శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం శరదృతువు; అధిక ఆశ్వయుజ మాసం; శుక్లపక్షం పూర్ణిమ: రా.1-14 తదుపరి బహుళ పాడ్యమి ఉత్తరాభాద్ర: తె.5-49 తదుపరి రేవతి వర్జ్యం: మ.2-02 నుంచి 3-47 వరకు అమృత ఘడియలు: రా.12-33 నుంచి 2-18 వరకు దుర్ముహూర్తం: ఉ.9-55 నుంచి 10-43 వరకు తిరిగి మ.2-44 నుంచి 3-33 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5-54 సూర్యాస్తమయం: సా.5-48
మేషం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని రానీయకండి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
వృషభం
లాభదాయకమైన కాలం. తెలివి తేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విద్య, వినోద సుఖం ఉంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
మిథునం
కుటుంబ సౌఖ్యం ఉంది. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కర్కాటకం
కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని అమలు చేస్తారు. మనోధైర్యంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.
సింహం
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
కన్య
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ప్రస్తుతం ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివడం మంచిది.
మకరం
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొంటారు. ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులు కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
మీనం
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన మానద్దు. శివారాధన శుభప్రదం.