శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం; శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం; ఏకాదశి: తె.5-28 తదుపరి ద్వాదశి ధనిష్ఠ: తె.5-29 తదుపరి శతభిషం; వర్జ్యం: ఉ.9-23 నుంచి 10-59 వరకు అమృత ఘడియలు: రా.7-01 నుంచి 8-37 వరకు; దుర్ముహూర్తం: ఉ.11-37 నుంచి 12-26 వరకు; రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.6-10 స్మార్త ఏకాదశి
మేషం
మిశ్రమ కాలం. చేపట్టే పనుల్లో ఓర్పు, సహనం పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. శివ సహస్రనామ పారాయణ మంచినిస్తుంది.
వృషభం
కీలక వ్యవహారాలలో తోటివారి ఆలోచనలు మంచి చేస్తాయి. ధర్మసిద్ధి కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహ సూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. లక్ష్మీదేవి సందర్శనం మంచినిస్తుంది.
మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది.
కర్కాటకం
అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణం శుభప్రదం.
సింహం
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
కన్య
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
తుల
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు వచ్చే సూచనలున్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
ధనుస్సు
అదృష్టం వరిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.
మకరం
శ్రమ ఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. గోవింద నామాలు జపిస్తే మంచిది.
కుంభం
మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులను కలుస్తారు. దైవ బలం కాపాడుతోంది. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
మీనం
చేపట్టే పనుల్లో లాభాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో ఒకమెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.