శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణమాసం;శుక్ల పక్షం దశమి: తె.5-57 తదుపరి ఏకాదశి పునర్వసు: సా.6-41 తదుపరి పుష్యమి వర్జ్యం: ఉ.శే.7-44 వరకు తిరిగి తె.2-57 నుంచి 4-36 వరకు అమృత ఘడియలు: సా.4-09 నుంచి 5-50 వరకు దుర్ముహూర్తం: ఉ.8-30 నుంచి 9-18 వరకు తిరిగి రా.10-54 నుంచి 11-42 వరకు రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.6-06, సూర్యాస్తమయం: సా.6-07
మేషం
పనిచేస్తున్న రంగంలో కీర్తి పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు తగిన సహాయం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచిది.
వృషభం
మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో ధన లాభం ఉంది. లక్ష్మి నామస్మరణ మంచిది.
మిథునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభదాయకం.
కర్కాటకం
ధైర్యంగా చేసే పనులు గొప్ప లాభాన్నిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఉత్తమం.
సింహం
చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువివ్వడం ద్వారా ఇంటగెలుస్తారు. మనో విచారం కలగకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.
కన్య
శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. మంచి భోజన సౌఖ్యం కలదు. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానద్దు.
తుల
శ్రమ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
వృశ్చికం
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
ధనుస్సు
విజయకాంక్ష నెరవేరుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
మకరం
లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. దుర్గాదేవి ధ్యానం శుభదాయకం.
కుంభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందడుగు వేయాలి. కీలక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సందర్శనం ఉత్తమం.
మీనం
వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా శుభ సమయం. ఇష్టదేవతా సందర్శనం మేలు చేస్తుంది.