scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!'

'కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!'

Know More

Movie Masala

 
category logo

మా అమ్మాయి ఆత్మకు శాంతి..మాకు మనశ్శాంతి !

Disha 4 accused were killed in police encounter

పది రోజుల క్రితం జరిగిన ‘దిశ’ దారుణ హత్యోదంతంతో తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురైన సమస్త భారతావని పండగ వాతావరణంలో మునిగిపోయింది. భవిష్యత్‌పై బంగారు ఆశలు పెట్టుకున్న ఆ వైద్యురాలి జీవితాన్ని చిదిమేసిన నాలుగు మానవ మృగాలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడమే ఆ సంతోషానికి కారణం. పుట్టెడు శోకంతో ఉన్న బాధితురాలి కుటుంబీకులకు ఈ వార్త కొంచెం సాంత్వన కలిగిస్తే.. ‘దిశ’ను తమ ఆడ కూతురిగా భావించిన భారతావని కళ్లల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. ఈ క్రమంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఏం చేసినా తప్పులేదంటూ దేశంలోని వివిధ రంగాల సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తిరుగుతున్న మరికొన్ని మానవ మృగాలకు భయం కలిగేలా చేసిన ఈ సంఘటనపై మహిళలు, విద్యార్థినులు టపాసులు కాలుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

dishrounuparticle650-5.jpg

సరైన న్యాయమే జరిగింది..!

మనుషులకు హక్కులుంటాయి..కానీ మృగాలకు కాదు’.. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తున్న కొందరికి ఓ సెలబ్రిటీ ఇచ్చిన ఈ సమాధానం సరిగ్గా సరిపోతుంది. మూగజీవాలకు వైద్యం చేసి ప్రాణాలు పోసే అభం శుభం తెలియని ఓ ఆడపిల్ల.. మనిషి ముసుగులో కొన్ని మృగాలు కూడా ఈ సమాజంలో తిరుగుతున్నాయని తెలుసుకోలేకపోయింది. మానవత్వాన్ని మరిచిన నలుగురు కీచకులు విసిరిన వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆ ముష్కరుల మధ్య ఆమె ఎంత నరక యాతన అనుభవించిందో..తలచుకుంటేనే ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి...అదే సమయంలో ఆక్రోశం, ఆవేశం కూడా ఉప్పొంగుతాయి. వీటన్నింటి నుంచి ఊరట కలిగించేలా ఆ మానవ మృగాలు పోలీసుల చేతుల్లో హతమయ్యారు. విచారణలో భాగంగా ‘దిశ’ కు సంబంధించిన వస్తువులను చూపెడతామంటే నిందితులను హత్యాస్థలానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని తప్పించుకుందామని ప్రయత్నించారు. అయితే పోలీసులు కూడా నిందితులపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే హతమయ్యారు. రాక్షసులు ఎక్కడైతే ‘దిశ’ను పాశవికంగా బలిగొన్నారో.. సరిగ్గా అదే ప్రదేశంలో ఆనలుగురు పోలీసుల తుపాకీ తుటాలకు ప్రాణాలొదలడం గమనార్హం.

dishrounuparticle650-1.jpg

ఆరోజు ఏం జరిగిందంటే..!

గత నెల 27న సాయంత్రం శంషాబాద్‌లోని తన ఇంటి నుంచి స్కూటీపై బయల్దేరింది ‘దిశ’. సమీపంలోని ఓ టోల్‌ ప్లాజా వద్ద వాహనం ఉంచేసి గచ్చిబౌలికి వెళ్లింది. అప్పటికే ఆమెపై కన్నేసిన దుండగులు ఆమె స్కూటీకి పంక్చర్‌ వేశారు. రాత్రి టోల్‌ప్లాజా దగ్గరకు చేరుకున్న ఆమె ఈవిషయంపై తీవ్ర ఆందోళన చెందుతూ సోదరికి ఫోన్‌ చేసింది. అయితే స్కూటీ రిపేర్‌ పేరుతో ఆమెను అక్కడే నిర్బంధించారు ఆ నలుగురు రాక్షసులు. అనంతరం అత్యంత పాశవికంగా హత్యాచారం చేశారు. పోలీసులకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకూడదన్న ఉద్దేశంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. హత్యోదంతానికి ముందే బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురు అదృశ్యంపై ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ మాటనుపెడచెవిన పెట్టారు స్థానిక పోలీసులు. మరుసటి రోజు పూర్తిగా కాలిపోయిన ఆమె మృతదేహం దొరికింది. అది తమ కూతురిదేనని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల ఆక్రందనలను ఆపడం ఎవరితరం కాలేదు.

24 గంటల్లోపే..!

ఏడేళ్ల క్రితం దేశ రాజధాని దిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు కీచకులు సాగించిన ఆ దారుణాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్యోదంతం మరో ‘నిర్భయ’ ఘటనను తలపించింది. మహిళల భద్రతపై పలు సందేహాలు రేకేత్తించిన ఈ ఘటనపై దేశంలోని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సామాన్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీరియస్‌గా దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం ..ఇందులో భాగంగా లభించిన కొన్ని ఆధారాలతో 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు

ఈ పది రోజుల్లో..!

dishrounuparticle650-4.jpg

 - గత నెల 27న దిశను నిందితులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు.

 - 28న ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు తెలంగాణ పోలీసులు.

 - 29న వారిని షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు.

 - 30న మెజిస్ర్టేట్‌ వద్ద హాజరుపరిచారు. 10 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. అనంతరం చర్లపల్లి జైలుకు నిందితులను తరలించారు.

 - ఈనెల 1న నిందితుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

 - 2న ‘దిశ’ హత్యోదంతంపై పార్లమెంట్ ఉభయ సభలు స్పందించాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చట్టాలు చేస్తామని కేంద్రమంత్రుల హామీ ఇచ్చారు.

 - 3న ‘దిశ’ను బతికుండగానే పెట్రోల్‌ పోసి తగలబెట్టామని ప్రధాన నిందితుడు అసలు నిజాన్ని బయటపెట్టాడు.

 - 4న నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్‌ కోర్టు తీర్పునిచ్చింది.

 - 5న నిందితులను సిట్‌ బృందం విచారించింది.

 - 6న పోలీసుల నుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తూ పోలీసుల ఎదురుకాల్పు్ల్లో మృత్యువాతపడ్డారు నలుగురు కామాంధులు.

దిశ’ దశ దిన కర్మ రోజే..!

ఎట్టకేలకు ఒక్క ఆడ కూతురికి అయినా న్యాయం జరిగింది. ఏడేళ్ల క్రితం నాకు తగిలిన గాయాలకు ఈ ఎన్‌కౌంటర్‌ ఆయింట్‌మెంట్‌ రాసినట్లుంది’ ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం ‘నిర్భయ’ తల్లి మనసులో నుంచి వచ్చిన ఉపశమనపు మాటలివి. ‘దిశ’ లాగే కీచకుల చేతిలో తన కన్న కూతురిని పోగొట్టుకుని, నేటికీ న్యాయం కోసం పోరాడుతోన్న ఆమె ఆవేదనకు కొంచెమైనా సాంత్వన దొరికిందని ఆమె మాటల్లో అర్థమవుతోంది. మరోవైపు కీచకుల చేతిలో కన్నుమూసిన కూతురి అత్మకు శాంతి కలగాలని దశ దిన కర్మ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ‘దిశ’ తల్లిదండ్రులు. ఇంతలోనే పోలీసుల చేతిలో నలుగురు నిందితులు హతమయ్యారనే వార్త వారికి తెలిసింది. దీంతో వారితో పాటు బంధువులు, చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పో..తప్పో పక్కన పెడితే ‘దిశ’కు సరైన న్యాయం జరిగిందని కొందరంటే, ‘తెలంగాణలో నిజమైన దీపావళి ఈరోజే ’ అంటూ మరికొందరు టపాసులు కాలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పోలీసుల చర్యను సమర్థిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నా !

ఏడేళ్లైనా నిర్భయకు న్యాయం జరగలేదు. దీంతో మాకు కూడా న్యాయం జరుగుతుందో? లేదో? అన్న అనుమానం ఉండేది. ఈ ఎన్‌కౌంటర్‌తో మా అమ్మాయి ఆత్మకు శాంతి, మాకు మనశ్శాంతి కలిగింది. నిందితుల శవాలను చూడాలని ఉంది. అందరి గురించి మంచిగా ఆలోచించే నా కూతురు లేదన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నా’

 - దిశ తల్లి

మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకూడదు..!

పోలీసులు చాలా వేగంగా న్యాయం చేశారు. మళ్లీ ఇలాంటి దారుణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్‌కౌంటర్‌ విషయానికి సంబంధించి మాకెలాంటి ముందస్తు సమాచారం లేదు. మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే మాకు తెలిసింది.’

-దిశ సోదరి

సేమ్‌ టు సేమ్‌ అలాగే..!

dishrounuparticle650-2.jpg

సరిగ్గా 11 ఏళ్ల క్రితం వరంగల్‌లో స్వప్నిక అనే అమ్మాయి తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి ద్వి చక్రవాహనంపై వెళుతుండగా శ్రీనివాస్‌ అనే యువకుడు యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో స్వప్నిక చనిపోగా, ఆమె స్నేహితురాలు ప్రణీత ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా అప్పుడు కూడా 48 గంటల్లోనే నిందితుడు శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఉరితీయాలని ఉద్యమాలు కూడా జరిగాయి. దీంతో నిందితులు వాడిన బైకు, యాసిడ్‌ సీసాలను స్వాధీనం చేసుకోవడానికి వరంగల్‌ నగర శివార్లలోని ఓ విమానాశ్రయం వద్దకు వారిని తీసుకొచ్చారు. ఈక్రమంలో నిందితులు పోలీసులపై దాడి చేసి ఆయుధాలను లాక్కోవాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నిందితులు మృతిచెందారు.ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది

కోర్టు హాలులోనే పొడిచి చంపేశారు..!

ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట’ ..రామజోగయ్య శాస్ర్తి చెప్పిన ఈ మాట..2004లో నాగ్‌పూర్‌లో జరిగిన ఓ యదార్థ ఘటనకు సరిగ్గా సరిపోతుంది. కాళీ చరణ్‌ అనే ఓ రేపిస్టును 200 మంది ఆడవాళ్లు కత్తులతో కోర్టు హాలులోనే చంపేశారు. రాజకీయ పలుకుబడి..పోలీసుల సహకారంతో ఆ కీచకుడు సాగించిన దురాగతాలకు లెక్కేలేదు. కంటికి కనిపించిన మహిళలందరిపై అత్యాచారం చేసే అతనికి రాజకీయ నాయకుల మద్దతు కూడా బాగా ఉండేది. దీంతో తనను ఎవరూ ఏం చేయలేరన్న అహంకారంతో మరో ఓ రేప్‌ చేశాడు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. దీంతో ఉషా నారాయణే అనే ఓ ధైర్యమున్న అమ్మాయి నేరుగా పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకు వెళ్లింది. ఫుల్‌ సెక్యూరిటీ ఉన్న ఇంట్లో బాధితురాలిని ఉంచి, కాళీపై కేసు బుక్‌ చేసి అరెస్ట్‌ చేయించింది. షరా మామూలుగానే బెయిల్‌ కోసం రంగంలోకి దిగారు అతడి తరఫున లాయర్లు. బెయిల్‌ విచారణ ప్రారంభమైంది. కోర్టు హాలులో ఒకామెను చూసిన కాళీ చరణ్‌ నవ్వుతూ ‘నిన్ను కూడా రేప్‌ చేస్తా’ అని అన్నాడు. ఆమె ధైర్యంతో అతడి చెంపలను వాయించడం ప్రారంభించింది. ఈలోపు కొందరు బాధిత మహిళలు చుట్టుముట్టారు. మొత్తం 70 కత్తిపోట్లతో ఆ కామపిశాచిపై తమ పగను తీర్చుకున్నారు. హత్య చేసిన తర్వాత కోర్టు హాలంతా సైలెంట్‌. తాపీగా నడుచుకుంటూ బయటికి వెళ్లిపోయారు ఆ మహిళలు. కొందరి మీద కేసులు కూడా నమోదయ్యాయి..2012 దాకా కేసు నడిచింది. చివరకు సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కేసు కొట్టేశారు.

అత్యాచార ఘటనలకు సంబంధించి చాలా కేసుల్లో న్యాయం జరగకపోవడంతో..న్యాయదేవత నిజంగానే కళ్లు మూసుకుందా? అన్న అనుమానం బాధిత కుటుంబాల్లో కలుగుతోంది. కాలం చెల్లిన చట్టాలతో ‘నిర్భయ’ కు ఇంతవరకు న్యాయమే జరగలేదని బాధితురాలి తల్లి వాపోవడమే దీనికి నిదర్శనం. గతంలో ప్రత్యూష, ఆయేషా లాంటి ఘటనల్లోనూ ఇలాగే జరిగింది. ఈ పరిస్థితుల్లో ‘ఇన్‌స్టంట్‌ జస్టిస్‌’ పేరుతో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైనదేనని చాలామంది అభిప్రాయపడతున్నారు. మరి మీరేమంటారు? మీఆలోచనలను ‘వసుంధర.నెట్‌’ వేదికగా అందరితో పంచుకోండి.

women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More

women icon@teamvasundhara
famous-indian-celebrities-who-have-adopted-children-in-telugu

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-27-10-2020
women icon@teamvasundhara
how-to-be-happy-in-this-society-as-a-women

జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో ఈ దసరా సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indian-cities-named-after-goddess-durga-in-telugu

ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ 'దసరా' సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-23-10-2020
women icon@teamvasundhara
bathukamma-songs-in-telugu

women icon@teamvasundhara
well-studied-girl-begging-in-the-streets-story-in-telugu

డబుల్ పీజీ చేసింది.. ఎన్నికల్లో నిలబడింది.. యాచకురాలిగా మారింది!

ఉన్నత చదువులు చదివిన ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. గతంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిగా తోటి విద్యార్థులకు అండగా నిలబడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఈ చదువుల తల్లి ప్రస్తుతం వీధుల్లో భిక్షమెత్తుకుంటోంది. కుమారుడితో కలిసి పార్కులు, రైల్వేస్టేషన్‌, బస్టాండులలో తిరుగుతూ పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకిలా యాచకురాలిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
significance-and-importance-of-batukamma-for-9-day-in-telugu

అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
with-family-separated-by-border-couple-exchange-wedding-vows-with-a-unique-twist

నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-10-2020
women icon@teamvasundhara
odisha-couple-gets-married-celebrates-by-feeding-500-stray-dogs-in-telugu

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-who-adopted-vegetarianism-in-telugu

ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాం!

వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్‌ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్‌ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
meghan-markle-says-online-abuse-almost-unsurvivable-in-telugu

women icon@teamvasundhara
this-american-mom-gives-birth-to-10-children-in-10-years-read-the-story-behind-this

అందుకే పదేళ్లలో పదిమంది పిల్లల్ని కన్నది!

ఒకప్పుడు పెళ్లైన అమ్మాయిని ‘గంపెడు మంది పిల్లల్ని కనమ్మా’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికే తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మందికి తల్లైంది అమెరికాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం పదకొండోసారి గర్భం ధరించిన ఈ మహిళ.. దీంతో పాటు మరో పాపాయిని కూడా కంటానంటోంది. ఇలా మొత్తంగా పన్నెండేళ్లలో పన్నెండు మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకుందీ అమెరికన్‌ మామ్‌. అయినా కచ్చితంగా ఇంతమందే పిల్లల్ని కనాలని ఎవరైనా అనుకుంటారా? అని సరదాగా అడిగితే.. దీని వెనుక ఒక చిన్న కథ ఉందని చెబుతోంది. మరి, ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చెబుతోన్న కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
doctor-narrates-how-she-delivered-a-baby-in-the-bathroom-of-a-flight
women icon@teamvasundhara
super-easy-hacks-will-help-you-relax-whenever-you-are-feeling-tense-in-telugu
women icon@teamvasundhara
today-horoscope-details-8-10-2020
women icon@teamvasundhara
elderly-couple-from-kerala-pose-for-wedding-photo-shoot-after-58-years-of-marriage

అందుకే పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!

నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్‌ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
celebrities-who-diagnosed-and-recovered-from-covid-in-telugu

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
women-safety-gadgets-which-are-easy-to-use-in-telugu
women icon@teamvasundhara
women-obsessed-with-their-favorite-colors-in-telugu

పింక్‌ అంటే ఎంతిష్టమైతే మాత్రం.. మరీ ఇంతగానా?!

గులాబీ రంగు అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గరా కనీసం ఒక్క పింక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ అయినా ఉంటుంది. ఇదొక్కటనే కాదు.. తమకు ఇష్టమైన రంగుల్లో ఉండే దుస్తులు, యాక్సెసరీస్‌.. వంటివి తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకొని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అలాగని అన్నీ ఒకే రంగులో ఉండవు.. సరికదా రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలన్నా ఎవరికైనా బోరే! కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల యాస్మిన్ చార్లొట్‌కు మాత్రం అస్సలు బోర్‌ కొట్టదట. రోజూ తాను పింక్‌ కలర్‌ దుస్తులు తప్ప మరేవీ ధరించనంటోంది. ఒక్క దుస్తులనే కాదు.. యాక్సెసరీస్‌ దగ్గర్నుంచి తన ఇల్లు, ఇంట్లోని వస్తువులు, మేకప్‌ సామగ్రి.. ఇలా అన్ని వస్తువుల్నీ పింక్‌ కలర్‌లో ఉన్నవి తప్ప మరేవీ ఎంచుకోవట్లేదామె. మరి ఎందుకిలా అని అడిగితే గులాబీ రంగు అంటే తనకు చెప్పలేనంత ఇష్టమంటూ తన గురించి బోలెడన్ని విషయాలు ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
glenn-maxwell-fiance-vini-raman-fires-on-netizen-who-wrote-nasty-comments

అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.

Know More

women icon@teamvasundhara
meet-the-talented-chef-kairavi-mehta-of-akkineni-family!

అక్కినేని వారి ఫ్యామిలీ చెఫ్‌ ఎవరో తెలుసా?

సాధారణంగా ఇంట్లో ఎవరు వంట చేస్తారు? అదేం ప్రశ్న.. ఆడవాళ్లు చేస్తారు.. కొన్ని పనుల్లో మగవాళ్లు కూడా వాళ్లకు సహాయపడతారు.. అంటారా? అవుననుకోండి.. కానీ ఆ ఇల్లాలికి వంట రాకపోతే? ఓ వంట మనిషిని పెట్టుకుంటుంది.. లేదంటే తనే ఎలాగోలా నేర్చుకొని వండుతుంది. మరి, అదే సెలబ్రిటీలైతే ఏకంగా చెఫ్‌లనే నియమించుకుంటారు. అందులోనూ సినిమా రంగానికి చెందిన వాళ్లైతే తమ ఫిట్‌నెస్‌ తగ్గకుండా, చక్కటి పోషకాహారాన్ని రుచికరంగా వండి వార్చే చెఫ్‌లకు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కినేని వారింట్లో కూడా అలాంటి చెఫ్‌ ఉన్నారన్న విషయం ఈమధ్యే అఖిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే గానీ చాలామందికి తెలియలేదు. అమలకు వంట రాదు.. మరి వాళ్లింట్లో వంట ఎవరు చేస్తారు? అన్న చాలామంది సందేహానికి ఈ ఫొటో సమాధానమిచ్చినట్లయింది. మరి, ఇంతకీ ఎవరా చెఫ్‌? ఇప్పటిదాకా తెర వెనకే ఉన్న ఆమె ఉన్నట్లుండి తెర ముందుకు ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
celebrities-demand-justice-for-19-years-old-gang-rape-and-murder-in-hathras
women icon@teamvasundhara
gauri-khan-reveals-things-in-mannat-are-‘remote-controlled’-by-her-mother-from-delhi

ఈ ఇంద్ర భవనాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

సాధారణంగా ఇల్లంటే లివింగ్‌ రూమ్‌, పడక గది, కిచెన్‌.. ఇవే ఉంటాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే విల్లాలు, డూప్లెక్స్‌ మోడల్స్‌లో తమ ఇంటిని నిర్మించుకుంటారు. వాటిలో తమ అభిరుచికి తగినట్లుగా అలంకరణ వస్తువులతో తీర్చిదిద్దుకుంటారు. మరి, రాజ భవనాన్ని మించిపోయేలా, ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఇంటిని మీరెప్పుడైనా చూశారా? బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు అందుకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. రాజసం ఉట్టిపడే హంగులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్‌, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు.. అబ్బో ఇలా ఆ ఇంటి గురించి, అందులో అలంకరించిన వస్తువుల గురించి ఎంత చెప్పినా తక్కువే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-9-2020
women icon@teamvasundhara
singer-sunitha-shares-emotional-video-about-spbalasubrahmanyam-in-telugu

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
women-are-higher-than-men-on-these-strengths-in-telugu
women icon@teamvasundhara
condolences-for-legendary-singer-sp-balasubrahmanyam-by-celebrties-in-telugu

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon@teamvasundhara
puri-jagannadh-expresses-about-girls-mindset-in-his-new-podcast
women icon@teamvasundhara
today-horoscope-details-21-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-18-9-2020
women icon@teamvasundhara
punishment-for-rapists-in-different-countries-in-telugu

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon@teamvasundhara
female-constable-lovingly-feeds-homeless-woman-her-baby-in-hyderabad-is-live-example-for-humanity
women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More