scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 02-04-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం పంచమి: మ.1-37 తదుపరి షష్ఠి అనూరాధ: ఉ.10-24 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: మ.3-38 నుంచి 5-08 వరకు అమృత ఘడియలు: రా.12-37 నుంచి 2-07 వరకు దుర్ముహూర్తం: ఉ.8-24 నుంచి 9-12 వరకు తిరిగి మ.12-27 నుంచి 1-16 వరకు రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.5-58, సూర్యాస్తమయం: సా.6-09

మేషం
శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఆపదలు పెరుగుతాయి. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు. మనోబలం పెరగడానికి లక్ష్మీ స్తోత్రం పఠించాలి.

వృషభం
శుభకార్యాల్లో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సప్తమంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదవాలి.

మిథునం
మనః సౌఖ్యం ఉంది. కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తికావచ్చు. చేసే పనిలో లాభాలున్నాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

సింహం
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన చేస్తే మేలు జరుగుతుంది.

కన్య
శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదివితే ఆత్మశక్తి పెరుగుతుంది.

తుల
చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే మంచిది.

వృశ్చికం
శుభ ఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సూర్యాష్టకం పఠిస్తే శుభదాయకం.

ధనుస్సు
మంచి ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయోదాయకం.

మకరం
చేపట్టే పనుల్లో అలసట పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో కలహ సూచన. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ గణపతి ఆరాధనా శుభప్రదం.

కుంభం
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. కొన్ని కీలకమైన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే సమయంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం మంచిది. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

మీనం
అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే శుభదాయకం.

women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-03-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-30-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery