శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;శుక్ల పక్షం త్రయోదశి: తె.4-16 తదుపరి చతుర్దశి మఘ: రా.7-35 తదుపరి పుబ్బ వర్జ్యం: ఉ.7-39 నుంచి 9-19 వరకు తిరిగి తె.3-23 నుంచి 4-56 వరకు అమృత ఘడియలు: సా.5-11 నుంచి 6-46 వరకు దుర్ముహూర్తం: ఉ.8-27 నుంచి 9-16 వరకు తిరిగి మ.12-29 నుంచి 1-17 వరకు రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు సూర్యోదయం: ఉ.6-03, సూర్యాస్తమయం: సా.6-07
మేషం
మధ్యమ ఫలితాలున్నాయి. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తపడాలి. సంతోషంగా ఉంటారు. గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శివుని సందర్శనం మేలు చేస్తుంది.
వృషభం
ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.
మిథునం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితాదేవి నామస్మరణ చేస్తే మంచిది.
కర్కాటకం
మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
సింహం
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.
కన్య
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.
వృశ్చికం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన వ్యవహరంలో ఆర్థిక సాయం లభిస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే శుభదాయకం.
ధనుస్సు
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.
మకరం
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలం కోసం దుర్గాష్టోత్తర శతనామావళి పఠించాలి.
కుంభం
యశోవృద్ధి కలదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.
మీనం
విశేషమైన శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మి సందర్శనం శుభప్రదం.