శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;శుక్ల పక్షం ద్వాదశి: తె.5-18 తదుపరి త్రయోదశి ఆశ్లేష: రా.7-45 తదుపరి మఘ వర్జ్యం: ఉ.8-24 నుంచి 10-01 వరకు అమృత ఘడియలు: సా.6-08 నుంచి 7-45 వరకు దుర్ముహూర్తం: ఉ.10-05 నుంచి 10-53 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-42 వరకు రాహుకాలం: మ.1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.6-04, సూర్యాస్తమయం: సా.6-07 వైష్ణవ, మాధ్వ ఏకాదశి
మేషం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.
వృషభం
అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మిథునం
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం వల్ల ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.
కర్కాటకం
ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది.
సింహం
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
కన్య
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.
తుల
మిశ్రమ కాలం. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. చేపట్టే పనిలో బద్ధకం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
ఉద్యోగంలో ఆటంకాలున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. నారాయణ మంత్రాన్ని జపించాలి.
ధనుస్సు
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానద్దు.
మకరం
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.
కుంభం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.
మీనం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.