Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా సాగిన ఈఎస్‌ఎల్‌ క్రికెట్‌ పోటీలు శనివారంతో ముగిశాయి. గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించి, వారిలో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈనాడు- స్ప్రైట్‌ ఆధ్వర్యంలో జిల్లా/ప్రాంతీయ/ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. రాష్ట్ర స్థాయి ఫైనల్స్‌ పోటీల్లో సత్తా చాటి విజేతలుగా నిలిచినవారికి శనివారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రికెట్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాలతో పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడా పోటీల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌, ఈఎస్‌ఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ పుల్లెల గోపీచంద్‌, ఈనాడు ఎండీ సీహెచ్‌.కిరణ్‌ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో పలువురు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా వివిధ క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటారు. ఈ క్రమంలో వివిధ క్రీడల్లో సత్తా చాటి బహుమతులు గెలుచుకున్న మహిళా విజేతల వివరాలివే...

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న శ్వేత వారాంత సెలవుల్ని తన సోదరి ఇంటి వద్ద గడిపి తిరిగి హాస్టల్‌కి వెళ్తోంది. ఆమె కోసం కోల్‌కతాలో ఉన్న ఆమె తండ్రి ఓ క్యాబ్‌ బుక్‌ చేశాడు. అయితే ఆమెను సురక్షితంగా తీసుకెళ్లాల్సిన ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. అదృష్టవశాత్తూ ఆమె అక్కడి నుంచి తప్పించుకోగా సదరు క్యాబ్ డ్రైవర్‌ను యాజమాన్యం విధుల నుంచి తప్పించి పోలీసులకు అప్పగించింది. ఇలా శ్వేత ఒక్కరే కాదు.. దేశ వ్యాప్తంగా క్యాబ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న చాలామంది స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న దుస్థితే ఇది. అందుకే దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ స్త్రీల రక్షణ కోసం ‘ఫర్‌ ఉమెన్‌, బై ఉమెన్‌’ అంటోంది. అంటే ఏంటో? తెలుసుకుందాం రండి...

మనకున్న రెండు కళ్లల్లో ఒక కన్ను మూసుకొని మరో కంటితో ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది ? కష్టం... అలా చూస్తే ఎంతటి అందమైనా మనసుకింపుగా ఉండదు... కదూ ! మరి సృష్టిలో ఒక భాగమైన స్త్రీ, పురుషుల్లో ఎవరో ఒక్కరే మనకు అన్ని విషయాలను చెబుతుంటే... నాణానికి రెండో వైపు ఎవరు చెబుతారు ? మరో కోణంలో ప్రపంచాన్ని ఎలా చూస్తాం ? అమ్మ, నాన్నల్లో ఎప్పుడూ ఏ ఒక్కరి మాటే మనం వినగలమా ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు. అందుకు కారణం... ఇటీవల 92వ ఆస్కార్‌ ఉత్తమ దర్శకుల నామినేషన్లలో ఏ ఒక్క మహిళా దర్శకురాలి పేరు లేకపోవడమే ! ఆ ఏముంది ? మహిళా దర్శకులెవరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉండరులే ! అంటారా ? అయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ! ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో మహిళా దర్శకులు చిత్రాలను తెరకెక్కించారు. వాటిలో సూపర్‌ హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌ కూడా ఉన్నాయి. మరెందుకు మహిళా దర్శకులకు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కలేదు ? ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ లేనంతగా సినీ అభిమానులు ఈసారి ఎందుకు ఆస్కార్‌ నామినేషన్లపై అసంతృప్తితో ఉన్నారు ? తెలుసుకుందాం రండి !

విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన మన దేశంలో అత్యంత వివాదాస్పదమైన సాంస్కృతిక క్రీడ జల్లికట్టు. మగవారి ధైర్యసాహసాలకు ప్రతీకగా తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే ! అయితే స్త్రీలకూ ఓ జల్లికట్టు ఉందనే విషయం మీకు తెలుసా ? ఇదీ తమిళనాడులోనే జరుగుతుందని ఎప్పుడైనా విన్నారా ? తెలీదంటే ఇప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిందే ! ఎందుకంటే మగవారి జల్లికట్టులో ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ ఉంటే స్త్రీల జల్లికట్టులో ‘ఫన్‌’ మాత్రమే ఉంటుంది. అది కూడా.. ఎదురుగా వస్తే కుమ్మిపడేసే ఎద్దులతో కాదు.. కోళ్లతో ! ఆశ్చర్యంగా ఉంది కదూ ! మరీ ఫన్నీ కథేంటో తెలుసుకుందాం రండి !

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న సామాజిక సమస్యల్లో మహిళల భద్రత కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మగువలపై జరుగుతోన్న అఘాయిత్యాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతికంగా మనం ఎంత ముందున్నా.. మహిళల భద్రత విషయంలో మాత్రం ఇంకా ఎంతో వెనుకబడే ఉన్నామని ఆడవాళ్లపై కొనసాగుతోన్న దుర్ఘటనలు మనకు గుర్తు చేస్తున్నాయి. స్కూల్‌లో, బస్సులో, కాలేజీలో, హాస్టల్‌లో, ఆఫీస్‌లో, పబ్లిక్‌ ప్రదేశాల్లో.. ఇలా ఆడవాళ్లకు ఎక్కడా భద్రతా లేకుండా పోతోంది. ఇంట్లో నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే చాలని కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థించే స్థితికి మనం చేరుకోవడం దురదృష్టకరం. వీటివల్ల ఆడవాళ్లు మానసికంగా బాగా కుంగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషులు ఆడవాళ్లపై దాడికి పాల్పడకపోయినా వాళ్లు చేసే వింత చేష్టలు, కల్పించే ఇబ్బందికర పరిస్థితులు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి అనుభవాలు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ ఎదురవుతుండడం గమనార్హం. ఈక్రమంలో బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌కి కూడా ఇటీవల ఇలాంటి ఓ చేదు అనుభవమే ఎదురైంది. తను ఇటీవలే లండన్‌లో క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. క్యాబ్‌ డ్రైవర్‌ ప్రవర్తన తనను చాలా ఇబ్బంది పెట్టిందని సోనమ్‌ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

‘బ్యాటు-బంతి రెండు చూడ చక్కగుండు... చూడ చూడ జోష్‌ పెరుగుతుండు, క్రీడలందు క్రికెట్‌ క్రీడ వేరయా... విశ్వదాభిరామ... వరల్డ్‌ కప్‌ మనదే రామ !’ అని ఆనందంగా పాడుకుంటున్నారు క్రికెట్‌ అభిమానులు. వారు అలా జోష్‌ఫుల్‌గా ఉండడానికి కారణం లేకపోలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో ప్రారంభమయ్యే మహిళా టీ20 వరల్డ్‌ కప్‌ పోటీలకు ఇటీవలే భారత మహిళల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో అందరూ భావించినట్లు చిచ్చర పిడుగు షెఫాలీ వర్మ చోటు సంపాదించగా, ఈ ప్రపంచకప్‌తో రిచా ఘోష్‌ తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెడుతోంది. ఇక తెలంగాణ క్రికెటర్‌ అరుంధతీ రెడ్డి కూడా ఈ మెగా టోర్నీలో చోటుదక్కించుకుంది. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ 22 ఏళ్ల హైదరాబాదీ పేసర్‌కిది రెండో ప్రపంచకప్‌. మిథాలీ రాజ్‌ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు క్రికెటర్‌ అరుంధతినే కావడం విశేషం. మరి ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరినీ అలరించేందుకు రడీ అవుతోన్న ఈ మెగా క్రికెట్‌ ఈవెంట్‌కు మన మహిళల టీమ్‌ స్క్వాడ్‌ ఎలా ఉందో ఓసారి చూద్దాం రండి !

‘అసలు లిప్‌స్టిక్‌ని పెదాలకు మాత్రమే ఎందుకు వాడాలి ?’ మన్మథుడు చిత్రంలో నాగార్జున ఇలా ఆలోచించే లిప్‌బామ్‌ను కళ్లకు కాటుకలా వాడతాడు. ఈ సన్నివేశం చూసినప్పుడల్లా ఇలాంటి వింత మనుషులు కూడా ఉంటారా అనిపించకమానదు. అయితే నిజజీవితంలోనూ ఇలాంటి వారు ఉంటారని నిరూపిస్తున్నారు ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ముగ్గురు మహిళలు. ఒక మహిళ టీలో బిస్కట్‌కు బదులుగా చికెన్‌ నంజుకు తింటే... ఇంకో మహిళ ఆస్పరాగస్‌ మొక్కతో భవిష్యవాణి చెబుతోంది. ఇక మరో మహిళ స్నేహితులతో ఆడిపాడటానికి నాలుగు గంటల ముందే న్యూ ఇయర్‌ను జరుపుకుంది. అసలు వీళ్లెందుకలా చేశారు ? అని ఆశ్చర్యంగా ఉందా ! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే!