scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 23-2-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం  శిశిర రుతువు; మాఘమాసం;శుక్ల పక్షం  ఏకాదశి: మ.3-18 తదుపరి ద్వాదశి  ఆర్ద్ర: ఉ.10-10 తదుపరి పునర్వసు  వర్జ్యం: రా.10-45 నుంచి 12-25 వరకు  అమృత ఘడియలు: ఉ.8-49 నుంచి 10-30 వరకు  దుర్ముహూర్తం: ఉ.8-45 నుంచి 9-31 వరకు  తిరిగి రా.10-58 నుంచి 11-48 వరకు  రాహుకాలం: సా.3-00 నుంచి 4-30 వరకు  సూర్యోదయం: ఉ.6-27, సూర్యాస్తమయం: సా.6-00  భీష్మ ఏకాదశి

మేషం
మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

వృషభం
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

మిథునం
మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం.

కర్కాటకం
మనః సౌఖ్యం కలదు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన ఉత్తమం.

సింహం
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవారాధన మానవద్దు.

కన్య
దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం మంచిది.

తుల
ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం మంచిది కాదు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం
మనోబలంతో ముందుకు సాగాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన ఉత్తమం.

ధనుస్సు
శుభ సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆంజనేయ స్వామి దర్శనం శుభదాయకం.

మకరం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపం చేస్తూ కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కుంభం
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనః సౌఖ్యం ఉంది. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మంచిది.

మీనం
ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

women icon@teamvasundhara
today-horoscope-details-25-02-2021
women icon@teamvasundhara
today-horoscope-details-20-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-17-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-13-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-10-2-2021

Movie Masala

Video Gallery