scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నేటి రాశిఫలాలు

Today Horoscope details 19-2-2021

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర రుతువు; మాఘమాసం;శుక్ల పక్షం సప్తమి: ఉ.8-57 తదుపరి అష్టమి కృత్తిక: తె.4-01 తదుపరి రోహిణి వర్జ్యం: మ.2-43 నుంచి 4-29 వరకు అమృత ఘడియలు: రా.1-21 నుంచి 3-07 వరకు దుర్ముహూర్తం: ఉ.8-46 నుంచి 9-32 వరకు తిరిగి మ.12-36 నుంచి 1-22 వరకు రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.6-29, సూర్యాస్తమయం: సా.5-58 రథసప్తమి, భీష్మాష్టమి

మేషం
మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణి వీడండి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

వృషభం

ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

మిథునం
అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కర్కాటకం
మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. వృథా ఖర్చులు లేకుండా జాగ్రత్తపడాలి. శివారాధన శుభప్రదం.

సింహం
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం.

కన్య
చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభ ఫలితాలనిస్తుంది.

తుల
ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మీ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాన్ని తీసుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. ఇష్టదైవ స్తోత్రం పఠిస్తే మంచిది.

వృశ్చికం
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుడిని ఆరాధిస్తే ఉత్తమం.

ధనుస్సు
బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరిత వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది.

మకరం
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావివ్వకండి. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. మనస్సు చెడును ఊహిస్తుంది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. దైవారాధన మానవద్దు.

కుంభం
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచి తూచి ముందుకు సాగాలి. పట్టుదలతో ముందుకు సాగితే ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. గణపతి సందర్శనం శుభప్రదం.

మీనం
మీ మీ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

women icon@teamvasundhara
today-horoscope-details-25-02-2021
women icon@teamvasundhara
today-horoscope-details-22-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-17-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-13-2-2021
women icon@teamvasundhara
today-horoscope-details-10-2-2021

Movie Masala

Video Gallery