Registration

Name

 

Gender

 

Age

 

Email

  

Phone

  

Location

 

Address


Close

Forgot Password

  

Your Password Has Been Sent To Your Registered EMail

close

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ప్రపంచమంతా అరచేతిలో ఉన్నట్లే. ఇక సామాజిక మాధ్యమాల కారణంగా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ వేలకొద్దీ వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు ఆనందాన్ని పంచితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అప్పుడప్పుడు మనకు స్ఫూర్తినిచ్చే వీడియోలు కూడా ఇందులో ఉంటాయి. అలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక మహిళా సీఈవో తన ఉద్యోగులతో కలిసి డ్యాన్స్‌ చేసి ఫ్రెండ్లీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తే, వయొలిన్‌ వాయిస్తూ తన సర్జరీ ఒత్తిడిని చిత్తు చేసింది మరో మహిళ. ఇక మరో వీడియోలో కొవిడ్‌-19 వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఒంటి నిండా జిరాఫీ కాస్ట్యూమ్స్ ధరించి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వైరస్‌. చైనాలో మొదలైన ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి ఇప్పటికే వందల మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా 31,493 మందికి ఈ వైరస్‌ సోకగా.. వీరిలో 4,824 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది. చైనాలో కరోనా బారిన పడి గురువారం (ఫిబ్రవరి 6) ఒక్కరోజే 73 మంది మరణించినట్లు తాజాగా అధికారులు తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా సహా ఇతర దేశాల ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టాయి. ఈ వైరస్‌ విజృంభణను దృష్టిలో ఉంచుకొని కొద్దిరోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ని ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలో బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చైనా వైద్య బృందం నిరంతరంగా శ్రమిస్తోంది. ఇది అంటువ్యాధి అని తెలిసినప్పటికీ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు అక్కడి డాక్టర్లు, నర్సులు. ఈ క్రమంలో కొంతమంది వైద్యులకు వైరస్‌ సోకడం బాధాకరం. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందించి అలసి సొలసిన కొందరు చైనా డాక్టర్లు, నర్సుల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల వెనకున్న కథేంటో మీరే చూడండి.

పెళ్లంటే జీవితంలో ఒకేసారి వచ్చే పండగ. సరదాలు, సంతోషాల సమ్మేళనమైన ఈ వేడుకను వీలైనంత వినూత్నంగా, అందంగా, పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటారు. వెడ్డింగ్‌ కార్డ్స్‌ మొదలు వివాహ వేదికలు, భోజనాలు, సంగీత్‌లు, బారాత్‌లు..ఇలా అన్ని విషయాల్లోనూ కొత్తదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులతో, వివిధ కార్యక్రమాలతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఓ వధువు డ్యాన్స్‌ చేస్తూ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. తోడు పెళ్లి కూతుళ్లతో కలిసి ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌కు వేదికపై కూర్చున్న వరుడు, అతిథులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ‘డేకేర్‌ సెంటర్‌’లు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ఉద్యోగాల కారణంగా భార్యాభర్తలిద్దరూ బయటకు వెళుతుండడం, ఇంట్లో చిన్నారులను చూసుకోవడానికి పెద్దవాళ్లెవరూ లేకపోవడంతో మరో మార్గం లేక చిన్నారులను డేకేర్‌ సెంటర్లలో చేర్పిస్తున్నారు. వేలకు వేలు పోసి మరీ ఇలాంటి సెంటర్లలో పిల్లల్ని చేర్పిస్తున్నారు సరే... మరి వాటి నిర్వాహకులు మీ పిల్లలను ఎంత వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని డేకేర్‌ సెంటర్ల సిబ్బంది నిర్వాకాలు చిన్నారుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన చేతులే వారి పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక డేకేర్‌ సెంటర్‌ టీచర్‌ ఓ చిన్నారి పట్ల చూపిన అలక్ష్యం పైత్యానికి పరాకాష్టగా నిలిచింది. అయితే ఆ చిన్నారి తల్లి మాత్రం అందరిలా ఊరుకోలేదు.. ఆ టీచర్‌ బాగోతాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. మరి ఆ టీచర్‌ అంతలా చేసిన పనేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే స్టోరీలోకి వెళ్దాం పదండి.

మనిషి జీవితంలో పెళ్లికి ఓ ప్రత్యేక స్థానముంది. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో దుస్తులు , మండపం, డెకరేషన్‌, శుభలేఖలు, భోజనాలు, ఫొటోగ్రఫీ.. ఇలా పెళ్లికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కొత్తదనం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈక్రమంలో ఈతరం జంటల్లో చాలామంది ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ పద్ధతిని ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. సముద్ర తీరంలో, జలపాతం వద్ద, ఆకాశ మార్గంలో, మంచు పర్వతాల మధ్య.. ఇలా రకరకాల ప్రదేశాల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలను మనం చూసుంటాం. కానీ, అగ్నిపర్వతం బద్దలవుతుండగా దానికి అతి చేరువలో వివాహం చేసుకున్న జంటను మీరెప్పుడైనా చూశారా..? అవును.. మీరు విన్నది నిజమే..! ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ అందమైన కపుల్‌ అక్కడున్న తాల్‌ అగ్నిపర్వతానికి సమీపంలో తమ పెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీసిన తమ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సృష్టిలో ప్రతి మనిషికీ తొలి గురువు తల్లే. ఎవరైనా సరే.. పుట్టిన క్షణం నుంచి తల్లితోనే తన ప్రయాణాన్ని మొదలు పెడతారు.. ఆమె ప్రేమ, ఆప్యాయతలను ఆస్వాదిస్తూ ఆమె ఆలనలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. అందుకే ప్రపంచంలో తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం మరొకటి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలా తల్లి తన పిల్లలకు కేవలం ప్రేమానురాగాల్ని పంచడమే కాదు.. తన చిన్నారుల కోసం ఎన్నో పాత్రలను పోషిస్తుంటుంది. బిడ్డ ఏడిస్తే లాలి పాట పాడే గాయనిగా మారుతుంది.. అన్నం తిననని మారాం చేస్తే కథలు చెప్పే గురువు అవుతుంది.. తప్పు చేస్తే మందలించే శ్రేయోభిలాషిగా మారుతుంది.. చివరికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్‌ ఎవరూ లేకపోతే ఒక స్నేహితురాలిగా మారి తన బిడ్డను ఆడించే ప్లేయర్‌గానూ అవతారం ఎత్తుతుంటుంది. ఇందుకు తాజా ఉదాహరణే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో. తల్లీకొడుకులు మధ్య అనురాగానికి, స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందీ వీడియో. ఇంతకీ ఏముందా వీడియోలో..?