scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!'

'కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!'

Know More

Movie Masala

 
category logo

బొజ్జ గణపయ్య కోరుకునేదీ అదే..!

Bollywood Beauties Urge People to make and worship Eco-Friendly Ganesh Idols in Telugu

అన్ని దేవతల్లోకెల్లా తొలి పూజలందుకునే గణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే పండగ ‘వినాయక చవితి’ రానే వచ్చింది. గణేష్‌ చతుర్థి అనగానే వీధివీధినా రంగురంగుల భారీ విగ్రహాలే దర్శనమిస్తుంటాయి. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సామూహిక పూజలు రద్దు చేసింది ప్రభుత్వం. అంతేకాదు.. ఎవరింట్లో వాళ్లు చేసుకునే పండగ కోసం కూడా పర్యావరణహిత గణపతి విగ్రహాన్నే పూజించాలంటూ కోరుతోంది కూడా! ఈ జాబితాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మట్టితో చేసిన గణపయ్యను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని.. తద్వారా పరోక్షంగా ఆ భగవంతుడిని సంతోషపెట్టిన వారవుతారని చెబుతూ ఎకో-ఫ్రెండ్లీ గణపతి ఉత్సవాల గురించి అందరిలో అవగాహన పెంచుతున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో వారూ పర్యావరణహిత గణపతిని తయారుచేస్తోన్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయారు. మరి, ఎకో-ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల గురించి వారేమంటున్నారో తెలుసుకుందాం రండి..

పర్యావరణహిత గణపతి ఉత్సవాలు.. ఈ మాట ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది. మట్టి విగ్రహాలు పూజిస్తూ పర్యావరణాన్ని మనం కాపాడితే.. ఆ భగవంతుడు తప్పకుండా ప్రసన్నుడవుతాడనే విషయాన్ని గ్రహించే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎకో-ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల్ని ఎంచుకుంటున్నారు. తాము కూడా ఏళ్లకేళ్లుగా పర్యావరణహితమైన మట్టి విగ్రహాన్నే పూజిస్తున్నామంటున్నారు కొందరు తారలు. ఇప్పటికీ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారుచేసిన గణపయ్యను పూజించే వారు తమ ఆలోచనను మార్చుకొని మట్టి విగ్రహాల వైపు మొగ్గుచూపమంటూ అందరిలో అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలోనే తాము తయారుచేసిన మట్టి గణపయ్యల ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. అలాగే విగ్రహ తయారీ గురించి కళాకారులతో ఆన్‌లైన్‌ వీడియో సెషన్‌ నిర్వహించి.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరికీ పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తున్నారు.

గొప్ప సంకల్పం!

View this post on Instagram

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on


పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన అందాల తారల్లో బాలీవుడ్‌ అందం భూమి పెడ్నేకర్‌ ఒకరు. ప్రకృతిని కాపాడుకునేందుకు తన వంతుగా కృషి చేస్తోన్న ఈ బ్యూటీ.. తాను పచ్చదనంతో గడిపిన ప్రతి క్షణాన్నీ ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది భూమి. ఇందులో భాగంగా తన పండగ విశేషాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దత్తాద్రి అనే కళాకారుడితో లైవ్‌ చాట్‌లో పాల్గొని ఎకో-ఫ్రెండ్లీ గణేషుడి విగ్రహ తయారీ గురించి సవివరంగా తెలియజేసిందీ సుందరి.

View this post on Instagram

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on


‘మనందరికీ ఎంతో ఇష్టమైన గణేష్‌ చతుర్థి పండగ దగ్గర్లోనే ఉంది. ఈ సందర్భంగా మనందరం ఇంట్లోనే గణేష్‌ విగ్రహాలను పెట్టుకొని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. నాకైతే ఈ పండగంటే భలే ఇష్టం. ఏళ్ల నుంచి మా ఇంట్లో గణేషుడి విగ్రహం ప్రతిష్టించి ఈ పండగను జరుపుకుంటున్నాం. ఇన్నేళ్లలో ఈ పండగకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తెలుసుకున్నాను. పర్యావరణహితమైన విగ్రహాలను పూజించడం వల్ల వాతావరణానికి మేలు జరుగుతుందన్న గొప్ప అంతరార్థం ఈ పండగ మనకు వివరిస్తుంది. ప్రకృతే దేవుడు, దేవుడే ప్రకృతి.. ఇలా ప్రకృతికి, దేవుడికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మనకు మేలు చేసే పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. అందరూ మట్టి గణపతుల్నే పూజించండి.

ఈ ఆలోచనతోనే నేను ఈ రోజు మీ అందరికీ ఓ గొప్ప పర్యావరణ కార్యకర్తను పరిచయం చేయబోతున్నా. తనే మహారాష్ట్రకు చెందిన దత్తాద్రి. ఆయన తయారుచేసే విగ్రహాలను చూస్తే విగ్రహాల తయారీ అంటే తనకున్న మక్కువ, పర్యావరణం పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ మనకు తెలిసిపోతుంది. ఎర్ర మట్టి, సేంద్రియ ఎరువులు, సహజసిద్ధమైన రంగులు, విత్తనాలు (గింజలు).. వంటి వాటితో అందమైన విగ్రహాలు తయారుచేస్తుంటారు దత్తాద్రి. ఇలాంటి విగ్రహాలు మనం నిమజ్జనం చేయడం వల్ల చెట్లుగా మొలకెత్తుతాయి. పర్యావరణాన్ని కాపాడడమంటే పరోక్షంగా గణపతిని ఆరాధించడమే అన్న గొప్ప సంకల్పంతో గత కొన్నేళ్లుగా ఈ విగ్రహాలను తయారుచేస్తున్నారాయన..’ అంటూ దత్తాద్రితో మాట కలిపింది భూమి. ఇలా తనదైన శైలిలో పర్యావరణహిత గణపతిని పూజించాలంటూ కోరుతోందీ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ.

వినాయకుడు నా అదృష్ట దైవం!

View this post on Instagram

A post shared by Juhi Parmar (@juhiparmar) on


తన వ్యక్తిగత విశేషాలే కాదు.. వృత్తిపరమైన విషయాల్ని సైతం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తన ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంది బాలీవుడ్‌ బుల్లితెర తార జుహీ పార్మర్‌. కరోనా మొదలైన దగ్గర్నుంచి తాను చేసే వంటకాలు, వ్యాయామాలు, పాటించే సౌందర్య చిట్కాలు.. వంటివన్నీ ఇన్‌స్టాలో పోస్టుల రూపంలో పంచుకుంటోన్న ఈ అందాల అమ్మ.. తాజాగా మట్టి వినాయకుడిని తయారుచేస్తోన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన గణపతి విగ్రహాలను పూజించమంటూ కోరుతోందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Juhi Parmar (@juhiparmar) on


‘గణపతి ఉత్సవాలంటే మా ఇంట్లో చాలా ప్రత్యేకమైనవి. వినాయకుడు మాకు అదృష్టాన్ని ప్రసాదించే దేవుడు. రెండేళ్ల క్రితం మేము తొలిసారి గణపతి విగ్రహాన్ని మా ఇంట్లో ప్రతిష్టించాం. ఆ రోజే మా అమ్మ బ్లాగింగ్‌ జర్నీ ప్రారంభమైంది. ఇక గతేడాది ఇదే రోజున నేను నా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాను. ఈ రెండు మంచి పనులు ఆయన ఆశీర్వాదంతోనే జరిగాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం ఆయన మాకు ప్రసాదించిన వరాలే!

ఇక ఈసారి కరోనా దృష్ట్యా ఎలాంటి సందడి లేకుండానే, అతిథులను ఆహ్వానించకుండానే పండగను జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరం పర్యావరణహిత గణపతినే పూజిద్దాం! నేను, నా కూతురు కలిసి ఈ సారి మా ఇంట్లోనే స్వయంగా వినాయక విగ్రహాన్ని తయారుచేశాం. గణపతి విగ్రహాల తయారీలో ఎవరూ నిపుణులు కారు. మనలో ఉన్న భక్తిశ్రద్ధలు, దేవుడిపై ఉండే ఆరాధనా భావమే మనతో అందమైన విగ్రహాలు తయారుచేయిస్తుంది. ఇక విగ్రహం తయారీ పూర్తయ్యాక మన చేతుల్లో రూపుదిద్దుకున్న గణపతిని చూస్తే మనలో సరికొత్త ఉత్సాహం జనిస్తుంది.
గణపతి బప్పా మోరియా!!’ అంటూ తన మనసులోని భావాలను పంచుకుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. అంతేకాదు.. తాను తయారుచేసిన గణేష్‌ విగ్రహం వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో సైతం పంచుకుంది జుహీ.

పర్యావరణహితమే మన హితం!

View this post on Instagram

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on


ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతోన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే పండగ జరుపుకోవాలని తన అభిమానులను కోరుతోంది బాలీవుడ్‌ అందాల తార శ్రద్ధా కపూర్‌. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలంటూ ఈ మధ్యే తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియోను పోస్ట్‌ చేసిందీ లవ్లీ బేబ్‌. ఇందులో భాగంగా ‘గణేష్‌ చతుర్థి దగ్గర్లోనే ఉంది. ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాన్నే ఇంటికి తెచ్చుకోండి.. భక్తిశ్రద్ధలతో పూజించండి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతోంది. అవి సముద్రంలో పూర్తిగా కరిగిపోవట్లేదు. అలా జరగడం కూడా మంచిది కాదు..’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

View this post on Instagram

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on

మట్టి గణపతికే మన ఓటు!

View this post on Instagram

A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) on


మోడల్‌, నటి అయిన మహి విజ్‌ కూడా పర్యావరణహిత గణపతినే పూజించాలంటూ తన ఫ్యాన్స్‌ని కోరుతోంది. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలు తయారుచేసిన మట్టి గణపతికి సంబంధించిన వీడియోలను ఇటీవలే ఇన్‌స్టా స్టోరీస్‌లో భాగంగా పంచుకుందీ ముద్దుగుమ్మ. తన చిన్నారులు ఖుషీ, రజ్వీర్‌ గణపతిని తయారుచేయడానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకోవడం, ఆపై గణపతిని తయారుచేయడం, తయారీ గురించి ఖుషీ వివరించడం.. ఇలా ముచ్చటగా మూడు షార్ట్‌ వీడియోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంటూ మురిసిపోయిందీ అందాల అమ్మ. ఇలా పర్యావరణహిత గణపతికే ప్రతి ఒక్కరూ ఓటేయాలంటూ తన చిన్నారులు తయారుచేసిన మట్టిగణపతి వీడియోల ద్వారా తన ఫ్యాన్స్‌ని కోరింది మహి. 2011లో టీవీ నటుడు జై భానుశాలిని వివాహమాడిందీ ముద్దుగుమ్మ. ఈ జంట కొన్నేళ్ల క్రితం ఖుషీ, రజ్వీర్‌ అనే పిల్లలిద్దరినీ దత్తత తీసుకున్నారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో తారా భానుశాలి అనే ముద్దుల పాపకు జన్మనిచ్చారీ పేరెంట్స్‌. ఇలా ముచ్చటగా ముగ్గురు పిల్లలతో ఎంజాయ్‌ చేస్తోన్న ఈ లవ్లీ కపుల్‌.. తమ ఇంట్లో జరిగే ప్రతి సందర్భాన్నీ సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోతుంటారు.

సో.. ఇవండీ.. మన ముద్దుగుమ్మలు మట్టి గణపతి విగ్రహాలు, వాటి ప్రాశస్త్యం గురించి పంచుకున్న విషయాలు! మరి, మనం కూడా వీరిని ఫాలో అయిపోయి ఎకో-ఫ్రెండ్లీ గణపతికే ఓటేద్దాం! అటు పర్యావరణాన్ని కాపాడుకుందాం.. ఇటు గణేషుడి ఆశీస్సులు అందుకుందాం..!

Photos: Instagram





women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More

women icon@teamvasundhara
famous-indian-celebrities-who-have-adopted-children-in-telugu

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-27-10-2020
women icon@teamvasundhara
how-to-be-happy-in-this-society-as-a-women

జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో ఈ దసరా సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indian-cities-named-after-goddess-durga-in-telugu

ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ 'దసరా' సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-23-10-2020
women icon@teamvasundhara
bathukamma-songs-in-telugu

women icon@teamvasundhara
well-studied-girl-begging-in-the-streets-story-in-telugu

డబుల్ పీజీ చేసింది.. ఎన్నికల్లో నిలబడింది.. యాచకురాలిగా మారింది!

ఉన్నత చదువులు చదివిన ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. గతంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిగా తోటి విద్యార్థులకు అండగా నిలబడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఈ చదువుల తల్లి ప్రస్తుతం వీధుల్లో భిక్షమెత్తుకుంటోంది. కుమారుడితో కలిసి పార్కులు, రైల్వేస్టేషన్‌, బస్టాండులలో తిరుగుతూ పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకిలా యాచకురాలిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
significance-and-importance-of-batukamma-for-9-day-in-telugu

అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
with-family-separated-by-border-couple-exchange-wedding-vows-with-a-unique-twist

నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-10-2020
women icon@teamvasundhara
odisha-couple-gets-married-celebrates-by-feeding-500-stray-dogs-in-telugu

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-who-adopted-vegetarianism-in-telugu

ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాం!

వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్‌ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్‌ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
meghan-markle-says-online-abuse-almost-unsurvivable-in-telugu

women icon@teamvasundhara
this-american-mom-gives-birth-to-10-children-in-10-years-read-the-story-behind-this

అందుకే పదేళ్లలో పదిమంది పిల్లల్ని కన్నది!

ఒకప్పుడు పెళ్లైన అమ్మాయిని ‘గంపెడు మంది పిల్లల్ని కనమ్మా’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికే తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మందికి తల్లైంది అమెరికాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం పదకొండోసారి గర్భం ధరించిన ఈ మహిళ.. దీంతో పాటు మరో పాపాయిని కూడా కంటానంటోంది. ఇలా మొత్తంగా పన్నెండేళ్లలో పన్నెండు మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకుందీ అమెరికన్‌ మామ్‌. అయినా కచ్చితంగా ఇంతమందే పిల్లల్ని కనాలని ఎవరైనా అనుకుంటారా? అని సరదాగా అడిగితే.. దీని వెనుక ఒక చిన్న కథ ఉందని చెబుతోంది. మరి, ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చెబుతోన్న కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
doctor-narrates-how-she-delivered-a-baby-in-the-bathroom-of-a-flight
women icon@teamvasundhara
super-easy-hacks-will-help-you-relax-whenever-you-are-feeling-tense-in-telugu
women icon@teamvasundhara
today-horoscope-details-8-10-2020
women icon@teamvasundhara
elderly-couple-from-kerala-pose-for-wedding-photo-shoot-after-58-years-of-marriage

అందుకే పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!

నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్‌ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
celebrities-who-diagnosed-and-recovered-from-covid-in-telugu

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
women-safety-gadgets-which-are-easy-to-use-in-telugu
women icon@teamvasundhara
women-obsessed-with-their-favorite-colors-in-telugu

పింక్‌ అంటే ఎంతిష్టమైతే మాత్రం.. మరీ ఇంతగానా?!

గులాబీ రంగు అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గరా కనీసం ఒక్క పింక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ అయినా ఉంటుంది. ఇదొక్కటనే కాదు.. తమకు ఇష్టమైన రంగుల్లో ఉండే దుస్తులు, యాక్సెసరీస్‌.. వంటివి తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకొని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అలాగని అన్నీ ఒకే రంగులో ఉండవు.. సరికదా రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలన్నా ఎవరికైనా బోరే! కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల యాస్మిన్ చార్లొట్‌కు మాత్రం అస్సలు బోర్‌ కొట్టదట. రోజూ తాను పింక్‌ కలర్‌ దుస్తులు తప్ప మరేవీ ధరించనంటోంది. ఒక్క దుస్తులనే కాదు.. యాక్సెసరీస్‌ దగ్గర్నుంచి తన ఇల్లు, ఇంట్లోని వస్తువులు, మేకప్‌ సామగ్రి.. ఇలా అన్ని వస్తువుల్నీ పింక్‌ కలర్‌లో ఉన్నవి తప్ప మరేవీ ఎంచుకోవట్లేదామె. మరి ఎందుకిలా అని అడిగితే గులాబీ రంగు అంటే తనకు చెప్పలేనంత ఇష్టమంటూ తన గురించి బోలెడన్ని విషయాలు ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
glenn-maxwell-fiance-vini-raman-fires-on-netizen-who-wrote-nasty-comments

అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.

Know More

women icon@teamvasundhara
meet-the-talented-chef-kairavi-mehta-of-akkineni-family!

అక్కినేని వారి ఫ్యామిలీ చెఫ్‌ ఎవరో తెలుసా?

సాధారణంగా ఇంట్లో ఎవరు వంట చేస్తారు? అదేం ప్రశ్న.. ఆడవాళ్లు చేస్తారు.. కొన్ని పనుల్లో మగవాళ్లు కూడా వాళ్లకు సహాయపడతారు.. అంటారా? అవుననుకోండి.. కానీ ఆ ఇల్లాలికి వంట రాకపోతే? ఓ వంట మనిషిని పెట్టుకుంటుంది.. లేదంటే తనే ఎలాగోలా నేర్చుకొని వండుతుంది. మరి, అదే సెలబ్రిటీలైతే ఏకంగా చెఫ్‌లనే నియమించుకుంటారు. అందులోనూ సినిమా రంగానికి చెందిన వాళ్లైతే తమ ఫిట్‌నెస్‌ తగ్గకుండా, చక్కటి పోషకాహారాన్ని రుచికరంగా వండి వార్చే చెఫ్‌లకు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కినేని వారింట్లో కూడా అలాంటి చెఫ్‌ ఉన్నారన్న విషయం ఈమధ్యే అఖిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే గానీ చాలామందికి తెలియలేదు. అమలకు వంట రాదు.. మరి వాళ్లింట్లో వంట ఎవరు చేస్తారు? అన్న చాలామంది సందేహానికి ఈ ఫొటో సమాధానమిచ్చినట్లయింది. మరి, ఇంతకీ ఎవరా చెఫ్‌? ఇప్పటిదాకా తెర వెనకే ఉన్న ఆమె ఉన్నట్లుండి తెర ముందుకు ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
celebrities-demand-justice-for-19-years-old-gang-rape-and-murder-in-hathras
women icon@teamvasundhara
gauri-khan-reveals-things-in-mannat-are-‘remote-controlled’-by-her-mother-from-delhi

ఈ ఇంద్ర భవనాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

సాధారణంగా ఇల్లంటే లివింగ్‌ రూమ్‌, పడక గది, కిచెన్‌.. ఇవే ఉంటాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే విల్లాలు, డూప్లెక్స్‌ మోడల్స్‌లో తమ ఇంటిని నిర్మించుకుంటారు. వాటిలో తమ అభిరుచికి తగినట్లుగా అలంకరణ వస్తువులతో తీర్చిదిద్దుకుంటారు. మరి, రాజ భవనాన్ని మించిపోయేలా, ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఇంటిని మీరెప్పుడైనా చూశారా? బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు అందుకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. రాజసం ఉట్టిపడే హంగులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్‌, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు.. అబ్బో ఇలా ఆ ఇంటి గురించి, అందులో అలంకరించిన వస్తువుల గురించి ఎంత చెప్పినా తక్కువే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-9-2020
women icon@teamvasundhara
singer-sunitha-shares-emotional-video-about-spbalasubrahmanyam-in-telugu

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
women-are-higher-than-men-on-these-strengths-in-telugu
women icon@teamvasundhara
condolences-for-legendary-singer-sp-balasubrahmanyam-by-celebrties-in-telugu

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon@teamvasundhara
puri-jagannadh-expresses-about-girls-mindset-in-his-new-podcast
women icon@teamvasundhara
today-horoscope-details-21-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-18-9-2020
women icon@teamvasundhara
punishment-for-rapists-in-different-countries-in-telugu

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon@teamvasundhara
female-constable-lovingly-feeds-homeless-woman-her-baby-in-hyderabad-is-live-example-for-humanity
women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
forgiveness-day-celebrations

ఐయామ్ వెరీ సారీ.. అనేద్దాం వందోసారి..!

అనూష, రాధిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. మొదటిసారి చూసినవాళ్లు అక్కాచెల్లెళ్లే అనుకోవాలి అలా ఉండేవాళ్లు. అయితే ఓ చిన్న గొడవ వల్ల ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తప్పెవరిది? అన్న విషయం పక్కన పెడితే తప్పు చేసిన వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకోవడం, అటుపక్కవాళ్లూ క్షమించడం వల్లే బంధాలు గట్టిపడతాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి సీరియస్ డైలాగ్ చెప్పినా.. క్షమించడం, క్షమాపణ అడగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే క్షమించడానికి మంచి మనసుండాలి.. అలాగే క్షమాపణ అడగడానికి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం, నేర్పు ఉండాలి. ఇవన్నీ మన సొంతమైతే - మనం కూడా 'అందరివాళ్లు' గా మారడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరూ అలా మారాలనుకుంటున్నారా? అయితే 'అంతర్జాతీయ క్షమా దినోత్సవం' సందర్భంగా 'సారీ' అనే మ్యాజికల్ వర్డ్‌కున్న పవర్ ఏంటో మీరే తెలుసుకోండి...

Know More