శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; అధిక ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం దశమి: ఉ.11-15 తదుపరి ఏకాదశి ఆశ్లేష: రా.8-38 తదుపరి మఘ వర్జ్యం: ఉ.9-35 నుంచి 11-10 వరకు అమృత ఘడియలు: రా. 7 -03 నుంచి 8-38 వరకు దుర్ముహూర్తం: మ.12-09 నుంచి 12-56 వరకు తిరిగి మ.2-30 నుంచి 3-17 వరకు రాహుకాలం: ఉ.7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ.5-55 సూర్యాస్తమయం: సా.5-38
మేషం
చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాధ్యానం చేస్తే మంచిది.
వృషభం
శుభ ఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
మిథునం
ముఖ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలున్నాయి. మీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కర్కాటకం
విజయ సిద్ధి కలదు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది.
సింహం
మీదైనా ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.
కన్య
సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. శని ధ్యాన శ్లోకం చదవితే ఉత్తమం.
తుల
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని జపం చేస్తే మంచిది.
వృశ్చికం
ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన శుభదాయకం.
ధనుస్సు
చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కులదైవ సందర్శనం శుభప్రదం.
మకరం
మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు, ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.
కుంభం
మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కాబట్టి అప్రమత్తమంగా వ్యవహరించాలి. సాయి బాబా సందర్శనం మేలు చేస్తుంది.
మీనం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడంతో కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.