scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 04-05-2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం వసంత రుతువు; చైత్ర మాసం;బహుళపక్షం అష్టమి: సా. 5-52 తదుపరి నవమి శ్రవణ: మ. 1-05 తదుపరి ధనిష్ట వర్జ్యం: సా.5-03 నుంచి 6-39 వరకు అమృత ఘడియలు: రా.2-39 నుంచి 4-15 వరకు దుర్ముహూర్తం: ఉ.8-08 నుంచి 8-59 వరకు తిరిగి రా.10-48 నుంచి 11-33 వరకు రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5-37, సూర్యాస్తమయం: సా.6-16 డొల్లుకర్తరీ ప్రారంభం

మేషం
ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో పరిష్కారం కాని ఒక సమస్య ఇప్పుడు చక్కబడుతుంది. దుర్గాష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి.

వృషభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మాట ప్రకారం పనిచేయండి. మంచి జరుగుతుంది. చేసే పనిలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అన్నదానం చేస్తే మంచిది.

మిథునం
దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో శాంతంగా వ్యవహరించి అభివృద్ధి సాధిస్తారు. దుర్గాస్తుతి పఠించాలి.

కర్కాటకం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. దుర్గాస్తుతి మంచిది.

సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి.

కన్య
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన సౌఖ్యం కలదు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

తుల
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త పడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరి చేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

ధనుస్సు
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మకరం
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

కుంభం
మనోల్లాసాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

మీనం
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్ధిక పరంగా మేలు జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.





women icon@teamvasundhara
today-horoscope-details-14-05-2021
women icon@teamvasundhara
today-horoscope-details-11-05-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-05-2021
women icon@teamvasundhara
today-horoscope-details-03-05-2021

Movie Masala

Video Gallery