scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 24-03-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;శుక్ల పక్షం ఏకాదశి: తె.5-33 తదుపరి ద్వాదశి పుష్యమి: రా.7-28, తదుపరి ఆశ్లేష వర్జ్యం: లేదు అమృత ఘడియలు: మ.12-51 నుంచి 2-30 వరకు దుర్ముహూర్తం: మ.11-41 నుంచి 12-30 వరకు రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ.6-05, సూర్యాస్తమయం: సా.6-07

స్మార్త ఏకాదశి

మేషం
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.

వృషభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్యారాధన మేలు చేస్తుంది.

మిథునం
ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం
ప్రయత్న కార్యానుకూలత ఉంది. అభివృధ్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

సింహం
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

కన్య
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది.

వృశ్చికం
మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. శుభకార్యక్రమాలలో పాల్గొని బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

ధనుస్సు
గ్రహబలం తక్కువగా ఉంది. మనసు చెడ్డ పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి. సూర్యారాధన శుభప్రదం.

మకరం
శుభాలు చేకూరుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

కుంభం
చక్కటి వ్యూహాలతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మీనం
ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. స్థానచలన సూచనలున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

women icon@teamvasundhara
today-horoscope-details-10-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-07-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-03-04-2021
women icon@teamvasundhara
today-horoscope-details-31-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-27-03-2021
women icon@teamvasundhara
today-horoscope-details-23-03-2021

Movie Masala

Video Gallery