Forgot Password
New User
Name
Gender
MaleFemale
Age
Email
Phone
Location
Address
Close
Your Password Has Been Sent To Your Registered EMail
²ù¢Ÿ¿ª½u ©£¾ÇJ
¤¶Äu†¾¯þ èð¯þ
’¹Õœþ-å£Ç©üh
X¶Ïšü-¯ç®ý «Õ¢“ÅŒ
'®ÔyšüÑ J©ä-†¾¯þq
£¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢
'„碜Ë-Åçª½Ñ OÊ®ý
„çÕª½ÕX¾Û B’¹©Õ
£¾Çô„þÕ NÕE-®¾dªý
XÏ©x© åX¢X¾Â¹¢
Æ©¢-¹%ÅŒ
©ãjX¶ý-å®kd©ü
«Õ£ÏÇ@Ç '«ÕFÑ
éÂKªý & é’jœç¯þq
ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపే కిచెన్‌లో కాస్త శ్రమతో కూడుకున్న పనులు చాలానే ఉంటాయి. వాటిలో గిన్నెలు తోమడం, వాటిని శుభ్రం చేయడం ఒకటి. వంట చేసే క్రమంలో వాటికి అంటుకున్న ఆహార పదార్థాల అవశేషాలను తొలగించాలంటే కాస్త బలం ఉపయోగించాల్సిందే! ఈ శ్రమంతా ఎందుకని కొందరు డిష్ వాషర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు.. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండే డిష్ వాషింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని కొలువుదీరాయి. వాటితో గిన్నెలకు అంటుకున్న ఎంతటి కఠినమైన జిడ్డునైనా ఇట్టే వదలగొట్టేయచ్చు. మరి, ఆ గ్యాడ్జెట్లేంటి? వాటితో గిన్నెల్ని సులభంగా ఎలా శుభ్రం చేయచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
ప్రస్తుతం చదువులు, ఉద్యోగాలు అంటూ చాలామంది తమ కుటుంబాలకు దూరంగా హాస్టల్స్‌లో, రూమ్స్‌లో ఉండడం కామనైపోయింది. ఇలా బయట ఉండాల్సి వచ్చినపుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక చాలా ఇబ్బందిపడుతుంటారు. హాస్టల్స్‌లో ఉంటే ఫుడ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ అక్కడే సమస్యంతా మొదలవుతుంది. హాస్టల్లో పెట్టే ఫుడ్ తినలేక .. అలాగని ప్రతి రోజూ బయటి ఫుడ్ తినాలంటే.. ఖర్చుతో పాటు అనారోగ్యం పాలవడం ఖాయం. కేవలం హాస్టలే కాదు.. రూమ్‌లో ఉండే వారి పరిస్థితి కూడా అంతే. ప్రతి రోజు రెస్టరంట్లో తింటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు... పైగా వాటి వల్ల ఆరోగ్యం చెడి అదనపు ఖర్చులవుతాయి. అందుకే ఈ కాలంలో ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వయంపాకానికే ఓటేస్తున్నారు. కానీ ఇంట్లోలా పెద్ద పెద్ద గ్యాస్ స్టౌలు రూమ్స్, హాస్టల్స్‌లో పెట్టుకోలేం. అలాంటి వారి కోసమే ఈ ‘పోర్టబుల్ గ్యాస్ బర్నర్స్’ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవెలా ఉంటాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి...
టీవీ చూసేటప్పుడైనా.. థియేటర్లో సినిమా మధ్యలో బ్రేక్ వచ్చినా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ వేసేటప్పుడైనా.. టైంపాస్‌గా ఏదైనా తిందాం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్నాక్ ఐటమ్ ‘పాప్‌కార్న్’. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే అద్భుతమైన రుచి వీటి సొంతం. అలాగని బయట చేసిన పాప్‌కార్న్ తెచ్చుకుంటారా ఏంటి? ఆ అవసరం లేకుండానే ఇంట్లోనే చిటికెలో వీటిని తయారుచేసుకోవచ్చు. అలాంటి బోలెడన్ని పాప్‌కార్న్ మేకింగ్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయ్. వాటిలో కార్న్ గింజలు వేసి సర్వింగ్ బౌల్స్ చేతిలోకి తీసుకునేలోపే ఇవి సిద్ధమైపోతాయి. అంత త్వరగా పాప్‌కార్న్‌ను తయారుచేస్తాయీ గ్యాడ్జెట్స్. ఇక వీటిలో కావాలంటే నూనె వేసుకోవచ్చు.. లేదంటే ఆయిల్ ఫ్రీగా కూడా రుచికరమైన పాప్‌కార్న్ తయారుచేసుకోవచ్చు. మరి, చిటికెలో పాప్‌కార్న్‌ను సిద్ధం చేసే కొన్ని పాప్‌కార్న్ మేకర్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..
వంట చేయడం ఒక ఎత్తయితే చేసిన తర్వాత వంటింటిని శుభ్రం చేసుకోవడం మరో ఎత్తు. పొంగిపోయిన పాల మరకలు, బాణలిలోంచి చిందిన నూనె... ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. 'తర్వాత చేద్దాంలే' అనుకుంటే ఆ మరకలు ఎండిపోతాయి. అసలీ జంజాటమంతా లేకుండా వంట చేసేటప్పుడే మరకలు పడకుండా జాగ్రత్తపడితే సరిపోతుంది కదా..! 'అది మన చేతుల్లో పనేనా' అంటారా..? ఇది వరకు కాదేమో కానీ ఇప్పుడు అలాంటి మరకలను నివారించడానికి రకరకాల గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో తెలుసుకుందామా..
బియ్యం కడిగిన నీళ్లను వేరుచేసేటప్పుడు ఆ నీటితో పాటే కొన్ని బియ్యం కూడా సింక్‌లో పడిపోయి వృధా అవడం మనకు రోజూ ఎదురయ్యే అనుభవమే. అలాగే పాస్తాను ఉడికించిన తర్వాత ఆ నీటిని వడకట్టే క్రమంలో పాస్తా ఎక్కడ సింక్‌లో పడిపోతుందోనని అనుకునే వారూ మనలో చాలామందే! నూనెలో వేయించిన పదార్థాలు, స్నాక్స్‌ను టిష్యూ పేపర్లో వేసి అది ఆ నూనెను పూర్తిగా పీల్చేసుకున్నాక తినడం మనకు అలవాటే. అలా ఆ నూనె వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించేవారూ మనలో లేకపోలేదు. మనం రోజూ కిచెన్‌లో వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనకు మామూలే. మరి, ఈ క్రమంలో ఆయా పదార్థాలు వృధా కాకుండా ఉండడంతో పాటు ఈ పనులన్నీ సులువుగా పూర్తవ్వాలంటే.. అందుకోసం వివిధ రకాల కిచెన్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి. పిండిని సులభంగా జల్లించడం దగ్గర్నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా కింద పడకుండా సులువుగా బియ్యం కడిగే దాకా ప్రతి పనినీ ఈజీ చేసేస్తున్నాయీ సరికొత్త కిచెన్ టూల్స్. మరి, వంటింట్లో పనిని మరింత సులభతరం చేస్తోన్న ఆ గ్యాడ్జెట్లేంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఎండల్లో ఎంత కాదనుకున్నా బయటికి వెళ్లక తప్పదు. పోనీ ఇంటిపట్టునే ఉందామనుకున్నా వాతావరణంలో వేడి వేధించక మానదు. ఒక్క ఏసీ గదుల్లో తప్ప మరెక్కడా ఉండలేమంటారా..? ఉండగలం..! ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఎండ ప్రభావం నుంచి శరీరాన్ని రక్షించుకోడానికి అనేక మార్గాలున్నాయి.. వాటిలో నోరూరించే పుచ్చకాయ ఒకటి.. చుట్టూ సూర్య ప్రతాపం చెలరేగినా..ఇది మాత్రం చల్లగా కడుపులో చేరి, ఆ వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మరి అలాంటి పుచ్చకాయని క్షణాల్లో తరిగేయడానికి, పిల్లలకు నచ్చేలా రకరకాల ఆకారాల్లో కట్ చేయడానికీ రకరకాల గ్యాడ్జెట్స్ ఒచ్చేశాయి.. అవేంటో చూసేద్దామా మరి..!
ప్రస్తుతం చదువులు, ఉద్యోగాలు అంటూ చాలామంది తమ కుటుంబాలకు దూరంగా హాస్టల్స్‌లో, రూమ్స్‌లో ఉండడం కామనైపోయింది. ఇలా బయట ఉండాల్సి వచ్చినపుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక చాలా ఇబ్బందిపడుతుంటారు. హాస్టల్స్‌లో ఉంటే ఫుడ్ గురించి ఆలోచించాల్సిన పనిలేదని చాలామంది భావిస్తుంటారు. కానీ అక్కడే సమస్యంతా మొదలవుతుంది. హాస్టల్లో పెట్టే ఫుడ్ తినలేక .. అలాగని ప్రతి రోజూ బయటి ఫుడ్ తినాలంటే.. ఖర్చుతో పాటు అనారోగ్యం పాలవడం ఖాయం. కేవలం హాస్టలే కాదు.. రూమ్‌లో ఉండే వారి పరిస్థతి కూడా అంతే. ప్రతి రోజు రెస్టరంట్లో తింటూ పోతే మిగిలేది ఏమీ ఉండదు... పైగా వాటి వల్ల ఆరోగ్యం చెడి అదనపు ఖర్చులవుతాయి. అందుకే ఈ కాలంలో ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వయంపాకానికే ఓటేస్తున్నారు. కానీ ఇంట్లోలా పెద్ద పెద్ద గ్యాస్ స్టౌలు రూమ్స్, హాస్టల్స్‌లో పెట్టుకోలేం. అలాంటి వారి కోసమే ఈ ‘పోర్టబుల్ గ్యాస్ బర్నర్స్’ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి అవెలా ఉంటాయో.. ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
కుక్కర్.. ఇది లేని వంటిల్లు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో తొందరగా వంట ముగించాలంటే కుక్కర్ తప్పక ఉండాల్సిందే. మరి ప్రతి వంటింట్లో ముఖ్య భాగమైన ఈ కుక్కర్లో.. ఇప్పుడు కేవలం అన్నం, కూరలు మాత్రమే కాదండోయ్.. అన్ని రకాల వంటకాలూ చేసేసుకోవచ్చు. అందుకోసమే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చాయ్ ‘మల్టీ ఫంక్షనల్ కుక్కర్స్’. ఇవన్నీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్లా కరెంట్‌తోనే పనిచేస్తాయి. వీటిని కొని మన వంటింట్లో చేర్చుకున్నామంటే అన్నం, కూరలతో పాటు ఆమ్లెట్, పాస్తా, పిజా, దోశ.. ప్రతి ఒక్కటీ ఈజీగా చేసేసుకోవచ్చు. అరే భలే బాగున్నాయే.. ఈ కుక్కర్స్ అనుకుంటున్నారా? మరి ఇంత ఉపయోగకరంగా ఉన్న ఈ మల్టీ పర్పస్ కుక్కర్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు.. అసలు విషయంలోకి వెళ్దాం పదండి..
అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే. నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్పరెంట్గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే! రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది. ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్ఫ్యూజన్కి చెక్ పెట్టాలంటే ‘కిచెన్ ర్యాక్స్’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్ ర్యాక్స్ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్ ర్యాక్స్/మల్టీ పర్పస్ ర్యాక్స్ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..
Facebook
Twitter
   Google +
Pratibha.net