scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా నా మనోధైర్యాన్ని చంపలేకపోయింది !'

'కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకే భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయట కాలుపెట్టేందుకు సాహసించడం లేదు. ఇక ఒకసారి కరోనా బారిన పడి అదృష్టవశాత్తూ కోలుకున్న వారు ఎంత అప్రమత్తంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి కలలో కూడా ఆ మహమ్మారి దరిదాపులకు పోవాలని అనుకోరు. అలాంటిది కళ్లారా కరోనాను చూసిన ఓ నర్సు మళ్లీ కరోనా బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చింది. కరోనా వేదన ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన ఆమె వైరస్‌ వ్యతిరేక పోరుకు రడీ అంటోంది. మరి మనో ధైర్యంతో మహమ్మారిని ఓడించి మళ్లీ మృత్యుకుహరంలోకి అడుగుపెట్టిన ఆ నర్సు హృదయరాగమేంటో మనమూ విందాం రండి..!'

Know More

Movie Masala

 
category logo

వీరి వివాహానికి అట్టబొమ్మలే అతిథులయ్యారు!

couple replaces relatives with cardboard in lockdown marriage

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌ పేరుతో జనసమూహం గుమిగూడే ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నాయి. ఇక వివాహం లాంటి శుభకార్యాలైతే వాయిదా వేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు చాలామంది. మరీ కాదనుకుంటే తక్కువ మంది సమక్షంలోనే ఏదో మొక్కుబడిగా కార్యం కానిచ్చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ జంటకు కూడా అచ్చంగా ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే ఆ జంట మాత్రం అతిథుల్ని ఆహ్వానించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే ఆ జంట కాస్త భిన్నంగా ఆలోచించి బోలెడంత మంది అతిథుల సమక్షంలో ఒక్కటైంది.  ఈ కరోనా నేపథ్యంలో అదెలా సాధ్యమైంది.. అనేగా మీ సందేహం..? వారి కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రానికి చెందిన అమీ సైమన్సన్‌, స్టగ్లిక్ జంటకు ఇటీవలే వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. అయితే తీరా వివాహ ముహూర్తం దగ్గరపడే సరికి కరోనా మహమ్మారి విజృంభించింది. ఎక్కువ సంఖ్యలో జనాలు ఒకచోట గుమిగూడకుండా ఉండాలని ప్రభుత్వాలు నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జంట వివాహ వేడుకకు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు హాజరుకాకూడదని ఆదేశాలు జారీ చేశారు.

అట్టబొమ్మలే అతిథులుగా..

ప్రతి మనిషి జీవితంలో ఎంతో కీలకమైన వివాహాన్ని ఈ జంట ఎప్పుడూ మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్నారు. కరోనా కారణంగా బంధువులు హాజరు కాలేరని గ్రహించి ఓ సరికొత్త ఆలోచన చేశారు. తమ వివాహానికి ఎంత మందికైతే ఆహ్వానం పంపించారో అన్ని కార్డ్‌బోర్డ్‌ (అట్టముక్క)లను మనుషుల రూపంలో తయారు చేయించారు. ఈ కార్డ్‌బోర్డ్‌లతో ఆడ, మగ, చిన్నారులు, వృద్ధులు.. ఇలా అన్ని ఆకృతుల్లో సిద్ధం చేయించారు.  అయితే వీటి తయారీ కోసం వరుడు ఏకంగా ఓ డిజైనర్‌ను ఆశ్రయించడం ఆసక్తికరమైన విషయం. ఇక పెళ్లి సమయానికి చర్చిలోని బల్లలు, కుర్చీలను ఈ కార్డ్‌బోర్డు అతిథులతో నింపేశారీ లవ్లీ కపుల్‌.

ఖాళీ చర్చిలో వివాహం చేసుకోవాలనుకోలేదు..

ఇక ఈ విషయమై వరుడు స్టగ్లిక్‌ మాట్లాడుతూ.. ‘బంధువులు, స్నేహితులు ఎవరూ లేని ఖాళీ చర్చిలో వివాహం చేసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే సరికొత్తగా ఈ కార్డ్‌బోర్డుల ఆలోచన చేశాను..’ అంటూ మురిసిపోయాడీ కొత్త పెళ్లి కొడుకు.

అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామనుకొని కలలు కన్న ఈ జంటకు కరోనా మహమ్మారి అడ్డుపడినా.. ఓ వినూత్న ఆలోచనతో వెరైటీగా వివాహమాడిందీ అందాల జంట. ఇలా తమ వివాహ వేడుకను ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా చేసుకున్న ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.





women icon@teamvasundhara
up-girl-walks-80km-to-reach-groom-house-ties-nuptial-knot

పెళ్లి కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కొందరేమో తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని ఎలాగోలా లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈక్రమంలో మరోసారి తమ పెళ్లి వాయిదా పడకూడదని ఓ వధువు పెద్ద సాహసమే చేసింది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న వరుడి ఇంటికి నడిచి వెళ్లి మరీ మూడుముళ్లు వేయించుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-live-with-rana

అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!

రానా-మిహీకా బజాజ్‌ ...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ ప్రేమ జంట గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారీ లవ్‌ బర్డ్స్‌. తాజాగా పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే రోకా ఫంక్షన్‌ను కూడా ఘనంగా జరుపుకొన్న ఈ ప్రేమ పక్షులకు ఇక పెళ్లే తరువాయి అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు రానా. వర్చువల్‌గా సాగే ఈ కార్యక్రమంలో తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడీ భళ్లాల దేవుడు. అంతేకాదు మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. మరి ఎంతో ఆసక్తికరంగా సాగిన వీరి సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-dresses-up-in-hippopotamus-costume-to-hug-elderly-mother-in-us-old-age-home

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon@teamvasundhara
karthik-dial-seytha-yenn-brings-back-ye-maya-chesave-memories

‘ఏ మాయ చేసావే’ మళ్లీ వచ్చింది!

‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా...నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?’...ఈ డైలాగ్‌ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ‘ఏమాయ చేసావే’. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ‘మాయ’ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కార్తీక్, జెస్సీల క్యారక్టర్లు ఎంత మ్యాజిక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో ‘విన్నైతండి వరువాయ’ పేరుతో విడుదలైన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య నటించిన పాత్రలను త్రిష, శింబు పోషించిన సంగతి తెలిసిందే. సినీ ప్రేక్షకులను, ప్రత్యేకించి యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అపురూప దృశ్య కావ్యం షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చింది. అప్పటి ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పూర్తిస్థాయి ప్రేమకథను అందించిన బృందమే ఈ మధురమైన చిన్న ప్రేమకథను రూపొందించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-05-2020
women icon@teamvasundhara
heartbroken-woman-sends-cheating-ex-boyfriend-a-tonne-of-onions

ఉల్లిపాయలతో మాజీ ప్రేమికుడికి అలా బుద్ధి చెప్పింది!

‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్‌ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్‌ బ్రేకప్‌ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్‌ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. రియల్‌ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్‌ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్‌ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-05-2020
women icon@teamvasundhara
today-horoscope-details-15-05-2020
women icon@teamvasundhara
corona-virus-elderly-couple-from-newyork-re-unites-for-35-minutes-after-56-days-of-separation

women icon@teamvasundhara
corona-virus-sweden-couple-to-open-world-of-restaurant

women icon@teamvasundhara
celebrate-this-mothers-day-by-giving-these-home-made-surprises
women icon@teamvasundhara
how-to-report-content-in-social-media-platforms

అభ్యంతరకర మెసేజ్‌లా..? అయితే ‘రిపోర్ట్‌’ చేయండిలా..!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేని వ్యక్తిని వెతికి పట్టుకోవడం సులభమేమో కానీ.. సోషల్‌ మీడియాలో ఖాతా లేని వారిని కనిపెట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఖాతాలుండడం గమనార్హం. తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు.. ఇలా ఒక్కటేమిటి ఇతరులకు ఇబ్బంది కలిగించని ఏ విషయమైనా ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. అయితే ఏ సోషల్‌ మీడియా వేదికలోనైనా ఒక కంటెంట్‌ (మెసేజ్‌, ఇమేజ్‌, వీడియో) మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే ఆ పోస్ట్‌ని లేదా ఆ ప్రొఫైల్‌పై ఆ సంస్థకు ఫిర్యాదు చేయచ్చు. దీనినే ‘Report' అంటారు. ఇలా ఏదైనా పోస్ట్‌/ప్రొఫైల్‌పై రిపోర్ట్‌ వస్తే ఆయా యాజమాన్యాలు దానిపై వెంటనే చర్యలు తీసుకుంటాయి.

Know More

women icon@teamvasundhara
corona-virus-kalki-koechlin-richa-chadda-and-amala-campaign-against-rising-domestic-violence-cases-during-lock-down

ఇంకా కొన్ని రోజులే.. పంచుకోండి.. ఒత్తిడి తగ్గించుకోండి!

కరోనా కల్లోలం నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. ఫలితంగా కరోనా కట్టడి మాటేమో కానీ... చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. అదేవిధంగా చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. వృద్ధులూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారందరికీ కొందరు సెలబ్రిటీలు భరోసానిస్తున్నారు. ఈ సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
masaba-gupta-gifted-designed-masks-to-police-officers

ఈ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..!

ప్రపంచ దేశాలకు.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటే.. అత్యవసర విభాగాలకు చెందిన వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిర్విరామంగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం వాళ్లు పడుతోన్న శ్రమను గుర్తించి ఎంతోమంది వివిధ వేదికల ద్వారా వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా పోలీసు అధికారులకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
funny-and-interesting-things-around-marriages-in-lock-down-time

కరోనా కాలం.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

ఒకప్పుడు ఏదైనా ఊహకందని విషయం జరిగితే అంతా వింతగా భావించేవారు.. కలి కాలమనే వారు.. కానీ ఇప్పుడు ‘కరోనా కాలమని’ అంటున్నారు. సమాజంలో జరుగుతోన్న వివిధ సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కార్యక్రమాలు రద్దయ్యాయి.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిశ్చయించిన ముహూర్తానికే ఒక్కటవ్వాలనుకున్న జంటలు మాత్రం ఎలాగోలా పెళ్లితంతును ముగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న జంటల్ని కూడా మనం చూశాం. అలాంటి విభిన్న పెళ్లిళ్లే ఇవి కూడా!

Know More

women icon@teamvasundhara
corona-virus-tollywood-singer-usha-dances-with-her-daughter-for-bareilly-wale-song

పాటల పూదోట.. కాలు కదిపితే ఇలా ఉంటుంది!

సంగీతానికి రాళ్లు కరుగుతాయేమో తెలియదు కానీ.. ఆమె మైక్‌ అందుకుంటే ఎలాంటి హృదయమైనా పరవశించి పోవాల్సిందే. ఇక తన మధురమైన గొంతు నుంచి మెలోడీ పాట వస్తే మరింత మైమరచిపోవాల్సిందే. తన పాటల ప్రవాహంతో అభిమానులను ఓలలాడించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంతో తనను తాను పరిచయం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఆమే నేపథ్య గాయని ఉష. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాలకు తన గొంతును అరువిచ్చిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఆమె మరోసారి తన అభిమానులను పలకరించింది. ఈక్రమంలో ఎప్పుడూ తన తీయటి గొంతుతో అలరించే ఉష.. తాజాగా తన కూతురితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-breaks-her-silence-and-responds-to-the-allegations

మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు కాదు..!

‘నిజం చెప్పులు తొడుక్కునేలోగా.. అబద్ధం ఆరుసార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు’.. ఈ సామెత సింగర్‌ కనికా కపూర్‌ విషయంలో అతికినట్లు సరిపోతుంది. మార్చి నెలలో విదేశాల నుండి వచ్చిన ఈ బాలీవుడ్‌ సింగర్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఆ సమయంలో ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది కనిక. ఇటీవలే ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరిన కనిక ఇక మౌనంగా ఉండి లాభం లేదంటోంది. తనపై వస్తున్న విమర్శలకు మౌనం వహించానంటే దానర్థం తప్పు చేసినట్టు కాదని.. అసలేం జరిగిందో అందరికీ తెలియాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. మరి తన ఆవేదనేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
harmanpreet-stuns-fans-with-mirror-magic

ఈ మిర్రర్‌ మ్యాజిక్‌ గుట్టు విప్పండి చూద్దాం!

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ ధాటికి ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ఇక భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి అన్ని షెడ్యూల్స్‌ రద్దు కావడంతో క్రికెటర్లందరూ ఇంట్లోనే ‘ఆట’విడుపును ఆస్వాదిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తుండగా, మరికొందరు తమ ట్యాలెంట్‌కు పదును పెడుతూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ మ్యాజిక్‌ పజిల్‌ను విసిరి అందరి బుర్రలకు పని పెట్టింది.

Know More

women icon@teamvasundhara
meet-modern-sita-deepika-chikhalia

ఈ చిన్నారి సీతమ్మను చూశారా?

ఈ లాక్‌డౌన్‌ ఖాళీ సమయంలో చాలామంది టైంపాస్‌ కోసం టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకొందరేమో నెట్టింట్లో విహరిస్తూ అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే కాలక్షేపం కోసం టీవీని ఆశ్రయించే ప్రేక్షకులను రంజింపజేయడానికి పలు టీవీ ఛానళ్లు గతంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కొన్ని సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతోన్న నాటి అభిమాన సీరియల్‌ ‘రామాయణ్‌’ కూడా ఒకటి. ఈ సీరియల్‌లోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మనకు కనిపించే సీతారాములెవరంటే ఈ సీరియల్‌లో నటించిన అరుణ్‌ గోవిల్‌ - దీపికా చిఖాలియా అనే అంటారు చాలామంది. అంతలా ఆ పాత్రలకు ప్రాణం పోశారీ ఇద్దరు నటీనటులు. ఇక ఆన్‌స్క్రీన్‌ సీత దీపిక అయితే.. త్రేతాయుగంలో సీత పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిందని చెప్పచ్చు. ఇలా తన నటనతో సీతమ్మను బుల్లితెరపై ఆవిష్కరించిన దీపిక ప్రస్తుతం ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన కుటుంబంతో గడుపుతూనే.. మరోవైపు సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
san-francisco-woman-reunited-with-her-stolen-dog-after-4-months

తన పెంపుడు కుక్కను వెతకడానికి విమానం అద్దెకు తీసుకుంది!

శునకాలు విశ్వాసానికి మారుపేరు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక వాటికి స్నానం చేయించడం దగ్గర్నుంచి ఆహారం పెట్టడం, పడుకోబెట్టడం.. ఇలా ప్రతి విషయంలోనూ వాటిని ఇంట్లో మనుషుల్లాగానే జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అంతేనా.. వాటికి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు పెట్‌ లవర్స్‌. ఇలా తమ పెంపుడు శునకాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడని వారూ ఉంటారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ 31 ఏళ్ల మహిళ కూడా అంతే..! తన పెంపుడు కుక్క కోసం ఏకంగా 1200 డాలర్లు ఖర్చు చేసి ఓ విమానమే అద్దెకు తీసుకుందంటే ఆమెకు తన పెట్‌ అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. మరి, ఈ మహిళ తన పెట్ కోసం ఎందుకంత ఖర్చు చేసింది? పెట్‌ కోసం విమానాన్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అసలేం జరిగింది..? వివరాలు తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే!

Know More

women icon@teamvasundhara
betherealman-challenge-telugu-star-heroes-directors-are-participating-in-household-chores-inspires-many

‘నిజమైన మగాళ్లు’ అనిపించుకుంటున్నారు!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అందరికీ అనుకోని సెలవులొచ్చాయి. దీంతో గత నెల రోజులుగా ఇంటి పట్టునే ఉంటూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారంతా. కానీ, ఇంట్లో ఉండే ఆడవాళ్లకు మాత్రం ఎలాంటి విశ్రాంతీ దొరకట్లేదు. ఇక ఇంటి నుంచి పనిచేసే మహిళల పరిస్థితి మరీ దారుణం అని చెప్పచ్చు. దీనికి తోడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనిమనుషులు, వంట మనుషులు కూడా స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటిస్తుండడంతో.. మహిళలకు పని భారం రెట్టింపైంది. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, అంట్లు తోమడం, బట్టలుతకడం, తోట పని.. ఇలా ఒక్కటేమిటి ఇంట్లో పనులన్నీ చేసే సరికి గృహిణులకు తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. అయితే ఇంటి పనులు చేసే బాధ్యత ఆడవాళ్లతో పాటు మగవాళ్లపై కూడా ఉందని చెబుతున్నారు మన సినీ హీరోలు, దర్శకులు. ఈ క్రమంలో వీళ్లు ఇల్లు శుభ్రం చేయడం దగ్గర్నుంచి వంట చేయడం, అంట్లు తోమడం.. వరకు ప్రతి పనిలోనూ పాల్గొనడంతో పాటు దీనిపై సోషల్‌ మీడియాలో ఒక ఛాలెంజ్‌ను కూడా ప్రారంభించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
corona-virus-you-clap-for-me-now-immigrant-essential-service-workers-solidarity-during-the-pandemic

అలా అనకుండా మీరిప్పుడు చప్పట్లు కొట్టాలి!

ప్రస్తుతం ప్రపంచమంతా ‘కరోనా’ జపం చేస్తోంది. లక్షలాది మందిని బలిగొన్న ఈ మహమ్మారి ఎప్పుడెప్పుడు అంతమైపోతుందా అని కోట్లాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలు దేశాల్లో ఈ వైరస్‌ ఓవైపు మృత్యు తాండవం చేస్తూనే.. మరోవైపు మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నిత్యం యుద్ధాలు, జాత్యహంకార మాటలతో కత్తులు దూసుకునే కొన్ని దేశాలు నేడు ఈ మహమ్మారి కారణంగా ఏకమయ్యాయి. కరోనాపై కలిసి పోరాటం చేద్దామని ముందుకు వస్తున్నాయి. ఇక ఉపాధి కోసం వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా.. కుల, మత, జాతి, వర్గ విభేదాలు చూపించకుండా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతూ అహర్నిశలూ సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈక్రమంలో వారి సేవలను ప్రశంసిస్తూ ‘సచిని’ అనే ఓ మహిళా నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
staying-indoors-people-participating-in-follow-me-to-series

ఇంట్లో ఉంటూనే ‘ఫాలో ఫాలో మీ’ అంటున్నారు!

ఈమధ్య కాలంలో ఫొటోషూట్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులోనూ భార్యభర్తలు, ప్రేమికులకు సంబంధించిన ఫొటోషూట్స్‌లో ఎన్నో రకాల క్రియేటివ్‌ ఫొటోగ్రఫీ స్టిల్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తమకు నచ్చిన అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాల ఎదుట.. తన జీవిత భాగస్వామి చేయి పట్టుకొని ‘నాతో రా’ అంటూ వారిని వాటివైపు తీసుకెళ్తున్నట్లుగా ఉండే ఫొటో స్టిల్‌ మనలో చాలామంది తీయించుకునే ఉంటారు. పెళ్లిళ్లు, హనీమూన్‌కు సంబంధించిన ఫొటోషూట్లలో మనకు ఇలాంటి స్టిల్స్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఫొటోల్లో అమ్మాయి వెనక నుంచి కనిపిస్తే, కేవలం అబ్బాయి చేయి మాత్రమే కనిపించడం మనకు తెలిసిందే. ఈ రకం ఫొటోషూట్స్‌ని ‘Follow Me To’ సిరీస్‌ అంటారు. 2013లో రష్యాకు చెందిన ఓ జంట మొట్టమొదటగా ఈ సిరీస్‌ని ప్రారంభించింది. అయితే కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా ‘Follow Me To Home’ పేరుతో వీళ్లు ఇటీవల ఓ ఆన్‌లైన్‌ కంటెస్ట్‌ పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జంటలు అందులో పాల్గొనడం విశేషం.

Know More

women icon@teamvasundhara
corona-virus-wife-beaters-in-pune-to-be-sent-to-institutional-quarantine

అక్కడ మహిళలను వేధిస్తే క్వారంటైన్‌కే!

ప్రపంచమంతా ముప్పతిప్పలు పెడుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. దీంతో చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లే లాక్‌డౌన్‌ కారణంగా ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దేశం నలుమూలల నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పురుషుల చేతిలో గృహహింసకు లేదా ఇతర వేధింపులకు గురవుతున్న మహిళల కోసం మహారాష్ట్రలోని పుణే జిల్లా పరిషత్తు అధికారులు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
reasons-to-get-negative-emotions-during-lock-down

లాక్‌డౌన్‌ ఒత్తిళ్లు - పరిష్కార మార్గాలు.. మీకోసం!

మనదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వారే స్వయంగా ‘లాక్‌డౌన్‌’ విధించుకుని బంధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది కరోనా. ఈ నేపథ్యంలో కొందరు ఈ సమయాన్ని తమ కోసం, తమ ప్రియమైన వారి కోసం కేటాయించడానికి దొరికిన అవకాశంగా భావిస్తుంటే.. మరికొందరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉన్నా కూడా కొందరు ఒత్తిడికి గురవుతున్నట్లు మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు వారు. ఇంతకీ, ఏంటా కారణాలు? వాటిని పరిష్కరించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-families-enjoying-with-their-innovative-thoughts-in-lock-down-period

వీళ్ళ ఇంట్లోనే బీచ్‌...ఎలాగో తెలుసా?

కరోనా వైరస్‌ విజృంభణతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న కొద్దీ ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. రోజుల తరబడి ఇళ్లకే పరిమితమవుతుండడంతో అందరూ బోర్‌గా ఫీలవుతున్నారు. సాధారణ రోజుల్లో ఎంతో జాలీగా గడిపిన వారంతా ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఈ కల్లోలం నుంచి బయటపడతామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు పరిమితమవుతున్న వారు కొందరైతే.. ఇంటినే తమకు నచ్చినట్లుగా మార్చుకొని ఎంజాయ్ చేస్తున్న వారు మరికొందరు. అలా తమ ఇంటినే తమకు ఇష్టమైన ప్రదేశంగా మార్చుకొని లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తోన్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
tic-tac-toe-is-new-trend-in-social-media

ఈ బామ్మ, మనవరాళ్ల ‘టిక్‌ టాక్‌ టో’ గేమ్‌ చూశారా?

కరోనా మనుషుల మధ్య భౌతికంగా దూరాన్ని పెంచగలిగిందేమో.. కానీ, వారిని మానసికంగా దూరం చేయడంలో మాత్రం విఫలమైందనే చెప్పాలి. వివిధ దేశాల ప్రభుత్వాలు విధిస్తోన్న లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. తమ మధ్య ఉండే ప్రేమానురాగాలు, ఆప్యాయతల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే కలిసి గడపడం వల్ల వారి మధ్య అనుబంధం మరింత రెట్టింపయ్యిందని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ఎన్నో సంఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి/ నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఒక బామ్మ, తన మనవరాలికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
most-searched-things-on-google-in-lock-down-time-during-corona-crisis

వీటి గురించే గూగుల్‌లో తెగ వెతికారట!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో రెండో దశ లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా నెలల తరబడి ఇళ్లలోనే ఉండిపోవడంతో అందరూ బోర్‌గా ఫీలవుతున్నారు. ఈ ఫీలింగ్‌ని అధిగమించడంలో భాగంగా ఇంటర్నెట్‌ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్‌ హోం చేసే వాళ్ల నుంచి.. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ల వరకూ అందరూ గూగుల్‌ తల్లినే ఆశ్రయిస్తున్నారు. మరి, నెటిజన్లంతా ఇలా అనుక్షణం అంతర్జాలంలోనే ఉంటూ ఏం వెతుకుతున్నారు.. అనేగా మీ సందేహం..? ఇదే విషయం గురించి తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ ఇలా చెప్పుకొచ్చింది.. గడిచిన మూడు వారాల లాక్‌డౌన్‌ పిరియడ్‌లో గూగుల్‌లో చాలామంది శోధించిన అంశాలను మన ముందుకు తెచ్చింది.

Know More

women icon@teamvasundhara
deepthi-modugula-giving-c-vitamin-fruits-to-poor-people-by-citrus-500-club
women icon@teamvasundhara
covid-19---doctors-postpone-their-wedding-to-fulfil-their-responsibilities

women icon@teamvasundhara
corona-virus-covid-19-maharashtra-police-shares-a-nursery-rhyme-to-spread-corona-awareness

మీరు కూడా జానీ లాగా ఉంటారుగా!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి భారతదేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ర్టాలకు లకు విస్తరిస్తూ ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా మహారాష్ర్టలో ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పుణె తదితర ప్రాంతాల్లో ఈ వైరస్‌ విశ్వరూపం చూపుతోంది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు బయటకు వచ్చేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలని నిబంధనలు విధించింది. ఇక మహారాష్ర్ట పోలీసులు కూడా కరోనాపై పోరులో భాగస్వాములవుతున్నారు. ప్రజలెవరూ బయటకు రాకుండా కాపలా కాస్తూనే సామాన్య ప్రజల్లో కరోనాపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ర్ట పోలీసులు తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
covid-19-here-are-few-fitness-challenges-you-can-give-a-try-during-quarantine

ప్లాంక్స్‌లో ఎన్నెన్ని స్టైల్సో.. మనమూ ట్రై చేద్దామా?

కరోనా లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో మనం మరిన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండక తప్పదు. ఇందులో భాగంగా బయటకు వెళ్లకుండా రోజుల కొద్దీ ఇంట్లోనే గడపడం చాలామందికి సవాలనే చెప్పాలి. అయితే ఎంతోమంది స్వీయ నిర్బంధం పాటిస్తూనే ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. అంతేకాదు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్వి్ట్టర్‌, టిక్‌టాక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా రకరకాల పేర్లతో ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టిక్‌టాక్‌లో వైరలవుతోన్న ఓ కొత్త ఛాలెంజ్‌ గురించి తెలుసుకుందామా..!

Know More

women icon@teamvasundhara
corona-song-by-andhra-pradesh-additional-sp-kgv-saritha

బయటకు రాకురోయన్న.. కాటేస్తుంది కరోనా..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. తమకు తోచిన విధంగా ఎన్నో మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్‌ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేజీవీ సరిత తన పాట ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసులు ముందున్నారని, యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో గడుపుతుంటే.. తాము మాత్రం కంటికి నిద్ర లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నామంటూ ఎంతో చక్కగా ఆలపించారు. ఈ పాటను మీరు కూడా ఓ సారి వినండి..

Know More

women icon@teamvasundhara
corona-google-and-amul-lauds-medical-workers-and-women-all-rounders

హృదయమున్న ప్రతిచోటా అమ్మ ఉంటుంది...!

కంటికి కనిపించకుండా, కనికరం లేకుండా ప్రపంచమంతా కోరలు చాస్తోంది కరోనా వైరస్‌. ఓవైపు కోట్లాదిమంది ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తూ మహమ్మారిపై సమరం చేస్తుంటే, ఇదే క్రమంలో వైద్య సిబ్బంది ముందుండి వైరస్‌పై పోరాటం సాగిస్తున్నారు. కరోనా బాధితులను కాపాడేందుకు వైద్యులు, నర్సులు కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. విధి నిర్వహణలో నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, వారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌.. డూడుల్‌తో వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక మరోవైపు లాక్‌డౌన్‌ కాలంలో గృహిణిగా, ఉద్యోగినిగా రెండు పనుల్ని సమన్వయం చేసుకుంటూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ‘వర్కింగ్‌ మదర్స్‌’కు తన తాజా డూడుల్‌ను అంకితం చేసింది ప్రముఖ డెయిరీ బ్రాండ్‌ ‘అమూల్‌’.

Know More

women icon@teamvasundhara
covid-19---friends-arranged-virtual-sangeet-party-for-the-couple-during-lockdown
women icon@teamvasundhara
corona-covid-19-ncw-launches-whatsapp-number-to-report-domestic-violence-during-lockdown

గృహహింసా? ఈ నంబర్‌కు వాట్సాప్‌ చేయండి..!

కరోనా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కొందరు మహిళలు ‘గృహహింస’ బారిన పడుతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే..! ఈ విషయాన్ని National Commission for Women (NCW) ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశం నలుమూలల నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయని ఈ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో గృహహింస లేదా ఇతర అఘాయిత్యాలకు గురవుతోన్న మహిళల కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేయడం విశేషం.

Know More

women icon@teamvasundhara
work-from-impact-on-employees-sleep-order-in-lockdown-time

women icon@teamvasundhara
covid-19-lockdown-sri-sri-ravi-sankar-guruji-started-the-letmencook-challenge

మగాళ్లూ.. ఈ లాక్‌డౌన్‌ ఛాలెంజ్‌కి మీరు రడీనా?

వంట.. ఈ పేరు వినగానే అది ఆడవాళ్ల పని కదా అనేస్తుంటారు అందరూ. వంటిల్లంటేనే అది ఆడవాళ్ల రాజ్యమని.. అక్కడికి మగాళ్లకు నో ఎంట్రీ అన్న ధోరణిలో ఉంటారు చాలామంది. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి అభిప్రాయాల్లో పూర్తిగా మార్పులొచ్చాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నందు వల్ల భర్తలు కూడా వంటింట్లో అడపాదడపా వారి పాకశాస్త్ర ప్రావీణ్యం చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోన్న నేపథ్యంలో ఆడవారితో పాటు మగవారు కూడా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మగవారు వంట చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ రవి శంకర్‌ ట్విట్టర్‌ వేదికగా మగవారికి ఓ ఛాలెంజ్‌ని విసిరారు. దీనికి సంబంధించిన ఛాలెంజ్‌ #LetMenCook అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఎందరో మగవాళ్లు తాము కిచెన్‌లో గరిటె తిప్పుతున్న ఫొటోలను ఈ హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా షేర్ చేయడంతో పాటు.. తమ అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. మరి, మగాళ్లను వంటింట్లోకి లాగిన ఈ ఛాలెంజ్‌ గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
healthcare-worker-couple-shares-loving-moment-in-hazmat-suits

ఈ ఫొటో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని పలు దేశాలు లాక్‌డౌన్‌ను ఎంతో పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ఈ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా సామాన్యులు కూడా స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే కరోనాపై యుద్ధంలో ముందుండి పోరాటం సాగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో వైద్య సిబ్బంది. రోగుల నుంచి వైరస్‌ సోకుతుందేమోనన్న భయం వెంటాడుతున్నప్పటికీ కరోనా బాధితులకు ఎంతో ఓపికతో సేవలందిస్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో తమ కారణంగా తెలియకుండానే తమ కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సంక్రమిస్తుందేమోనని కొందరు వైద్యులు నెలల తరబడి తమ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.

Know More

women icon@teamvasundhara
the-changes-occurred-during-covid-19

కరోనా వచ్చె.. మార్పులెన్నో తెచ్చె..!

కరోనా వైరస్‌ పుణ్యమా అని మన జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ పేరుతో ఇలా దేశమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొనడం మన జీవితంలో మునుపెన్నడూ చూసి ఎరగం. అలాగే స్వీయ నిర్బంధం అనే పదం కూడా మనలో చాలామంది విని ఉండరు. కానీ కరోనా కారణంగా మనకు మనమే గృహ నిర్బంధంలో ఉండాల్సిన గడ్డు పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇవే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మందిని బలిగొంటోన్న కరోనా.. ప్రప్రంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. అందులో కొన్ని మనకు మంచి విషయాలు నేర్పిన మార్పులు కూడా ఉన్నాయి. మరి, ఇంతకీ కరోనా మన జీవనశైలిలో తీసుకొచ్చిన మార్పులు-చేర్పులు ఏంటో తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
online-food-delivery-precautions-during-corona-crisis

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!

కరోనా సృష్టిస్తోన్న కల్లోలం ఇప్పట్లో ఆగేలా లేదు. దీని ధాటికి ప్రపంచంలోని దాదాపు చాలా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సాధారణ సమయాల్లోనే ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడానికి అలవాటు పడిన నగర వాసులు ఇప్పుడు కరోనా విజృంభణ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. పోనీ ఇంట్లో/బ్యాచిలర్‌ రూమ్‌ల్లో వంట చేసుకొని తిందామంటే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితులున్నాయి. దాంతో ఇక తప్పని పరిస్థితుల్లోనైనా ఆన్‌లైన్‌లోనే ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసుకుంటున్నారు. అయితే శరవేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్‌ డెలివరీ బాయ్స్‌ ద్వారా కానీ, పార్శిళ్ల ద్వారా కానీ మనదాకా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
american-student-makes-different-masks-for-deaf-people

వారి కోసమే.. నోరు కనిపించే ఈ ప్రత్యేక మాస్కులు!

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న అల్లకల్లోలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా కరోనాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. ఇక ఎన్నడూ లేని విధంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ మాస్కుల్లోనూ ఎన్నో రకాలు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే అవసరం నుంచే ఓ ఆలోచన పుడుతుందన్నట్లు సరికొత్త మాస్కుకు రూపకల్పన చేసింది అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌. ఇంతకీ ఆమె రూపొందించిన ఈ మాస్కుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటనేగా మీ సందేహం? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...!

Know More

women icon@teamvasundhara
what-is-the-reason-behind-14-days-quarantine-why-in-some-cases-14-days-quarantine-is-not-enough

14 రోజుల స్వీయ నిర్బంధం ఎందుకంటే..?

కరోనా.. కంటికి కనిపించదు.. కానీ ప్రపంచామంతా అది చేసే మరణ మృదంగమే వినిపిస్తోంది. ఎవరికి ఏ మాత్రం కాస్త జలుబు, దగ్గు లక్షణాలున్నా అందరూ వారిని చూసి భయపడిపోతున్నారు. ఒకవేళ ఇలాంటి లక్షణాలున్నా లేకపోయినా.. లాక్‌డౌన్‌కు ముందు వరకు దూర ప్రయాణాలు చేసిన వారిని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం పాటించాలంటూ నిపుణులు సూచించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఏమిటీ 14 రోజుల లెక్క? రెండు వారాల స్వీయ నిర్బంధం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నిజానికి కొవిడ్‌ లక్షణాలు ఈ రెండు వారాల్లోనే బయటపడతాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. వీటిన్నింటికి సమాధానాలు ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-corona-warriors-are-putting-their-sincere-efforts-to-serve-society

అందుకే వీళ్లు నిజమైన ‘కరోనా యోధులు’ !

కరోనా విజృంభణను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నాయి. కానీ, ఎక్కువ జనాభా, జనసాంద్రత కలిగిన మన దేశంలో ప్రజలను కరోనా నుంచి కాపాడగలిగే సూత్రం ‘లాక్‌డౌన్‌’ ఒక్కటే..! అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర విభాగాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగులు పగలు, రాత్రి అనే తేడాల్లేకుండా పని చేస్తుంటే.. వారితో పాటు ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు మరికొందరు. ఈ క్రమంలో ఇలాంటి వాళ్ల గురించి, సమాజానికి వారు చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది NITI (National Institution for Transforming India) Aayog సంస్థ. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!

Know More