శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;బహుళ పక్షం పాడ్యమి: రా.11-02 తదుపరి విదియ హస్త: సా.4-58 తదుపరి చిత్త వర్జ్యం: రా.12-19 నుంచి 1-49 వరకు అమృత ఘడియలు: ఉ.11-06 నుంచి 12-37 వరకు దుర్ముహూర్తం: మ.12-28 నుంచి 1-17 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-42 వరకు రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు సూర్యోదయం: ఉ.6-01, సూర్యాస్తమయం: సా.6-08
మేషం
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
వృషభం
శుభ ఫలితాలున్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
మిథునం
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం
కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.
సింహం
మనఃసౌఖ్యం ఉంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
కన్య
ధృడమైన మనసుతో ముందుకు సాగండి, ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
తుల
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలు పెట్టిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయి బాబా సచ్ఛరిత్ర పఠిస్తే బాగుంటుంది.
వృశ్చికం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్యారాధన చేస్తే మంచిది.
ధనుస్సు
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవారాదన మానద్దు.
మకరం
ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభం
మనస్తాపం చెందకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
మీనం
కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.