శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం తదియ: సా.6.24 తదుపరి చవితి స్వాతి: మ.1.44 తదుపరి విశాఖ వర్జ్యం: సా.6.55 నుంచి 8.23 వరకు ,అమృత ఘడియలు: ఉ.7.01 వరకు తిరిగి తె. 3.48 నుంచి 5.17 వరకు దుర్ముహూర్తం: ఉ.11.40 నుంచి 12.28 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.6-00, సూర్యాస్తమయం: సా.6-09
సంకటహర చతుర్ధి
మేషం
ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
వృషభం
ఉత్సాహంతో ముందుకు సాగండి, సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.
మిథునం
మధ్యమ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహ సూచన ఉంది. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి.
కర్కాటకం
మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం సహకరిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.
సింహం
ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్ట దైవారాధన శుభప్రదం.
కన్య
చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఎవరితోను వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
తుల
చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
వృశ్చికం
తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గాష్టోత్తరం చదవడం మంచిది.
ధనుస్సు
మనఃసౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
మకరం
మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.
కుంభం
తలపెట్టిన పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. దుర్గాష్టోత్తర శతనామావళి చదవాలి.
మీనం
మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికై చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.