శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; అధిక ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం షష్ఠి: ఉ.11-42 తదుపరి సప్తమి మృగశిర: రా.7-12 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: తె.3-58 నుంచి 5-38 వరకు అమృత ఘడియలు: ఉ.9-49 నుంచి 11-32 వరకు దుర్ముహూర్తం: ఉ.9-50 నుంచి 10-37 వరకు తిరిగి మ.2-33 నుంచి 3-20 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5-54 సూర్యాస్తమయం: సా.5-42
మేషం
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతినిస్తుంది. దుర్గారాధన చేస్తే శుభప్రదం.
వృషభం
అనుకూల ఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం ఉత్తమం.
మిథునం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. గోసేవ చేస్తే బాగుంటుంది.
కర్కాటకం
అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
కన్య
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
తుల
చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. రవిద్యాన శ్లోకం చదివితే మేలు.
వృశ్చికం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన శుభప్రదం.
ధనుస్సు
గ్రహబలం బాగుంది. మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.
మకరం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
కుంభం
చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. సౌభాగ్య సిద్ధి కలదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభాన్నిస్తుంది.
మీనం
మంచి పనులు చేయడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.