scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

అలా ఈ స్టార్‌ కిడ్స్ ‘కరోనియల్‌ కిడ్స్’గా మారిపోయారు!

Kareena And Saif To Have A Coronial Baby. Here Is What It Means in Telugu

తల్లిదండ్రులవడం అనేది జీవితంలో మరో మెట్టు పైకెక్కడం లాంటిదే. ఇక మొదటిసారి పేరెంట్స్‌గా మారిన జంటలు..మరోసారి అమ్మానాన్నలయ్యేసరికి మరింత ఆనందోత్సాహానికి, భావోద్వేగానికి గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ కరీనా కపూర్ -సైఫ్‌ అలీఖాన్‌. 2012లో పెళ్లిపీటలెక్కిన ఈ దంపతులకు ఇప్పటికే తైమూర్‌ అనే మూడేళ్ల కుమారుడున్నాడు. ఈ సందర్భంగా త్వరలోనే మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిందీ క్యూట్‌ కపుల్.

మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నాం!

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో కరీనా- సైఫ్‌ జోడీ కూడా ఒకటి. వయసు పరంగా వారిద్దరి మధ్య పదేళ్ల తేడా ఉంది. అయినా పెద్దల ఆశీర్వాదంతో 2012లో పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్. 2016 డిసెంబర్‌లో ఈ దంపతులకు తైమూర్‌ అనే పిల్లాడు జన్మించాడు. తల్లిదండ్రుల్లాగే తన క్యూట్‌ లుక్స్‌, అల్లరి మాటలతో ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడీ చోటా నవాబ్‌. ఈక్రమంలో తైమూర్‌కు తోబుట్టువును అందిస్తున్నామంటూ తాజాగా శుభవార్తను ప్రకటించారు కరీనా దంపతులు. ‘మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని చెప్పడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. మాపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు కురిపించే మా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా తెలిపారీ బ్యూటిఫుల్ కపుల్‌. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ అందాల జంటకు అభినందనలు తెలుపుతున్నారు.


కరోనియల్‌ పేరెంట్స్‌గా కరీనా, సైఫ్!

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది. గతేడాది చివరిలో వూహాన్‌ వేదికగా ఊపిరిపోసుకున్న ఈ వైరస్‌ ప్రస్తుతం అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇక ఇండియాలో కూడా కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో చాలామంది క్వారంటైన్‌ అంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో మొదలైన ఈ కరోనా సంక్షోభం 2021 వరకు ఉంటుందని అంచనా. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చిన ఈ సందిగ్ధ కాలాన్ని ‘క్వారంటైన్‌ పిరియడ్‌’ అని అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా ఈ సంక్షోభ సమయంలో పుట్టిన చిన్నారులను ‘కరోనియల్‌ కిడ్స్‌ లేదా కొవిడ్‌ కిడ్స్‌’ అని, వారి తల్లిదండ్రులను ‘కరోనియల్‌ పేరెంట్స్‌’ అని పిలుస్తున్నారు.

ఈ క్రమంలో ‘క్వారంటైన్‌ పిరియడ్‌’ లోనే మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు కరీనా దంపతులు. వీరే కాదు గడిచిన ఆరు నెలల్లో పలువురు సెలబ్రిటీలు కూడా ఈ క్వారంటైన్‌ పిరియడ్‌లో తల్లిదండ్రులయ్యారు. రాబోయే రోజుల్లో మరికొందరు ప్రముఖులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నారు. మరి ఇప్పటివరకు కరోనియల్‌ పేరెంట్స్‌గా మారిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి.


నటాషా-హార్దిక్

View this post on Instagram

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ఈ ఏడాది తొలి రోజున సముద్ర కెరటాల సాక్షిగా తమ ప్రేమాయణం, నిశ్చితార్థం విషయాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు బాలీవుడ్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌- క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా. ఇక ఈ ఏడాది మేలో తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన ఈ లవ్లీ కపుల్‌ జులై 30న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన హార్దిక్ ‘మేం తల్లిదండ్రులయ్యాం. మాకు బాబు పుట్టాడు’ అని అందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు.

View this post on Instagram

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) onసోఫీ టర్నర్

View this post on Instagram

A post shared by Sophie Turner (@sophiet) on

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా మరదలు, హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ క్వారంటైన్‌ పిరియడ్‌లోనే అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’, ‘ఎక్స్‌మెన్‌: డార్క్‌ ఫీనిక్స్‌’ తదితర చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె ప్రియాంక భర్త నిక్‌ సోదరుడు జో జోనస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 మేలో పెళ్లి పీటలెక్కిన ఈ జంట ఈ ఏడాది జులై 26న విల్లా అనే ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు.


సయాలీ భగత్

View this post on Instagram

A post shared by Sayali Bhagat (@sayali_bhagat) on

‘బ్లేడ్‌ బాబ్జీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సయాలీ భగత్‌. ‘ది ట్రైన్‌’, ‘గుడ్‌ లక్‌’, ‘హల్లా బోల్‌’, ‘యారియాన్‌’ తదితర బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 2013లో దిల్లీకి చెందిన వ్యాపార వేత్త నవీన్‌ ప్రతాప్‌ సింగ్‌ని పెళ్లి చేసుకున్న ఆమె జూన్‌లో ఓ బుజ్జి పాపాయికి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఇవాంకా సింగ్‌గా నామకరణం చేసిన సయాలీ ‘హలో ఇన్‌స్టా ఫ్యామ్‌.. మా బుల్లి ఏంజెల్‌ ఇవాంకా సింగ్‌కి హాయ్‌ చెప్పండి’ అంటూ తన బేబీని ప్రపంచానికి పరిచయం చేసింది.


సంఘవి

View this post on Instagram

A post shared by Sangavi Kavya Ramesh (@sangavi_venkatesh) on

‘హాయ్‌ రే హాయ్‌..జాం పండు రోయ్‌’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ చిత్రంతో పాటు ‘సీతారామరాజు’, ‘సమర సింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’, ‘సందడే సందడి’ సినిమాల్లో సందడి చేసిందీ అందాల తార. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం ఫిబ్రవరిలో వెంకటేష్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కిన సంఘవి ఈ ఏడాది మేలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా 42 ఏళ్ల వయసులో అమ్మగా ప్రమోషన్‌ పొందిన ఆమె కూతురితో కలిసున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘నా లిటిల్‌ ఏంజెల్‌ ఇదిగో..’ అంటూ తన బుజ్జి పాపాయిని అందరికీ పరిచయం చేసింది.


శిల్పాశెట్టి

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన శిల్పాశెట్టి ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి తల్లయింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ 2009లో రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో వియాన్‌ అనే బాబుకు జన్మనిచ్చిన ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 10న సరోగసీ ద్వారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన బుజ్జి పాపాయికి సమిషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టుకున్న ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను షేర్‌ చేసుకుంది. ‘ మా హృదయాలు ఎంతో సంతోషంతో నిండిపోయాయి. లిటిల్‌ ఏంజెల్‌ మా జీవితంలోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. జూనియర్‌ ఎస్‌ ఎస్‌ కే ఫిబ్రవరి 15న మా ఇంట్లోకి అడుగుపెట్టింది. ‘స’ అంటే సంస్కృతంలో ‘కలిగి ఉండడం’, ‘మిష’ అంటే రష్యన్‌ భాషలో ‘దేవత’ అని అర్థం. అలా మా ఇంటి మహాలక్ష్మి మా కుటుంబంలోకి అడుగుపెట్టి మా జీవితాలను పరిపూర్ణం చేసింది’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది శిల్ప.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) onలిసా హెడెన్

View this post on Instagram

A post shared by Lisa Lalvani (@lisahaydon) on

మోడల్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, నటిగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది లిసా హెడెన్‌. పలు బాలీవుడ్‌ హిట్‌ సినిమాల్లో మెరిసిన ఈ బాలీవుడ్‌ అందం 2016లో డినో లల్వానీ అనే బ్రిటిష్‌ వ్యాపారవేత్తను వివాహమాడింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా 2017లో జాక్‌ లల్వానీ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల తార..గతేడాది ఆగస్టులో మరోసారి తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘లియో’ అని ఓ బాబుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన ఇద్దరు కుమారులు కలిసున్న ఫొటోలను షేర్‌ చేసిన లిసా‘ మీ ఇద్దరూ నా హృదయాన్ని తాకారు. మీ ఇద్దరినీ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు. లియో అండ్‌ జాక్‌..మీ ఇద్దరినీ అలా ప్రేమగా చూస్తూ జీవితాంతం గడిపేస్తాను’ అని తన సంతోషాన్ని అందరితో షేర్‌ చేసుకుంది.


కల్కి కొచ్లిన్

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani) on

‘దేవ్ డి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘షైతాన్‌’, ‘యే జవానీ హై దివానీ’, ‘మార్గరిటా విత్‌ ఏ స్ట్రా’ తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది కల్కికొచ్లిన్‌. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌తో ప్రేమలో పడిన ఆమె 2011లో అతనితో కలిసి పెళ్లి పీటలెక్కింది. అయితే రెండేళ్లకే వారి బంధం బీటలు వారింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో ప్రేమలో పడిన ఈ అందాల తార...గతేడాది సెప్టెంబర్‌లో తాను అమ్మను కాబోతున్నానంటూ ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న ‘సఫో’ అనే ఓ ఆడకూతురికి జన్మనిచ్చిన కల్కి తన కూతురి కాళ్ల ఫుట్‌ ప్రింట్స్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నవమాసాలు నా గర్భంలో పెరిగిన నా కూతురు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన పేరు ‘సఫో’, నా ఆరోగ్యం, నా కూతురు క్షేమం కోరుతూ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Kalki (@kalkikanmani) onస్నేహ

View this post on Instagram

A post shared by Prasanna_actor (@prasanna_actor) on

తెలుగింటి బాపూ బొమ్మ స్నేహ ఈ ఏడాది ప్రారంభంలో రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందింది. సౌందర్య తర్వాత మళ్లీ అంతటి హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార జనవరి 24న ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రసన్న తమ బుజ్జి పాపాయి కాళ్లకు తొడగడానికి రడీగా ఉంచిన పింక్‌ కలర్‌ షూ పెయిర్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ‘ మా ఏంజెల్‌ అడుగుపెట్టింది’ అని క్యాప్షన్‌ జత చేశాడు.

View this post on Instagram

A post shared by Sneha Prasanna (@realactress_sneha) on


వీరితో పాటు సల్మాన్‌ సోదరి అర్పితాఖాన్‌ (డిసెంబర్ 27), స్టార్‌ రెజ్లర్ గీతా ఫోగట్ (డిసెంబర్ 24) కూడా క్వారంటైన్‌ పిరియడ్‌లోనే తల్లులయ్యారు.

women icon@teamvasundhara
today-horoscope-details-17-10-2020
women icon@teamvasundhara
odisha-couple-gets-married-celebrates-by-feeding-500-stray-dogs-in-telugu

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-who-adopted-vegetarianism-in-telugu

ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాం!

వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్‌ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్‌ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
meghan-markle-says-online-abuse-almost-unsurvivable-in-telugu

women icon@teamvasundhara
this-american-mom-gives-birth-to-10-children-in-10-years-read-the-story-behind-this

అందుకే పదేళ్లలో పదిమంది పిల్లల్ని కన్నది!

ఒకప్పుడు పెళ్లైన అమ్మాయిని ‘గంపెడు మంది పిల్లల్ని కనమ్మా’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికే తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మందికి తల్లైంది అమెరికాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం పదకొండోసారి గర్భం ధరించిన ఈ మహిళ.. దీంతో పాటు మరో పాపాయిని కూడా కంటానంటోంది. ఇలా మొత్తంగా పన్నెండేళ్లలో పన్నెండు మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకుందీ అమెరికన్‌ మామ్‌. అయినా కచ్చితంగా ఇంతమందే పిల్లల్ని కనాలని ఎవరైనా అనుకుంటారా? అని సరదాగా అడిగితే.. దీని వెనుక ఒక చిన్న కథ ఉందని చెబుతోంది. మరి, ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చెబుతోన్న కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-10-2020
women icon@teamvasundhara
meet-the-israeli-child-who-takes-a-11-foot-pet-python-swimming
women icon@teamvasundhara
obese-woman-weighing-172-kg-morbidities-like-cancer-diabetis-asthma-beats-covid
women icon@teamvasundhara
elderly-couple-from-kerala-pose-for-wedding-photo-shoot-after-58-years-of-marriage

అందుకే పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!

నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్‌ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
celebrities-who-diagnosed-and-recovered-from-covid-in-telugu

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-6-10-2020
women icon@teamvasundhara
women-obsessed-with-their-favorite-colors-in-telugu

పింక్‌ అంటే ఎంతిష్టమైతే మాత్రం.. మరీ ఇంతగానా?!

గులాబీ రంగు అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గరా కనీసం ఒక్క పింక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ అయినా ఉంటుంది. ఇదొక్కటనే కాదు.. తమకు ఇష్టమైన రంగుల్లో ఉండే దుస్తులు, యాక్సెసరీస్‌.. వంటివి తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకొని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అలాగని అన్నీ ఒకే రంగులో ఉండవు.. సరికదా రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలన్నా ఎవరికైనా బోరే! కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల యాస్మిన్ చార్లొట్‌కు మాత్రం అస్సలు బోర్‌ కొట్టదట. రోజూ తాను పింక్‌ కలర్‌ దుస్తులు తప్ప మరేవీ ధరించనంటోంది. ఒక్క దుస్తులనే కాదు.. యాక్సెసరీస్‌ దగ్గర్నుంచి తన ఇల్లు, ఇంట్లోని వస్తువులు, మేకప్‌ సామగ్రి.. ఇలా అన్ని వస్తువుల్నీ పింక్‌ కలర్‌లో ఉన్నవి తప్ప మరేవీ ఎంచుకోవట్లేదామె. మరి ఎందుకిలా అని అడిగితే గులాబీ రంగు అంటే తనకు చెప్పలేనంత ఇష్టమంటూ తన గురించి బోలెడన్ని విషయాలు ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
glenn-maxwell-fiance-vini-raman-fires-on-netizen-who-wrote-nasty-comments

అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.

Know More

women icon@teamvasundhara
meet-the-talented-chef-kairavi-mehta-of-akkineni-family!

అక్కినేని వారి ఫ్యామిలీ చెఫ్‌ ఎవరో తెలుసా?

సాధారణంగా ఇంట్లో ఎవరు వంట చేస్తారు? అదేం ప్రశ్న.. ఆడవాళ్లు చేస్తారు.. కొన్ని పనుల్లో మగవాళ్లు కూడా వాళ్లకు సహాయపడతారు.. అంటారా? అవుననుకోండి.. కానీ ఆ ఇల్లాలికి వంట రాకపోతే? ఓ వంట మనిషిని పెట్టుకుంటుంది.. లేదంటే తనే ఎలాగోలా నేర్చుకొని వండుతుంది. మరి, అదే సెలబ్రిటీలైతే ఏకంగా చెఫ్‌లనే నియమించుకుంటారు. అందులోనూ సినిమా రంగానికి చెందిన వాళ్లైతే తమ ఫిట్‌నెస్‌ తగ్గకుండా, చక్కటి పోషకాహారాన్ని రుచికరంగా వండి వార్చే చెఫ్‌లకు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కినేని వారింట్లో కూడా అలాంటి చెఫ్‌ ఉన్నారన్న విషయం ఈమధ్యే అఖిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే గానీ చాలామందికి తెలియలేదు. అమలకు వంట రాదు.. మరి వాళ్లింట్లో వంట ఎవరు చేస్తారు? అన్న చాలామంది సందేహానికి ఈ ఫొటో సమాధానమిచ్చినట్లయింది. మరి, ఇంతకీ ఎవరా చెఫ్‌? ఇప్పటిదాకా తెర వెనకే ఉన్న ఆమె ఉన్నట్లుండి తెర ముందుకు ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
celebrities-demand-justice-for-19-years-old-gang-rape-and-murder-in-hathras

women icon@teamvasundhara
today-horoscope-details-30-9-2020
women icon@teamvasundhara
gauri-khan-reveals-things-in-mannat-are-‘remote-controlled’-by-her-mother-from-delhi

ఈ ఇంద్ర భవనాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

సాధారణంగా ఇల్లంటే లివింగ్‌ రూమ్‌, పడక గది, కిచెన్‌.. ఇవే ఉంటాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే విల్లాలు, డూప్లెక్స్‌ మోడల్స్‌లో తమ ఇంటిని నిర్మించుకుంటారు. వాటిలో తమ అభిరుచికి తగినట్లుగా అలంకరణ వస్తువులతో తీర్చిదిద్దుకుంటారు. మరి, రాజ భవనాన్ని మించిపోయేలా, ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఇంటిని మీరెప్పుడైనా చూశారా? బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు అందుకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. రాజసం ఉట్టిపడే హంగులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్‌, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు.. అబ్బో ఇలా ఆ ఇంటి గురించి, అందులో అలంకరించిన వస్తువుల గురించి ఎంత చెప్పినా తక్కువే!

Know More

women icon@teamvasundhara
singer-sunitha-shares-emotional-video-about-spbalasubrahmanyam-in-telugu

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-26-9-2020
women icon@teamvasundhara
condolences-for-legendary-singer-sp-balasubrahmanyam-by-celebrties-in-telugu

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-25-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-23-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-19-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-17-9-2020
women icon@teamvasundhara
punishment-for-rapists-in-different-countries-in-telugu

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-16-9-2020
women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
forgiveness-day-celebrations

ఐయామ్ వెరీ సారీ.. అనేద్దాం వందోసారి..!

అనూష, రాధిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. మొదటిసారి చూసినవాళ్లు అక్కాచెల్లెళ్లే అనుకోవాలి అలా ఉండేవాళ్లు. అయితే ఓ చిన్న గొడవ వల్ల ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తప్పెవరిది? అన్న విషయం పక్కన పెడితే తప్పు చేసిన వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకోవడం, అటుపక్కవాళ్లూ క్షమించడం వల్లే బంధాలు గట్టిపడతాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి సీరియస్ డైలాగ్ చెప్పినా.. క్షమించడం, క్షమాపణ అడగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే క్షమించడానికి మంచి మనసుండాలి.. అలాగే క్షమాపణ అడగడానికి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం, నేర్పు ఉండాలి. ఇవన్నీ మన సొంతమైతే - మనం కూడా 'అందరివాళ్లు' గా మారడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరూ అలా మారాలనుకుంటున్నారా? అయితే 'అంతర్జాతీయ క్షమా దినోత్సవం' సందర్భంగా 'సారీ' అనే మ్యాజికల్ వర్డ్‌కున్న పవర్ ఏంటో మీరే తెలుసుకోండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-15-9-2020
women icon@teamvasundhara
couple-spends-2-lakh-creating-cardboard-cutout-guests-for-wedding

కరోనా వేళ.. కటౌట్స్ రూపంలో అక్షింతలు వేశారు!

పెళ్లంటే ఎవరికైనా ప్రత్యేకమే! అందుకే బంధువులందరినీ పిలిచి తమకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు అందరూ..! ఇంగ్లండ్‌కు చెందిన ఓ జంటా ఇందుకు అతీతం కాదు! మా పెళ్లి అలా జరగాలి.. అంతమంది బంధువుల్ని ఆహ్వానించాలి.. వివాహానికి ఇలా ముస్తాబు కావాలి.. అంటూ ఎన్నో కలలు కంది ఆ జంట. కానీ అంతలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయినా సరే.. పెళ్లి వేడుకల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదా కపుల్. ముహూర్తం తేదీ మార్చుకున్నా అతిథులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా కల్యాణమాడారు. పైగా వాళ్లందరితో కలిసి ఎంచక్కా ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారీ న్యూ కపుల్‌. అలాగని కరోనా నిబంధనల్ని పాటించలేదనుకుంటే మీరు పొరపాటు పడినట్లే! మరి, అటు అన్ని నిబంధనల్ని పాటించారంటున్నారు.. ఇటు అతిథులందరినీ పెళ్లికి పిలిచారంటున్నారు.. పైగా వాళ్లు దిగిన ఫొటోలు కూడా వైరలయ్యాయంటున్నారు.. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటారా? ఇదిగో ఇలా..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-12-9-2020
women icon@teamvasundhara
dubai-couple-hosts-gender-reveal-on-burj-khalifa-video-breaks-the-internet

బుర్జ్ ఖలీఫా సాక్షిగా పుట్టబోయేది ఎవరో చెప్పేశారు!

తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన మరుక్షణం నుంచీ ఆ జంట ఆనందానికి అంతుండదు. ఇక తమకు పుట్టబోయేది పాపో / బాబో తెలుసుకోవాలన్న ఆరాటం కాబోయే పేరెంట్స్‌కి ఉన్నప్పటికీ అది మన దేశంలో చట్ట విరుద్ధం. కానీ విదేశాల్లో మాత్రం దీన్నో వేడుకలా జరుపుకొంటారు తమకు పుట్టబోయే బిడ్డ ఎవరో తాము తెలుసుకోవడమే కాదు.. తమ బంధువులు, స్నేహితులకు పెద్ద పార్టీ ఇచ్చి మరీ సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఇలాంటి వేడుకనే అందరికంటే భిన్నంగా జరుపుకొని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మలచుకున్నారు దుబాయ్‌కి చెందిన ఓ జంట. ‘జెండర్‌ రివీల్‌ పార్టీ’ని అంత ప్రత్యేకంగా జరుపుకొన్నారు కాబట్టే ప్రస్తుతం వారి వీడియో ఇంటర్నెట్‌లో ఓ సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-10-9-2020
women icon@teamvasundhara