scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ఈ ఏడాది సోషల్‌ మీడియాలో ‘సెన్సేషనల్‌ టాపిక్స్‌’ ఇవే..!

Stories those went viral in 2019

2019కి వీడ్కోలు చెప్పడానికి ఇంకెంతో సమయం లేదు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదిలో కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా వాడకం పెరిగాక ప్రపంచంలో ఏ మూల, ఏ విషయం జరిగినా సరే క్షణాల్లో అది మనకు తెలిసిపోతుంది. ఇలా ఈ 2019 ఆరంభం నుంచి చివరి వరకు ఎన్నో విషయాలు సోషల్‌ మీడియా ద్వారా మనల్ని పలకరించాయి. వీటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని భావోద్వేగానికి గురి చేశాయి. కొన్ని ఆనందపర్చితే.. మరికొన్ని మనలో స్ఫూర్తి నింపాయి. ఈ క్రమంలో 2019లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన పది వైరల్‌ స్టోరీస్‌ మీకోసం..!

వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన గుడ్డు ఫొటో..!

ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా వైరలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘world_record_egg’ పేరుతో మొదలైన ఓ పేజీలో మొదటి పోస్ట్‌గా ఒక గుడ్డు ఫొటోను షేర్‌ చేశారు. ఇలా పోస్ట్‌ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫొటోకు వేలు కాదు, లక్షలు కాదు.. కోట్లలో లైకులు రావడం విశేషం. అప్పటివరకు ఇన్‌స్టాలో అత్యధిక లైకులు సంపాదించిన ఫొటోగా పేరొందిన కైలీ జెన్నర్స్‌ (అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్‌, వ్యాపారవేత్త) ఫొటోను ఈ గుడ్డు ఫొటో అధిగమించి వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించడం విశేషం. ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. ఈ గుడ్డు ఫొటోకు ఇప్పటివరకు 54 మిలియన్ల లైకులు, 3.2 మిలియన్ల కామెంట్లు రావడం విశేషం. అంతేకాదు, ఈ ‘world_record_egg’ ఇన్‌స్టా పేజ్‌ను 7.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

View this post on Instagram

A post shared by EGG GANG 🌍 (@world_record_egg) on

సచిన్‌కు షేవింగ్‌ చేసిన బార్బర్‌ గర్ల్‌..!

కుటుంబ పోషణ కోసం క్షవర వృత్తిలో రాణిస్తోన్న అక్కాచెల్లెళ్లు జ్యోతి, నేహలను ప్రఖ్యాత క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ స్వయంగా వెళ్లి కలిసిన వార్త ఇంటర్నెట్‌లో బాగా వైరలైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జ్యోతి, నేహలు.. తండ్రికి పక్షవాతం రావడంతో మగ పిల్లలుగా వేషం మార్చుకొని మరీ క్షవర వృత్తిలోకి దిగడం చాలామందిని కదిలించింది. వీరి ప్రతిభ గురించి ఆ నోట ఈ నోట పాకి.. ప్రముఖ షేవింగ్‌ బ్రాండ్‌ జిల్లెట్‌ని చేరింది. దీంతో ఆ సంస్థ వీరిపై ఓ టీవీ ప్రకటనను రూపొందించింది. ‘ది బార్బర్‌ షాప్‌ గర్ల్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ ప్రకటన అనతికాలంలోనే 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సంపాదించడం విశేషం. ఈ ప్రకటన సచిన్‌ని కూడా చేరడంతో వాళ్లను స్వయంగా కలవాలనుకున్నాడు మాస్టర్‌ బ్లాస్టర్‌. ఈ క్రమంలో తను వాళ్ల షాప్‌కి వెళ్లి గడ్డం కూడా గీయించుకున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను సచిన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ‘నాకిది మొదటిసారి..! మీకు ఈ విషయం తెలియకపోవచ్చు. నేను గతంలో ఎవరి వద్దా షేవింగ్‌ చేయించుకోలేదు. ఆ రికార్డు ఈరోజు బద్దలైంది. #Barbershopgirlsని కలిసి ‘జిల్లెట్‌ ఇండియా స్కాలర్‌షిప్‌’ వారికి అందజేయడం నాకెంతో గర్వంగా ఉంది’ అంటూ తన భావాలను పంచుకున్నారు సచిన్‌.

నేషనల్‌ క్రష్‌గా మారిన ఆర్‌సీబీ గర్ల్‌..!

సోషల్‌ మీడియా వచ్చాక.. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా స్టార్స్‌గా మారతారో చెప్పడం కష్టమైంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం మే 4న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తన ఓరనవ్వుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది దీపికా ఘోష్‌. ఆర్‌సీబీ ఫ్యాన్‌ అయిన ఈ ముద్దుగుమ్మ మ్యాచ్‌ జరుగుతుండగా మిగతా ఫ్యాన్స్‌లాగే జెండా పట్టుకొని ఆ జట్టుని ఉత్సాహపరుస్తోంది. ఎర్రటి ఆఫ్‌ షోల్డర్‌ క్రాప్‌ టాప్‌లో సందడి చేస్తోన్న ఈ బ్యూటీ వైపు ఐపీఎల్‌ కెమెరా ఇలా తిరిగిందో లేదో.. అమ్మాయి చిరునవ్వుకి కుర్రాళ్లకి నిజంగానే మతిపోయింది. అంతే ఈ ‘ఆర్‌సీబీ గర్ల్‌’ ఎవరంటూ.. ఆమె గురించి గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. అంతేకాదు, మ్యాచ్‌ జరిగిన కొన్ని గంటల్లోనే తన సోషల్‌ మీడియా ఖాతాలకు విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది. దీంతో చూస్తుండగానే దీపిక నేషనల్‌ క్రష్‌గా మారడం విశేషం.

87 ఏళ్ల అభిమాని..!

మన దేశంలో చిన్నా, పెద్దా అనే వయోభేదం లేకుండా ఎక్కువశాతం మంది ఇష్టపడే ఆట క్రికెట్‌. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు టీవీల ముందు కూర్చొని అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక అదే మ్యాచ్‌ను లైవ్‌గా స్టేడియంలో చూసే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ చప్పట్లు, ఈలలు, అరుపులతో ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు చారులత అనే ఓ 87 ఏళ్ల బామ్మ కూడా వచ్చింది. మ్యాచ్‌ జరుగుతుండగా మన వాళ్లు కొట్టే సిక్సులు, ఫోర్లకు.. బామ్మ కూడా చిన్నపిల్లలా మారిపోయి బూరలూదుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేసింది. అలా ఈ బామ్మ ఆనందాన్ని పదే పదే కెమెరా హైలైట్‌ చేయడంతో ఆమె ఉత్సాహాన్ని చూసిన మన క్రికెటర్లు మ్యాచ్‌ ఆడుతూనే ఎంతగానో మురిసిపోయారు. అంతేకాదు, మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ, రోహిత్‌ శర్మ.. ఆమె దగ్గరకు వెళ్లి బామ్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి.

రనూ మోండల్‌.. సింగింగ్‌ సెన్సేషన్‌..!

సోషల్‌ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన వారిలో రనూ మోండల్‌ ఒకరు. రైల్వే స్టేషన్‌లో యాచకురాలిగా జీవనం సాగించే ఆమె సింగింగ్‌ ట్యాలెంట్‌కు అదృష్టం తోడై అనతికాలంలోనే బాలీవుడ్‌ సింగర్‌గా మారింది. ఒకనాడు రైల్వేస్టేషన్‌లో రనూ మోండల్‌ ‘ఏక్‌ ప్యార్‌ కా నగ్‌మా హై’ అనే లతా మంగేష్కర్‌ ఆలపించిన పాటను పాడుతుండగా.. అతీంద్ర చక్రబొర్తి అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అంతే.. ఈ వీడియో నిమిషాల్లో వైరల్‌గా మారింది. ఇంతటి గాన ప్రతిభ ఉన్నా ఆమె రైల్వేస్టేషన్‌లో ఏం చేస్తోందంటూ.. నెటిజన్లు కామెంట్లు పెట్టడం మెదలుపెట్టారు. ఈ వీడియో ప్రముఖ సంగీత దర్శకుడు హిమేష్‌ రేషమ్మియాని చేరుకుంది. రను ప్రతిభను చూసి ముగ్ధుడైన హిమేష్‌ తన తదుపరి చిత్రం ‘హ్యపీ హార్డీ అండ్‌ హీర్‌’ చిత్రంలో ‘తేరీ మేరీ కహానీ’ అనే పాటను రనుతో పాడించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను హిమేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అది ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రనుపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆమె చూస్తుండగానే సెలబ్రిటీగా మారింది.

ఒక్క ట్వీట్‌తో గూగుల్‌ సీఈవోనే మెప్పించింది..!

ఒక సాధారణ అమ్మాయి చేసిన ట్వీట్‌ గూగుల్‌ సీఈవోను ఆకర్షించిన సంఘటన ఈ ఏడాది వైరలైన స్టోరీస్‌లో ఒకటి. క్యాలిఫోర్నియాలోని బెర్కలీ నగరానికి చెందిన సారాఫిన్‌ నాన్స్‌ అనే 26 ఏళ్ల అమ్మాయికి చిన్నతనం నుంచి ‘ఫిజిక్స్‌’ సబ్జెక్ట్‌ అంటే చాలా భయం. ఆ భయమే నాలుగేళ్ల క్రితం క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో ఆమెకు 0 మార్కులొచ్చేలా చేసింది. కానీ, ఆమె ఆ సబ్జెక్ట్‌ను వదలకుండా పట్టు సాధించి అందులో పీహెచ్‌డీ కూడా చేసింది. ఈ విషయాన్ని తను ట్విట్టర్‌లో వివరంగా పోస్ట్‌ చేసింది.

sarafinanancephysics650-4.jpg

నాలుగేళ్ల క్రితం క్వాంటమ్‌ ఫిజిక్స్‌ ఎగ్జామ్‌లో నాకు 0 మార్కులొచ్చాయి. దీంతో నేను నా ప్రొఫెసర్‌ని కలిసి ..‘నాకెందుకో క్వాంటమ్‌ ఫిజిక్స్‌ అంటే భయమేస్తోంది. నేను నా సబ్జెక్ట్‌ని మార్చుకుంటా’ అని చెప్పా. ఇది విని ఆయన ‘నువ్వు ఆ పని చేయడమే కరెక్టేమో’ అన్నట్లు చూశాడు. ఆ చూపులు నా ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. ప్రస్తుతం నేను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒకటైన ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్నా..! ఇప్పటికే ఇందులో రెండు థీసిస్‌లు కూడా ప్రచురితమయ్యాయి. స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) అంటే చాలామంది ఎంతో కఠినమైన సబ్జెక్ట్‌గా భావిస్తుంటారు. అలాగని దీనిలో ప్రవేశించడానికి వారు అనర్హులు అని కాదు..’ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చింది. ఈ క్రమంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కూడా దీనిపై స్పందించడం విశేషం. ‘చాలా బాగా చెప్పారు..! మీ అనుభవం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది’ అంటూ ఆయన ట్వీట్‌ చేయడంతో ఈ వార్త మరింత వైరలైంది.

ఆకట్టుకున్న గ్రెటా ఉద్వేగభరిత ప్రసంగం..!

ప్రస్తుతం తమ సౌకర్యాలు, విలాసాల కోసం పర్యావరణానికి హాని చేస్తోన్న వారిని ఐక్యరాజ్య సమితి వేదికపై ఓ 16 ఏళ్ల అమ్మాయి నిలదీసింది. ఆమె ఉద్విగ్నభరిత ప్రసంగం, భావోద్వేగాలతో నిండిన మాటలు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ సంవత్సరం ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆధ్వర్యంలో ‘ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు’ జరిగింది. ఇందులో ఆయా దేశాధినేతలు పాల్గొని పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకునే చర్యల గురించి తమ ప్రణాళికల్ని వివరించారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ కోసం తన చదువునే త్యాగం చేసి మార్పు కోసం పోరాడుతోన్న స్వీడిష్‌ టీనేజర్‌ గ్రెటా థున్‌బర్గ్‌ కూడా ఈ సదస్సులో ప్రసంగించింది.

GretaThunbergspeech650.jpg

ప్రస్తుతం వాతావారణమంతా కలుషితమవుతోంది. అలా కాకుండా ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు..! అందరు పిల్లల్లాగే హాయిగా బడిలో పాఠాలు నేర్చుకునేదాన్ని. మీ నిస్సారమైన మాటలు, చేతలతో ఓవైపు పర్యావరణాన్ని నాశనం చేస్తూనే, మా ఆశల్ని ఆవిరి చేస్తున్నారు. మీ చేతకాని మాటల వల్ల మా బాల్యాన్ని, భవిష్యత్తు గురించి మేము కన్న కలల్ని ఆవిరి చేశారు. నానాటికీ కలుషితమైపోతోన్న ఈ పర్యావరణం ఎందరో సామాన్య ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. మా తరం తీవ్ర విపత్తుకు ఆరంభంలో ఉంది. అయినా మీరేమో డబ్బు, విలువలు, ఆర్థిక వృద్ధి.. అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. అలా మమ్మల్ని పట్టించుకోకుండా, మా మాటల్ని పెడచెవిన పెట్టడానికి మీకెంత ధైర్యం..?భవిష్యత్‌ తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు మీకెంత ధైర్యం..?’ అంటూ అందరినీ కడిగేసింది. ప్రపంచ వ్యాపంగా ఈ వీడియోను చూసిన వారంతా గ్రెటా ప్రసంగానికి నిర్ఘాంతపోయారు. పర్యావరణంపై తను చూపించే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

చెల్లి కోసం చెఫ్‌గా మారిన అన్న..!

తన చిన్నారి చెల్లి ఆకలి తీర్చేందుకు తానే స్వయంగా వంట చేశాడు ఓ బుడతడు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. అచ్చం ఆరితేరిన వంటవాడిలా ముందు ఓ గుడ్డు కొట్టి మూకుట్లో వేసిన అన్నకి.. చెల్లి గరిట అందించి సహాయం చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక ఈ బుడ్డోడు వంట చేస్తున్నప్పుడు కూరగాయ ముక్కలను తీసుకొచ్చి ఓ ముక్క చెల్లికిచ్చి.. ఓ ముక్కను తన నోట్లో వేసుకోవడం ముచ్చటగా అనిపించింది. ఇలా కాసేపట్లోనే పసందైన ఫ్రైడ్‌రైస్‌ని ఎడమ చేత్తో కలిపేసి వేడి వేడిగా చెల్లికి వడ్డించి.. ఆ తర్వాత తను తిన్నాడీ బుల్లి బ్రదర్‌. ఇండోనేషియాకు చెందిన ఈ అన్నాచెల్లెళ్ల వీడియోను ‘ఫెస్‌’ అనే ఆహార సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా ‘నాకూ అలాంటి అన్న ఉంటే ఎంత బాగుండేది..!’ అంటూ చెల్లిపై అతనికున్న ప్రేమను తెగ పొగుడుతూ కామెంట్లు పెట్టారు.

పనిమనిషికి బిజినెస్‌ కార్డ్‌ డిజైన్‌ చేసింది..!

ఉపాధి కోల్పోయిన తన పని మనిషికి సహాయం చేసేందుకు యజమానురాలు చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఈ ఏడాది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. పుణేలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోన్న ధనశ్రీ ఇంట్లో గీతా కాలే పనిమనిషిగా చేస్తోంది. అయితే గీత పని చేసే ఇళ్లలో ఒక ఇంట్లో తన ఉద్యోగం పోయిందని విషయం తెలుసుకున్న ధనశ్రీకి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే గీతకు ఎలాంటి పనుల్లో ప్రావీణ్యం ఉందో.. అందుకు తను ఎంత వేతనం కోరుకుంటోందో.. తదితర వివరాలు ఆమెను అడిగి తెలుసుకుంది. వీటితో తన పని మనిషి పేరిట ఓ విజిటింగ్‌ కార్డ్‌ను తయారు చేసింది ధనశ్రీ. ‘అంట్లు తోమడానికి రూ. 800, ఇల్లు శుభ్రం చేయడానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేయడానికి రూ.1000.. వీటితో పాటు కూరగాయలు తరగడం వంటి సేవలు కూడా పొందవచ్చు’ అంటూ తన ఫోన్‌ సహాయంతోనే గీత పేరుతో తను ఓ బిజినెస్‌ కార్డ్‌ను డిజైన్‌ చేసింది. ఈ డిజైన్‌తో 100 కార్డులు ప్రింట్‌ చేయించి దగ్గర్లో ఉన్న అపార్ట్‌మెంట్లు, సొసైటీ వాచ్‌మన్‌లకు పంచమని గీతకు ఇచ్చింది. అంతేకాదు, ఈ విషయాన్ని ధనశ్రీ సోషల్‌ మీడియాలో కూడా పోస్ట్‌ చేసింది. దీంతో గీత సేవలు వినియోగించుకుంటామంటూ వేల సంఖ్యలో కాల్స్‌ వచ్చాయి. అంతేకాదు, సమయస్ఫూర్తితో సాటి ఆడదాని సమస్యను పరిష్కరించిన ధనశ్రీపై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు.

ఆట మధ్యలో బిడ్డకు పాలిచ్చిన తల్లి..!

మిజోరంలో ఓ వాలీబాల్‌ క్రీడాకారిణి ఆట మధ్యలో తన బిడ్డ ఆకలి తీర్చిన తీరు నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌వెంట్లుయాంగీ అనే వాలీబాల్‌ క్రీడాకారిణి టుయ్‌కమ్‌ నియోజక వర్గానికి చెందిన వాలీబాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె.. గ్రౌండ్‌కు తన ఏడు నెలల కూతురును కూడా తీసుకొచ్చింది. ఆట మొదలైన కాసేపటికే చిన్నారి ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తోంది. ఇది చూసిన తల్లి వెంటనే బ్రేక్‌ సమయంలో బిడ్డను గుండెలకు హత్తుకొని పాలిచ్చింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోను నిగ్లూన్‌ హంఘల్‌ అనే మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆ క్రీడాకారిణిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఫొటోను చూసిన మిజోరం క్రీడా శాఖ మంత్రి రాబర్ట్‌ రొమావియా లాల్‌వెంట్లుయాంగీని అభినందిస్తూ రూ.10,000 నగదును బహుమతిగా ప్రకటించారు.

women icon@teamvasundhara
today-horoscope-details-15-02-2020
women icon@teamvasundhara
different-types-of-celebrations-on-valentines-day-around-world

అక్కడ ప్రతినెలా ‘ప్రేమికుల దినోత్సవమే’..!

కులం, మతం, ప్రాంతం. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకునే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్‌ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ మనసులోని ప్రేమను చాక్లెట్లు, బొమ్మలు, ఖరీదైన బహుమతులు.. చివరికి ఒక రోజా పువ్వుతోనైనా తెలియజేస్తుంటారు. ఇలా వేలంటైన్స్‌ డే రోజున ప్రేమను చాటిచెప్పడం కామన్‌ అయినా.. వేడుకలను జరుపుకునే విధానం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఇంతకీ ఈ వేలంటైన్స్‌ డేను ఎందుకు జరుపుకుంటారు.? ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకునే వేలంటైన్స్‌ డే వేడుకల గురించి తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-02-2020
women icon@teamvasundhara
gujarathi-couple-online-engagement-video-goes-viral

ఈ ఇ‘స్మార్ట్‌’ ఎంగేజ్‌మెంట్‌ చూశారా?

నిశ్చితార్థం అనేది పెళ్లి వేడుకల్లో మొట్టమొదటగా జరుపుకునే సంబరం. అమ్మాయి, అబ్బాయి తరఫు ఇరు కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు కలిసి ఎంతో సంతోషంగా చేసుకునే ఈ వేడుక కాబోయే భార్యాభర్తలకు ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకేనేమో, నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్లే అని అంటుంటారు మన పెద్దలు. అయితే ఈ సంబరాన్ని ఒక్కొక్కరు ఒక్కో మాదిరిగా, తమ తాహతుకు తగ్గట్లుగా జరుపుకుంటారు. కొంతమంది భారీగా ఖర్చు పెట్టి గ్రాండ్‌గా చేసుకుంటే.. మరికొంతమంది సింపుల్‌గా తాంబూలాలు మార్చు్కొని జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఈ రెండు రకాలుగా కాకుండా మీరెప్పుడైనా ఆన్‌లైన్‌ నిశ్చితార్థం గురించి విన్నారా?? అలా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న జంటల్ని చూశారా?? బహుశా వినుండరు, చూసుండరు కదూ! అయినా ఆన్‌లైన్‌లో నిమిషాల్లో షాపింగ్‌ చేయడం, వీడియో కాల్స్‌ చేసుకొని మాట్లాడుకోవడం తెలుసు కానీ.. ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్‌ ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఇ‘స్మార్ట్‌’ ఎంగేజ్‌మెంట్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-13-02-2020
women icon@teamvasundhara
budget-friendly-ways-to-celebrate-valentines-day

women icon@teamvasundhara
buttabomma-song-tiktok-videos-goes-viral

ప్రపంచాన్ని చుట్టేస్తున్న ‘బుట్టబొమ్మ’ ..!

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో పాటల గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కోపాట ఒక్కో సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఉన్న సోషల్‌ మీడియా రికార్డులన్నింటినీ ఈచిత్రంలోని పాటలు తిరగరాశాయి. ఇక సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా ఇందులోని ‘బుట్టబొమ్మ’ పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోట్లో నానుతూనే ఉంది. టిక్‌టాక్‌ వీడియోల్లో ఇప్పుడీ పాట ట్రెండింగ్‌లో ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ‘బుట్టబొమ్మ’కు ఫిదా అవుతున్నారు. చివరికి దేశాల మధ్య హద్దులను కూడా చెరిపేసిందీ పాట. మరి టిక్‌టాక్‌లో ‘బుట్టబొమ్మ’ సృష్టిస్తోన్న హంగామాపై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
how-to-celebrate-valentine-week-practically-without-wasting-money

ఈ వారం రోజులే కాదు... ఎప్పటికీ ప్రేమను ఇలా పంచేద్దాం !

ప్రేమ.. సృష్టిలో అత్యంత తియ్యనైనది.. మరపురానిది ఇదే.. ప్రతి బంధంలోనూ ప్రేమ ఉంటేనే అది పదిలంగా ఉంటుంది. అలాంటి అనిర్వచనీయమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఏటా జరుపుకుంటున్నదే ఈ 'వేలంటైన్స్‌ డే'. ఈ రోజుకు ముందున్న ఏడు రోజులకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది.. అయితే 'వేలంటైన్ వీక్' అని పిలుచుకునే ఈ వారం రోజుల గురించి చెప్పుకోవాలంటే వివిధ రకాల సర్‌ప్రైజ్‌లు, రొమాంటిక్ డేట్స్.. వంటివే గుర్తుకురావడం సహజం. కమర్షియలైజేషన్ నేపథ్యంలో ప్రేమికుల రోజు కూడా ఓ రకంగా కృత్రిమంగా, వ్యాపార వస్తువుగా మారిపోవడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చేమో. అయితే కేవలం ఇలా పైపై మెరుగులతో కాకుండా వేలంటైన్ వీక్‌ని హృదయపూర్వకంగా, మనసుకు హత్తుకునే రీతిలో ఎలా జరుపుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
intresting-thing-happening-related-to-corona

రేప్‌ చేయబోయాడు... కరోనా సోకిందని తప్పించుకుంది..!

ప్రస్తుతం ఏ వార్తా పత్రిక చూసినా, ఏ న్యూస్‌ ఛానల్‌ ట్యూన్‌ చేసినా ‘కరోనా’ వైరస్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. చివరికి ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ‘కరోనా’ ప్రస్తావన రావాల్సిందే. అంతలా ప్రపంచాన్ని భయపెడుతోందీ వ్యాధి. ఇప్పటికే వేల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడగా, వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌ నగరంలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలా ఓ వైపు ఈ వ్యాధి సృష్టిస్తున్న నష్టం ఎంతకీ పూడ్చలేనిదైతే మరోవైపు కరోనా వ్యాధి వల్ల కొన్ని వింత సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక సోషల్‌ మీడియా పుణ్యమాని ఆ వార్తలు కాస్తా క్షణాల్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. మరి కరోనాకు సంబంధించి ఇలా అందరి దృష్టినీ ఆకర్షించిన ఓ రెండు సంఘటనలు మీకోసం...

Know More

women icon@teamvasundhara
dont-let-social-media-ruine-your-life

కాపురాలు కూల్చేంతగా దీనికి బానిసలు కాకండి!

ఎదుటివారి మెప్పు పొందాలనుకోవడం మనిషి సహజ గుణం. అయితే ఈక్రమంలో మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయడం నిస్సందేహంగా తప్పే. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే భేదం తీసుకొచ్చి, ఒకరిపై ఒకరికి నిర్లక్ష్య భావం కలిగించేదేదైనా కూడా తప్పే అంటున్నారు మానసిక నిపుణులు. ప్రస్తుతం ఇలా భార్యాభర్తల మధ్య అగాథం సృష్టిస్తోంది మరెవరో కాదు.. సోషల్‌ మీడియా ! ఎందుకంటే ఒక్క అమెరికాలోనే దాదాపు 81 శాతం విడాకుల కేసుల్లో ఈ సోషల్‌ మీడియానే ప్రధాన కారణంగా ఉంటోందట. భార్యాభర్తల జీవితంలో చాపకింది నీరులా ఈ సోషల్‌ మీడియా ఎంతటి అగాథాన్ని సృష్టిస్తుందో లత, నజియా(పేర్లు మార్చాం) జీవితాలను ఓసారి పలకరిస్తే తెలుస్తుంది. ఇంతకీ ఎవరు వీళ్లు ? ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ సోషల్‌ మీడియా వారిలా చాలామంది జీవితాల్లో ఎందుకు అగాథాన్ని సృష్టిస్తోంది ? తెలుసుకుందాం రండి !

Know More

women icon@teamvasundhara
chinese-nurses-treating-corona-effected-pics-goes-viral

థ్యాంక్యూ సో మచ్‌ సిస్టర్స్‌.. మీ రుణం తీర్చుకోలేం..!

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్‌. చైనాలో మొదలైన ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి ఇప్పటికే వందల మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా 31,493 మందికి ఈ వైరస్‌ సోకగా.. వీరిలో 4,824 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది. చైనాలో కరోనా బారిన పడి గురువారం (ఫిబ్రవరి 6) ఒక్కరోజే 73 మంది మరణించినట్లు తాజాగా అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా సహా ఇతర దేశాల ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టాయి. ఈ వైరస్‌ విజృంభణను దృష్టిలో ఉంచుకొని కొద్దిరోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ని ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చైనా వైద్య బృందం నిరంతరంగా శ్రమిస్తోంది. ఇది అంటువ్యాధి అని తెలిసినప్పటికీ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు అక్కడి డాక్టర్లు, నర్సులు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులకు వైరస్‌ సోకడం బాధాకరం. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందించి అలసి సొలసిన కొందరు చైనా డాక్టర్లు, నర్సుల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల వెనకున్న కథేంటో మీరే చూడండి.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-06-02-2020
women icon@teamvasundhara
kerala-bride-surprises-with-a-dance-and-wins-internet

ఈ పెళ్లికూతురు డ్యాన్స్‌ చేస్తూ పెళ్లిపీటలెక్కింది!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. సరదాలు, సంతోషాల సమ్మేళనమైన ఈ వేడుకను వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. వెడ్డింగ్‌ కార్డ్స్‌ మొదలు వివాహ వేదికలు, భోజనాలు, సంగీత్‌లు, బారాత్‌లు..ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులతో, వివిధ కార్యక్రమాలతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ వధువు డ్యాన్స్‌ చేస్తూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. తోడు పెళ్లి కూతుళ్లతో కలిసి ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌కు వేదికపై కూర్చున్న వరుడు, అతిథులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Know More

women icon@teamvasundhara
mughal-gardens-opens-for-public-for-free-entry

women icon@teamvasundhara
today-horoscope-details-05-02-2020
women icon@teamvasundhara
medaram-jathara-special-significance-of-samakka-saralammma

అమ్మల జాతరకు మనమూ వెళ్లొద్దామా..!

శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం(బెల్లం) మొక్కులు.. వెరసి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. కోరుకున్న కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతరకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచిన ఈ జాతరకు తెలంగాణవ్యాప్తంగానే కాదు.. దేశవిదేశాల నుంచీ కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.. అమ్మల ఆశీర్వాదాలు అందుకుంటారు.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ పండగకు ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో అమ్మల వనమంతా జనసంద్రంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం..

Know More

women icon@teamvasundhara
woman-shares-video-from-chemo-session-becomes-twitter-star-overnight

ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది!

క్యాన్సర్‌.. ఎన్నో ఏళ్లుగా మనిషిని పీడిస్తోన్న వ్యాధుల్లో ఒకటి. వూపిరితిత్తులు, మెదడు, గొంతు, ఎముకలు, కాలేయం, రక్తం, చర్మం.. మొదలైన శరీర భాగాల కణజాలాలు దెబ్బతిని వివిధ రకాల క్యాన్సర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ రోగానికి సంబంధించి వైద్య సేవల్లో ఆధునికత కనిపిస్తున్నప్పటికీ సరైన మందు కనుగొనకపోవడంతో చాలామంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడినప్పటికీ.. తమ మనోధైర్యంతో దాన్ని జయించిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. కీమోథెరపీ వంటి చికిత్సా పద్ధతుల ద్వారా, ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకొని చాలామంది ఆ వ్యాధిని తరిమికొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి అనుభవాలను అందరితో షేర్‌ చేసుకుంటూ తమలాంటి బాధితులకు జీవితంపై భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన క్యాతీ హెలెంద్‌ అనే ఓ క్యాన్సర్ బాధితురాలు తన కీమోథెరపీ చికిత్సకు సంబంధించిన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకొని రాత్రికి రాత్రే ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయింది.

Know More

women icon@teamvasundhara
ratha-saptami-significance

సూర్య నారాయణా... నమో నమః

మాఘమాసం.. శుక్లపక్షం ప్రారంభమైన 7వ రోజు.. ఏడు అశ్వాలు కలిగి ఉన్న రథాన్ని అధిరోహించిన సూర్యనారాయణుడు తన పయనమార్గాన్ని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా మార్చుకుంటాడని ప్రతీతి. అందుకే భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించి ఆ సూర్య భగవానునికి అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజునే 'రథసప్తమి' అని చెప్పుకుంటారు. అలాగే సూర్య భగవానుడి పుట్టినరోజుగా కూడా ఈ రోజుని అభివర్ణిస్తారు. మరి, ఈ రోజుకి సంబంధించిన ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.. రథసప్తమి అనేది కాలానుగుణంగా జరిగే మార్పుని కూడా సూచిస్తుంది. ఎముకలు కొరికే చలికాలం నుంచి వెచ్చవెచ్చని వేసవికి ఆహ్వానం పలుకుతుంది. అంటే వసంత రుతువుకి స్వాగతం పలకడమే కాకుండా పంట కోతలను కూడా ప్రారంభించడానికి ఇది చాలా అనువైన సమయం.

Know More