scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 27-03-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;శుక్ల పక్షం చతుర్దశి: రా.2-50 తదుపరి పూర్ణిమ పుబ్బ: రా.6-59 తదుపరి ఉత్తర వర్జ్యం: రా.1-54 నుంచి 3-26 వరకు అమృత ఘడియలు: మ.12-45 నుంచి 2-17 వరకు దుర్ముహూర్తం: ఉ.6-02 నుంచి 7-38 వరకు రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ.6-02, సూర్యాస్తమయం: సా.6-07

మేషం
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది.

వృషభం
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయారాధన శుభప్రదం.

మిథునం
మనోధైర్యంతో ప్రయత్నించి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచిది.

కర్కాటకం
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

సింహం
మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కన్య
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం మంచిది.

తుల
మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

వృశ్చికం
మీ ప్రతిభ, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి.

ధనుస్సు
చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అవసరానికి సహాయం చేసే వారుంటారు. అతిగా ఎవరినీ నమ్మరాదు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానద్దు.

కుంభం
చేపట్టిన పనులను పూర్తి చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మీనం
బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో కొన్ని ముఖ్య విషయాలలో అభిప్రాయబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. దైవారాధన మానవద్దు.

women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-03-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-31-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-26-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery