scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 05-04-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం అష్టమి: ఉ.7-27 తదుపరి నవమి పూర్వాషాఢ: ఉ. 6-23, తదుపరి ఉత్తరాషాఢ తె. 5-44, తదుపరి శ్రవణం వర్జ్యం: మ. 1-56 నుంచి 3-31 వరకు అమృత ఘడియలు: రాత్రి 11-24 నుంచి 12-59 వరకు దుర్ముహూర్తం: మ. 12-27 నుంచి 1-16 వరకు తిరిగి 2-54 నుంచి 3-43 వరకు రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు సూర్యోదయం: ఉ.5-56, సూర్యాస్తమయం: సా.6-10

మేషం
మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. ఎవరినీ అతిగా నమ్మకండి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

వృషభం
ఒకట్రెండు ఆటంకాలున్నా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. కొంత మంది పక్కనే ఉండి చాపకింద నీరులా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. శివారాధన మంచినిస్తుంది.

మిథునం
చేపట్టే పనులలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ప్రారంభించాలి. మీ శ్రమ ఫలిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు బాగా అలోచించి మాట్లాడాలి. సాయి బాబా సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

కర్కాటకం
తోటివారి సహాయంతో ప్రణాళికలను అమలు చేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి, ఇబ్బందులు తొలుగుతాయి. శివారాధన శుభప్రదం.

సింహం
మిత్రుల సహకారంతో అయోమయ స్థితులనుంచి బయటపడతారు. ఒక పనికి పది అడ్డంకులు వస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. కోపాన్ని దరిచేరనీయకండి. కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు మేలు చేస్తాయి. నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తే మంచిది.

కన్య
అనుకూలమైన సమయం. ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.

తుల
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వాదనలు రాకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం
ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురుశ్లోకం చదవాలి.

ధనుస్సు
మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

మకరం
గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈశ్వర సందర్శనం శక్తినిస్తుంది.

కుంభం
ప్రయత్న అనుకూలత ఉంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మీనం
ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. లక్ష్మీఅష్టోత్తరం పఠిస్తే ఇంకా మంచిది.

women icon@teamvasundhara
today-horoscope-details-20-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-15-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-02-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-30-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery