శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం చవితి: మ.3-54 తదుపరి పంచమి విశాఖ: ఉ.11-56 తదుపరి అనూరాధ వర్జ్యం: మ. 3-40 నుంచి 5-10 వరకు అమృత ఘడియలు: రా.12-40 నుంచి 2-10 వరకు దుర్ముహూర్తం: ఉ.10-02 నుంచి 10-50 వరకు తిరిగి మ.2-53 నుంచి 3-42 వరకు రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5-59, సూర్యాస్తమయం: సా.6-08
మేషం
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారున్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సాయిబాబా సందర్శనం ఉత్తమం.
వృషభం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
మిథునం
అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.
కర్కాటకం
చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవస్తుతి శక్తినిస్తుంది.
సింహం
అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
కన్య
సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలున్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
తుల
గ్రహబలం తక్కువగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.
వృశ్చికం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
ధనుస్సు
మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
మకరం
చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన మానద్దు.
కుంభం
చేపట్టిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి.
మీనం
గ్రహ బలం అనుకూలంగాఉంది. పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. చేసే ప్రతి పని అనుకూలతపిస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.