scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు గర్భాశయం లేదని అప్పుడే తెలిసింది!'

'పన్నెండేళ్లు దాటాయంటే అమ్మాయిలకు నెలసరి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నిజానికి ఈ సమయంలో ఎలా స్పందించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియదు.. పైగా ఏదో తెలియని బెరుకు వారిని ఆవహిస్తుంటుంది. అయినా తమ తల్లుల సహకారంతో వాటిని దాటుకొని యుక్తవయసులోకి అడుగుపెడతారు అమ్మాయిలు. తన ఫస్ట్‌ పిరియడ్‌ కోసం ఓ అమ్మాయి కూడా ఇలాగే ఎదురుచూసింది. కానీ ఏళ్లు గడుస్తోన్నా నెలసరి మాత్రం తనను పలకరించలేదు. దీనికి కారణం తన శరీరంలో ఓ అరుదైన లోపమే అని తెలుసుకున్న ఆమె ఏళ్ల పాటు చీకట్లోనే మగ్గింది. ‘కానీ ఇలా ఎంతకాలం’ అంటూ ఆ చీకట్లను చీల్చుకొని వెలుగు రేఖలా బయటికొచ్చింది. ఈ క్రమంలో తనలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో రోల్‌మోడల్‌గా మారిందామె. ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుందంటోన్న ఆమె తన కథను పంచుకోవడానికి ఇప్పుడిలా మనందరి ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

నిర్భయంగా ఉండాలంటే.. ఆయుధం పట్టాల్సిందే !

Women Self Defence Tools

ఆడవారి కోసం ఎన్ని ‘నిర్భయ’ చట్టాలు తీసుకొచ్చినా... ఎన్ని విధాలుగానో సమాజానికి ‘దిశా’ నిర్దేశం చేసినా... స్త్రీలపై అఘాయిత్యాలు మటుకు ఆగడం లేదు. ఈక్రమంలో స్త్రీలకు రక్షణ ఎవరిస్తారు ? అంటే... తండ్రినో, సోదరుడినో వెంటబెట్టుకెళ్లమంటున్నారు. లేదంటే ఆపదలో ఉన్నప్పుడు వందకు ఫోన్‌ చేయమంటున్నారు. నిర్భయ ఉదంతంలో పక్కనే కావాల్సిన వారు ఉన్నా కాపాడలేకపోయారు. అటువంటిది ఏ సమయం ఎలాంటిదో ఎవరు చెప్పగలరు. కాబట్టి ఒక స్త్రీ తన రక్షణ తానే చూసుకోవాలి. స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్న మృగాలను ఆయుధంతోనే ఎదుర్కోవాలి. ఇది హింసను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ కాదు. ఆత్మ రక్షణ నేర్పడం మాత్రమే ! మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంచుకునేందుకే ఇవి వస్తువులు కాదు.. ఆత్మరక్షణ ఆయుధాలు... ! వీటిని వెంటబెట్టుకెళ్లండి !

womensafetytools650-2.jpg
టచ్‌ చేస్తే గుచ్చాల్సిందే !
ఈరోజుల్లో చాలామంది స్త్రీలు ప్రయాణం చేయాలంటేనే సంకోచిస్తున్నారు. అందుకు కారణం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవల మెట్రో ట్రైన్‌లో ఆడవారికి కేటాయించిన కోచ్‌లో మగవారు చేరి అల్లరి చేస్తుంటే పోలీసులు అరెస్ట్‌ చేసిన ఉదంతాలు చాలు ఎందుకు సంకోచిస్తున్నారో చెప్పడానికి. ఇలా ఆటోల్లో, బస్సుల్లో అన్న తేడా లేకుండా సందర్భాన్ని బట్టి ఆడవారిపై చేయి వేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది మగవారు. ఈక్రమంలో కొంతమంది స్త్రీలు తమ వద్ద ఉండే సేఫ్టీ పిన్స్‌ను ఆయుధాలుగా మలచుకుంటున్నారు. ఎవరైనా తమను తడమాలని చూస్తే వాటితో వారిని గుచ్చుతున్నారు. ఇక కొంతమంది యువతులైతే జపాన్‌ బ్లేడ్స్‌ (క్రాఫ్ట్‌ బ్లేడ్స్‌)ను తమ ప్రాజెక్ట్‌ వర్క్‌ కోసమే కాకుండా తమను తడమాలనుకుంటున్న ఆకతాయిల వేళ్లను కోసేందుకు కూడా వాడుతున్నారు. కేవలం సేఫ్టీ పిన్స్‌, క్రాఫ్ట్‌ బ్లేడ్స్‌ మాత్రమే కాదు జామెట్రీ బాక్స్‌లోని కంపాస్‌లను కూడా తమ మాన రక్షణకు వాడుతున్నారు అమ్మాయిలు. మరి మీకింకా ఈ టెక్నిక్స్‌ తెలియకపోతే మీరూ వీటిని వెంటబెట్టుకెళ్లండి. ఏ మూలన ఏ మృగం ఉందో ఎవరికి తెలుసు !

womensafetytools650-3.jpg
హై హీల్స్‌ను ఇలా కూడా వాడొచ్చు... తెలుసా !
ఆపద సంభవించినప్పుడు ఆత్మరక్షణకు దగ్గరలో ఉన్న దేన్నైనా ఆయుధంగా మలచుకునే నేర్పు ఉండాలి. అందుకు మీ హై హీల్స్‌తో చిన్నపాటి ప్రాక్టీస్‌ చేస్తే వాటినే ఓ ఆయుధంలా మలచుకోవచ్చు. అదెలాగంటే... మార్షల్‌ ఆర్ట్స్‌లో కాలితో కొట్టే కొన్ని కిక్స్‌ ఉంటాయి. నిపుణులను కలిస్తే పెద్దగా కష్టపడకుండా రెండు మూడు సింపుల్‌ కిక్స్‌ను వారు నేర్పుతారు. హీల్స్‌ వేసుకొని తరచూ వాటిని ఓ పది నిమిషాలు ప్రాక్టీస్‌ చేస్తే ఆపద సమయంలో అర్జునుడి బాణంలా మీ పాద రక్షలే మీకు ఉపయోగపడగలవు. కనీసం ప్రాక్టీస్‌ లేకపోయినా హై హీల్స్‌ వేసుకున్న కాలితో మీపై దాడి చేసిన వాడి కాలిపై ఒక్క తన్ను తన్నినా అతడు తేరుకునే లోపు మీరు పరిగెత్తవచ్చు. అయితే ఇటువంటి టెక్నిక్స్‌ ప్రదర్శించేటప్పుడు భయపడకుండా కాస్తంత సమయస్ఫూర్తి చూపిస్తే చాలు.

womensafetytools650-4.jpg
తాళాలే మీ పంజా దెబ్బ !
మీపై ఎగబడే మృగాన్ని ఎదుర్కోవడానికి మీ బండి తాళాలనే మీ పంజాగా మార్చుకోవచ్చు. అవును ! మీపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని చిన్న తాళం చెవితో మూర్ఛబోయేలా చేయొచ్చు. అదే ‘హ్యామర్‌ స్ట్రైక్‌’. అంటే మీ బండి లేక కారు తాళం చెవిని పిడికిట్లో గట్టిగా బిగబట్టి దాని పదునైన భాగం బయటకు ఉండేలా చూసుకోవాలి. అది ఎదుటి వ్యక్తికి కనబడకుండా జాగ్రత్తపడాలి. అతడు మీపై దాడికి దిగబడ్డప్పుడు సుత్తిని పైకి లేపి కొట్టినట్లు దానితో అతడి మెడపై ఒక్క దెబ్బతో దాడి చేయాలి. లేదా రెండు మూడు తాళం చెవులుంటే వాటిని వేళ్ల మధ్యలో గట్టిగా ఉంచుకొని మీపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తి ముఖంపై పంజాలా విసరొచ్చు. ఇక మీ వద్ద ఒక పొడవాటి ఇనుప కీచైనే కనుక ఉంటే దాన్ని ఓ నాన్‌చాక్‌లా అతడి ముఖంపై కూడా ఝులిపించవచ్చు.

womensafetytools650-5.jpg
షాక్‌ అంటే ఇలా ఉండాలి !
ఆత్మ రక్షణ కోసం స్త్రీలు తమ హ్యాండ్‌ బ్యాగ్‌లో తప్పక ఉంచుకోదగిన వాటిలో స్టన్‌ గన్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే కాస్త ప్రయాస పడి పోలీసుల నుంచి వాటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అంత సాధారణంగా లభించవు. వీటి ద్వారా ప్రసరించే విద్యుత్తుకు ఎదుటివారు అక్కడికక్కడే మూర్ఛబోతారు. అందుకే పోలీసులను సంప్రదించి వాటిని కొనుగోలు చేయాలి. ఒక్క సెకండ్‌లో కొన్ని లక్షల వోల్ట్స్‌ను ప్రసరించే స్టన్‌గన్స్‌ కూడా లభిస్తాయి. టార్చ్‌లైట్‌లా ఉండే వీటితో మీపై దాడి చేయడానికి వచ్చిన వారికి బటన్‌ ప్రెస్‌ చేసి ఒక్క క్షణం ఆనిస్తే చాలు... అతడి వికెట్‌ డౌన్‌ అయినట్లే ! అక్కడికక్కడే అతడు మూర్ఛబోవడం ఖాయం. పాశ్చాత్య దేశాల్లోని పోలీసులు ఎక్కువగా ఇటువంటి స్టన్‌గన్స్‌లను వాడుతుంటారు.

womensafetytools650-6.jpg
పేరుకే దువ్వెనలు, పెన్నులు !
ఆత్మరక్షణకు ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాల దువ్వెనలు, పెన్నులు అందుబాటులో ఉన్నాయి. అదేంటి ? వాటితో ఆత్మరక్షణ ఎలా సాధ్యమవుతుంది ? అనుకుంటారేమో ! చూడ్డానికి మామూలు పెన్నులు, దువ్వెనల మాదిరిగా ఉండే వీటిలో చిన్నపాటి కత్తిని ప్రవేశపడతారు తయారీదారులు.

womensafetytools650-6-1.jpg

కామంతో ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడని మానవ మృగాలను ఎదుర్కొనేందుకు ఈ వస్తువులు... కాదు... కాదు... ఈ ఆయుధాలే కరెక్ట్‌ అనడంలో ఎంతమాత్రం తప్పు లేదు. ఎప్పుడూ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకుంటూ అవసరమైనప్పుడు దువ్వుకునేందుకు, రాసుకునేందుకు వాడే ఈ దువ్వెనలనూ, పెన్నులనూ ఆపద సమయంలో ఆత్మరక్షణ కోసం కూడా వాడుకోవచ్చు.

womensafetytools650-7.jpg
వీటిని ప్రత్యేకంగా కొనండి !
మీరు నిత్యం తీసుకెళ్లే పుస్తకాలు, చేతి గ్లోవ్స్‌, కీ చెయిన్స్‌ కూడా మీ ఆత్మరక్షణలో భాగమవ్వొచ్చు. ఎలాగంటారా ? కేవలం అత్యాచారాలు మాత్రమే కాదు.. ఇతరత్రా వివిధ సందర్భాలలో కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒంటి మీది నగల కోసం కూడా స్త్రీలపైన దాడులు జరుగుతుంటాయి. ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తూ ఒంటి మీద నగల వల్ల ఆపద వస్తుందేమో అనుకుంటే... వాటిని ఓ పుస్తకంలో దాచుకోవచ్చు ! పుస్తకం అంటే సాధారణ పుస్తకం కాదు. పైకే పుస్తకంలా ఉంటుంది కానీ లోన పేజీలు లేకుండా నగలు పట్టే స్పేస్‌ ఉంటుంది. ఆ స్పేస్‌లో చిన్నపాటి ఆయుధాలను కూడా దాచుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ సౌకర్యం కోసమే ఇటువంటి పుస్తకాలను రూపొందించారు తయారీదారులు. ఇక ఎవరైనా మీపై దాడి చేయడానికి వస్తే ఒట్టి చేతులతో కొడితే ఏం సరిపోతుంది చెప్పండి. మీ పిడికిలికి కాస్త వెయిట్‌ జోడిస్తే ఆ పంచ్‌ పవరే వేరు. అందుకే ఈ హార్డ్‌ నకుల్‌ గ్లౌజ్‌లు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో పోలీసులు ఇటువంటి వాటిని వాడతారు. ఈ గ్లౌజ్‌ల్లో మెటికల వద్ద ఎదుటివారి ఎముకలు విరగ్గొట్టేంత గట్టిగా ఉంటుంది. వీటిని ధరించి దాడికి వచ్చిన వారి ముఖం మీద ఒక్క పిడిగుద్దు గుద్దితే ముక్కు పగిలి పళ్లు రాలిపోవాల్సిందే ! వీటితో పాటు భారీ శబ్దం చేసే కొన్ని కీ చెయిన్స్‌ కూడా మార్కె్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఆపద సంభవించబోతున్న సమయంలో బటన్‌ నొక్కితే చాలు, చాలా దూరం వరకూ ఆ శబ్దం వినపడి మీకు సహాయం అందే అవకాశం ఉంది. అసలు కొంతమంది ఆ శబ్దం వినే పారిపోయినా ఆశ్చర్యం లేదు.

womensafetytools650-8.jpg
ఆత్మరక్షణకు బ్రహ్మాస్త్రం !
పైవన్నీ ఉన్నా లేకపోయినా ఈరోజుల్లో స్త్రీలందరూ తప్పక వెంటబెట్టుకెళ్లాల్సిన ఆయుధం పెప్పర్‌ స్ప్రే. అందుకే ఈ కాలంలో చాలామంది అమ్మాయిలు తమ స్నేహితురాళ్లకు వీటిని గిఫ్ట్స్‌గా కూడా ఇస్తున్నారు. ఇలా ఇటీవల ఒకమ్మాయి తన స్నేహితురాలి నుంచి పెప్పర్‌ స్ప్రేను గిఫ్ట్‌గా పొంది ఓ రాత్రి ఓ మృగం నుంచి తప్పించుకోగలిగింది కూడా ! ఇక ఇటీవల మెట్రోస్టేషన్‌లు కూడా స్త్రీలు పెప్పర్‌ స్ప్రే తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చాయంటే ఆత్మరక్షణలో ఇవి ఎంతగా ఉపయోగపడతాయో ఊహించుకోవచ్చు. అందుకే మీరూ ఒకటి కొనుక్కోండి.. మీ స్నేహితురాళ్లకూ వీటిని బహుమతిగా ఇవ్వండి !

చూశారు కదా ! స్త్రీల ఆత్మరక్షణకు ఎన్ని ఆయుధాలున్నాయో ! మానవత్వం అంతరించిపోతూ అనాగరిక మృగాలు అధికమవుతున్న ఈ రోజుల్లో మానం కోసం, ప్రాణం కోసం స్త్రీలు ఇటువంటి ఆయుధాలను పట్టడంలో తప్పులేదు. అయితే ఇవి వెంట ఉన్నా కూడా, వాటిని వాడే సమయంలో ధైర్యంగా ఉండడం, వాటిని తీసుకొని దుండగులే వారిపైన ఎదురుదాడికి దిగకుండా ఉండేలా జాగ్రత్తపడడం ఎంతో అవసరం. అలానే వీటితో పాటు మహిళల రక్షణ కోసం ఉపయోగించే ఇతర పరికరాల గురించి, పద్ధతుల గురించి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకోండి !





women icon@teamvasundhara
celebrities-wishes-on-the-occasion-of-women’s-day-in-telugu

మీరు లేకుండా మేం లేము.. ఈ ఒక్క రోజుతో మీ రుణం తీర్చుకోలేం!

తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా, స్నేహితురాలిగా, ఉపాధ్యాయురాలిగా... ఇలా ఎన్నో రూపాల్లో మనకు ప్రేమను పంచుతుంది స్త్రీ. భూదేవికి మించిన ఓర్పుతో మన జీవితాలను ముందుండి నడిపిస్తుంది. అలాంటి మహిళల శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా త్యాగానికి, సహనానికి నిలువెత్తు ప్రతీకైన స్ర్తీ గొప్పతనాన్ని వివరిస్తూ వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి ఉన్నతికి కారణమై, ఆదర్శంగా నిలిచిన ఆడవాళ్లకు జోహార్లు తెలుపుతున్నారు.

Know More

women icon@teamvasundhara
men-are-not-allowed-in-these-villages-in-telugu

women icon@teamvasundhara
know-this-years-international-women’s-day-theme-and-its-significance

ఇలా ఛాలెంజ్ చేద్దాం!

కూతురిగా, సోదరిగా, భార్యగా, తల్లిగా.. ఇలా తమ జీవితంలో వివిధ పాత్రల్ని సమర్థంగా పోషిస్తోన్న మహిళలను గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే వేడుకే ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళలకున్న హక్కుల్ని గుర్తు చేసుకుంటూ, వారిని సాధికారత దిశగా నడిపించడానికి ఏటా ఒక అంశాన్ని ఎంచుకుని విమెన్స్‌ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్త్రీ శక్తిని చాటేలా, వారిని అభివృద్ధి పథంలో నడిపించేలా వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని సైతం నిర్వహిస్తుంటారు. మరి, ఈసారి మహిళా దినోత్సవం ఏ అంశంతో మన ముందుకొచ్చింది? ఎలాంటి సందేశాన్ని మహిళా లోకానికి అందించనుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
key-points-to-empower-and-encourage-women-in-different-fields

ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ ఏళ్లు గడుస్తోన్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
time-magazine-covers-women-in-farmers-protest-at-delhi

నన్ను బెదిరించలేరు... నన్ను కొనలేరు!

వ్యక్తులైనా, దేశమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే అందులో మహిళల పాత్ర ఎంతో కీలకం. వంట గదిలో గరిటె తిప్పడం దగ్గర్నుంచి... రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లేవరకు ఏ రంగమైనా అందులో మహిళల చొరవ, కృషి కచ్చితంగా ఉండాల్సిందే. ఎలాంటి బాధ్యతలనిచ్చినా ఎంతో అణకువగా నిర్వర్తించే స్త్రీలు... తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఆది పరాశక్తులుగా మారతారు. గతంలో మహిళలు నడిపిన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలే ఇందుకు నిదర్శనం. ఇలా మహిళల సహనశీల శక్తికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం. నాలుగు నెలలుగా నిద్రాహారాలు మాని పురుషులతో సమానంగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు పలువురు మహిళా రైతులు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ టైమ్‌ మ్యాగజైన్‌ పోరుబాటలో నిమగ్నమైన మహిళలకు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఇందులో భాగంగా మార్చి నెల ఎడిషన్‌ కవర్‌ పేజీపై మహిళా రైతుల ఫొటోతో పాటు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Know More

women icon@teamvasundhara
in-madhya-pradesh-pmay-houses-named-after-daughters

అక్కడ అందరిళ్లకూ అమ్మాయిల పేర్లే .. ఎందుకో తెలుసా?

‘ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా... ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేస్తున్నా... ఇంకా చాలాచోట్ల ఆడపిల్లలపై ఆంక్షలు, వివక్షలు కొనసాగుతున్నాయి. అంతెందుకు... ఇప్పటికీ చాలా ఇళ్లల్లో మగవారికి ఇచ్చిన విలువ మహిళలకు ఉండదు. అందుకే పురుషాధిక్య భావనను చెరిపేయాలనుకుంటే.... అది మొదట మన ఇంటి నుంచే మొదలు కావాలంటారు. ఈ క్రమంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లా పంచాయతీ రాజ్‌ విభాగం సీఈవో మిషా సింగ్‌. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరైన గృహాలకు లబ్ధిదారుల కుటుంబంలోని ఆడపిల్లల పేరుతో నేమ్‌ప్లేట్లను ఏర్పాటు చేశారు.

Know More

women icon@teamvasundhara
ad-on-infertility-with-powerful-message-goes-viral

పిల్లల్లేకపోతే ఏమిటంటూ కన్నీళ్లు పెట్టిస్తూ..!

మాతృత్వం... పెళ్లైన ప్రతి స్త్రీ తప్పకుండా కోరుకునే ఒక వరం. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక బిడ్డకు తల్లి కాలేని స్త్రీ జీవితం అసంపూర్ణం అని భావించే వారు చాలామంది ఉంటారు. అందుకే సంతాన భాగ్యానికి నోచుకోని మహిళలు ఎదుటివారి సూటిపోటి మాటలతో మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనసులో ఎంత ఆవేదన ఉన్నా మౌనంగా భరిస్తున్నారు. ఈ క్రమంలో ‘మహిళలు అంటే పిల్లలు మాత్రమేనా’?అన్న ఆలోచనా ధోరణిని మార్చుకోవాలంటూ ఓ సంస్థ రూపొందించిన యాడ్‌ అందరినీ ఆలోచింపజేస్తోంది. పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా మహిళగా ఆమె ఎప్పటికీ పరిపూర్ణమేనంటూ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ యాడ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
easy-steps-to-finding-body-positive-confidence-in-new-year

ఇలా ఈ ఏడాదంతా మనల్ని మనం ప్రేమించుకుందాం!

శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్‌లైన్‌, అటు ఆన్‌లైన్‌ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఈ తరహా బాడీ షేమింగ్‌ ప్రస్తుతం మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. దీని కారణంగా ఎంతోమంది మహిళలు తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతున్నారు. నిజానికి ఇలాంటి భావోద్వేగాల వల్ల మనకే నష్టం. అందుకే బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ‘ఎవరేమనుకుంటే నాకేంటి.. ఇది నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా..’ అన్న ధోరణిని అలవర్చుకోమంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాల్ని సైతం సూచిస్తున్నారు. మరి, కొత్త ఆశలు-ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగిడిన ఈ శుభ సందర్భంలో బాడీ పాజిటివిటీని పెంచుకోవడమెలాగో తెలుసుకుందాం రండి..!

Know More

women icon@teamvasundhara
things-you-can-do-in-2021-to-make-it-the-best-year-of-your-life

2020లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందండిలా!

చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది. ట్వంటీ-20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా ఎంతో వేగంగా, ఉత్కంఠగా సాగింది. కంటికి కనిపించని శత్రువులా కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురి చేసింది. యావత్‌ ప్రపంచానికే సంక్షోభంగా మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పించింది. ఇలా మనల్ని ఆనందానికి, ఆహ్లాదానికి దూరం చేసిన 2020 లాగా కాకుండా 2021 హ్యాపీగా సాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని కొత్త సంవత్సరంలో పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిందే. అలాగని ఇవేవీ శ్రమతో, ఖర్చుతో కూడుకున్నవి కావు. మనం మనసు పెట్టి చేయాల్సిన చిన్న చిన్న పనులే. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. మరి అవేంటో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
different-new-year-traditions-around-the-world

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
habits-that-you-need-to-implement-in-2021-for-the-sake-of-your-emotional-wellness

ఈ అలవాట్లతో కొత్త ఏడాదంతా హ్యాపీగా ఉండచ్చు!

సరిగ్గా ఏడాది క్రితం ఫుల్‌ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్‌ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.

Know More

women icon@teamvasundhara
new-years-eve-celebrations-get-new-cdc-guidance-in-telugu

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదట!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనమంతా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటిదాకా చేసుకున్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఒకెత్తయితే.. ఈ ఏడాది మరో ఎత్తు! కారణం.. కరోనా మహమ్మారి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే! పైగా ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం వల్ల వైరస్‌ విస్తృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Know More

women icon@teamvasundhara
rajasthan-man-gifts-plot-of-land-on-moon-to-wife-on-their-wedding-anniversary

ముద్దుల భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
telangana-cm-k-chandrasekhar-rao-adopted-daughter-to-tie-the-knot

కేసీఆర్ దత్తపుత్రిక.. కల్లోల జీవితం నుంచి కల్యాణ వేదిక పైకి!

ప్రత్యూష... ఐదేళ్ల క్రితం సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై మృత్యుముఖం దాకా వెళ్లిన ఓ అభాగ్యురాలు. ఒళ్లంతా గాయాలతో, మొహం మీద వాతలతో ఆస్పత్రి పాలైన ఆమెను చూసి ప్రతిఒక్కరూ ఆవేదన చెందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమె పరిస్థితిని చూసి మరింత చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా సవతి తల్లి, కన్న తండ్రి కబంధ హస్తాల నుంచి బయటపడిన ప్రత్యూష నేడు తన సొంతకాళ్లపై నిలబడుతోంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోందామె. ఈ క్రమంలో కల్లోల జీవితం నుంచి బయటపడిన ప్రత్యూష తాజాగా తను కోరుకున్న యువకుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది.

Know More

women icon@teamvasundhara
celebrities-who-tied-knot-in-this-pandemic-year

‘కరోనా నామ సంవత్సరం’లోనే పెళ్లి పీటలెక్కేశారు!

పెళ్లంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటుంది.. తన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా తను కోరుకున్న వాడి చేయి పట్టుకొని ఏడడుగులు నడవాలనుకుంటుంది. ఫొటోషూట్స్‌తో సందడి చేయాలనుకుంటుంది. మరి, మనమే మన పెళ్లి గురించి ఇన్ని కలలు కంటే సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఆకాశానికి నిచ్చెనలేస్తుంటారు. అయితే ఈ ఏడాది అంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రముఖులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కరోనానే! ఓ వైపు తక్కువ మంది అతిథులు, మరో వైపు కొవిడ్‌ నిబంధనలతోనే సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు కొంతమంది ముద్దుగుమ్మలు/సెలబ్రిటీలు. అలాగని తమ ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మరి, ఈ ‘కరోనా నామ సంవత్సరం’లో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రముఖులెవరో, వారి పెళ్లి ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
vaikunta-ekadashi-significance-in-telugu

అందుకే ముక్కోటి ఏకాదశి అంత పవిత్రం !

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ రోజునే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని చెబుతారు.

Know More

women icon@teamvasundhara
biryani-most-preferred-food-on-swiggy-ordered-more-than-once-every-second!

ఈ ఏడాది కూడా చికెన్ బిర్యానీనే ఎక్కువగా లాగించేశారట!

పార్టీ అయినా, ఫ్రెండ్స్‌/కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్లినా, ఆఫీస్‌లో ఎవరైనా ట్రీట్‌ ఇవ్వాలనుకున్నా.. మన మెనూలో ముందుండే ఫుడ్‌ ఐటమ్‌ బిర్యానీ కాక ఇంకేముంటుంది చెప్పండి! అందులోనూ మొదటి ప్రాధాన్యం చికెన్‌ బిర్యానీదే! అంతలా మన ఆహారపుటలవాట్లలో భాగమైందీ వంటకం. అయితే ఈ ఏడాది కరోనా రాకతో చాలామంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకున్నారు.. ఆరోగ్యం పేరుతో ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బిర్యానీ ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదనడానికి ‘స్విగ్గీ’ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికే ప్రత్యక్ష నిదర్శనం!

Know More

women icon@teamvasundhara
decorate-christmas-tree-in-your-home-in-telugu

'క్రిస్మస్ చెట్టు' కాంతులీనేలా...

క్రిస్మస్ పండగ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ చెట్టు, స్టార్స్, శాంటాక్లాజ్.. అయితే వీటిలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మాత్రం క్రిస్మస్ చెట్టే. ఈ పండగకు దాదాపు కొన్ని రోజుల ముందునుంచే ఇళ్లల్లో, షాపింగ్ మాల్స్‌లో, చర్చిల్లో.. ఈ చెట్టును అత్యంత రమణీయంగా అలంకరిస్తుంటారు. సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి కొనిఫెర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు) జాతికి చెందిన చెట్లను క్రిస్మస్ ట్రీగా అలంకరిస్తుంటారు. అయితే కొంతమంది ఈ చెట్టును ఇంట్లోనే పెంచుకుంటే.. మరికొంతమంది కృత్రిమ చెట్టును వాస్తవికత ఉట్టిపడేలా ముస్తాబు చేస్తారు. ఏదేమైనా క్రిస్మస్ చెట్టును కాంతులీనేలా, ఆకర్షణీయంగా అలంకరించడమెలాగో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

Know More

women icon@teamvasundhara
deepika-padukones-nutritionist-reveals-the-actors-pre-wedding-diet-plan!

ఆ డైట్ తోనే దీపిక అప్పుడంత అందంగా కనిపించిందట!

పెళ్లి ఫిక్సయిందంటే అమ్మాయిల కలలు కోటలు దాటుతాయి. అందరి కంటే అందంగా మెరిసిపోవాలి.. చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవాలి.. సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్స్‌ ఫాలో అవ్వాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ తనదే పైచేయిగా ఉండాలనుకుంటుంది నవ వధువు. ఇలాంటి అపురూప లావణ్యాన్ని, నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి ముందు నుంచే చక్కటి ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలనుకుంటారు కాబోయే పెళ్లికూతుళ్లు. అయితే అలాంటి వారందరికీ దీపిక పాటించిన ఈ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. ఈ మూడింటినీ బ్యాలన్స్‌ చేసేలా తాను రూపొందించిన హెల్దీ ప్రి-వెడ్డింగ్‌ డైట్‌ ప్లాన్‌తో అప్పుడు దీపిక వెలిగిపోతే.. ఇప్పుడు అదే డైట్‌ ప్లాన్‌ను ఫాలో అవుతూ నవ వధువులందరూ మెరిసిపోవచ్చంటున్నారామె. అందుకే ఆ విశేషాలను ఇటీవలే పంచుకున్నారు శ్వేత.

Know More

women icon@teamvasundhara
eight-years-on-nirbhayas-mother-asha-devi-says-she-will-seek-justice-for-all-rape-victims

వారి ముఖంలో నా కూతురిని చూసుకుంటున్నా!

అమానవీయం... అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ క్రూర ఘటన ఓ కన్నతల్లికి తీరని గర్భశోకాన్ని మిగల్చగా, యావత్‌ భారతావని చేత కన్నీళ్లు పెట్టించింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరేసరి అంటూ అందరూ రోడ్ల మీదకు వచ్చేలా చేసింది. ఈమేరకు మానవత్వానికే మచ్చగా మిగిలిపోయిన ‘నిర్భయ’ ఘటనకు నేటితో (డిసెంబర్‌ 16) ఎనిమిదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిర్భయకు నివాళి అర్పించిన ఆమె తల్లి ఆశాదేవి... అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మరోసారి నినదించారు.

Know More

women icon@teamvasundhara
first-period-traditions-in-india-in-telugu

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
most-tweeted-actress-in-2020-in-telugu

అందుకే వీళ్ల గురించి తెగ ‘ట్వీటా’రట!

సాధారణంగా తమ అభిమాన హీరోయిన్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ కావాలంటే చాలామంది వారి సోషల్‌ మీడియా ఖాతాలనే ఆశ్రయిస్తారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్లను శోధించి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... తదితర సమాచారం తెలుసుకుంటుంటారు. ఈక్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్‌ ఇండియా. ‘మోస్ట్‌ ట్వీటెడ్ స్టార్స్‌-2020’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ఆమె గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు చేశారని ట్విట్టర్ ఇండియా తెలిపింది. కీర్తితో పాటు పలువురు కథానాయికలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Know More

women icon@teamvasundhara
mother-and-daughter-tie-nuptial-knot-at-same-mass-marriage-event-in-gorakhpur
women icon@teamvasundhara
here-are-the-women-india-googled-the-most-in-2020

ఈ ఏడాది గూగుల్‌లో వీరి గురించే ఎక్కువగా వెతికారు!

సాధారణంగా తమకు నచ్చిన వారి గురించి కానీ, వార్తల్లోని వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవడానికి అందరూ మొదట గూగుల్‌నే ఆశ్రయిస్తారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... ఎలాంటి సమాచారం పొందాలనుకున్నా ఈ సెర్చింజన్‌లోనే శోధిస్తారు. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా ఎక్కువమంది వెతికిన వ్యక్తుల జాబితాను ‘గూగుల్‌ ఇండియా’ విడుదల చేసింది. ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీస్‌’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో టాప్‌-10లో ఐదుగురు మహిళా సెలబ్రిటీలు చోటు దక్కించుకున్నారు. మరి, వారెవరు? నెటిజన్లు ఎందుకు వారి గురించే ఎక్కువగా వెతికారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Know More

women icon@teamvasundhara
karnataka-newly-weds-skip-honeymoon-and-clear-over-600-kg-trash-from-beach-instead
women icon@teamvasundhara
things-not-to-tell-your-friends-about-your-life-partner-in-telugu
women icon@teamvasundhara
bollywood-to-be-moms-who-resumes-their-work-with-cute-baby-bump-and-their-viral-photos
women icon@teamvasundhara
lord-siva-temples-in-telugu-states

ఈ శైవక్షేత్రాల దర్శనం.. పరమ పవిత్రం!

కార్తీకమాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దేవుడు, సత్యయుగంతో సమానమైన యుగం, గంగతో సమానమైన నది లేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో సూర్యోదయానికి ముందే.. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే నదీ స్నానం అనంతకోటి పుణ్య ఫలాన్నిస్తుందట. అలాగే కార్తీక సోమవారం రోజు ఉసిరి చెట్టుకింద దీపం పెడితే హరిహరాదుల అనుగ్రహం కలుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ మాసంలో 'హరహర మహాదేవ.. శంభో శంకర' అని వేడుకుంటే చాలు.. భోళాశంకరుడు భక్తుల కోరికలను తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడని వారి భావన. కార్తీకమాసంలో శివుణ్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందితే సకల దరిద్రాలు తొలగిపోయి, భోగభాగ్యాలతో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉన్న కొన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం మీకోసం.

Know More

women icon@teamvasundhara
51-year-old-woman-gives-birth-to-her-granddaughter

కూతురి కోసం మనవరాలికి జన్మనిచ్చింది!

పెళ్లైన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. తల్లిప్రేమను పొందాలని తపిస్తుంది. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన బ్రెయన్నా లాక్‌వుడ్‌ కూడా ‘అమ్మా’ అన్న పిలుపు కోసం ఆరాటపడింది. అయితే ఆదిలోనే సంతాన సమస్యలు ఆమె కలను కల్లలు చేశాయి. ఎలాగైనా అమ్మ కావాలని పరితపించిన ఆమె.. ఎందరో డాక్టర్లను కలిసింది.. ఎన్నో చికిత్సలు చేయించుకుంది.. ఆఖరికి ఐవీఎఫ్‌ దాకా కూడా వెళ్లింది. ఇలా ఆమె చేసిన ప్రతి ప్రయత్నం విఫలయత్నమే అయింది. అయినా తన తల్లి సహాయంతో ఇటీవలే ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చి అమ్మతనాన్ని పొందిందామె. అంతేనా.. ఈ క్రమంలో తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది బ్రెయన్నా. మరి, ఎన్ని నోములు నోచినా తనకు కలగని సంతానం తన తల్లి ద్వారా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
do-you-know-the-secret-of-happiness?-in-telugu

ఈ ‘హ్యాపీ హార్మోన్లు’ మీలో విడుదలవుతున్నాయా?

నలభై దాటినా సరే - ఫిట్‌నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. యోగ సాధనలో ఆరితేరిన ఈ అందాల తారతో ఫిట్‌నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎవరూ పోటీ పడలేరేమో. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వివిధ ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. వాటిలోని పోషక విలువల్ని వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ అందాల అమ్మ. ఇప్పుడు 'మీకు సంతోషం సీక్రెట్ తెలుసా' అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
deepavali-celebrations-around-the-world

women icon@teamvasundhara
festivals-in-sharad-ritu-in-telugu
women icon@teamvasundhara
after-her-pet-dog-went-missing-6-years-ago-a-texas-woman-drives-2200km-for-their-reunion

తప్పిపోయిన 'కింగ్' మళ్లీ ఆరేళ్ల తర్వాత అలా దొరికాడు!

శునకాలను విశ్వాసానికి మారుపేరంటారు. ద్వేషమంటే తెలియని ఈ మూగజీవాలను తిట్టినా... కొట్టినా అవి చూపించే ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. అందుకే చాలామంది తమ పెట్స్‌గా కుక్కల్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపుతుంటారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకుని మరీ ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటారు. ఒక్క క్షణం అవి కనిపించకపోయినా, వాటికేమైనా ప్రమాదం జరిగినా విలవిల్లాడిపోయే పెట్‌ లవర్స్‌ కూడా ఉంటారు. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన తన శునకాన్ని తెచ్చుకునేందుకు ఓ మహిళ పెద్ద సాహసమే చేసింది. ఇంతకీ ఎవరా మహిళ? తను చేసిన సాహసమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
twin-sisters-give-birth-to-daughters-on-their-birthday-in-the-same-hospital

ఈ కవలలిద్దరూ గంటన్నర వ్యవధిలో అమ్మలయ్యారు!

సాధారణంగా కవలలంటే చూడ్డానికి ఒకేలా ఉండచ్చు. కానీ కలిసి పుట్టినంత మాత్రాన అన్ని విషయాల్లో సారూప్యతలు ఉండాలనేం లేదు. పెరిగి పెద్దయ్యాక వాళ్ల అలవాట్లు, అభిరుచులు విభిన్నంగా ఉండచ్చు. వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు సంభవించవచ్చు. అయితే రూపురేఖల దగ్గర్నుంచి చదువు దాకా... అనేక విషయాల్లో సారూప్యత ఉన్న కవలలు అరుదుగానే ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు అమెరికాకు చెందిన ఆటమన్‌షా, అంబర్‌ ట్రామోంటానా అనే ఇద్దరు కవలలు. చిన్నప్పటి నుంచి ఎన్నో సారూప్యతలను పంచుకున్న ఈ ట్విన్‌ సిస్టర్స్‌ తాజాగా ఒకే రోజు ఒకే హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆశ్చర్యకరంగా మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఇలాగే కొన్ని వారాల వ్యవధిలో మగ బిడ్డలను ప్రసవించారీ బ్యూటిఫుల్‌ సిస్టర్స్. ఈ సందర్భంగా అందరి నోళ్లలో నానుతున్న ఈ అమెరికన్ కవల సోదరీమణుల గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
festival-significance-of-karva-chauth-in-telugu

కుటుంబ క్షేమాన్ని కాంక్షించే 'కర్వా చౌత్'!

పండగలంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించడంతో పాటు బోలెడన్ని సరదాల్నీ మనకందిస్తాయి. అయితే వీటిలో అందరూ కలిసి జరుపుకొనే పండగలు కొన్నైతే.. కేవలం మహిళలు మాత్రమే మమేకమై జరుపుకొనేవి మరికొన్ని. అందులో 'కర్వా చౌత్' కూడా ఒకటి. శ్రావణం, కార్తీకం.. వంటి పలు మాసాల్లో ఆడవారు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేవిధంగా కర్వా చౌత్ రోజున కూడా ఆడవారు పార్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం ఉంటారు. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు లేదా దీపావళికి పదకొండు రోజులు ముందుగా వచ్చే ఈ పండగను ఉత్తర భారతదేశం వారు ఎక్కువగా జరుపుకొంటారు. మరి, మహిళలంతా ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండగ వైశిష్ట్యం, నేపథ్యం తదితర అంశాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
things-you-should-know-while-attending-or-organizing-small-gatherings-amid-pandemic

కరోనా వేళ వేడుకలా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

ఓవైపు దీపావళి-క్రిస్మస్‌ పండగలు.. మరోవైపు పెళ్లిళ్ల హడావిడి.. ఇంకోవైపు చలికాలం మొదలు.. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంటుంది. పండగలు, శుభకార్యాల కోసం ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. కరోనా కారణంగా వేడుకల సందడి తీరు మారింది. అయినప్పటికీ పెళ్లి, ఇతర శుభకార్యాల్లో కొంతమందైనా అతిథుల్ని పిలవడం, లేదంటే మనమే మన దగ్గరి బంధువుల పార్టీలు, వేడుకలకు హాజరవడం.. వంటివి చేస్తున్నాం. అది కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే! కానీ ఇలాంటి చిన్న చిన్న గుంపులే కరోనా వైరస్‌ విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందంటోంది వ్యాధి నివారణ, నియంత్రణ మండలి (సీడీసీ). పైగా చలికాలం వైరస్‌కు అనువైన కాలం కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తద్వారా అటు వేడుకలను ఎంజాయ్‌ చేస్తూనే, ఇటు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు.. కరోనా వేళ వేడుకలకు/పార్టీలకు హాజరవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
what-is-halloween-and-why-do-we-celebrate-it

ఆత్మల కోసం ప్రారంభమై ఆటవిడుపైంది..!

హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే భయంగొలిపే వివిధ దుస్తుల్లో సిద్ధమయ్యే వ్యక్తులు.. ఒకరినొకరు భయపెట్టుకోవడం.. భయం కలిగించే రీతిలో వివిధ రకాల ఆహారపదార్థాలు తయారుచేసుకొని ఆస్వాదించడం గుర్తొస్తాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. స్నేహితులతో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎవరింట్లో వారే హాలోవీన్‌ పండగ జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడమే మంచిది కూడా! మరి, ఈ పండగ ఒకప్పుడు ఆత్మలను భయపెట్టడానికి ప్రారంభించారంటే నమ్ముతారా?మనుషులేంటి? ఆత్మలను భయపెట్టడమేంటి అనుకుంటున్నారా? అసలు మనుషులకు ఆత్మలను భయపెట్టాల్సిన అవసరం ఏంటి? మన దేశంలో ఇప్పుడిప్పుడే పాపులర్‌గా మారుతున్న 'హాలోవీన్ డే' వెనుక ఉన్న నేపథ్యాన్ని తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More