Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

ఒకప్పుడు టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది నటి ఛార్మి. ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’, ‘జ్యోతి లక్ష్మి’ వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అద్భుత నటనను కనబరిచి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఛార్మి తాజాగా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీజగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌పై ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిందీ ముద్దుగుమ్మ. ఇక ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ముంబయిలో జరుగుతోంది. ఈక్రమంలో ముంబయికి మకాం మార్చిన ఛార్మి.. అక్కడ తెగ సందడి చేస్తోంది. షూటింగ్‌కు సంబంధించిన వివరాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోందీ భామ. ఇక తాజాగా షూటింగ్‌ స్పాట్‌లో తన పెంపుడు శునకాలను పట్టుకొని.. నవ్వుతూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘సంతోషంగా ఉండడానికి ప్రతిఒక్కరూ అర్హులే’ అనే క్యాప్షన్‌ను జోడించింది.

సుమారు 19 ఏళ్ల క్రితం ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఆంగ్ల సినిమాల్లోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు పవన్‌, ప్రభాస్‌, మహేశ్‌ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఈ అందాల తార 2018 మార్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ఆండ్రీ కొశ్చీవ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఆమె, ఇప్పటివరకు ఎప్పుడూ తన భర్త గురించి కానీ, తన ప్రేమకథ గురించి కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ, పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

మాఘ మాసం మొదలు కావడంతో ప్రస్తుతం దేశమంతా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా బాజా భజంత్రీలే, పెళ్లిళ్ల ఫంక్షన్ల హడావిడే కనిపిస్తోంది. ఇక సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే ‘పెళ్లి సందడి’ మామూలుగా ఉండడం లేదు. సుందరంగా తీర్చిదిద్దిన వివాహ వేదికలు, సంగీత్‌లు, బారాత్‌లు, హల్దీ-మెహెందీ.. లాంటి ఫంక్షన్లతో ఫుల్‌ హంగామాతో ప్రముఖుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరీనా సోదరుడు, బాలీవుడ్‌ నటుడు అర్మాన్‌ జైన్‌, అనీసా మల్హోత్రాల వివాహం ముంబై వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం కన్నుల పండువలా సాగిన ఈ శుభకార్యానికి కరీనా, కరిష్మాతో పాటు ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటారు. బ్యూటీపార్లర్‌లో ప్రత్యేకంగా మసాజ్, ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యూర్ లాంటివి కూడా చేయించుకొంటారు. దీంతో పెళ్లికూతురు మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చాలామంది వివాహమైన తర్వాత కూడా ఆ మెరుపును కొనసాగించడంలో విఫలమవుతుంటారు. దీంతో వారి అందం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఇలా కాకుండా.. వివాహమైన తర్వాత కూడా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి అవేంటో తెలుసుకొందామా..

చాలామంది తల్లిదండ్రులు త్వరలో పెళ్లి కాబోయే వధూవరులకు కామన్‌గా చెప్పే మాట ఒకటుంది. అదేంటంటే.. ‘జీవితంలో కష్టసుఖాలనేవి వస్తుంటాయి, పోతుంటాయి.. అవసరమైనప్పుడు సర్దుకుపోవాలి, ఎవరో ఒకరు రాజీపడాలి’ అని. అయినా కూడా ఈరోజుల్లో చాలామంది భార్యాభర్తలు, ఎప్పుడూ నేనే రాజీపడాలా ? అన్నిటికీ నేనే సర్దుకోవాలా ? అనే మంకుపట్టుతో జీవితాలను ఛిద్రం చేసుకుంటున్న సందర్భాలు అనేకం చూస్తూనే ఉన్నాం. మరి ఇలా ఎప్పుడో పెళ్లైన వారు గొడవ పడితే మామూలే అనుకోవచ్చు. కానీ రేపో మాపో పెళ్లిచేసుకోబోయేవారు కూడా గొడవ పడితే ? అదీ ఆన్‌లైన్‌లో అందరి సమక్షంలో అయితే? ఇదెక్కడి విడ్డూరం... అనాల్సిందే ! మరి ఈ వింత కథేంటో మనమూ తెలుసుకుందాం రండి...

మనిషి జీవితంలో పెళ్లికి ఓ ప్రత్యేక స్థానముంది. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో దుస్తులు , మండపం, డెకరేషన్‌, శుభలేఖలు, భోజనాలు, ఫొటోగ్రఫీ.. ఇలా పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కొత్తదనం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈక్రమంలో ఈతరం జంటల్లో చాలామంది ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ పద్ధతిని ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర తీరంలో, జలపాతం వద్ద, ఆకాశ మార్గంలో, మంచు పర్వతాల మధ్య.. ఇలా రకరకాల ప్రదేశాల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలను మనం చూసుంటాం. కానీ, అగ్నిపర్వతం బద్దలవుతుండగా దానికి అతి చేరువలో వివాహం చేసుకున్న జంటను మీరెప్పుడైనా చూశారా..? అవును.. మీరు విన్నది నిజమే..! ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ అందమైన కపుల్‌ అక్కడున్న తాల్‌ అగ్నిపర్వతానికి సమీపంలో తమ పెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీసిన తమ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పెళ్లంటేనే సరదాలు, సంతోషాల సమ్మేళనం. జీవితంలో వచ్చే అతి పెద్ద వేడుక కాబట్టి.. దీనిని వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయే లాగా జరుపుకోవాలని కోరుకోవడం సహజం. పందిరి దగ్గర నుంచి భోజనాల మెనూ వరకు.. శుభలేఖల మోడల్‌ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ వరకు.. ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యానికి గురి చేయడానికి ఒక్కోసారి వింత ప్రయత్నాలు చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఆ ప్రయత్నం విజయవంతమై అందరి ప్రశంసలందుకుంటే ఫర్వాలేదు.. కానీ, అవి వికటిస్తే మాత్రం నలుగురి ముందు నవ్వుల పాలవ్వడంతో పాటు పలు రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఓ సంఘటన ఇటీవలే మలేషియాలో జరిగింది. మరి అదేంటో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా ఈ వేడుకను జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఇక పెళ్లిలో ఫొటోల ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఈ మధ్యన సెలబ్రిటీలు, సినీతారలు ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ అంటూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు . సామాన్యులు కూడా వారిని అనుసరిస్తూ స్పెషల్‌ థీమ్స్‌తో ఈ ఫొటో షూట్‌లు తీయించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ జంట కూడా ఇలాగే ఫొటోషూట్‌ తీయించుకుంది. అయితే అందరిలా కేవలం రొమాంటిక్‌ స్టిల్స్‌కే పరిమితం కాకుండా, ఓ సామాజిక అంశాన్ని జోడిస్తూ ఈ ఫొటోషూట్‌ తీయించుకుంది.

పెళ్లికి ముందు పదేళ్లు ప్రేమలో ఉన్నా..ఏనాడూ పెద్దగా వార్తల్లో నిలవని జంట సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌. బ్యాడ్మింటన్‌ అకాడమీలో మొదలైన వీరిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. కానీ ఆ ప్రేమ బంధం పెళ్లి పీటలెక్కడానికి పదేళ్లు పెట్టింది. అందుకు కారణం.. ప్రేమతో పాటు బ్యాడ్మింటన్‌ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించిన ఈ జంట..అందులో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాకే ఒక్కటవుదామని నిశ్చయించుకోవడం.. పెద్దల అంగీకారంతో గతేడాది ఇదే రోజు (డిసెంబర్‌ 18న) ఏడడుగులు నడిచారీ లవ్‌ బర్డ్స్‌. ఈ క్రమంలో తమ మొదటి పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాదు తమ జీవితంలోని తీపి గుర్తులను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.