scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 03-04-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం; బహుళ పక్షం షష్ఠి: ఉ.11-21 తదుపరి సప్తమి జ్యేష్ఠ: ఉ.8-51 తదుపరి మూల వర్జ్యం: సా.4-24 నుంచి 5-54 వరకు తిరిగి తె.6-00 నుంచి అమృత ఘడియలు: రా.1-27 నుంచి 2-58 వరకు దుర్ముహూర్తం: ఉ.5-58 నుంచి 7-35 వరకు రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.6-09

మేషం
మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

వృషభం
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

మిథునం
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్ట దైవారాధన మంచిది.

కర్కాటకం
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. కొన్ని విషయాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

సింహం
ఒక మంచి వార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానద్దు.

కన్య
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చతుర్థంలో చంద్రస్థితి అనుకూలంగా లేదు. దుర్గాశ్లోకం చదివితే అన్ని విధాలా మంచిది.

తుల
మీరు పని చేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

వృశ్చికం
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలున్నాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు జరుగుతుంది.

ధనుస్సు
పట్టుదలతో పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. చంద్ర ధ్యానం శ్రేయోదాయకం.

మకరం
మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవింద నామాలు చదివితే మంచి జరుగుతుంది.

కుంభం
ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మీనం
అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-02-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-30-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery