బుజ్జాయిలకూ జలకాలాట!
అడపాదడపా వర్షాలు పడినా... ఆ చల్లదనం కొద్దిసేపే కదూ! పగలు వేడి, దానికితోడు ఉక్కబోత. ఈ చిరాకుకి ఎన్నిసార్లు స్నానం చేసినా తక్కువే అనిపిస్తుంది. అయితే ఈ ఇబ్బంది మనకే కాదు పసివాళ్లకీ ఉంటుంది. అందుకే వాళ్లనీ నీటిలో కాసేపు ఆడుకోనివ్వండి. దీనివల్ల బోలెడు అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. చక్కగా నిద్రపడుతుంది, చర్మం మృదువుగా అవుతుందని రోజూ వేడినీటి స్నానాలు, నలుగు పెట్టడం వంటివి చేయొద్దు.