scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 30-03-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం విదియ: రా.8-48 తదుపరి తదియ చిత్త: మ.3-20 తదుపరి స్వాతి వర్జ్యం: రా.8-33 నుంచి 10-03 వరకు అమృత ఘడియలు: ఉ.9-19 నుంచి 10-49 వరకు తిరిగి తె. 5.31 వరకు దుర్ముహూర్తం: ఉ.8-25 నుంచి 9-14 వరకు తిరిగి రా. 10-52 నుంచి 11-40 వరకు రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.6-00, సూర్యాస్తమయం: సా.6-08

మేషం
ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరుగకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

వృషభం
ఒక శుభవార్త మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మిథునం
కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

కర్కాటకం
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు నామస్మరణ ఉత్తమ ఫలాలను ఇస్తుంది.

సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

కన్య
చేపట్టిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానద్దు.

తుల
ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయభేదాలు వస్తాయి. దుర్గ స్తోత్రం పఠించాలి.

వృశ్చికం
మంచి మనసుతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. చంచల స్వభావం ఇబ్బంది పెడుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. దత్తాత్రేయ సహస్రనామావళి పఠించడం మంచిది.

మకరం
మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరవద్దు. సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రం పఠించాలి.

కుంభం
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. దైవస్మరణ మానద్దు.

మీనం
శుభఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.

women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-03-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-31-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery