం, ప్రజా రవాణాను వినియోగించుకోవడం.. వంటివి తప్పట్లేదు. మరి, ఇలాంటి సమయాల్లో ఒకే మాస్క్‌ సరిపోతుందా? తద్వారా వైరస్‌కు కళ్లెం వేయచ్చా? అంటే.. అది కష్టమే అంటోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ. అత్యవసర పరిస్థితుల్లో ప్రజా రవాణాను వినియోగించుకున్నప్పుడు, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు రెండు మాస్కులు పెట్టుకోవడం వల్ల సుమారు 94.6 శాతం దాకా వైరస్‌ నుంచి మనకు రక్షణ ఉంటుందని సూచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారికి మనం చిక్కకూడదంటే రెండు మాస్కులు తప్పనిసరి అని చెబుతోంది. మరి, రెండు మాస్కులు ఎలా ధరించాలి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
given-24-hours-to-live-75-years-old-woman-beats-covid-in-13-days

బతకడమే కష్టమన్నారు.. అలాంటిది రెండు వారాల్లో కరోనాను జయించింది!

రోజుకు లక్షలాది పాజిటివ్‌ కేసులు.. వేలాది మరణాలు.. ఆస్పత్రుల్లో నిండుకుంటున్న పడకలు.. ఆరుబయట బారులు తీరిన అంబులెన్స్‌లు.. ఆక్సిజన్‌ కొరతతో గాల్లో దీపంలా ప్రాణాలు.. శ్మశాన వాటికల్లోనూ క్యూలు.. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలే దర్శనమిస్తున్నాయి. ఇక కరోనా గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న కొన్ని పోస్టులు ‘వామ్మో.. ఇదేం కలికాలం’ అనిపించేలా ఉన్నాయి. అయితే వీటన్నింటి మధ్య ఊరట కలిగించే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే కొవిడ్‌ రికవరీలు, మరణాల రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మరణాల రేటు కేవలం 1.12 శాతం మాత్రమే! అంటే కరోనాకు గురైన వారిలో దాదాపు 99 శాతం మంది కొవిడ్‌ నుంచి బయటపడిన వారే అన్నమాట!

Know More

women icon@teamvasundhara
woman-constable-unable-to-get-leave-has-her-haldi-ceremony-held-at-police-station

అందుకే పోలీస్‌ స్టేషన్‌లోనే హల్దీ వేడుక జరుపుకొంది!

కొన్ని రోజుల క్రితం వరకు తగ్గుతోందిలే అనుకున్న కరోనా మళ్లీ తిరగబెడుతోంది. మొదటి దశ కంటే వేగంగా విస్తరిస్తూ మళ్లీ గతేడాది పరిస్థితులనే గుర్తు చేస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో బయటపడి సాధారణ జీవితం ప్రారంభించే లోపే ‘సెకండ్‌ వేవ్‌’ అంటూ మళ్లీ తన ఉగ్రరూపాన్ని చూపెడుతోంది. దీంతో కొవిడ్‌ ఆంక్షలను పటిష్ఠంగా అమలు చేసి మహమ్మారిని నియంత్రించేందుకు పోలీసులు మళ్లీ రోడ్ల పైకి రావాల్సి వచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా నిత్యం గస్తీ కాస్తూ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీంతో కనీసం కుటుంబ సభ్యులను కలిసే సమయం కూడా దొరకడం లేదు కొంతమంది పోలీసులకు. ఈ క్రమంలో కొవిడ్‌ విధుల కారణంగా పోలీస్‌ స్టేషన్‌లోనే తన హల్దీ వేడుక జరుపుకొంది ఓ మహిళా కానిస్టేబుల్. సెలవులు లేకపోవడంతో ఇంటికెళ్లలేక స్టేషన్‌ ఆవరణలోనే సంప్రదాయబద్ధంగా తన ముందస్తు పెళ్లి వేడుకను పూర్తి చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
rajasthan-family-books-helicopter-to-bring-home-first-girl-child-born-in-35-years

తమ మనవరాలిని హెలికాప్టర్‌లో తీసుకొచ్చి పూల వర్షంతో ఆహ్వానించారు!

కంప్యూటర్ల యుగంలోనూ కడుపులో పడ్డ నలుసు ఆడపిల్ల అని తెలియగానే భూమ్మీదకు రాకుండా ఆపేసే తల్లిదండ్రులున్నారు. ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటి తల్లి గర్భం నుంచి బయటపడితే గుండెల మీద కుంపటిలా భావించి చెత్త కుప్పల్లో, మురుగు కాలువల్లో విసిరేసే వారూ ఉన్నారు. అంతెందుకు.. ఇంట్లోని కూతురుని ఒకలా, కొడుకుని మరొకలా పెంచే పేరెంట్స్‌ను ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఎన్నో అసమానతల మధ్య... తమ ఇంట్లో ఆడపిల్ల అడుగుపెట్టిందన్న శుభవార్తను పండగలా సెలబ్రేట్‌ చేసుకుంది ఓ రాజస్థానీ కుటుంబం. మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తమ కుటుంబంలో లేక లేక జన్మించిన ఆడబిడ్డ కావడంతో తనకు అపూర్వ స్వాగతం పలికింది.

Know More

women icon@teamvasundhara
mumbai-doctor-dies-of-covid-a-day-after-saying-goodbye-on-facebook

కరోనాపై పోరాటంలో మరణాన్ని ముందే ఊహించి!

కరోనా రక్కసి సృష్టిస్తున్న విలయ తాండవంలో వెలుగు చూసిన మరో విషాద గాథ ఇది. ముంబయిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు కరోనా రక్కసితో పోరాడలేక కన్ను మూశారు. అయితే ఇక్కడ విచారించాల్సిన విషయమేమిటంటే... ఆమె తన మరణాన్ని ముందే ఊహించడం. తను తుదిశ్వాస విడిచే కొన్ని గంటలకు ముందే ఇకపై తాను బతికి ఉండకపోవచ్చన్న సంకేతాలు అందేలా ఫేస్‌బుక్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిందా డాక్టర్‌. మరి తన మరణం గురించి ఆమెకు ఎలాంటి ముందస్తు సంకేతాలు అందాయో తెలియదు కానీ... ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ మాత్రం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
women-cant-say-no-to-sex-in-developing-nations-says-un-report

‘నా శరీరం.. నా సొంతం’.. నాకిష్టమైతేనే ఏదైనా!

రోజులు మారుతున్నా, మహిళలు అభివృద్ధి పథం వైపు అడుగులేస్తున్నా సమాజం వారిని చూసే దృష్టి కోణంలో మాత్రం మార్పు రావట్లేదు. ఆడవారిని లైంగిక బానిసలా చూస్తూ వారి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వారిని లొంగదీసుకునే కలియుగ దుశ్శాసనులు మన చుట్టూనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక చెబుతోంది. నచ్చిన వారితో శృంగారం, గర్భనిరోధక సాధనాల వాడకం, ఆరోగ్య సేవలు పొందడం.. వంటి విషయాల్లో మహిళలకు నిర్ణయించుకునే హక్కు పూర్తిగా కొరవడుతోందని ఐరాస జనాభా నిధి (యూఎన్‌పీఎఫ్‌) జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనే ఆడవారిపై ఇలాంటి ఆంక్షలు, ప్రతికూల పరిస్థితులుండడం శోచనీయం. ఆడదంటే ఓ లైంగిక వస్తువే అన్నంతలా అక్కడి మహిళల దారుణ పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపుతోన్న ఈ నివేదికలోని కీలకాంశాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
woman-wears-wedding-gown-to-get-vaccine-after-covid-cancelled-her-reception

అందుకే పెళ్లి డ్రస్సులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది!

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కీలక మలుపు. అందుకే పది కాలాల పాటు గుర్తుండేలా అంగరంగ వైభవంగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఇక పెళ్లిలో దుస్తులకుండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ జీవితంలో జరిగే అత్యంత ప్రధాన వేడుక కాబట్టి వధూవరులిద్దరూ తమ దుస్తుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరినీ ఆకట్టుకునేలా అందంగా, ప్రత్యేకంగా ఉండేలా తమ దుస్తులను డిజైన్‌ చేయించుకుంటారు. ఎందుకంటే వివాహం తర్వాత పెళ్లి దుస్తులను చాలా తక్కువసార్లు ధరిస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో కానీ వాటిని బీరువా నుంచి బయటకు తీయరు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ మహిళ తన పెళ్లి నాటి దుస్తులు ధరించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. ఇంతకీ ఎవరా మహిళ?వెడ్డింగ్‌ డ్రస్‌తో ఎందుకు వ్యాక్సిన్ తీసుకుంది?తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
15-ways-to-overcome-body-odor-in-telugu

చెమట వాసనను పోగొట్టే 15 సులభ మార్గాలు..!

చక్కని పెర్ఫ్యూమ్ వాసన రాగానే చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదకరంగా మారినట్లనిపిస్తుంది. సువాసనలు వెదజల్లే వారిని చూడగానే అసంకల్పితంగా చిరునవ్వుతో పలకరిస్తాం. అదే.. శరీరం నుంచి దుర్గంధం వచ్చే వారితో మాట్లాడేటప్పుడు కాస్త అసౌకర్యంగా ఫీలౌతాం. ఇది వివక్ష అనుకుంటే పొరబాటే.. ఎందుకంటే మనుషుల్లో ఈ ప్రవర్తన అమ్మ కడుపులో పడ్డ ఆరోనెల నుంచే మొదలౌతుందట..! అందుకే దుర్గంధం వెదజల్లే వస్తువులు, మనుషులు దగ్గరలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం. అదే వాసన మన శరీరం నుంచే వస్తుంటే అందరికీ దూరంగా నిలబడతాం. ఎవరైనా చనువుగా దగ్గరికి వస్తే అసౌకర్యానికి గురౌతాం. శరీర దుర్వాసన మన ఆత్మవిశ్వాసంపై ఎంతగానో ప్రభావం చూపుతుందన్నది కాదనలేని సత్యం. ప్రత్యేకించి వేసవిలో ఎక్కువగా బాధించే ఈ సమస్యను సహజంగా అధిగమించడానికి అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

Know More

women icon@teamvasundhara
neeta-lulla-on-what-it-took-to-recreate-jayalalithaas-wardrobe

కంగనను చూసి నిజంగా జయలలితే అనుకుని పులకరించిపోయింది!

చెన్నైలో బాగా రద్దీగా ఉండే ప్రాంతమది. ఓ మహిళ కారులోంచి దిగింది. ఆమెను చూసిన ఓ ముసలావిడ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తన దగ్గరకొచ్చి ‘అమ్మా అమ్మా’ అంటూ కౌగిలించుకొని.. కాళ్లపై పడి భావోద్వేగానికి లోనైంది. తనొక్కర్తే కాదు.. అక్కడ సంచరిస్తోన్న చాలామంది ముఖాల్లో ఇదే ఆశ్చర్యం.. చెప్పలేని ఆనందం! ఇంతకీ ఆమె మరెవరో కాదు.. తమిళుల ఆరాధ్య దైవం ‘అమ్మ’ అలియాస్‌ జయలలిత. అదేంటి ఆమె ఎప్పుడో చనిపోయారు కదా..? ఇప్పుడు రావడమేంటి? అని మీరూ ఆశ్చర్యపోతున్నారా? ‘అమ్మ’ రూపంలో అక్కడకొచ్చింది ఆన్‌స్క్రీన్‌ జయలలిత.. అంటే ‘తలైవి’గా నటిస్తోన్న కంగనా రనౌత్‌. అవును.. ఆ సినిమాలో కంగనను తెరపై చూసిన ప్రతి ఒక్కరూ అచ్చం జయలలితలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. మరి, ఆ ప్రశంసల వెనుక, ఆమెను అచ్చం జయలాగే మలచడం వెనుక ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లాదే కీలక పాత్ర అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో కంగనను అలనాటి జయలలితగా కనిపించేలా చేయడానికి చాలానే శ్రమించాల్సి వచ్చిందని.. ఈ అవకాశాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నానంటూ ‘తలైవి’ సినిమాకు పనిచేసే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను ఇలా గుదిగుచ్చారు నీతా.

Know More

women icon@teamvasundhara
breaking-the-barriers-women-who-got-second-marriage-after-ending-the-first-relationship

మలి వయసులో నాకో తోడు కావాలనుకోవడం తప్పా?!

విడాకులు తీసుకున్నా, వితంతువుగా మిగిలిపోయినా.. మహిళలు రెండో వివాహం చేసుకుంటామంటే మాత్రం ఎందుకో ఈ లోకం ఒప్పుకోదు. ఇక కాస్త లేటు వయసులో రెండో పెళ్లంటే ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అన్న సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిందే! కానీ ఏ వయసులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా సరే ఓ జీవిత భాగస్వామి తోడు అవసరమని, అందుకే తాను 73 ఏళ్ల వయసులో వరుడి కోసం అన్వేషిస్తున్నానని చెబుతోంది కర్ణాటకకు చెందిన ఓ రిటైర్డ్‌ టీచర్‌. ఈ క్రమంలోనే ‘వరుడు కావలెను’ అంటూ తానిచ్చిన ఓ మ్యాట్రిమోనియల్‌ ప్రకటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తనది రెండో పెళ్లని ఏమాత్రం రాజీ పడకుండా, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధమే లేదన్న సానుకూల దృక్పథంతో.. తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో తన యాడ్‌లో స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా తన నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది మాత్రం తన ధైర్యానికి, సానుకూల దృక్పథానికి సలాం కొడుతున్నారు. ఇలా ఆమె ప్రకటన చూసి.. ‘మీకు తగిన వరుడిని నేనే’ అంటూ ఓ 69 ఏళ్ల వ్యక్తి స్పందించడం ఇక్కడ కొసమెరుపు.

Know More

women icon@teamvasundhara
signs-you-may-have-already-had-covid-19-without-knowing

మనకు తెలియకుండానే కరోనా ఇలా మన శరీరంలోకి వచ్చి వెళ్తోందట!

‘హమ్మయ్య.. వ్యాక్సిన్ వచ్చేసింది.. కేసులూ తగ్గుతున్నాయి.. ఇక కరోనా పీడ విరగడైనట్లే!’ అని ఇలా అనుకున్నామో లేదో.. అలా సెకండ్‌ వేవ్‌ రెట్టింపు వేగంతో దూసుకొస్తోంది. పైగా ఈ దశలో వైరస్‌ సోకిన వారిలో సుమారు 95 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించట్లేదని చెబుతున్నారు నిపుణులు. కొవిడ్‌ ఎక్కువ మందికి విస్తరించడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇక మరోవైపు సాధారణ ఫ్లూ లక్షణాలు, చిన్న పాటి అనారోగ్యాలు కనిపిస్తే.. అది వైరస్‌ వల్ల కాదేమో అన్న చాలామంది నిర్లక్ష్యం కూడా ప్రస్తుతం కరోనా విజృంభణకు ఓ కారణమే అంటున్నారు నిపుణులు. నిజానికి ఇలా మనకు తెలియకుండానే వైరస్‌ మన శరీరంలోకి వచ్చి వెళ్తోందన్నమాట! మరి, ఇంతకీ ఏవి అసలైన కరోనా లక్షణాలు? మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపిస్తే కొవిడ్‌ సోకినట్లుగా భావించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? ఇలాంటి సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే వీటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

Know More