scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

ఇవి కూడా కరోనా లక్షణాలే కావచ్చు!

COVID 19 New coronavirus symptoms

కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో ఆరు వచ్చి చేరాయి. అమెరికాలోని సెంటర్‌ ఆఫ్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) వీటిని జోడించింది. ఇప్పటిదాకా ఉన్న జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు తోడుగా మరికొన్ని లక్షణాలు ఇందులో చేరాయి.

అవేంటంటే..

* వాసనలను గ్రహించలేకపోవడం

* చలి

* చలితో వచ్చే వణుకుడు

* తలనొప్పి

* గొంతులో మంట

* కండరాల నొప్పి వంటి ఇబ్బందులు కనిపించినా కరోనా సోకినట్లు అనుమానించాల్సిందేనని సీడీసీ చెప్పింది. కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించాక 2 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాలు బయటపడవచ్చునని తెలిపింది.

ఛాతీలో విడవకుండా నొప్పి వస్తున్నా, గందరగోళంగా అనిపిస్తున్నా, పెదవులు కానీ, ముఖం కానీ నీలి రంగులోకి మారుతున్నా జాగ్రత్త పడాలని సీడీసీ హెచ్చరించింది. జాబితాలో పేర్కొన్న లక్షణాలే కాకుండా ఇతరత్రా మరేవైనా తీవ్ర ఇబ్బందులుంటే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

Also Read: కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?

gynecologist Ask Gynecologist Expert
ఓ సోదరి.

పిరియడ్స్ సరిగ్గా రావట్లేదు... ఏం చేయాలి?

హాయ్‌ మేడం. నేను గత కొన్ని రోజుల నుంచి నీటి బుడగలతో బాధపడుతున్నా. ఫలితంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, చుండ్రు, అవాంఛిత రోమాలు మొదలైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నేనొక సాధారణ ఉద్యోగిని. 8 గంటల పాటు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్ని కసరత్తులు చేసినా నా బరువు అదుపు కావట్లేదు. అలాగే నెలసరి కూడా సరిగ్గా రావట్లేదు. నాకు త్వరలోనే పెళ్లి. ఈ సమస్యల వల్ల పెళ్లయ్యాక ఇబ్బందులొస్తాయేమోనని భయంగా ఉంది. ఏం చేయను?


Know More

facebook
whatsapp
twitter

Video Gallery

Add These Natural Ingredients To Your Shampoo
Tips to lose your weight
Ways To Recycle Used Coffee Grounds
Side Effects of Excessive Exercise
Natural Packs for Lip Care
Ways to Strengthen Your Bones

Beauty Suggestions

womentalk Women Talk
ఓ సోదరి.

నేను ఎలాంటి క్రాప్‌టాప్స్ వేసుకోవచ్చు?

నా వయసు 15సం||. కాస్త లావుగా ఉంటా. దాంతో క్రాప్‌టాప్, జీన్స్.. వంటి డ్రస్సులు వేసుకోలేకపోతున్నా. ఫ్రెండ్స్ ముందు వాళ్లలా ఉండలేకపోతున్నా అని బాధగా ఉంది.

Know More

facebook
whatsapp
twitter
share your story హృదయ రాగం
ఓ సోదరి

'డియర్‌... మా కోసం మళ్ళీ తిరిగి రావా!?'

'కరోనా.. ఈ పదం ఎందరో పాలిట యమపాశమవుతోంది.. ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తోంది.. ఎంతోమందిని మానసికంగా కుంగదీస్తోంది.. ఎన్నో బంధాలను కాలరాస్తోంది. కన్న వాళ్లు, కట్టుకున్న వాళ్ల కడసారి చూపు కూడా దక్కకుండా చేస్తోంది. ఇలా ప్రపంచమంతా విషపు కోరలు చాస్తున్న కరోనా తన జీవితాన్నీ ఛిద్రం చేసిందంటోంది ఓ మహిళ. భర్తే సర్వస్వం అనుకున్న ఆమెకు ఆఖరికి కన్నీళ్లనే మిగిల్చిందీ మహమ్మారి. భర్త కడసారి చూపు కూడా దక్కకుండా చేసింది.. కానీ ఆయన గుండెల నిండా తామే ఉన్నామన్న ఆఖరి సందేశం మాత్రం ఎప్పటికీ తనతోనే, తనలోనే ఉంటుందన్న ఆమె బరువెక్కిన హృదయంతో తన మనసులోని మాటల్ని పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

facebook
whatsapp
twitter

Movie Masala

Worls Famous Lover Trailer
Nishabdham Trailer : Telugu
RED Official Teaser
Krack Movie Teaser
Bheeshma Theatrical Trailer
V Teaser

డియర్ వసుంధర

expert image

డా|| కవిత గూడపాటి

ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
expert image

డా|| వై.సవితాదేవి

గైనకాలజిస్ట్
expert image

శోభారాణి

బ్యూటీ ఎక్స్‌పర్ట్
expert image

కంతేటి స్వప్న

ఆర్థిక నిపుణురాలు
category logo




women icon@teamvasundhara
follow-these-covid-19-safety-guidelines-from-the-health-ministry

ఈ 15 వాగ్దానాలు కరోనా నుంచి మనల్ని కాపాడతాయి!

కరోనా.. మందు లేని ఈ మహమ్మారికి మనం తీసుకునే జాగ్రత్తలే నివారణ మార్గాలు. అయితే ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా అందరూ తిరిగి సాధారణ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు సెలబ్రిటీలు, ఆరోగ్య నిపుణులు కూడా కరోనా ముప్పును తప్పించుకోవాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవాల్సిన అంశాలపై వివిధ వేదికల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కరోనా నుంచి కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని, అందుకు ఎవరికి వారు 15 వాగ్దానాలు చేసుకోవాలంటూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-08-07-2020
women icon@teamvasundhara
health-benefits-of-chocolate

చాక్లెట్.. ఆ కోరికను పెంచుతుందట!

కేక్స్‌ దగ్గర్నుంచి మిల్క్‌ షేక్స్‌ దాకా.. బిస్కట్స్‌ దగ్గర్నుంచి స్వీట్స్‌ దాకా.. ఇలా ఎందులోనైనా చాక్లెట్‌ ఫ్లేవర్‌ని కోరుకుంటున్నారు చాలామంది. ఇక అమ్మాయిలైతే చాక్లెట్‌ అంటే చెవి కోసుకుంటారనుకోండి. అందుకే వారికి అందించే బహుమతుల్లో చాక్లెట్‌ ముందు వరుసలో ఉంటుంది. మరి, ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ పదార్థం రుచిని ఆస్వాదించడమే తప్ప.. అసలు ఇదెక్కడ పుట్టింది? దీన్నెలా తయారుచేస్తారు? దీనివల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రయోజనాలున్నాయా? అని మీరెప్పుడైనా ఆలోచించారా? మరి అయితే ఆలస్యమెందుకు.. నేడు ‘ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం’ సందర్భంగా చాక్లెట్‌కు సంబంధించిన ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-07-07-2020
women icon@teamvasundhara
today-horoscope-details-03-07-2020
women icon@teamvasundhara
covid-19-alert---precautions-while-receiving-and-opening-of-online-orders

కరోనా అలర్ట్‌ : ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో తస్మాత్‌ జాగ్రత్త!

ప్రస్తుతం కరోనా మహమ్మారి మన చుట్టూ వై-ఫైలా తిరుగుతున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే సాధారణ జీవితానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ఆర్డర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ద్వారా కూడా కరోనా ముప్పు పొంచి ఉండడమే ఇందుకు కారణం. కొందరు ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ద్వారా కరోనా సోకిన పలు సంఘటనల గురించి మనం ఇదివరకే విన్నాం. కాబట్టి ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసినప్పుడు బయటి నుంచి వచ్చే ఎలాంటి వస్తువులైనా, ఆహారమైనా సరే.. అవి ఇంటికొచ్చాక వాటిని ఓపెన్‌ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. తద్వారా కరోనా ముప్పును మన ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకోవచ్చంటున్నారు. మరి, ఏంటా జాగ్రత్తలు? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
a-tiktoker’s-chapati-face-mask-has-got-the-internet-in-a-frenzy

women icon@teamvasundhara
today-horoscope-details-30-06-2020
women icon@teamvasundhara
nari-kavach-a-specially-designed-ppe-kit-for-women-health-workers

‘కొవిడ్ నారీ కవచ్‌’.. మహిళల కోసం ప్రత్యేకమైన పీపీఈ!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న భూతం. ఈ కంటికి కనిపించని శత్రువుతో ముందుండి పోరాటం చేస్తోంది ఎవరంటే నిస్సందేహంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందే! అయితే కరోనా రోగులకు సేవలందించే క్రమంలో తాము వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు.. వంటివన్నీ వారికి రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా పీపీఈ కిట్లంటే నఖశిఖపర్యంతం శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే డ్రస్‌. ప్యాంట్‌, షర్ట్‌.. వంటి దుస్తులు ధరించే వారికి ఇది వేసుకోవడం అంత కష్టమనిపించదు. కానీ భారతీయ మహిళలు ట్రెడిషనల్‌గా ధరించే చీరలపై దీన్ని వేసుకోవడం వీలు కాదు. ఇలాంటి మహిళల అసౌకర్యాన్ని అర్థం చేసుకున్న ఓ ఇండియన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పీపీఈ కిట్‌ని రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ సూట్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
china-woman-gives-birth-to-twin-sons-10-years-apart

ఈ కవలలిద్దరూ పదేళ్ల గ్యాప్‌తో పుట్టారు!

సాధారణంగా కవలలంటే ఒకే తల్లి కడుపున ఒకేసారి పుట్టే పిల్లలు. అది వారు అమ్మాయిలు కావచ్చు.. అబ్బాయిలు కావచ్చు.. లేదంటే ఒక ఆడ-ఒక మగ శిశువు కూడా జన్మించచ్చు. కానీ పదేళ్ల తేడాతో కవల పిల్లలు జన్మించడం మీరెప్పుడైనా విన్నారా? అదెలా సాధ్యం.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. మీరు విన్నది నిజమే. అలాంటి అరుదైన సంఘటనకు చైనా వేదికైంది. పదేళ్ల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళే.. ఇప్పుడు మరో మగబిడ్డకు తల్లైంది. అలా అయితే వారు కవలలెలా అవుతారు? అసలు పదేళ్ల గ్యాప్‌తో కవలలు పుట్టడమేంటి? మీ సందేహానికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
parenting-lessons-from-fathers-in-telugu

అమ్మే కాదు.. నాన్న కూడా మార్గదర్శే!

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయితే పిల్లలు పుట్టినప్పట్నుంచీ.. పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపే వరకు తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతో, సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వివిధ అంశాలలో తెలివితేటలతో వ్యవహరించడం, భావోద్వేగాల నియంత్రణ, విలువలు ఒంట పట్టించుకోవడం.. మొదలైన విషయాల్లో చిన్నతనం నుంచే పిల్లలు మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర గురించి చర్చిద్దామా..

Know More

women icon@teamvasundhara
corona-virus-twitter-adds-new-search-prompt-to-help-survivors-domestic-violence-in-india

ఈ కొత్త ఫీచర్‌తో గృహహింసపై పోరాటం చేయండి!

కరోనాను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ..ఈ లాక్‌డౌన్‌ మొదలయ్యాక ఇండియాతో పాటు పలు దేశాల్లో గృహహింస బారిన పడుతున్న మహిళల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇండియాలో అయితే లాక్‌డౌన్‌ కాలంలో గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు రెండు రెట్లు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం అఘాయిత్యాలకు గురవుతున్న మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ వేదికను కూడా ఏర్పాటుచేసింది. ఈ పరిస్థితుల్లో గృహహింస బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ మైగ్రో బ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విట్టర్‌ ఇండియా’ కూడా తాజాగా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా గృహహింసకు సంబంధించి అవసరమైన సమాచారం, కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందించేందుకు ప్రత్యేకంగా ‘సెర్చ్‌ ప్రాంప్ట్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
monica-dogra-shares-her-mothers-covid-survivol-story

మీరెవరూ నాలాగా ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదనే ఈ విషయం చెబుతున్నా!

కరోనా... పేరు వింటేనే వెన్నులో వణుకు తెప్పిస్తోన్న ఈ వైరస్‌ ఏ మాత్రం శాంతించడం లేదు. రోజురోజుకీ తన ఉద్ధృతిని పెంచుకుంటూ చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోంది. ఈక్రమంలో బాలీవుడ్‌ నటి, సింగర్‌ మోనికా డోగ్రా తల్లి కూడా కొద్ది రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడింది. ఆస్తమా, బీపీ, మధుమేహం తదితర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న ఆమె ఈ మహమ్మారితో మొండిగా పోరాడి గెలిచింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఈ తల్లీకూతుళ్లిద్దరూ కరోనాకు సంబంధించి తమ అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకున్నారు. వైరస్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తూనే, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఈ మహమ్మారిని జయించవచ్చంటూ బాధితుల్లో సాంత్వన నింపారు.

Know More

women icon@teamvasundhara
pune-teacher’s-innovative-live-stream-classes-win-praise-online

మేడమ్‌... మీ ఐడియా అదిరింది !

అటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా అందరినీ వేధిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల మన జీవన విధానంలో కొన్ని మంచి మార్పులు కూడా చోటుచేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందరూ వినియోగించుకోవడం కూడా మంచి పరిణామమే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. విద్యార్థులూ ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలలు తమ టీచర్లను స్కూళ్లకు రప్పించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తుంటే.. మరికొందరు టీచర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా స్టూడెంట్స్‌ ఇంట్లో ఉన్నా కూడా వారికి తరగతి గది వాతావరణాన్ని కల్పిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అందుకు తాజా ఉదాహరణే పుణేకు చెందిన టీచర్‌ మౌమిత. పిల్లలకు పాఠాలు బోధించడానికి తాను అనుసరించిన ఓ క్రియేటివ్‌ ఐడియా ప్రస్తుతం నెటిజన్ల చేత చప్పట్లు కొట్టిస్తోంది.

Know More

women icon@teamvasundhara
kerala-girl-and-tamil-boy-married-at-state-borders

నడి రోడ్డు పైనే పెళ్లి పీటలెక్కారు !

వందేళ్ల జీవిత ప్రయాణంలో వివాహమనేది ఓ పెద్ద మలుపు. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు నడవాలనుకుంటారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం వివాహం చేసుకునే జంటలకు ఆ అదృష్టం దక్కడం లేదు. సామాజిక దూరం నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండానే చాలా పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వధువు ఒకచోట, వరుడు మరో చోట ఉంటూ ఫోన్‌కే తాళికట్టగా, మరి కొన్ని జంటలు వీడియో కాలింగ్‌ ద్వారా అందరినీ ఆహ్వానించి ‘వర్చువల్‌ వెడ్డింగ్‌’ ద్వారా ఏకమవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా మరో జంట ఇలాగే ఏడడుగులు నడిచింది.

Know More