శ్రీ శార్వరి నామ సం||రం|| ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; ఆషాఢమాసం; బహుళ పక్షం పంచమి: ఉ. 11-09 తదుపరి షష్ఠి; పూర్వాభాద్ర: పూర్తి; అమృత ఘడియలు: రా.8-59 నుంచి 10-44 వరకు; వర్జ్యం: ఉ.10-35 నుంచి 12-19 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-11 నుంచి 9-03 వరకు; తిరిగి మ. 12-31 నుంచి 1-23 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు; సూర్యోదయం: ఉ.5-35 సూర్యాస్తమయం: సా.6-35
మేషం
శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం.
వృషభం
ఉత్సాహంతో పని చేస్తే సకాలంలో పనులు పూర్తవుతాయి. శ్రమ అధికమవుతుంది. కొందరి ప్రవర్తన వల్ల మనస్తాపం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. రామ నామ జపం శ్రేయోదాయకం.
మిథునం
ఎన్ని అవరోధాలు ఎదురైనా మనోధైర్యంతో పనులను పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. మాటపట్టింపులకు పోరాదు. అనవసర కలహాలతో సమయం వృథా చేయకండి. దుర్గా దేవిని ఆరాధించాలి.
కర్కాటకం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఒక కీలక వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఇష్ట దైవారాధన చేయడం మంచిది.
సింహం
మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మనోసౌఖ్యం ఉంది. మీ చిత్తశుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. ఆరోగ్య నియమాలను పాటించడం ఉత్తమం. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.
కన్య
కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. లలితా దేవిని స్తుతించాలి.
తుల
ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి.
వృశ్చికం
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఫర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం శుభప్రదం.
ధనుస్సు
చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ధృడంగా ఉండాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. అలసట పెరుగుతుంది. శ్రీ కృష్ణ దర్శనం మంచిది.
మకరం
మీ మీ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. శివపంచాక్షరీ స్తోత్రం పఠిస్తే మంచిది.
కుంభం
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అధికారుల అనుగ్రహం పొందడానికి ఎక్కువ కష్ట పడాల్సివస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీనం
పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. దైవబలం కలదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలబుద్ధిని వీడాలి. అనవసరమైన ఆందోళన తగ్గించుకుంటే మంచిది. గణపతి ఆరాధన శుభప్రదం.