scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మేమొకటి తలిస్తే.. కరోనా మరొకటి తలచింది!'

'కరోనా మనుషుల జీవితాలనే కాదు.. ప్రత్యేక సందర్భాల రూపురేఖల్ని కూడా మార్చేసింది..! అంతకుముందు వరకూ ఏ వేడుకైనా అందరితో కలిసి ఎంతో సంబరంగా జరుపుకొనే మనం ఇప్పుడు ఇంటికే పరిమితమై సింపుల్‌గా చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌కి చెందిన నవ్య కూడా తన కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో ఇలాగే ఆలోచించింది. వాడి మొదటి పుట్టినరోజులాగే ఐదో పుట్టినరోజునూ ఘనంగా జరపాలనుకుంది.. అయినా కరోనా వల్ల అది సాధ్యం కాలేదు..! సరికదా.. సింపుల్‌గానైనా చేసుకుందామంటే అందుకూ కరోనా అడ్డుపడి.. మరోసారి తనను, తన కొడుకును నిరాశపరిచిందంటోంది. మరి, ఇంతకీ ఏమైంది? వాళ్ల బాబు పుట్టినరోజు వేడుకలు ఆగడానికి, కరోనాకు సంబంధమేంటి? రండి.. తన మాటల్లోనే తెలుసుకుందాం..!'

Know More

Movie Masala

 
category logo

మహిళలకేనా ఈ సలహాలు..మృగాళ్ల గురించి మాట్లాడరా?

Hyderabad police have 14 tips for women to stay safe tell men not to rape

భాగ్యనగరంలో మహిళల భద్రతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది ‘దిశ’ హత్యోదంతం. సాటి మనిషి అన్న మానవత్వం కూడా లేకుండా మృగాల్లా ప్రవర్తించిన ఆ నలుగురికి మరణశిక్ష విధించాల్సిందేనని పలువురు ముక్తకంఠంతో ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు హైదరాబాద్‌ పోలీసులు. మహిళల రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న విద్యార్థినులు, వివిధ సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్న యువతులు, మహిళలకు పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ సమయాల్లో .. ప్రత్యేకించి రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే యువతులకు కొన్ని జాగ్రత్తలు సూచించారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌. ఆపద సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తూ 14 పాయింట్లతో కూడిన మార్గదర్శకాలను జారీ చేశారు. వీటిని గుదిగుచ్చి కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

14tipsforwomengh650-1.jpg

పోలీసుల నిర్లక్ష్యం కూడా..

నాలుగు మానవ మృగాల చేతిలో దారుణంగా బలైపోయిన వైద్యురాలి హత్యోదంతానికి పోలీసుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఘటన జరిగిన రోజు రాత్రి తమ కుమార్తె అదృశ్యమయిందని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు సమీపంలోని శంషాబాద్‌, ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్లకు వెళ్లారు. అయితే అది తమ పరిధిలోకి రాదంటూ అక్కడి పోలీసులు అలక్ష్యంగా వ్యవహరించారని, ‘ ఎవరితో వెళ్లిపోయిందో’ అంటూ అసభ్యకర కామెంట్లు చేశారని ‘దిశ’ కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ కూడా తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ . ఈ క్రమంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల భద్రత కోసం 14 పాయింట్లతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేశారు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్. ‘మహిళలందరికీ ముఖ్యమైన సందేశం’ అనే పేరుతో ఏదైనా అనుకోని ఆపద ఎదురైతే స్వీయ రక్షణతో బయటపడే పద్ధతులను కూడా వివరించారు.

14tipsforwomengh650-2.jpg

1. మహిళలందరూ ఎక్కడికి వెళుతున్నారో.. ఎలా వెళుతున్నారో.. తిరిగి ఎప్పుడు వస్తారో.. తదితర వివరాలను కుటుంబసభ్యలకు కానీ, స్నేహితులకు కానీ తప్పనిసరిగా చెప్పాలి.

2. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఎప్పటికప్పుడు ‘లైవ్‌ లొకేషన్‌’ షేర్‌ చేస్తుండాలి.

3. ఏ వాహనంలో వెళుతున్నారో చెప్పడంతో పాటు వాహనం నెంబర్‌ను ఫొటో తీసి కుటుంబ సభ్యులకు షేర్‌ చేయాలి. ఆటోలో ప్రయాణిస్తుంటే డ్రైవర్‌ సీటు వెనక ఉండే వివరాలు, ట్యాక్సీలో ప్రయాణిస్తుంటే ఐడీ నెంబర్‌ తదితర వివరాలు పంపాలి.

4. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళుతున్నట్లయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రదేశం వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ ప్లేస్‌ ఎక్కడ ఉంది? ఎటు వైపు నుంచి వెళ్లాలి? తదితర విషయాలను ఆన్‌లైన్‌లో ముందుగానే తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల వాహన డ్రైవర్లు దారి మళ్లిస్తే వెంటనే గుర్తించడానికి సులభంగా ఉంటుంది.

5. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాల్లోనే ఉండాలి. ప్రమాదం ముంచుకొస్తుందని భావిస్తే సమీపంలో వెళ్తున్న పోలీసు వాహనాన్ని కానీ, పెట్రోలింగ్‌ సిబ్బందిని కానీ, బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని కానీ ఆపవచ్చు. ఈ సౌకర్యాలన్నీ మహిళల రక్షణ కోసమే..

6. చుట్టుపక్కల ఎవరూ లేకపోతే, ఒంటరిగా అక్కడే నిల్చోవద్దు. సమీపంలోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల దగ్గరికి వెళ్లండి.

14tipsforwomengh650-3.jpg

7. ఏదైనా విపత్తు ఎదురైతే ‘డయల్‌ 100’ కు ఫోన్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి.

8. తెలంగాణ పోలీసుల అధికారిక మొబైల్‌ యాప్‌ ‘హాక్‌ ఐ’ ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోండి. నిరంతరం లోకేషన్‌ ఆన్‌ చేసి ఉంచాలి.

9. హాని కలిగించేవారు ఎవరైనా చుట్టుపక్కల ఉన్నట్లయితే..వారికి వినిపించేలా గట్టిగా ఫోన్‌లో మాట్లాడండి.. పోలీసులు, బంధువులకు సమాచారం ఇస్తున్నట్లుగా నటించండి. దీంతో వారు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది.

10. భయమేసినప్పుడు స్వరం పెంచి గట్టిగా మాట్లాడాలి. పెద్దగా అరిచి అందరినీ పిలిచేందుకు ప్రయత్నించాలి.

11. నిస్సహాయ పరిస్థితులు ఎదురైతే బిగ్గరగా అరవండి. జనసంచారం ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు ట్రై చేయండి.

12. ఎవరైనా అనుమానితులు వెంట పడుతున్నప్పుడు రక్షణ పొందేందుకు సాటి ప్రయాణికులను సహాయం అడగడానికి సంశయించకండి.

13. భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు జరగకుండా నిరోధించేంలా ..ఎవరిమీదైనా అనుమానం వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.

14. అనుమానితులు, ప్రదేశాల ఫొటోలు 9490616555 నెంబర్‌కు వాట్సప్‌ చేసి సహాయం పొందవచ్చు.

14tipsforwomengh650-4.jpg

మాకెందుకీ శిక్ష?

దిశ’ లాంటి హత్యోదంతాలను నివారించడానికి మహిళలు ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదో సీపీ అంజనీ కుమార్‌ వివరించిన పాయింట్లను కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే అన్ని సందర్భాల్లో మహిళలు మాత్రమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పుకొచ్చిన ఈ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. మనిషి ముసుగులో తిరుగుతున్న మానవ మృగాలకు ఒక్క సూచన కూడా చెప్పకపోవడం గమనార్హం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు మహిళలు, యువతులు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘నేరం ఒకరిది..శిక్ష మరొకరికా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారికి కూడా చెప్పండి!

ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా ఓ యువతి ‘ మేం పురుషుల చేతిలో హత్యాచారానికి గురవుతున్నాం. ఏదేమైనా జాగ్రత్తగా ఉండమని మాకే సలహాలు ఇస్తున్నారు.. కానీ ఇలాంటి దారుణాలకు పాల్పడవద్దని అబ్బాయిలు, యువకులకు ఒక్క సలహా అయినా ఇస్తున్నారా? మేం ఎంత అప్రమత్తంగా ఉన్నా.. వాళ్లు మృగాల్లా, రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే మేమేం చేయాలి ?’ అని స్పందించింది.

స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కల్పించండి..

పోలీసుల సూచన ప్రకారం మా రక్షణ కోసం మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మానవ మృగాల నుంచి భద్రత కల్పించాలని కోరిన మహిళల ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాకు చూపించండి. అదేవిధంగా ‘మహిళలు కూడా సాటి మనుషులే’ అన్న పాఠాలను స్కూళ్లు, కాలేజీల్లో అబ్బాయిలకు అర్థమయ్యేలా చెప్పండి ’ అంటూ మరో యువతి కోరింది.

తాళమేసుకొని ఇంట్లో కూర్చోవాలా?

సీపీ చెప్పిన జాగ్రత్తలను చూస్తే ఒకటనిపిస్తోంది. ఇలాంటి అత్యాచారాలు ఆగాలంటే మహిళలందరూ బయటికి రాకుండా ఇళ్లలో తాళమేసుకుని ఉండాలనే అర్థం వస్తోంది. అయినా అక్కడ కూడా మాకు రక్షణ దొరకడం లేదు కదా..మరి మాకు జీవించే హక్కు లేదంటారా’ అని కాస్త ఘాటుగానే స్పందించింది మరో మహిళ.

చెడు ఆలోచనలను కూడా షేర్‌ చేసుకోండి!

ఈ క్రమంలో సీపీ ట్వీట్‌పై స్పందించిన మరో యువతి ‘ హైదరాబాద్‌ పోలీసులు అన్ని సలహాలు మహిళలే పాటించాలని చెప్పారు. మరి మనిషి ముసుగులో ఉన్న మృగాళ్లకు ఒక్క సూచన కూడా లేదెందుకో?

మహిళలకు జాగ్రత్తలు చెప్పినట్లుగానే సమాజంలో తిరుగుతున్న కొన్ని మృగాలు తమ మనసులో ఉన్న చెడు ఆలోచనలను వారి తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకోమని చెప్పండి. ఎక్కడైతే వినాశకరమైన ఆలోచనలు వారి మనసులో మెదులుతున్నాయో వాటిని అందరితో షేర్‌ చేసుకోండని’ వ్యంగంగా రాసుకొచ్చింది.

ఇంట్లో ఆడపిల్లలకు జాగ్రత్త చెబితే ఆ అమ్మాయి ఒక్కర్తే సురక్షితంగా ఉంటుంది. అదే ఇంట్లో మగపిల్లాడిని ‘జాగ్రత్త’ అని హెచ్చరిస్తే బయటి ఆడపిల్లలంతా సురక్షితంగా ఉంటారు’ .. ‘దిశ’ ఘటన తర్వాత పలువురు సెలబ్రిటీలు చెప్పిన మాట ఇది. కనీసం ఈ తరం తల్లిదండ్రులైనా తమ మగపిల్లల్ని నియంత్రణలో పెంచితే, చాలామంది ఆశిస్తు్న్నట్లు మెరుగైన సమాజాన్ని త్వరలోనే చూడవచ్చు కదా..మరి మీరేమంటారు. మీ ఆలోచనలను వసుంధర.నెట్‌ వేదికగా అందరితో పంచుకోండి.





women icon@teamvasundhara
three-girls-of-kerala-pancharatnam-tie-knot-on-same-day

ఆ పంచరత్నాల్లో ముగ్గురూ ఒకే రోజు పెళ్లి పీటలెక్కారు!

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల మీద కుంపటిలా భావించే రోజులవి. అలాంటిది ఆమె ఒకే కాన్సులో నలుగురు ఆడపిల్లలను, ఒక అబ్బాయిని ప్రసవించింది. కడవరకు కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త మధ్యలోనే కన్నుమూయడంతో ఇంటి యజమానురాలిగా తనే కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకుంది. కష్టపడి పిల్లలందరినీ గొప్ప చదువులు చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఇలా తల్లిగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తోన్న ఆమె తాజాగా తన ముగ్గురు అమ్మాయిలకు ఒకే రోజు ఒకే వేదికపై వివాహం జరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్‌ నిబంధనలను పాటించి వేడుకగా జరిగిన ఈ ముగ్గురు అమ్మాయిల పెళ్లి ముచ్చట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Know More

women icon@teamvasundhara
famous-indian-celebrities-who-have-adopted-children-in-telugu

కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా లేకపోయినా, వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ వారికి బంగారు భవిష్యత్‌ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి మందిరా బేడీ ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-27-10-2020
women icon@teamvasundhara
how-to-be-happy-in-this-society-as-a-women

జగన్మాత స్ఫూర్తితో ప్రగతి పథంలో సాగుదాం..!

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ అవతారాల్లో దర్శనమిచ్చే ఆ దుర్గాదేవి మహిళలందరికీ ఎప్పటికీ ఆదర్శప్రాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు..! అయితే సమాజంలోని మహిళలంతా ఆ అమ్మలాగే దృఢ నిశ్చయంతో, సమర్థతతో, కార్యదక్షతతో విజయపథంలో దూసుకెళ్లాలంటే మనలో ఉన్న కొన్ని అంశాలను మరింత బలపరుచుకోవాలి. అదే సమయంలో మన బలహీనతలను సైతం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆ అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని సమర్థమైన మహిళగా మనల్ని మనం తీర్చిదిద్దుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మహిళా బలపరుచుకోవాల్సిన కొన్ని అంశాలేంటో ఈ దసరా సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indian-cities-named-after-goddess-durga-in-telugu

ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కనీసం ఈ మహానగరానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఆలోచించారా? లేదా? అయితే అమ్మవారి పేర్ల మీద వెలసిన అలాంటి కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఈ 'దసరా' సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-23-10-2020
women icon@teamvasundhara
bathukamma-songs-in-telugu

women icon@teamvasundhara
well-studied-girl-begging-in-the-streets-story-in-telugu

డబుల్ పీజీ చేసింది.. ఎన్నికల్లో నిలబడింది.. యాచకురాలిగా మారింది!

ఉన్నత చదువులు చదివిన ఆమె ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. గతంలో యూనివర్సిటీలో విద్యార్థి నాయకురాలిగా తోటి విద్యార్థులకు అండగా నిలబడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన ఈ చదువుల తల్లి ప్రస్తుతం వీధుల్లో భిక్షమెత్తుకుంటోంది. కుమారుడితో కలిసి పార్కులు, రైల్వేస్టేషన్‌, బస్టాండులలో తిరుగుతూ పొట్ట కూటి కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకిలా యాచకురాలిగా మారిపోయింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

Know More

women icon@teamvasundhara
significance-and-importance-of-batukamma-for-9-day-in-telugu

అట్ల బతుకమ్మ.. అలిగిన బతుకమ్మ.. !

రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబరాలు. మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను వారు రోజుకో పేరుతో పిలుస్తూ, తీరొక్క నైవేద్యంతో కొలుస్తారు. మరి ఆ పేర్లేంటో, ఆయా రోజుల్లో అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
with-family-separated-by-border-couple-exchange-wedding-vows-with-a-unique-twist

నదీ జలాల సాక్షిగా వంతెన పైనే ఒక్కటయ్యారు!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా ఏడడుగులు నడవాలనుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన ప్రణాళికలన్నీ మారిపోయాయి. వధువు ఒక చోట, వరుడు మరో చోట ఉంటే ఫోన్‌కే తాళి కట్టి పెళ్లైందనిపించే రోజులొచ్చాయి. అంతేనా వధూవరులిద్దరూ ఒకే చోట ఉండి, కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాల్లో ఉంటే వీడియో కాలింగ్‌ యాప్స్‌ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి మరీ అక్షింతలు వేయించుకుంటున్నాయి కొన్ని జంటలు. ఈ క్రమంలో అమెరికా-కెనడాలకు చెందిన ఓ జోడీ కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-19-10-2020
women icon@teamvasundhara
odisha-couple-gets-married-celebrates-by-feeding-500-stray-dogs-in-telugu

వాటి కడుపు నింపడానికి తమ సంతోషాన్ని కూడా వదులుకున్నారు!

సాధారణంగా పెళ్లి చేసుకునే జంటలు బంధువులను, స్నేహితులను ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకుంటూనే.. వారికి చక్కటి విందు ఏర్పాటుచేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు చాలామంది! కానీ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ జంట ఇలా అందరిలా ఆలోచించలేదు. తమ పెళ్లికయ్యే ఖర్చును సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుళ్లోనే చాలా సింపుల్‌గా దండలు మార్చుకొని.. పెళ్లి ఖర్చులకయ్యే మొత్తాన్ని అక్కడి ఓ వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి విరాళంగా అందించారు. ఆ మూగ జీవాలకు కడుపు నిండా ఆహారం పెట్టి సంతృప్తి పడ్డారు. ఇలా ఈ కొత్త జంట చేసిన పనికి, వారు చూపిన దాతృత్వానికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-who-adopted-vegetarianism-in-telugu

ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాం!

వారాంతం వచ్చిందంటే మాంసాహారం లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇంకొందరేమో వారాలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్‌ లాగించేస్తుంటారు. అలాంటిది ప్రకృతి పరిరక్షణ కోసమో లేదంటే జీవకారుణ్యం వల్లో కొంతమంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటూ ఉంటారు.. ఈ క్రమంలో తమకిష్టమైన మాంసాహారాన్ని సైతం వదిలేసి పూర్తి శాకాహారులుగా మారిపోతుంటారు. బాలీవుడ్‌ భామ భూమీ పెడ్నేకర్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది. స్వయానా ప్రకృతి ప్రేమికురాలు అయిన భూమి.. ఎప్పట్నుంచో ఇటువైపు రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎంతో కష్టపడి మరీ తన ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని చెబుతోంది. ఇలా తాను వెజిటేరియన్‌గా మారిన విషయాన్ని తాజా సోషల్‌ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించిందీ సుందరి. భూమిలాగే గతంలో మరికొందరు ముద్దుగుమ్మలు కూడా మాంసాహారాన్ని మానేసి శాకాహారం బాట పట్టారు. మరి, వాళ్లెవరు? శాకాహారులుగా మారే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
meghan-markle-says-online-abuse-almost-unsurvivable-in-telugu

women icon@teamvasundhara
this-american-mom-gives-birth-to-10-children-in-10-years-read-the-story-behind-this

అందుకే పదేళ్లలో పదిమంది పిల్లల్ని కన్నది!

ఒకప్పుడు పెళ్లైన అమ్మాయిని ‘గంపెడు మంది పిల్లల్ని కనమ్మా’ అని ఆశీర్వదించేవారు. ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికే తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పది మందికి తల్లైంది అమెరికాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం పదకొండోసారి గర్భం ధరించిన ఈ మహిళ.. దీంతో పాటు మరో పాపాయిని కూడా కంటానంటోంది. ఇలా మొత్తంగా పన్నెండేళ్లలో పన్నెండు మంది పిల్లల్ని కనడమే లక్ష్యంగా పెట్టుకుందీ అమెరికన్‌ మామ్‌. అయినా కచ్చితంగా ఇంతమందే పిల్లల్ని కనాలని ఎవరైనా అనుకుంటారా? అని సరదాగా అడిగితే.. దీని వెనుక ఒక చిన్న కథ ఉందని చెబుతోంది. మరి, ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చెబుతోన్న కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
doctor-narrates-how-she-delivered-a-baby-in-the-bathroom-of-a-flight
women icon@teamvasundhara
super-easy-hacks-will-help-you-relax-whenever-you-are-feeling-tense-in-telugu
women icon@teamvasundhara
today-horoscope-details-8-10-2020
women icon@teamvasundhara
elderly-couple-from-kerala-pose-for-wedding-photo-shoot-after-58-years-of-marriage

అందుకే పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత ఫొటోషూట్!

నేటి తరంలో ఫొటోలకున్న ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలతో పాటు ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని ఫొటోల్లో బంధించడం ఈ రోజుల్లో పరిపాటిగా మారిపోయింది. ఇక పెళ్లిలో భాగంగా జరిగే ప్రతి వేడుకను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించడం సహజమే. వధూవరులు తమ పెళ్లికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను పది కాలాల పాటు పదిలంగా గుర్తుండిపోయేలా ఈ వెడ్డింగ్ ఫొటోషూట్‌ను నిర్వహిస్తారు. అయితే కేరళకు చెందిన ఓ వృద్ధ దంపతులు మాత్రం పెళ్లయిన 58 ఏళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీయించుకున్నారు. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోషూట్‌ పూర్తి వివరాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
celebrities-who-diagnosed-and-recovered-from-covid-in-telugu

ఈ సెలబ్రిటీలందరూ కరోనాను జయించిన వారే!

కనికరం లేకుండా విరుచుకుపడుతోన్న కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పేద-ధనిక, ఆడ-మగ, చిన్నా-పెద్దా... ఈ తేడాలేవీ చూడకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అయితే ఇంకా మందు లేని ఈ మహమ్మారిని చాలామంది మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడ్డ తమన్నా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకుని ఆ అనుభవాలను అందరితో షేర్ చేసుకున్న కొందరి ప్రముఖుల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
women-safety-gadgets-which-are-easy-to-use-in-telugu
women icon@teamvasundhara
women-obsessed-with-their-favorite-colors-in-telugu

పింక్‌ అంటే ఎంతిష్టమైతే మాత్రం.. మరీ ఇంతగానా?!

గులాబీ రంగు అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రతి ఒక్కరి దగ్గరా కనీసం ఒక్క పింక్‌ కలర్‌ అవుట్‌ఫిట్‌ అయినా ఉంటుంది. ఇదొక్కటనే కాదు.. తమకు ఇష్టమైన రంగుల్లో ఉండే దుస్తులు, యాక్సెసరీస్‌.. వంటివి తమ వార్డ్‌రోబ్‌లో చేర్చుకొని మురిసిపోతుంటారు అమ్మాయిలు. అలాగని అన్నీ ఒకే రంగులో ఉండవు.. సరికదా రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలన్నా ఎవరికైనా బోరే! కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన 32 ఏళ్ల యాస్మిన్ చార్లొట్‌కు మాత్రం అస్సలు బోర్‌ కొట్టదట. రోజూ తాను పింక్‌ కలర్‌ దుస్తులు తప్ప మరేవీ ధరించనంటోంది. ఒక్క దుస్తులనే కాదు.. యాక్సెసరీస్‌ దగ్గర్నుంచి తన ఇల్లు, ఇంట్లోని వస్తువులు, మేకప్‌ సామగ్రి.. ఇలా అన్ని వస్తువుల్నీ పింక్‌ కలర్‌లో ఉన్నవి తప్ప మరేవీ ఎంచుకోవట్లేదామె. మరి ఎందుకిలా అని అడిగితే గులాబీ రంగు అంటే తనకు చెప్పలేనంత ఇష్టమంటూ తన గురించి బోలెడన్ని విషయాలు ఇలా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
glenn-maxwell-fiance-vini-raman-fires-on-netizen-who-wrote-nasty-comments

అందుకే అతనిపై మనసు పడ్డాను.. తప్పేమిటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. అదేపనిగా వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రియురాలు వినీ రామన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సందర్భంగా తనను, తన ప్రియుడిని ఉద్దేశించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చిందామె.

Know More

women icon@teamvasundhara
meet-the-talented-chef-kairavi-mehta-of-akkineni-family!

అక్కినేని వారి ఫ్యామిలీ చెఫ్‌ ఎవరో తెలుసా?

సాధారణంగా ఇంట్లో ఎవరు వంట చేస్తారు? అదేం ప్రశ్న.. ఆడవాళ్లు చేస్తారు.. కొన్ని పనుల్లో మగవాళ్లు కూడా వాళ్లకు సహాయపడతారు.. అంటారా? అవుననుకోండి.. కానీ ఆ ఇల్లాలికి వంట రాకపోతే? ఓ వంట మనిషిని పెట్టుకుంటుంది.. లేదంటే తనే ఎలాగోలా నేర్చుకొని వండుతుంది. మరి, అదే సెలబ్రిటీలైతే ఏకంగా చెఫ్‌లనే నియమించుకుంటారు. అందులోనూ సినిమా రంగానికి చెందిన వాళ్లైతే తమ ఫిట్‌నెస్‌ తగ్గకుండా, చక్కటి పోషకాహారాన్ని రుచికరంగా వండి వార్చే చెఫ్‌లకు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కినేని వారింట్లో కూడా అలాంటి చెఫ్‌ ఉన్నారన్న విషయం ఈమధ్యే అఖిల్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే గానీ చాలామందికి తెలియలేదు. అమలకు వంట రాదు.. మరి వాళ్లింట్లో వంట ఎవరు చేస్తారు? అన్న చాలామంది సందేహానికి ఈ ఫొటో సమాధానమిచ్చినట్లయింది. మరి, ఇంతకీ ఎవరా చెఫ్‌? ఇప్పటిదాకా తెర వెనకే ఉన్న ఆమె ఉన్నట్లుండి తెర ముందుకు ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Know More

women icon@teamvasundhara
celebrities-demand-justice-for-19-years-old-gang-rape-and-murder-in-hathras
women icon@teamvasundhara
gauri-khan-reveals-things-in-mannat-are-‘remote-controlled’-by-her-mother-from-delhi

ఈ ఇంద్ర భవనాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

సాధారణంగా ఇల్లంటే లివింగ్‌ రూమ్‌, పడక గది, కిచెన్‌.. ఇవే ఉంటాయి. కాస్త డబ్బున్న వాళ్లైతే విల్లాలు, డూప్లెక్స్‌ మోడల్స్‌లో తమ ఇంటిని నిర్మించుకుంటారు. వాటిలో తమ అభిరుచికి తగినట్లుగా అలంకరణ వస్తువులతో తీర్చిదిద్దుకుంటారు. మరి, రాజ భవనాన్ని మించిపోయేలా, ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉండే ఇంటిని మీరెప్పుడైనా చూశారా? బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఇల్లు అందుకు ఏమాత్రం తీసిపోదంటే అతిశయోక్తి కాదు. రాజసం ఉట్టిపడే హంగులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్‌, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, ఈత కొలనులు.. అబ్బో ఇలా ఆ ఇంటి గురించి, అందులో అలంకరించిన వస్తువుల గురించి ఎంత చెప్పినా తక్కువే!

Know More

women icon@teamvasundhara
today-horoscope-details-29-9-2020
women icon@teamvasundhara
singer-sunitha-shares-emotional-video-about-spbalasubrahmanyam-in-telugu

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon@teamvasundhara
women-are-higher-than-men-on-these-strengths-in-telugu
women icon@teamvasundhara
condolences-for-legendary-singer-sp-balasubrahmanyam-by-celebrties-in-telugu

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon@teamvasundhara
puri-jagannadh-expresses-about-girls-mindset-in-his-new-podcast
women icon@teamvasundhara
today-horoscope-details-21-9-2020
women icon@teamvasundhara
today-horoscope-details-18-9-2020
women icon@teamvasundhara
punishment-for-rapists-in-different-countries-in-telugu

రేపిస్టులకు అక్కడ వేసే శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్ల కళ్లు కామంతో మూసుకుపోతాయి. ఎప్పుడెప్పుడు అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తమ కోరిక తీర్చుకుందామా? అన్న ఆలోచనలే వారి మదిలో మెదులుతాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఇలాంటి ఘటనల్లో వెలుగు చూసేవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇక మరుగున పడిపోయే వాటికైతే లెక్కేలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మైనర్‌ బాలికపై జరిగిన రేప్‌, పాకిస్థాన్‌లో తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే తల్లిపై జరిగిన అత్యాచారం.. రాన్రానూ ఆడవారికి రక్షణ కరువవుతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.

Know More

women icon@teamvasundhara
female-constable-lovingly-feeds-homeless-woman-her-baby-in-hyderabad-is-live-example-for-humanity
women icon@teamvasundhara
how-to-rescue-from-forgetfulness-in-telugu

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తురాదు. వినడానికి ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించినా అందరికీ ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు అనే పదం మన డిక్షనరీలో కూడా కనపడదట. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
forgiveness-day-celebrations

ఐయామ్ వెరీ సారీ.. అనేద్దాం వందోసారి..!

అనూష, రాధిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. మొదటిసారి చూసినవాళ్లు అక్కాచెల్లెళ్లే అనుకోవాలి అలా ఉండేవాళ్లు. అయితే ఓ చిన్న గొడవ వల్ల ఇప్పుడు వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. తప్పెవరిది? అన్న విషయం పక్కన పెడితే తప్పు చేసిన వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకోవడం, అటుపక్కవాళ్లూ క్షమించడం వల్లే బంధాలు గట్టిపడతాయి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం 'క్షమించడం' అంటూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి సీరియస్ డైలాగ్ చెప్పినా.. క్షమించడం, క్షమాపణ అడగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే క్షమించడానికి మంచి మనసుండాలి.. అలాగే క్షమాపణ అడగడానికి చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం, నేర్పు ఉండాలి. ఇవన్నీ మన సొంతమైతే - మనం కూడా 'అందరివాళ్లు' గా మారడం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీరూ అలా మారాలనుకుంటున్నారా? అయితే 'అంతర్జాతీయ క్షమా దినోత్సవం' సందర్భంగా 'సారీ' అనే మ్యాజికల్ వర్డ్‌కున్న పవర్ ఏంటో మీరే తెలుసుకోండి...

Know More

women icon@teamvasundhara
couple-spends-2-lakh-creating-cardboard-cutout-guests-for-wedding

కరోనా వేళ.. కటౌట్స్ రూపంలో అక్షింతలు వేశారు!

పెళ్లంటే ఎవరికైనా ప్రత్యేకమే! అందుకే బంధువులందరినీ పిలిచి తమకు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు అందరూ..! ఇంగ్లండ్‌కు చెందిన ఓ జంటా ఇందుకు అతీతం కాదు! మా పెళ్లి అలా జరగాలి.. అంతమంది బంధువుల్ని ఆహ్వానించాలి.. వివాహానికి ఇలా ముస్తాబు కావాలి.. అంటూ ఎన్నో కలలు కంది ఆ జంట. కానీ అంతలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయినా సరే.. పెళ్లి వేడుకల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదా కపుల్. ముహూర్తం తేదీ మార్చుకున్నా అతిథులందరినీ పిలిచి అంగరంగ వైభవంగా కల్యాణమాడారు. పైగా వాళ్లందరితో కలిసి ఎంచక్కా ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారీ న్యూ కపుల్‌. అలాగని కరోనా నిబంధనల్ని పాటించలేదనుకుంటే మీరు పొరపాటు పడినట్లే! మరి, అటు అన్ని నిబంధనల్ని పాటించారంటున్నారు.. ఇటు అతిథులందరినీ పెళ్లికి పిలిచారంటున్నారు.. పైగా వాళ్లు దిగిన ఫొటోలు కూడా వైరలయ్యాయంటున్నారు.. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటారా? ఇదిగో ఇలా..!

Know More