శ్రీ శార్వరి నామ సం||రం|| ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; ఆషాఢమాసం; బహుళ పక్షం; చవితి: ఉ. 9-56 తదుపరి పంచమి; శతభిషం: తె. 3-39 తదుపరి పూర్వాభాద్ర; అమృత ఘడియలు: రా.7-55 నుంచి 9-38 వరకు; వర్జ్యం: ఉ.9-38 నుంచి 11-21 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-47 వరకు తిరిగి మ. 3-07 నుంచి 3-59 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు; సూర్యోదయం: ఉ.5-35 సూర్యాస్తమయం: సా.6-35
మేషం
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
వృషభం
మంచి కాలం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
మిథునం
హుషారుగా ముందుకు సాగితే సమస్యలు దరిచేరవు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దేహజాడ్యం ఉంది. చంద్ర శ్లోకం చదవాలి.
కర్కాటకం
అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్ట దైవ ప్రార్థన శుభప్రదం.
సింహం
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్ఛరిత పారాయణ శుభాన్నిస్తుంది.
కన్య
మనసుపెట్టి పని చేయండి. విజయం సిద్ధిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.
తుల
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.
వృశ్చికం
ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకుసాగాలి. గోసేవ చేయడం మంచిది.
ధనుస్సు
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
మకరం
అనుకున్న పని నెరవేరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతోషంగా గడుపుతారు. విందు, వినోద సుఖాలున్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
కుంభం
శుభ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. దైవారాధన మానద్దు.
మీనం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి.