scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పిల్లల కోసమైనా బతకాలనుకుంది.. కానీ కనికరం లేని కరోనా పగబట్టేసింది!'

'కరోనా ఉపద్రవంతో దేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటనలే కనిపిస్తున్నాయి. రోడ్లపై సాధారణ వాహనాల కంటే అంబులెన్స్‌ సైరన్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులు, ఆప్తులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతం. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు ఇలాంటి ఎన్నో హృదయ విదారక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీకి చెందిన ఓ వైద్యురాలు కరోనా కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో షేర్‌ చేసుకుంది. చదువుతుంటేనే కన్నీళ్లు తెప్పిస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.'

Know More

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 06-04-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం; శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం; నవమి: ఉ.5-58 తదుపరి దశమి తె.5-04; శ్రవణం: తె.5-23 తదుపరి ధనిష్ఠ; వర్జ్యం: ఉ.9-39 నుంచి 11-14 వరకు; అమృత ఘడియలు: రా.7-07 నుంచి 8-41 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-22 నుంచి 9-11 వరకు, తిరిగి రా.10-52 నుంచి 11-39 వరకు ; రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.5-55, సూర్యాస్తమయం: సా.6-10

మేషం
మధ్యమ ఫలితాలున్నాయి. చేసే పనిలో శ్రమ పెరుగుతుంది. అపార్ధాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా కానీయకండి. శివారాధన శుభప్రదం.

వృషభం
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆందోళనను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం.

మిథునం
పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. దుర్గారాధన శుభప్రదం.

కర్కాటకం
బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోతే ఇబ్బందులు తగ్గుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.

సింహం
అనుకూలమైన సమయం. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. కీలక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుల దైవారాధన మేలు చేస్తుంది.

కన్య
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

తుల
శుభకాలం. మీ ప్రతిభ, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయభేదాలు రానీయకండి. సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం పఠించాలి.

వృశ్చికం
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువివ్వడం వల్ల సమస్యలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే బాగుంటుంది.

ధనుస్సు
ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకుసాగాలి. గోసేవ చేయడం మంచిది.

మకరం
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి.

కుంభం
శుభ ఫలితాలున్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలు చేయకండి. దైవారాధన మానద్దు.

మీనం
శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం.





women icon@teamvasundhara
today-horoscope-details-20-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-15-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-02-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-30-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery