scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా వల్ల ఉద్యోగం పోయినా.. ఇలా సొంతంగా బతుకుతున్నా!'

'కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోంది. ఇంకెందరికో ఉద్యోగాలు కోల్పోయి ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో అప్పటిదాకా స్వతంత్రంగా బతికిన తాము డబ్బు కోసం మరొకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితి తన వృత్తి జీవితంలోనూ చిచ్చు పెట్టిందని అంటోంది ఓ మహిళ. అయినా అధైర్య పడకుండా సంపాదన కోసం మరో మార్గం వెతుక్కున్నానని, ఈ క్రమంలో నలుగురికి సహాయపడుతూ మరీ సంపాదించడం సంతృప్తిగా అనిపిస్తోందని చెబుతోందామె. ఇలా తన వంతుగా కుటుంబానికి అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందంటూనే.. తన జీవితంలో కరోనా తెచ్చిన కష్టాల గురించి ఇలా మనందరితో పంచుకుంది.'

Know More

Movie Masala

 
category logo

ఇంటా, బయటా గెలుపు ఎలా? నిపుణుల సలహాలు మీకోసం..!

Expert Opinions on Women Empowerment

‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు..’ పెద్దలు. కానీ ఇంతి.. ఓ అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలకు అంకితమవుతూ ఇంట్లో పైచేయి సాధించినప్పటికీ.. బయటికొచ్చే సరికి మాత్రం ఆమె అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు ఎదురుపడుతున్నాయి. ముందుకెళ్లకుండా ఆమె కాళ్లను సంకెళ్లతో బంధించేస్తున్నాయి. అయినా కొందరు మహిళలు వీటిని సమర్థంగా ఎదుర్కొంటూ విజయ తీరాలను చేరుతున్నారు.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. సంపూర్ణ సాధికారతకు నిలువెత్తు రూపంలా ప్రతిబింబిస్తున్నారు.

మరి, సాధికారత అంటే.. ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు.. ఇటు ఇంట్లోని బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే.. అటు వృత్తినీ బ్యాలన్స్‌ చేసుకోవడం, తల్లిగా పిల్లల్ని ఉత్తమంగా తీర్చిదిద్దడం, ఇంటి ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం, ఇలా ఎన్ని పనులతో తీరిక లేకుండా ఉన్నా.. తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని ఆరోగ్యంగా-ఫిట్‌గా మారడం.. ఇలా అతివ అన్ని కోణాల్లో అభివృద్ధి సాధిస్తేనే సంపూర్ణ సాధికారత సాధించినట్లు లెక్క. మరి, అలాంటి పరిపూర్ణ సాధికారత ఎలా సాధ్యమవుతుందనే విషయంపై కొందరు నిపుణులతో చర్చించింది ‘వసుంధర.నెట్‌’. ఈ క్రమంలో ఆయా నిపుణులు అందించిన విలువైన సలహాలు, సూచనలేంటో తెలుసుకొని ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మనమూ సంపూర్ణ సాధికారత దిశగా అడుగేద్దాం రండి..

మన చేతులే చురకత్తులు - లక్ష్మి, సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోచ్‌

womensdayspeicialarticle650-1.jpg

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మహిళా భద్రత ప్రశ్నార్థకంగానే ఉంది. ఇలాంటి సమయంలో మహిళలు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలంటే ఆత్మరక్షణ విద్యలు చాలా అవసరం. మనల్ని మనం రక్షించుకునే నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడు మనం ధైర్యంగా ముందడుగు వేయగలుగుతాం. అలాగే మనం చేసే పనిపై ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. రాత్రీపగలూ అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా అడుగు బయట పెట్టగలిగే ధైర్యం మనలో అలవడుతుంది. అది చిన్న పనైనా, పెద్ద పనైనా మనలో ఆత్మస్థైర్యం ఉన్నప్పుడే చేయగలం.

womensdayspeicialarticle650-2.jpg

ఏదైనా ఆపద ఎదురైనప్పుడు మన బ్యాగ్‌లో పెప్పర్‌ స్ప్రే వంటి ఎమర్జెన్సీ వస్తువులున్నప్పటికీ వాటిని బయటికి తీసే సమయం కూడా ఆ అత్యవసర పరిస్థితిలో మనకు ఉండకపోవచ్చు. అవన్నీ ఉన్నా కూడా మనలో ధైర్యం లేనప్పుడు ఏమీ ఉపయోగించలేం. కాబట్టి ఎప్పుడైతే మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఉంటాయో.. అప్పుడు ఏ ఆపద వచ్చినా మన చేతులే చురకత్తులవుతాయి. వాటితోనే ఎదుటివారి వీక్‌ పాయింట్స్‌పై అటాక్‌ చేయగలుగుతాం. ఈ ఆత్మరక్షణ విద్యల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతాం.. కాబట్టి ఆ ఆపద నుంచి ఈజీగా బయటపడచ్చు. మహిళ తనలోని శక్తిసామర్థ్యాలను గుర్తించి, తనను తాను ప్రేమించుకొని, తన విలువలను తాను కాపాడుకున్నప్పుడు ప్రతి రోజూ విమెన్స్‌ డేనే అవుతుంది.

మన ఆరోగ్యమే కుటుంబ క్షేమం! - క్రిష్ణ శ్రీ, యోగా నిపుణురాలు

womensdayspeicialarticle650-3.jpg

ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఇటు ఇంటి పనుల రీత్యా, అటు వృత్తిపరంగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తమ కోసం అంటూ కాస్త సమయం కూడా కేటాయించుకోలేకపోతున్నారు. కానీ నేటి మహిళలు అన్ని పనులను సమర్థంగా నిర్వర్తించాలంటే ముందు వారు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం గంటల కొద్దీ సమయం కేటాయించాల్సిన పనిలేదు. రోజూ కేవలం అరగంట చొప్పున వ్యాయామానికి కేటాయిస్తే సరిపోతుంది. లేదంటే అరగంట యోగాపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యోగాలో ప్రాణాయామాలు చేయడానికి చాలా తక్కువ సమయం పట్టడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.

ఐదు ప్రాణాయామాలకు ఒక్కో దానికి ఐదు నిమిషాల చొప్పున కేటాయించుకొని, ఆఖరి ఐదు నిమిషాల పాటు సూర్య నమస్కారాలకు కేటాయిస్తే శరీరానికి చక్కటి వ్యాయామం అందుతుంది. శరీరంలోని అన్ని అవయవాలూ శుద్ధి అవుతాయి. అలాగే మానసికంగానూ దృఢంగా మారతాం. కాబట్టి ప్రతి మహిళా యోగాను ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఒకవేళ రోజూ చేయడం వీలు కాని పరిస్థితుల్లో వారానికి కనీసం ఐదు రోజులైనా యోగా చేసేలా ప్రణాళిక వేసుకోవాలి.

womensdayspeicialarticle650-4.jpgఇక ఆహారపుటలవాట్ల విషయానికొస్తే.. ఈ రోజుల్లో చాలామంది భోంచేయడాన్ని కూడా ఏదో పనిలా భావిస్తున్నారు. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా ఐదు నిమిషాల్లోనే గబగబా తినేస్తున్నారు. దీనివల్ల గ్యాస్ట్రిక్‌, అజీర్తి.. వంటి ఎన్నో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి తినడానికి కూడా కాస్త సమయం కేటాయించాలి. కనీసం పావుగంట పాటైనా మనం తీసుకునే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా అరుగుదల బాగుంటుంది.. ఉదర సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఉదయం లేవగానే గోరువెచ్చటి నీరు తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. సాత్వికాహారం.. అందులోనూ ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, స్ప్రౌట్స్‌, సలాడ్స్‌.. వంటివి తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సంస్థలు ఫీమేల్‌ - ఫ్రెండ్లీగా ఉండాలి! - కవితా గూడపాటి, ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్ట్‌

womensdayspeicialarticle650-5.jpg


ఎవరి జీవితంలోనైనా రెండు రకాల సంబంధాలుంటాయి. ఒకటి - ఇంటర్‌పర్సనల్‌ రిలేషన్‌షిప్‌.. అంటే మనకు, ఇతరులతో ఉన్న సంబంధం. రెండోది - ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌షిప్‌.. అంటే మనతో మనకున్న అనుబంధం. ఇది అన్నింటికంటే ముఖ్యమైంది. మహిళలు ఈ పని చేయాలి.. అలా చేయకూడదు.. ఈ ఉద్యోగం చేయాలి.. అంటూ చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. కానీ మహిళలంతా వీటన్నింటినీ పక్కన పెట్టి మనకేం కావాలి అనేది ముందుగా ఆలోచించుకోవాలి. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, కెరీర్‌లో రాణించాలన్నా, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవాలన్నా.. మనతో మనకున్న సంబంధాన్ని దృఢపరచుకోవడం ముఖ్యం. అప్పుడే ఇతరుల అభిప్రాయాల్ని వింటూ మనకేమవసరమో గ్రహించగలుగుతాం.kavitha200.jpg

అలాగే వర్కింగ్‌ మదర్స్‌ ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటే వాళ్లు తమ ఇంటిని, ఉద్యోగాన్నీ అంతగా బ్యాలన్స్‌ చేసుకోగలుగుతారు. సక్సెస్‌ కాగలుగుతారు. భార్యగా, అమ్మగా, ఉద్యోగినిగా.. ఇలా రోజూ మనం ఎన్నో పాత్రల్ని పోషిస్తాం. కాబట్టి వాటికి తగ్గట్లుగా మనల్ని మనం మలచుకుంటూ ఓ ప్లాన్‌ వేసుకుంటే తప్ప వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ సాధ్యం కాదు. ఈ క్రమంలో క్యాలెండర్స్‌ పెట్టుకోవడం, టు-డూ లిస్ట్‌లు పెట్టుకోవడం, జర్నల్‌లో రాసుకోవడం.. ఇలా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించాలంటే ఓ పక్కా ప్రణాళిక ఉండాల్సిందే!womensdayspeicialarticle650-6.jpg

ఇక మహిళలు తమ కెరీర్‌లో సాధికారత సాధించాలంటే తాము పనిచేసే సంస్థల్లో వారికి కొన్ని సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకు.. ఆఫీసుల్లోనే క్రెష్‌ పెట్టడం, పనివేళలు మహిళలకు అనువైన సమయాల్లోనే నిర్దేశించడం, ఇంటి నుంచే పనిచేసే ఆప్షన్లివ్వడం, వారికి కేటాయించే సెలవుల సంఖ్య పెంచడం, వాళ్లకు అనువుగా ఉండేట్లుగా రీ-జాయినింగ్‌ ఆప్షన్లివ్వడం.. వంటివి చేయాలి. అయితే కొన్ని సంస్థలు ఇలాంటి ఆప్షన్లను ఇస్తామని చెబుతున్నారే తప్ప వాటిని ఆచరణలో పెట్టట్లేదు. కాబట్టి కెరీర్‌లో మహిళలు అభివృద్ధి పథంలో పయనించాలంటే ఆయా సంస్థలు ఫీమేల్‌ - ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.

కలిసి పంచుకుంటేనే కలిమి! - చల్లా గీత, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

womensdayspeicialarticle650-7.jpg

ఒక మహిళ తన కెరీర్‌లో బిజీగా ఉండడం వల్ల ఇంట్లో తగిన సమయం కేటాయించలేక బంధాలను కోల్పోతుంది అని చాలామంది భావన. కానీ అది ఒక అపోహ మాత్రమే. అది అందరి జీవితాల్లో నిజం కాదు. కాబట్టి మహిళలు అటు తమ కెరీర్‌లో ముందుకు సాగుతూనే.. ఇటు కుటుంబానికి సమయం ఇవ్వడమనేది 60:40 ప్రిన్సిపుల్‌గా పరిగణిస్తాం. అంటే 60 శాతం కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూ.. 40 శాతం కుటుంబానికి సమయమివ్వాలి. అయితే కొందరు మహిళలు అలా బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడానికీ కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా మహిళలు పనులకు ప్రాధాన్యతనివ్వడంలో విజ్ఞత కోల్పోతున్నారు. అంటే కెరీర్‌లో రాణించాలన్న ఆతృతతో వారికి దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాల్లో తెలియట్లేదు. కొంతమంది మహిళలు పిల్లల బాధ్యతలను తమ అభివృద్ధికి అడ్డంకిగా భావిస్తున్నారు. కానీ మనం ఉద్యోగం చేసేది, డబ్బులు సంపాదించేది మన పిల్లల కోసమే అనే విషయాన్ని గుర్తించాలి. ఈ క్రమంలో వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ అనేది చాలా అవసరం.womensdayspeicialarticle650-9.jpg
అయితే ఒక్కోసారి ఆఫీసులో పని ఒత్తిడి వల్ల మనకు తెలియకుండానే కోపమొచ్చేస్తుంటుంది. ఇలాంటి సమయంలో అతిగా రియాక్ట్‌ కాకుండా కాస్త గ్యాప్‌ తీసుకోవాలి. తద్వారా కోపం తగ్గి ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. ఇలా ప్రతి సందర్భంలోనూ స్పందించే విజ్ఞత అనేది మహిళలు అలవర్చుకోవాలి. తద్వారా ఇంట్లో గొడవలు రావు.. అలాగే అది కెరీర్‌ అయినా, ఏదైనా సరే.. మన కుటుంబం తర్వాతే అన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఉద్యోగం చేసే మహిళలకు తమ కుటుంబ సభ్యులు, భర్త, పిల్లల సపోర్ట్‌ కూడా చాలా అవసరం. భార్యాభర్తలిద్దరూ అన్ని బాధ్యతల్నీ కలిసి పంచుకోవాలి. అన్ని పనుల్నీ కలిసే షేర్‌ చేసుకోవాలి. అప్పుడు పని ఒత్తిడీ తగ్గుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధమూ రెట్టింపవుతుంది.

womensdayspeicialarticle650-8.jpg
ఇంకొంతమంది మహిళలు తాము ఉద్యోగం చేయడం వల్ల ఇంట్లో వారికి తగిన సమయం కేటాయించట్లేదని గిల్ట్‌గా ఫీలవుతుంటారు. కానీ మనం అంతగా కష్టపడేది మన వాళ్ల కోసమేనని గ్రహించాలి. మీకు మరో విషయం తెలుసా.. గృహిణుల కంటే వర్కింగ్‌ మదర్సే తమ పిల్లల్ని బాగా పెంచగలుగుతారని చాలా పరిశోధనల్లో తేలిన నిజం. ఇది చాలామందికి తెలియని సీక్రెట్‌ కూడా! ఎందుకంటే ఉద్యోగాలు చేసే తల్లుల పిల్లలు తమ తల్లుల్నే రోల్‌మోడల్‌గా చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల్ని పరిష్కరించడం, ఉదయాన్నే లేచి నీట్‌గా రడీ అయ్యే విధానం.. ఇలా ప్రతి విషయాన్నీ పిల్లలు తమ తల్లుల్ని చూసే నేర్చుకుంటుంటారు.

ఎంత సంతోషంగా గడిపారన్నదే ముఖ్యం! - మందాడి గౌరీ దేవి, పిల్లల మానసిక నిపుణురాలు

womensdayspeicialarticle650-10.jpg

ఈ కాలపు తల్లులు ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్లు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారని ఫీలవుతుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే కొంతమంది గృహిణులు ఇంట్లో ఉండి కూడా ఇతర బాధ్యతల వల్ల వారి పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోవచ్చు. అయితే తల్లులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలకు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలి. ఈ క్రమంలో తాము పిల్లలతో ఎంత సేపు గడుపుతున్నామన్నది కాకుండా ఎంత సంతోషంగా గడుపుతున్నామన్నది ముఖ్యం. అలాగే తల్లి కూడా తనకంటూ కాస్త సమయం కేటాయించుకొని తనకు నచ్చిన పనుల్ని చేసుకుంటూ సంతోషంగా ఉండగలిగితేనే పిల్లలకు ఆనందాన్నివ్వగలుగుతుంది. ఇక పిల్లలతో సమయం గడపడంలో భాగంగా మీరు పనులు చేస్తూ వారిని అందులో భాగం చేయడం, హోంవర్క్‌ చేయించడం-వారిని చదివించడం.. వంటి పనుల వల్ల మీరు వారితో సమయం గడిపిన వారవుతారు.. అలాగే తన తల్లి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ కాస్త సమయం కేటాయించిందని పిల్లలూ హ్యాపీగా ఫీలవుతారు. ఈ క్రమంలో వారికి స్వయంగా ఆయా పనుల్ని చేసుకునే నేర్పు కూడా అలవడుతుంది. అలాగే వారానికోసారైనా మీరు అలా బజారుకి వెళ్లేటప్పుడు వారిని వెంటబెట్టుకెళ్లడం.. వంటివి చేయాలి. అలాగే అమ్మ ఆఫీసుకెళ్తుంది కాబట్టి మనం కూడా అమ్మకు సహాయపడాలి.. అన్న బాధ్యత చిన్నతనం నుంచే పిల్లలకు అలవడుతుంది. తద్వారా వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దిన వారవుతారు.womensdayspeicialarticle650-11.jpg

ఇక సోషల్‌ మీడియా ఈ కాలపు పిల్లలపై చాలానే ప్రభావం చూపుతుంది. వాటిలో వచ్చే కొన్ని నెగెటివ్‌ వార్తలకు పిల్లలు త్వరగా అట్రాక్ట్‌ అవుతారు. ఇలాంటి వాటి గురించి పిల్లలకు అర్థం చేయించడంలో తల్లిదండ్రులు అస్సలు వెనకాడకూడదు. ఇలాంటి వార్తలు వాళ్లు చూడడం తప్పు అని చెప్పడం కాకుండా దాని గురించి అందరూ కలిసి చర్చించాలి. ఇలా చర్చించాలంటే తల్లులు ముందుగా సోషల్‌ మీడియాపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. లేదంటే నాలెడ్జ్‌ ఉన్న వారి సహాయం తీసుకొని ఆ విషయం గురించి పిల్లలకు తెలియజెప్పాలి. అలా ఓపెన్‌ డిస్కషన్‌ జరగకపోతే ఆ విషయం గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆరాటం పిల్లల్ని తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. ఇలా తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకపోయినా ఇలాంటి అంశాల గురించి అందరూ కలిసి బహిరంగంగా మాట్లాడుకోవడం వల్ల పిల్లలు తప్పుదారి పడతారన్న సమస్యలుండవు.

అవగాహనతోనే ఆర్థిక స్వాతంత్ర్యం! - వంగా రాజేంద్రప్రసాద్‌, ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌

womensdayspeicialarticle650-12.jpg


కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టగల సమర్థులు మహిళలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి సహజసిద్ధంగానే ఆ శక్తి ఉంటుంది. పొదుపులో మహిళలే ఉత్తమం కానీ.. ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే పొదుపు చేస్తే చాలదు.. పెట్టుబడులు కూడా పెట్టాలి.womensdayspeicialarticle650.jpg

ఎందుకంటే పొదుపు చేస్తే రాబడి తక్కువగా ఉంటుంది.. అదే పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల గురించి మహిళలు అవగాహన పెంచుకుంటే పరిపూర్ణ ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించినట్లే! ప్రస్తుతం ఆదాయ మార్గాలు కూడా మెండుగానే ఉన్నాయి కాబట్టి సంపాదన, పొదుపుతో పాటు పెట్టుబడులు పెట్టే స్థాయికి కూడా స్త్రీ ఎదిగినప్పుడే సంపూర్ణ ఆర్థిక సాధికారత సొంతమవుతుంది. ఈ క్రమంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ తానొక్కరే కాకుండా తమ కుటుంబ సభ్యులతో అంటే భర్త, పిల్లలతోనూ చర్చించి తీసుకోవడం మంచిది. ఇలా పిల్లల్నీ ఈ విషయంలో భాగం చేయడం వల్ల వారికీ చిన్నతనం నుంచే ఆర్థిక విషయాలు అర్థమవుతాయి. పొదుపు గురించి కూడా తెలుస్తుంది.

- కె. గౌతమి

women icon@teamvasundhara
new-zealand-to-provide-free-sanitary-products-in-schools-to-fight-period-poverty

ఇకపై అక్కడి అమ్మాయిలకు ఆ సమస్య లేదు !

నెలసరి.. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది మనందరికీ దేవుడు ప్రసాదించిన వరం. దీని కారణంగానే మనకు సంతానోత్పత్తి ప్రాప్తిస్తుంది.. మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగలుగుతున్నాం. అలాంటిది నెలసరి అంటేనే బెంబేలెత్తిపోయే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు. ‘నెలనెలా ఈ బాధ ఆడవారికే ఎందుకిచ్చావ్‌ దేవుడా..’ అనుకునే వారూ లేకపోలేదు. ఇందుకు నెలసరి గురించి వారిలో సరైన అవగాహన లేకపోవడం ఓ కారణమైతే.. ఆ సమయంలో శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేకపోవడం మరో కారణం. అంతేకాదు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా.. వాటిని కొనలేని పేదరికం కూడా చాలా దేశాల్లో అలుముకొని ఉంది. అలాంటి నెలసరి పేదరికాన్ని దూరం చేయడానికి తాజాగా నడుం బిగించింది న్యూజిలాండ్‌ ప్రభుత్వం. ఈ సత్కార్యానికి అక్కడి విద్యార్థినులతోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డ్‌ర్న్‌ తాజాగా ప్రకటించారు.. తన నిర్ణయంతో ప్రపంచ దేశాధినేతలకు ఆదర్శంగా నిలిచారు.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-05-06-2020
women icon@teamvasundhara
celebrities-mourn-kerala-elephant-death-and-demands-stricter-laws-against-animal-cruelty

నిన్ను నమ్మించి గొంతు కోశారు... మమ్మల్ని క్షమించు!

ఆకలి తీర్చుకోవడానికి అడవి నుంచి జనావాసంలోకి వచ్చిన ఆ ఏనుగు ఇక్కడ కూడా కొన్ని మానవ మృగాలుంటాయని కనిపెట్టలేకపోయింది. అందుకే అనాస పండు(పైనాపిల్‌)లో ప్రాణం తీసే పేలుడు పదార్థాలు పెట్టిచ్చినా ఆబగా నోటికందుకుంది. ఆ అనాస తన ఆయుష్షు తీస్తుందని తెలియక అమాయకంగా నోరు, నాలుక, దవడను పూర్తిగా ఛిద్రం చేసుకుంది. ఎంతటి బాధనైనా తట్టుకోగలిగే ఆ భారీకాయం ఆ పేలుడు నొప్పి, మంటకు మాత్రం పసిపాపలా విలవిల్లాడిపోయింది. ఉపశమనం కోసం చల్లటి నీరు దొరికితే బాగుండునని ఊరూరా తిరిగింది. చివరకు ఓ నదిలోకి దిగి వూపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే నోరంతా ఛిద్రం అవ్వడం, ఏమీ తినకపోవడంతో ఆకలితోనే ప్రాణమొదిలింది. భూతల స్వర్గంగా పేరొందిన కేరళలో జరిగిన ఈ ఘోరం ‘మనుషుల్లో మానవత్వం మాయమవుతోంది’ అన్న మాటకు సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే మానవ మృగాల చేతిలో మృత్యువాత పడిన ఆ మూగజీవం గర్భంతో ఉండడం..!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-02-06-2020
women icon@teamvasundhara
dutee-chand-shares-about-her-relationship-and-sister-behavior

నా వరకు అది ప్రేమే.. ఆ అమ్మాయితోనే ఉంటా!

స్వలింగ వివాహాలు.. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ వివాహ వ్యవస్థను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా దేశాల్లోని కొందరు సెలబ్రిటీలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకోవడం కూడా మనం వార్తల్లో చదివాం. అయితే మన దేశంలో మాత్రం స్వలింగ వివాహాలు ఇంకా చట్టబద్ధం కానప్పటికీ.. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గతేడాది భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ తాను ఓ అమ్మాయితో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, తననే పెళ్లి చేసుకోబోతున్నానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ద్యుతి తన బంధం గురించి ధైర్యంగా వెల్లడించడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు పలువురు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ విషయంలో తన సోదరి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన ఆమె తాజాగా ‘ఈటీవీ భారత్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-01-06-2020
women icon@teamvasundhara
anchor-anasuya-dares-to-share-her-period-story

నా తొలి నెలసరి సమయంలో ఏం జరిగిందంటే!

నెలసరి... మహిళలకు సంబంధించిన ఈ సహజ ప్రక్రియ సమయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అనుభవం ఎదురవుతుంది. అయితే వీటి గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఇప్పటికీ రహస్యంగా సైగలు చేసుకుంటారు తప్ప నోరు విప్పరు. ఇలా బహిరంగంగా చెప్పడం వల్ల ఎదుటి వారు ఏమనుకుంటారోనన్న సందేహానికి తోడు సమాజం దీన్ని ఏ రకంగా తీసుకుంటుందోనన్న భయం నెలసరి గురించి నలుగురిలో మాట్లాడడానికి వెనకంజ వేసేలా చేస్తుంది. అయితే మహిళల్లో ఇది కామన్‌గా జరిగే ప్రక్రియ. అలాంటప్పుడు దీని గురించి రహస్యంగా మాట్లాడుకోవడమెందుకు అని ప్రశ్నిస్తోంది టాలీవుడ్‌ యాంకర్‌ అనసూయ. తాజాగా ‘మెన్‌స్ర్టువల్‌ ఎడ్యుకేషన్‌’పై ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఆమె తన తొలి నెలసరి అనుభవం గురించి ధైర్యంగా షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
indian-company-paree-announces-period-leave-on-world-menstrual-hygiene-day

అందుకే ‘పిరియడ్‌ లీవ్‌’ కూడా ఇస్తున్నాయి !

కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల పరిస్థితి ఇది. సాధారణంగా ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు ఈ రోజుల్లో కూడా విధులకు హాజరవక తప్పదు. దాంతో తప్పని పరిస్థితుల్లో నొప్పుల్ని భరిస్తూ మరీ ఉద్యోగానికి వెళ్తుంటారు మహిళలు. అయితే తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రం ఇకపై ఇలాంటి అసౌకర్యం కలిగించొద్దని నిర్ణయించుకుంది ఓ ఇండియన్‌ కంపెనీ. ఈ క్రమంలోనే నెలసరి ప్రారంభమైన మొదటిరోజున వేతనంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
psychiatrist-advice-on-how-to-identify-and-avoid-fraud-people

మాటల మాయలో.. వలపు వలలో.. చిక్కుకోకుండా !

‘పెళ్లి చేసుకుంటాను... నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. - గొర్రెకుంటబావి సంఘటన ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. - ఓ బాధితురాలు ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్‌లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్‌లైన్‌లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే...

Know More

women icon@teamvasundhara
first-period-traditions-in-different-states-on-this-menstrual-hygiene-day

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వివిధ మూఢనమ్మకాలు సంప్రదాయాలు రాజ్యమేలుతుండడం విచారకరం. 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినం' సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
about-menstrual-hygiene-day-facts

నెలసరి సమయంలో పరిశుభ్రతే ధ్యేయంగా..!

ప్రతినెలా వచ్చి పలకరించే రుతుక్రమం కారణంగా ఇండియాలో 20 శాతం మంది అమ్మాయిలు స్కూలుకు గైర్హాజరవుతున్నారట! అంతేకాదు.. బాలికలు స్కూలు మానేయడానికి ఇది రెండో అతిపెద్ద కారణమట. అలాగే ఈ సమయంలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అమ్మాయిలు కూడా చాలామందే ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, ఆడపిల్లలు నెలసరి సమయంలో పరిశుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. తెలియజేసే ఉద్దేశంతోనే ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం' (మెన్‌స్ట్రువల్ హైజీన్ డే) ప్రారంభమైంది. ఏటా మే 28న జరుపుకొనే ఈ రోజు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకొంటున్నారా? అయితే రండి..

Know More

women icon@teamvasundhara
corona-virus-a-child-tries-to-wake-up-dead-mother-at-railway-station

చనిపోయిందని తెలియక ‘అమ్మా.. లే అమ్మా’ అంటూ..!

రెక్కాడితే కానీ డొక్కాడని వలస కార్మికుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చింది కరోనా. లాక్‌డౌన్‌ కారణంగా పొట్ట కూటి కోసం పట్నం వచ్చిన ఈ బడుగు జీవుల బతుకు ప్రశ్నార్థకమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఉన్న చోట ఉపాధి దొరక్క, ఆదరించే దిక్కులేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. చివరకు కనీసం సొంతూరులోనైనా కడుపు నింపుకొందామన్న కొండంత ఆశతో వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన, సైకిళ్ల పైన బయల్దేరి వెళ్తున్నారు. ఇంకొందరైతే మార్గమధ్యంలో దొరికిన ట్రక్కు, లారీ, ఆటోలనో పట్టుకొని సొంతగూటి బాట పడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలామంది ఇంటికి చేరేలోపే వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో వలస కార్మికుల దీన పరిస్థితికి అద్దం పట్టే మరో విషాదకర ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

Know More

women icon@teamvasundhara
assamese-bride-adorns-silk-handloom-mask-for-her-wedding-is-viral-on-social-media

మ్యాచింగ్‌ మాస్కుతో ఈ పెళ్లికూతురు అదుర్స్‌ !

పెళ్లంటే జీవితంలో ఒకేసారి అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. నిశ్చితార్థం మొదలు రిసెప్షన్‌ పూర్తయ్యే వరకూ ఫొటోషూట్స్‌, వీడియోలు అంటూ వధూవరులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా మనువాడబోయే ప్రతి జంటా తమ పెళ్లిని పది కాలాల పాటు నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని కలలు కంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎందరో జంటల పెళ్లి కలలను ఛిద్రం చేస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కాస్తా ఏదో తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారు పెద్దలు. దీనికి తోడు పెళ్లి ముస్తాబులో నూతన వధూవరులు ఒకరినొకరు కళ్లారా చూసుకోకుండా మాస్కులు అడ్డుపడుతున్నాయి. అయితే మాస్కులు ధరించామన్న భావనే కలగకుండా దాన్నీ ఓ పెళ్లి కాస్ట్యూమ్‌గా చేసుకుంటే బాగుంటుందనుకున్నట్లుంది ఈ అస్సామీ నవ వధువు. పెళ్లి దుస్తులకు మ్యాచయ్యే విధంగా మాస్క్‌ను డిజైన్‌ చేయించుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వధువు ఫొటోలు చూసి నెటిజన్లు సైతం వావ్‌ అంటూ ఈ కొత్త పెళ్లి కూతురి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
up-girl-walks-80km-to-reach-groom-house-ties-nuptial-knot

పెళ్లి కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. కొందరేమో తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి ముహూర్తం మళ్లీ రాదని ఎలాగోలా లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈక్రమంలో మరోసారి తమ పెళ్లి వాయిదా పడకూడదని ఓ వధువు పెద్ద సాహసమే చేసింది. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న వరుడి ఇంటికి నడిచి వెళ్లి మరీ మూడుముళ్లు వేయించుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-live-with-rana

అంతా ఆరు నిమిషాల్లో అయిపోయిందమ్మా..!

రానా-మిహీకా బజాజ్‌ ...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఈ ప్రేమ జంట గురించే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారీ లవ్‌ బర్డ్స్‌. తాజాగా పెళ్లికి ముందు సంప్రదాయంగా నిర్వహించే రోకా ఫంక్షన్‌ను కూడా ఘనంగా జరుపుకొన్న ఈ ప్రేమ పక్షులకు ఇక పెళ్లే తరువాయి అని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో మంచు లక్ష్మి నిర్వహిస్తోన్న ‘లాక్డ్‌ అప్‌ విత్‌ లక్ష్మి’ లైవ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాడు రానా. వర్చువల్‌గా సాగే ఈ కార్యక్రమంలో తన ప్రేమకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడీ భళ్లాల దేవుడు. అంతేకాదు మంచు లక్ష్మి అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చాడు. మరి ఎంతో ఆసక్తికరంగా సాగిన వీరి సంభాషణపై మీరూ ఓ లుక్కేయండి!

Know More

women icon@teamvasundhara
corona-virus-woman-dresses-up-in-hippopotamus-costume-to-hug-elderly-mother-in-us-old-age-home

అమ్మను ఆప్యాయంగా హత్తుకునేందుకు ఈ మహిళ ఏం చేసిందంటే!

కరోనా... అటు శారీరకంగా, ఇటు మానసికంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోన్న వైరస్‌. మనుషుల మధ్య సామాజిక దూరాన్ని తీసుకొచ్చిన ఈ మహమ్మారి కారణంగా కనీసం కుటుంబ సభ్యులతో కూడా దగ్గరగా ఉండలేని దీన పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో తెలియని ఈ వైరస్‌ భయంతో సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు దూరంగా ఉంటున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో దూరంగా ఉన్న తన తల్లిని కలుసుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది అమెరికాకు చెందిన ఓ మహిళ. ఇందులో భాగంగా హిప్పోపొటామస్‌ (నీటి గుర్రం) కాస్ట్యూమ్‌ ధరించిన ఆమె సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తన తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది.

Know More

women icon@teamvasundhara
karthik-dial-seytha-yenn-brings-back-ye-maya-chesave-memories

‘ఏ మాయ చేసావే’ మళ్లీ వచ్చింది!

‘ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా...నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను?’...ఈ డైలాగ్‌ వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమా ‘ఏమాయ చేసావే’. సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిజంగానే ‘మాయ’ చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కార్తీక్, జెస్సీల క్యారక్టర్లు ఎంత మ్యాజిక్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో ‘విన్నైతండి వరువాయ’ పేరుతో విడుదలైన ఈ చిత్రంలో సమంత, నాగచైతన్య నటించిన పాత్రలను త్రిష, శింబు పోషించిన సంగతి తెలిసిందే. సినీ ప్రేక్షకులను, ప్రత్యేకించి యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ అపురూప దృశ్య కావ్యం షార్ట్‌ ఫిల్మ్‌ రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చింది. అప్పటి ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పూర్తిస్థాయి ప్రేమకథను అందించిన బృందమే ఈ మధురమైన చిన్న ప్రేమకథను రూపొందించడం విశేషం.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-21-05-2020
women icon@teamvasundhara
heartbroken-woman-sends-cheating-ex-boyfriend-a-tonne-of-onions

ఉల్లిపాయలతో మాజీ ప్రేమికుడికి అలా బుద్ధి చెప్పింది!

‘ఏం చేస్తాం? అమ్మాయిలం! జెన్యూన్‌గా లవ్‌ చేయడం తప్ప మాకేం తెలుసు’ ...‘నేను శైలజ’ సినిమాలో లవర్‌ బ్రేకప్‌ చెప్పాడని ధన్యా బాలక్రిష్ణన్‌ అమాయకంగా కన్నీరుమున్నీరవుతూ చెప్పే ఈ డైలాగ్‌ చాలా ఫేమస్‌ అయింది. రియల్‌ లైఫ్‌లో కూడా ప్రియుడు ఉన్నట్లుండి బ్రేకప్‌ చెబితే ఏ అమ్మాయి అయినా ఇలాగే కన్నీరుమున్నీరవుతుంది. తనలో తాను మధనపడుతూ కుమిలిపోతుంది. ఇంకొందరు ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడమో, కోర్టు మెట్లెక్కడమో చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ యువతి మాత్రం తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియుడికి విభిన్నంగా బుద్ధి చెప్పింది. ఇందులో భాగంగా అతడికి 1000కిలోల ఉల్లిపాయలు హోం డెలివరీ చేసింది. వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఉల్లిపాయల బ్రేకప్‌ స్టోరీ వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-05-2020
women icon@teamvasundhara
today-horoscope-details-15-05-2020
women icon@teamvasundhara
corona-virus-elderly-couple-from-newyork-re-unites-for-35-minutes-after-56-days-of-separation

women icon@teamvasundhara
corona-virus-sweden-couple-to-open-world-of-restaurant

women icon@teamvasundhara
celebrate-this-mothers-day-by-giving-these-home-made-surprises
women icon@teamvasundhara
how-to-report-content-in-social-media-platforms

అభ్యంతరకర మెసేజ్‌లా..? అయితే ‘రిపోర్ట్‌’ చేయండిలా..!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేని వ్యక్తిని వెతికి పట్టుకోవడం సులభమేమో కానీ.. సోషల్‌ మీడియాలో ఖాతా లేని వారిని కనిపెట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఖాతాలుండడం గమనార్హం. తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, సూచనలు.. ఇలా ఒక్కటేమిటి ఇతరులకు ఇబ్బంది కలిగించని ఏ విషయమైనా ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. అయితే ఏ సోషల్‌ మీడియా వేదికలోనైనా ఒక కంటెంట్‌ (మెసేజ్‌, ఇమేజ్‌, వీడియో) మీకు అభ్యంతరకరంగా అనిపిస్తే వెంటనే ఆ పోస్ట్‌ని లేదా ఆ ప్రొఫైల్‌పై ఆ సంస్థకు ఫిర్యాదు చేయచ్చు. దీనినే ‘Report' అంటారు. ఇలా ఏదైనా పోస్ట్‌/ప్రొఫైల్‌పై రిపోర్ట్‌ వస్తే ఆయా యాజమాన్యాలు దానిపై వెంటనే చర్యలు తీసుకుంటాయి.

Know More

women icon@teamvasundhara
corona-virus-kalki-koechlin-richa-chadda-and-amala-campaign-against-rising-domestic-violence-cases-during-lock-down

ఇంకా కొన్ని రోజులే.. పంచుకోండి.. ఒత్తిడి తగ్గించుకోండి!

కరోనా కల్లోలం నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. ఫలితంగా కరోనా కట్టడి మాటేమో కానీ... చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కాలంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లే ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. అదేవిధంగా చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. వృద్ధులూ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారందరికీ కొందరు సెలబ్రిటీలు భరోసానిస్తున్నారు. ఈ సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు.

Know More

women icon@teamvasundhara
masaba-gupta-gifted-designed-masks-to-police-officers

ఈ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..!

ప్రపంచ దేశాలకు.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటే.. అత్యవసర విభాగాలకు చెందిన వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిర్విరామంగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం వాళ్లు పడుతోన్న శ్రమను గుర్తించి ఎంతోమంది వివిధ వేదికల ద్వారా వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా పోలీసు అధికారులకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon@teamvasundhara
funny-and-interesting-things-around-marriages-in-lock-down-time

కరోనా కాలం.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

ఒకప్పుడు ఏదైనా ఊహకందని విషయం జరిగితే అంతా వింతగా భావించేవారు.. కలి కాలమనే వారు.. కానీ ఇప్పుడు ‘కరోనా కాలమని’ అంటున్నారు. సమాజంలో జరుగుతోన్న వివిధ సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కార్యక్రమాలు రద్దయ్యాయి.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిశ్చయించిన ముహూర్తానికే ఒక్కటవ్వాలనుకున్న జంటలు మాత్రం ఎలాగోలా పెళ్లితంతును ముగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న జంటల్ని కూడా మనం చూశాం. అలాంటి విభిన్న పెళ్లిళ్లే ఇవి కూడా!

Know More

women icon@teamvasundhara
corona-virus-tollywood-singer-usha-dances-with-her-daughter-for-bareilly-wale-song

పాటల పూదోట.. కాలు కదిపితే ఇలా ఉంటుంది!

సంగీతానికి రాళ్లు కరుగుతాయేమో తెలియదు కానీ.. ఆమె మైక్‌ అందుకుంటే ఎలాంటి హృదయమైనా పరవశించి పోవాల్సిందే. ఇక తన మధురమైన గొంతు నుంచి మెలోడీ పాట వస్తే మరింత మైమరచిపోవాల్సిందే. తన పాటల ప్రవాహంతో అభిమానులను ఓలలాడించడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంతో తనను తాను పరిచయం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఆమే నేపథ్య గాయని ఉష. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రాలకు తన గొంతును అరువిచ్చిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఆమె మరోసారి తన అభిమానులను పలకరించింది. ఈక్రమంలో ఎప్పుడూ తన తీయటి గొంతుతో అలరించే ఉష.. తాజాగా తన కూతురితో కలిసి ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-breaks-her-silence-and-responds-to-the-allegations

మౌనంగా ఉంటే తప్పు చేసినట్లు కాదు..!

‘నిజం చెప్పులు తొడుక్కునేలోగా.. అబద్ధం ఆరుసార్లు ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు’.. ఈ సామెత సింగర్‌ కనికా కపూర్‌ విషయంలో అతికినట్లు సరిపోతుంది. మార్చి నెలలో విదేశాల నుండి వచ్చిన ఈ బాలీవుడ్‌ సింగర్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఆ సమయంలో ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది కనిక. ఇటీవలే ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరిన కనిక ఇక మౌనంగా ఉండి లాభం లేదంటోంది. తనపై వస్తున్న విమర్శలకు మౌనం వహించానంటే దానర్థం తప్పు చేసినట్టు కాదని.. అసలేం జరిగిందో అందరికీ తెలియాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. మరి తన ఆవేదనేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
harmanpreet-stuns-fans-with-mirror-magic

ఈ మిర్రర్‌ మ్యాజిక్‌ గుట్టు విప్పండి చూద్దాం!

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్‌ ధాటికి ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయ క్రీడా టోర్నీలు సైతం వాయిదా పడ్డాయి. ఇక భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి అన్ని షెడ్యూల్స్‌ రద్దు కావడంతో క్రికెటర్లందరూ ఇంట్లోనే ‘ఆట’విడుపును ఆస్వాదిస్తున్నారు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమానులతో ముచ్చటిస్తుండగా, మరికొందరు తమ ట్యాలెంట్‌కు పదును పెడుతూ రకరకాల ఛాలెంజ్‌లను విసురుతున్నారు. ఈక్రమంలో భారత మహిళల క్రికెట్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ఓ మ్యాజిక్‌ పజిల్‌ను విసిరి అందరి బుర్రలకు పని పెట్టింది.

Know More

women icon@teamvasundhara
meet-modern-sita-deepika-chikhalia

ఈ చిన్నారి సీతమ్మను చూశారా?

ఈ లాక్‌డౌన్‌ ఖాళీ సమయంలో చాలామంది టైంపాస్‌ కోసం టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకొందరేమో నెట్టింట్లో విహరిస్తూ అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే కాలక్షేపం కోసం టీవీని ఆశ్రయించే ప్రేక్షకులను రంజింపజేయడానికి పలు టీవీ ఛానళ్లు గతంలో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కొన్ని సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తున్నాయి. అలాంటి వాటిలో ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతోన్న నాటి అభిమాన సీరియల్‌ ‘రామాయణ్‌’ కూడా ఒకటి. ఈ సీరియల్‌లోని పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశాయని చెప్పడం అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా మనకు కనిపించే సీతారాములెవరంటే ఈ సీరియల్‌లో నటించిన అరుణ్‌ గోవిల్‌ - దీపికా చిఖాలియా అనే అంటారు చాలామంది. అంతలా ఆ పాత్రలకు ప్రాణం పోశారీ ఇద్దరు నటీనటులు. ఇక ఆన్‌స్క్రీన్‌ సీత దీపిక అయితే.. త్రేతాయుగంలో సీత పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించిందని చెప్పచ్చు. ఇలా తన నటనతో సీతమ్మను బుల్లితెరపై ఆవిష్కరించిన దీపిక ప్రస్తుతం ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన కుటుంబంతో గడుపుతూనే.. మరోవైపు సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకున్నారు.

Know More