శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం ద్వాదశి: తె.4-22 తదుపరి త్రయోదశి శతభిషం: పూర్తి వర్జ్యం: మ.12-48 నుంచి 2-26 వరకు అమృతఘడియలు: రా.10-36 నుంచి 12-14 వరకు దుర్ముహూర్తం: ఉ.9-58 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.5-53, సూర్యాస్తమయం: సా.6-10
వైష్ణవ,మాధ్వ ఏకాదశి
మేషం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం కలదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.
వృషభం
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
మిథునం
చేపట్టిన పనులలో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివారాధన మంచినిస్తుంది.
కర్కాటకం
శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
సింహం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
కన్య
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
తుల
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
వృశ్చికం
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
మకరం
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. ఇష్టసల్లాపం ఉంది. కొత్తవస్తువులు కొంటారు. ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
మీనం
అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.